వాషింగ్టన్: ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణను ఖండిస్తూ భద్రతామండలిలో ప్రవేశపెట్టిన తీర్మానంపై ఓటింగ్‌లో భారత్ పాల్గొనకపోవడం నిరుత్సాహం కలిగించిందని రిపబ్లిక్ పార్టీకి చెందిన అమెరికా టాప్ సెనేటర్ జాన్ కొర్నిన్ వ్యాఖ్యానించారు.
రష్యాతో ఉన్న వ్యూహాత్మక సంబంధాలను కొనసాగించేందుకే ఆ దేశాన్ని విమర్శించకుండా ఇలా తప్పించుకునే వైఖరిని అనుసరించిందని ఆయన ట్విట్టర్ వేదికగా భారత్‌ను విమర్శించారు. సెనేట్ ఇండియా కాకస్ సహాధ్యక్షుడి భారత్– అమెరికా సంబంధాలు బలోపేతానికి కృషి చేస్తున్న కొర్నిన్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. అమెరికా కాంగ్రెస్ సభ్యులురో ఖన్నా, ఎరిక్ స్వాల్‌వెల్ కూడా మండలిలో భారత్ వైఖరిని తప్పుబట్టారు.
Comments
Please login to add a commentAdd a comment