Aggression
-
సరైన దిశలో తొలి అడుగు
కోర్టు నోరు విప్పిందంటే న్యాయం నిలబడుతుందని సామాన్యులకు ఆశ. దేశంలో చట్టాలను తుంగలో తొక్కుతున్న బుల్డోజర్ సంస్కృతిపై మంగళవారం దేశ సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు కాసింతైనా సంతోషం కలిగిస్తున్నది అందుకే. అనేక రాష్ట్రాలలో క్రిమినల్ కేసుల్లో దర్యాప్తును ఎదుర్కొంటున్న నిందితులు, వారి కుటుంబ సభ్యుల ప్రైవేట్ గృహాలు, ఆస్తు లపై బుల్డోజర్లను నడిపిస్తూ... ‘దాన్ని ఘనకార్యంగా పేర్కొంటూ, సమర్థించుకుంటున్న’ వైఖరి పాలకుల సాక్షిగా పెచ్చుమీరుతోంది. ఈ పరిస్థితుల్లో తదుపరి విచారణ జరిగే అక్టోబర్ 1 దాకా దేశవ్యాప్తంగా ఈ అడ్డగోలు కూల్చివేతలన్నిటికీ సుప్రీమ్ కోర్ట్ అడ్డుకట్ట వేయడం విశేషం. అదే సమ యంలో నీటి వసతులు, రైల్వే లైన్లకు అడ్డుగానూ, ఫుట్‌పాత్‌లు, ప్రభుత్వ స్థలాల్లోనూ సాగిన దురా క్రమణలనూ, అనధికారిక నిర్మాణాలనూ కూల్చేందుకు అభ్యంతరం లేదని సుప్రీమ్ పేర్కొంది. అలాగే, కూల్చివేతలపై దేశవ్యాప్తంగా అమలయ్యేలా నిర్ణీత మార్గదర్శకాల్ని రూపొందించాలన్న కోర్ట్ ప్రతిపాదన హర్షణీయం. ఇన్నాళ్ళ తరువాత ఇప్పటికైనా ఇది సరైన దిశలో సరైన అడుగు.యోగి ఆదిత్యనాథ్ సారథ్యంలోని ఉత్తరప్రదేశ్‌లో 2017లో ఈ బుల్డోజర్ న్యాయానికి బీజం పడింది. ఆ తరువాత ఇది అనేక బీజేపీ పాలిత రాష్ట్రాలకు పాకింది. ఒక్క ఉత్తరప్రదేశ్‌లోనే ఇప్పటికి 4.5 లక్షల దాకా గృహాలు ఇలా నేలమట్టమయ్యాయని అంచనా. ఇకపై చట్టవిరుద్ధంగా ఒక్క కూల్చివేత జరిగినా అది పూర్తిగా రాజ్యాంగ విధానానికే విరుద్ధమని కోర్ట్ పేర్కొనడం గమనార్హం. నిజానికి, గతంలోనూ కోర్టులు ఇలాంటి వ్యాఖ్యలు చేసినా, వాటి ఆదేశాలను ధిక్కరిస్తూ అనేకచోట్ల కూల్చివేతలు యథేచ్ఛగా సాగాయి. అసలు అనేక రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని నిందితుల మీదకు బుల్డోజర్ను నడిపిస్తున్న తీరుపై చాలా కాలంగా చర్చ జరుగుతోంది. తప్పు చేసినవారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సింది పోయి, నోటీసులైనా ఇవ్వకుండా, నిర్ణీత ప్రక్రియ ఏదీ పాటించకుండా వారికి శిక్షగా బుల్డోజర్ను ఉపయోగించడమేమిటనే ధర్మబద్ధమైన ప్రశ్నలు వినిపిస్తూ వచ్చాయి. పైపెచ్చు, ముస్లిమ్‌ల ఇళ్ళను లక్ష్యంగా చేసుకొని కూల్చివేతలు సాగించడమనేది బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పాలనా విధానంగా తయారవడం ఆందోళన రేపింది. ఈ పరిస్థితుల్లో జస్టిస్ బి.ఆర్. గవాయ్, కె.వి. విశ్వనాథన్‌లతో కూడిన సుప్రీమ్ కోర్ట్ డివిజన్ బెంచ్ ఈ పద్ధతిని తప్పుబట్టింది. ఒక కేసులో నిందితులైనంత మాత్రానో, లేదంటే దోషి అయినంత మాత్రానో వారి ఇంటిని కూల్చేయవచ్చా? అందుకు చట్టం అనుమతిస్తుందా? లేదు కదా! ఆ మాటే సుప్రీమ్ అంటోంది. పైగా ఇంట్లో ఎవరో ఒకరు నేరం చేస్తే, కూల్చివేతలతో ఆ కుటుంబం మొత్తానికీ శిక్ష విధించడం ఏ రకంగా సబబు? ప్రభుత్వ పాలన నిర్వహించే కార్యనిర్వాహక వ్యవస్థే జడ్జిగా మారి, శిక్షించవచ్చా? ఆక్రమణలనూ, అనధికారిక నిర్మాణాలనూ తొలగించేందుకు వివిధ రాష్ట్రాల్లోని స్థానిక చట్టాలు అనుమతిస్తున్నాయి. కానీ, వాటిని ప్రతిపక్షాల పీక నొక్కేందుకూ, నిర్ణీత వర్గాలపై ప్రతీకారేచ్ఛకూ సాధనంగా మార్చుకోవడంతోనే అసలు సమస్య. గొంతు విప్పిన భార తీయ ముస్లిమ్‌లపై ఉద్దేశపూర్వకంగా సాగుతున్న దాడిలో భాగమే ఈ కూల్చివేతలని చివరకు ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ సైతం పేర్కొనే పరిస్థితి వచ్చిందంటే తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. ఈ బుల్డోజర్ న్యాయం దేశంలోని వివిధ ప్రాంతాల్లో వివిధ పద్ధతుల్లో సాగుతున్నా, అన్ని చోట్లా ఒక అంశం మాత్రం సర్వసాధారణం. అది ఏమిటంటే – గతంలో కోర్టులిచ్చిన ఆదేశాలను పట్టించుకోకుండా, నిర్ణీత ప్రక్రియ అంటూ లేకుండానే ఈ కూల్చివేతలు కొనసాగడం! దురాక్రమణ లకు వ్యతిరేకంగా ఉద్యమం అంటూ ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, హర్యానా, ఢిల్లీ లాంటి చోట్ల ఇటీవలి కూల్చివేతల్లోనూ చట్ట ఉల్లంఘన నిర్భీతిగా సాగింది. గుజరాత్, అస్సామ్, త్రిపురల్లో సైతం కూల్చివేతల పర్వానికి కట్టడి లేకుండా పోయింది. అసాంఘిక శక్తులపై ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమిస్తోందనే భావన కల్పిస్తూ, రాజకీయ లబ్ధి పొందడం అధికార పార్టీల వ్యూహం. దానిలోని మతపరమైన కోణాన్ని కప్పిపుచ్చడం వాటికి వెన్నతో పెట్టిన విద్య. ఈ బుల్డోజర్సంస్కృతిపై భారత అత్యున్నత న్యాయస్థానం జోక్యానికి ఇంతకాలం పట్టడం విచారకరమే. అయితే, ఇప్పుడిక పనిప్రదేశాల్లో లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా ‘విశాఖ’ మార్గదర్శకాలు చేసినట్టుగానే దీనిపైనా అఖిల భారత స్థాయిలో కోర్టు మార్గదర్శకాలు ఇవ్వనుండడం ఒకింత ఊరట. అనధికారిక నిర్మాణాల గుర్తింపు, నోటీసులివ్వడం, వాదనలు వినడం, అనంతరం చట్టబద్ధంగా కూల్చివేతలు జరపడం... ఈ ప్రక్రియ అంతటికీ దేశవ్యాప్తంగా ఒకే విధమైన నియమావళి ఉండడం కచ్చితంగా మంచిదే. ఇటీవలి కూల్చివేతల డేటాను నిశితంగా సమీక్షిస్తే అనేక లోపాలు కనిపిస్తాయి. అందుకే, ఈ అంశంపై సంబంధిత వర్గాల నుంచి సూచనలు కోరుతున్న కోర్ట్ రేపు మార్గదర్శకాల రూపకల్పనలోనూ జాగ్రత్తగా వ్యవహరించడం కీలకం. మత ఘర్షణలు, ఆ వెంటనే సాగే కూల్చి వేతల మధ్య సంబంధాన్ని కప్పిపుచ్చేందుకు పాలకులు ఎత్తులు వేయడం తరచూ చూస్తున్నాం. ఆ పన్నాగాలు పారనివ్వకుండా మార్గదర్శకాల తయారీ అవసరం. అలాగే, ఎప్పుడో నోటీసులు ఇచ్చా మని మభ్యపెట్టేందుకు వెనకటి తేదీలతో కాగితాలు చూపించి, పాలనా యంత్రాంగం ఇష్టారీతిన సాగించే కూల్చివేతలకు చెక్ పెట్టాలి. సహజ న్యాయసూత్రాలకు విరుద్ధంగా జరిగే ఏ చర్యలనూ అనుమతించని రీతిలో నియమావళిని కట్టుదిట్టంగా రూపొందించాలి. ఆదేశాల ఉల్లంఘనను తీవ్రంగా పరిగణించి, కోర్టు ధిక్కారం కింద కఠిన చర్యలు చేపట్టాలి. ప్రజలెనుకున్న పాలకులు తామే జడ్జీలుగా, తామే శిక్షలు అమలు చేసేవారిగా ప్రవర్తిస్తే అది పౌరుల ప్రాథమికహక్కులకే భంగకరం. -
మహిళ కనిపిస్తే.. వేధింపులేనా? మీరేం మనుష్యులు
మహిళలకు సంబంధించి ఓ ముఖ్యమైన విషయాన్ని సోషల్‌మీడియాలో ప్రస్తావించారు డాక్టర్ శ్రీకాంత్ మిరియాల. ఆయన ట్విట్టర్ వేదికగా రాసిన పోస్టు యథాతధంగా.. నేను వైద్యం చేసిన ఎంతోమంది ఆడవాళ్లు (వయసు నిమిత్తం లేకుండా), నా స్నేహితురాళ్ల అనుభవాలు ఇవి. ఈ దురదృష్ట అనుభవాలు అన్ని దేశాల్లో ఉన్నప్పటికీ మనదేశంలో బాగా ఎక్కువ. ఏమిటివి? వీధుల్లో, బస్సుల్లో,రైళ్లలో, ఇళ్లలో,ఆడుకునే స్థలాల్లో, పనిచేసే ప్రదేశాల్లో, గుళ్లలో సమయం సందర్భం ఏదైనాగానీ ఆడవాళ్ళ వెంటబడటం, తేరిపార చూడటం, సైగలు చెయ్యటం, ఫోటోలు తీయటం మాత్రమే కాకుండా కావాలని రాసుకుని వెళ్ళటం, ఇంకా మితిమీరి తాకటం, ముట్టటం, పట్టుకోవడం, కొట్టటం, హఠాత్తుగా మీద పడడం లాంటివి చేసి చాలా ఇబ్బంది పెడతారు. ఇలా ఎందుకు చేస్తారు అన్నదానికి మానసిక శాస్త్ర పరంగా చాలా కారణాలున్నప్పటికీ ఇది చెడ్డ ప్రవర్తన. ఒకసారి చేసి పట్టుబడనప్పుడు వీళ్లలో ధైర్యం పెరిగి మళ్లీ మళ్లీ చేస్తూ, వారి చర్యల తీవ్రత కూడా పెరుగుతుంది. ముందు భయంతో చేసి, చేశాక ఆనందాన్ని పొందే వీళ్లు తర్వాత తర్వాత దాడికి గురైన ఆడవాళ్ల ముఖంలో ఉండే భయాన్ని, షాక్ ని చూసి ఒక పైశాచిక ఆనందాన్ని పొందుతుంటారు. వీళ్లని నియంత్రించే ఒకే ఒక్క మార్గం ఎదిరించటం, పట్టుకుని ప్రశ్నించడం. అలా జరిగిన చాలా సందర్భాల్లో అందరూ కలిసి దేహశుద్ధి చేస్తారు. ఒకసారి పట్టుబడ్డాక చాలామంది మానేస్తారు కానీ కొంతమంది కొనసాగిస్తారు. వీళ్లని కఠినంగా శిక్షించటం ద్వారా ఈ నేరాల తీవ్రత కొంతవరకు తగ్గించవచ్చు. ఈమధ్య వచ్చే కొన్ని సినిమాలు కూడా ఇటువంటి ప్రవర్తనని ఎగదోస్తున్నాయి. ఇటువంటి సంఘటనలు ఆడవాళ్ళని చాలా ఇబ్బంది పెడతాయి. వాళ్లని చాలా బాధకి గురిచేస్తాయి. కోపం, దిగులు, బయటికెళ్లాలంటే భయం, వణుకు, నిస్సహాయత మొదలైన అనుభూతులకి గురవ్వటమే కాకుండా ఆత్మన్యూనత, తమనితాము నిందించుకోవడం, తమ వస్త్రాలంకరణని ప్రశ్నించుకోవడం, తోడు లేనిదే బయటికి వెళ్లకపోవడం చేస్తుంటారు. పైగా ఈబధని ఎవరితో చెప్పుకోలేక సతమతమౌతుంటారు. చెప్పినా కూడా కొన్నిసార్లు వీళ్లే నిందలకు గురవుతుంటారు. కొన్ని గుర్తుపెట్టుకోండి. 1. ఈ అనుభవాలు మీ ఒక్కరికే కాదు, దాదాపు అందరి ఆడవాళ్లలో ఉంటాయి. ఒకసారి మీ అమ్మాయి/సోదరి/భార్య/స్నేహితురాళ్లతో చర్చించండి. వారికి సాంత్వన చేకూర్చి ధైర్యాన్ని ఇచ్చినవాళ్లవుతారు. 2. తప్పు ఎప్పుడూ దాడి చేసినవాళ్లదే. మీరు ఒంటరిగా బయటికి వెళ్ళటం, మీ వస్త్రాలంకరణ, మీ మాటలు ఇవేవీ కూడా వారు మీతో అలా ప్రవర్తించడానికి పచ్చజెండా కాదు. 3. మిమ్మల్ని మీరు నిందించుకోవద్దు. రోడ్డుపై వెళ్ళేటప్పుడు జాగరూకతతో ఉండండి, ఎదుటివాళ్లపై అనుమానం ఉంచి వాళ్లు మిమ్మల్ని దరి చేరేటప్పుడు బ్యాగ్ ఒక చేతి నుంచి ఇంకో చేతికి మార్చటం, చేతులు విదల్చటం వంటి హఠాత్చర్యల వలన దాడిచేసేవాళ్లు దూరం జరుగుతారు. 4. దాడి జరిగినప్పుడు వెంటనే పట్టుకుని ప్రశ్నించండి. వాళ్లు హెడ్లైట్ల కింద దొరికిన కుందేలులా స్థాణువైపోతారు. 5. ఇటువంటి అనుభవాలు మిమ్మల్ని తీవ్ర మానసిక ఇబ్బందికి గురిచేసినా లేక మీ లైంగిక జీవితాన్ని అస్తవ్యస్తం చేసినా మానసిక నిపుణుల్ని కలవండి. డాక్టర్ శ్రీకాంత్ మిరియాల -
Russia-Ukraine war: ఒడెసాపై ఆగని రష్యా క్రూయిజ్ దాడులు
కీవ్: రణనినాదంతో రంకెలేస్తూ ఉక్రెయిన్‌పై దురాక్రమణకు దూకిన రష్యా సైన్యం ఒడెసా నగరంపై క్రూయిజ్ క్షిపణి దాడులతో దండెత్తింది. డజన్ల కొద్దీ భవనాలను ధ్వంసం చేసింది. వీటిలో పలు క్షిపణులను ఉక్రెయిన్ దళాలు విజయవంతంగా అడ్డుకుని నేలకూల్చాయి. కానీ రష్యా దాడిలో ఒడెసాలో గిడ్డంగి కూలడంతో అందులో పనిచేస్తున్న ముగ్గురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. కొన్ని ఇళ్లు, దుకాణాలు, కేఫ్‌లు ధ్వంసమయ్యాయి. 13 మందికి గాయాలయ్యాయి. కుప్పకూలిన గిడ్డంగి శిథిలాల కింద ఎవరైనా బతికిఉంటారనే ఆశతో అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. క్రమటోర్క్, కోస్టియాన్టినీవ్కా సిటీలపైనా రష్యా దాడులు చేసింది. క్రమటోర్క్లో ఇద్దరు పౌరులు చనిపోగా 29 ఇళ్లు కూలిపోయాయని అధ్యక్ష కార్యాలయం తెలిపింది. కోస్టియాన్టినీవ్కాలో ఒకరు చనిపోయారు. 57 ఇళ్లు నేలమట్టమయ్యాయి. దాదాపు 16 నెలలుగా కొనసాగుతున్న యుద్ధంలో రష్యా మళ్లీ వైమానిక దాడులను పెంచిందని ఉక్రెయిన్ సైన్యం అధికార ప్రతినిధి బుధవారం చెప్పారు. -
ఉక్రెయిన్ను ముంచెత్తిన వరద
ఖేర్సన్(ఉక్రెయిన్): ఉక్రెయిన్ భూభాగాలపై రష్యా దురాక్రమణకు దిగాక ఇన్నాళ్లూ బాంబుదాడులకు భయపడి ప్రాణాలు అరచేత పట్టుకుని వలసపోయిన జనం ఇప్పుడు వరదరూపంలో వచ్చిన జలఖడ్గం దాటికి సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు. నీపర్ నదీ ప్రవాహంపై నిర్మించిన కఖోవ్కా ఆనకట్ట, జలవిద్యుత్ ప్లాంట్‌పై బాంబుల వర్షం నేపథ్యంలో డ్యామ్ బద్దలై వరదనీరు దిగువ ప్రాంతాలను ముంచెత్తింది. దీంతో దక్షిణ ఉక్రెయిన్ ప్రాంతాలు జలమయమయ్యాయి. కొందరు ఇళ్లపైకి ఎక్కి అక్కడే గడిపారు. ఎమర్జెన్సీ ఆపరేషన్ మొదలుపెట్టి స్థానిక పాలనా యంత్రాంగాలు పౌరులను వేరే చోట్లకు హుటాహుటిన తరలిస్తున్న దృశ్యాలు అంతర్జాతీయ మీడియాలో ఆవిష్కతమయ్యాయి. దొరికింది తీసుకెళ్తూ ఏదో ఒకదాంట్లో వలసపోతూ.. చేతికందినంత నిత్యావసర వస్తువులు తీసుకుని మిలటరీ ట్రక్కులు, రాఫ్ట్‌లపై ఎక్కి జనం ఓవైపు వలసపోతుంటే శతఘ్ని పేలుళ్ల చప్పుళ్లతో ఆ ప్రాంతం భయానకంగా మారింది. ఇంకొందరు బస్సుల్లో, రైళ్లలో వెళ్లిపోయారు. డ్యామ్ కుప్పకూలి 24 గంటలు గడుస్తున్నా ఇంతవరకు ఆ దాడికి కారకులు ఎవరో తెలియరాలేదు. మీరంటే మీరని ఉక్రెయిన్, రష్యాలు పరస్పర దూషణలు మాత్రం ఆపట్లేవు. కొంతకాలంగా రష్యా ఆక్రమిత భూభాగంలో ఉన్న ఈ డ్యామ్ పరిసరాల్లో తరచూ బాంబు దాడులు జరుగుతున్నాయి. రణక్షేత్రంగా మారిన ఈ ప్రాంతంపై ఇరుపక్షాల్లో ఒకరు పొరపాటున భారీ దాడి చేసిఉంటారని, నిర్లక్ష్యం కూడా అయి ఉండొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఆగకుండా వస్తున్న వరదనీటితో దిగువ ప్రాంతాల్లో వచ్చే 20 గంటల్లో మరో మూడు అడుగులమేర నీరు నిలుస్తుందని అధికారుల ఆందోళన వ్యక్తంచేశారు. విస్తారమైన ప్రాంతాలకు తాగునీరు, సాగునీరు అందిస్తున్న ప్రపంచంలోని అతిపెద్ద రిజర్వాయర్లలో కఖోవ్కా డ్యామ్ కూడా ఒకటి. గత ఏడాది రష్యా ఆక్రమించిన ఖేర్సన్ ప్రాంతంలోనే ఈ డ్యామ్ ఉంది. ఖేర్సన్ సిటీకి కేవలం 44 మైళ్లదూరంలో ఈ డ్యామ్ ఉండటంతో ఇప్పటికే వరదనీరు సిటీలోకి ప్రవేశించింది. వరదనీటి మట్టం పెరిగితే ఖేర్సన్కు కష్టాలు పెరుగుతాయి. డ్యామ్ పూర్తిగా పాడవలేదని, ఇంకా చాలా నీరు నిల్వ ఉందని, కొద్దిరోజుల్లో మొత్తం డ్యామ్ నేలమట్టమైతే మరో దఫా వరద ఖాయమని బ్రిటన్ రక్షణ శాఖ తన తాజా అప్డేట్లో పేర్కొంది. ఈ శాఖ తరచూ యుద్ధసమాచారాన్ని అందరితో పంచుకుంటోంది. తాగేందుకు నీరే లేదు: జెలెన్స్కీ ‘కుట్ర పన్ని రష్యా ఈ డ్యామ్‌ను నేలమట్టం చేసింది. వేలాది మంది ప్రజలకు కనీసం తాగు నీరు లేకుండా పోయింది’ అని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ టెలిగ్రామ్‌లో పోస్ట్‌చేశారు. ఇది రష్యా పనే: అమెరికా మేథో సంస్థ ‘నీపర్ దిగువ ప్రాంతాలను వరదమయం చేస్తే రష్యాకే మేలు. ఉక్రెయిన్ సేనలు మళ్లీ ఆప్రాంతాలను చేజిక్కించుకోకుండా ఆలస్యం చేయడం రష్యా ఎత్తుగడ. అందుకే తమకు కొంచెం నష్టం జరుగుతుందని తెల్సికూడా ఇలా డ్యామ్‌ను పేల్చేసింది’ అని రక్షణ, విదేశీవ్యవహారాల విశ్లేషణ మేథోసంస్థ, అమెరికాకు చెందిన లాభాపేక్షలేని ‘స్టడీ ఆఫ్ వార్’ వ్యాఖ్యానించింది. పొంచి ఉన్న ధరాఘాతం గోధుమలు, బార్లీ, పొద్దుతిరుగుడు నూనె, ఇతర ఆహార ఉత్పత్తుల్ని భారీ స్థాయిలో పండిస్తూ ప్రపంచ ఆహార అవసరాలు తీర్చడంలో ఉక్రెయిన్ కీలక భూమిక పోషిస్తోంది. డ్యామ్ వరదనీటితో పంట నష్టం వాటిల్లి ఇక్కడి నుంచి విదేశాలకు ఎగుమతులు తగ్గి డిమాండ్ పెరిగి ధరలు ఎక్కువయ్యే ప్రమాదం పొంచి ఉంది. డ్యామ్ కూలిన ఈ కొద్ది గంటల్లోనే గోధుమ ధరలు 3 శాతం ఎగబాకాయి. ఆఫ్రికా, మధ్య ప్రాచ్యం, ఆసియాలోని కొన్ని దేశాలు ఉక్రెయిన్ ఆహార ఉత్పత్తులపై ఆధారపడు తున్నాయి. డ్యామ్ కూల్చివేత కారణంగా కలిగే నష్టాన్ని ఇప్పుడే అంచనా వేయలేమని రష్యా, ఉక్రెయిన్, ఐక్యరాజ్యసమితి అధికారులు చెబుతున్నారు. డ్యామ్‌ను బాగుచేసి మళ్లీ పూర్వ స్థితికి తీసుకురావాలంటే ఈ యుద్ధతరుణంలో ఎన్నేళ్లు పడుతుందో చెప్పలేని పరిస్థితి. -
మాల్దీవులకు భారత్ గస్తీ నౌక, ల్యాండింగ్ క్రాఫ్ట్
న్యూఢిల్లీ: కీలకమైన మిత్రదేశమైన మాల్దీవులకు భారత్ గస్తీ నౌక, ల్యాండింగ్ క్రాఫ్ట్‌లను కానుకగా అందివ్వనుంది. మే ఒకటి నుంచి మూడో తేదీ వరకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాల్దీవుల్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా వీటిని అందజేస్తారు. హిందూ మహాసముద్ర ప్రాంతంలో కొంతకాలంగా పెరుగుతున్న చైనా దూకుడుకు అడ్డుకట్ట వేసే దిశగా భారత్ తీసుకుంటున్న చర్యల్లో ఇది భాగమని చెబుతున్నారు. పర్యటనలో భాగంగా మాల్దీవుల అధ్యక్షుడు ఇబ్రహీం సోలిహ్, విదేశాంగ మంత్రి అబ్దుల్లా సాహిత్, రక్షణ మంత్రి మరియా దీదీతోనూ రాజ్‌నాథ్ చర్చలు జరుపుతారు. -
చైనా దురాక్రమణపై చర్చించాల్సిందే
న్యూఢిల్లీ: అరుణాచల్‌ప్రదేశ్‌లో భారత్, చైనా జవాన్ల మధ్య ఘర్షణ, చైనా దురాక్రమణపై చర్చించాలని ప్రతిపక్ష కాంగ్రెస్ శుక్రవారం రాజ్యసభలో డిమాండ్ చేసింది. ఉదయం సభ ప్రారంభం కాగానే పార్టీ ఎంపీలు నినాదాలు ప్రారంభించారు. వెల్‌లో బైఠాయించారు. దాంతో సభ 25 నిమిషాలు వాయిదా పడింది. తర్వాత కూడా చర్చకు విపక్షాలిచ్చిన నోటీసులను ఆమోదించాలని, ఇతర కార్యకలాపాలను పక్కనపెట్టి చైనా దురాక్రమణపై చర్చ చేపట్టాలని కాంగ్రెస్ ఎంపీలు పట్టుబట్టారు. దేశ భద్రతకు సంబంధించిన కీలకమైన అంశంపై చట్టసభలో చర్చించకపోవడం ఏమిటని ప్రతిపక్ష నేత మల్లిఖార్జున ఖర్గే మండిపడ్డారు. జీరో అవర్‌ను ప్రారంభిస్తున్నట్లు డిప్యూటీ చైర్మన్ హరివంశ్ ప్రకటించడంతో ఎంపీలు నినాదాలకు దిగారు. దాంతో సభ వాయిదా పడింది. లోక్‌సభలో కీలక అంశాల ప్రస్తావన రోడ్ల అనుసంధానం, అన్ని ఎన్నికలకు ఒకే ఓటర్ జాబితా, కేంద్ర పథకాలకు నిధులు, కాలుష్యం వంటి కీలకాంశాలను లోక్‌సభలో శుక్రవారం పలు పార్టీల సభ్యులు ప్రస్తావించారు. పెన్షన్లు, రిటైర్మెంట్ ప్రయోజనాల విషయంలో సమస్యలను తక్షణమే పరిష్కరించాలని శివసేన ఎంపీ వినాయక్ రౌత్ కోరారు. కొన్ని రాష్ట్రాల్లో ఆయుష్మాన్ భారత్–ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన దుర్వినియోగం అవుతోందని బీజేపీ సభ్యుడు సుదర్శన్ భగత్ ఆందోళన వ్యక్తం చేశారు. -
శ్రీలంక సంక్షోభానికి అదే కారణమై ఉండొచ్చు!: యూఎస్
Russian Aggression May Have Contributed To Sri Lanka Crisis: శ్రీలంక సంక్షోభానికి గల కారణం రష్యా 'దురాక్రమణ యుద్ధమే' అని యూఎస్ విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. అదీగాక ఇటీవలే ఆంటోని బ్లింకెన్ ఉక్రెయిన్ నుంచి దాదాపు 20 మిలియన్ టన్నుల ధాన్యాన్ని విడిచిపెట్టాలని రష్యాకు పిలుపునిచ్చారు. ఉక్రెయిన్ ఆహార ఉత్పత్తుల ఎగుమతులపై రష్యా విధించిన ఆంక్షలే.. ఒకరకంగా శ్రీలంక సంక్షోభానికి కారణమై ఉండోచ్చని ఆంటోని బ్లింకెన్ అన్నారు. ప్రస్తుతం శ్రీలంక ఆహారం, ఇంధన కొరత, విదేశీ మారక నిల్వలు వంటి సంక్షోభాలతో అతలాకుతలమౌతున్న సంగతి తెలిసిందే. ఈ రష్యా ఉక్రెయిన్‌పై సాగిస్తున్న దురాక్రమణ యుద్ధం ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ప్రభావం చూపుతోందంటూ.. బ్లింకెన్ ఆందోళన వ్యక్తం చేశారు. అంతేగాదు ఇంతవరకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆహార అభద్రత ఇప్పుడు మరింత పెరుగుతోందన్నారు. ఈ యుద్ధం కారణంగా అదికాస్త గణనీయంగా పెరిగిందని చెప్పారు. ముఖ్యంగా థాయ్‌లాండ్ వంటి శక్తిమంతమైన దేశం పై కూడా ఈ యుద్ధం ప్రభావం మరింతగా ఉంటుందన్నారు. మాస్కో ఆక్రమిత ఉక్రెయిన్ నుంచి 20 మిలియన్ టన్నుల ధాన్యాన్ని ఎగుమతి చేసే నౌకలను అడ్డుకోవద్దని రష్యాకి పదేపదే బ్లింకెన్ విజ్ఞప్తి చేశాడు. ఐతే రష్యా మాత్రం నౌకాశ్రయాల్లో ఉక్రెయిన్ పెట్టిన మందుపాతరలను తీసివేస్తే... ఆహార ఉత్పత్తులతో కూడిన ఉక్రేనియన్ నౌకలను విడిచిపెట్టడానికి అనుమతిస్తామని రష్యా చెప్పింది. అందుకు కీవ్ తిరస్కరించడం గమనార్హం. (చదవండి: అధ్యక్షుడి భవనంలో కరెన్సీ కట్టల గుట్టలు.. ఆశ్చర్యంలో లంకేయులు) -
Russia- Ukraine war: కీలక దశలో దేశ రక్షణ!
రష్యా దురాక్రమణ నుంచి తన దేశాన్ని రక్షించుకోవడం ప్రస్తుతం కీలక దశకు చేరుకుందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అభిప్రాయపడ్డారు. ఈ సమయంలో అమెరికా మరింత సహాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. ఉక్రెయిన్ పార్లమెంట్‌నుంచి కొందరు సభ్యుల బృందం అమెరికాను సందర్శించి మరింత సహాయం అందించాలని కోరింది. తమకు మరిన్ని ఆయుధాలు, ఆర్థిక సాయం అవసరమని పేర్కొంది. ఇదే విషయాన్ని అమెరికా అధిపతి బైడెన్‌కు జెలెన్స్కీ నేరుగా వెల్లడించారు. తాము స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం కోసం పోరాడుతున్నామని, తమకు సాయం కోరే హక్కు ఉందని ఆయన తాజాగా విడుదల చేసిన వీడియోలో చెప్పారు. కీవ్‌లోని అధ్యక్ష కార్యాలయం వెలుపల రాత్రి సమయంలో ఈ వీడియో తీసినట్లు తెలుస్తోంది. యుద్ధం మొదలై ఐదువారాలు ముగుస్తున్నవేళ ఉక్రెయిన్ నుంచి దాదాపు 40 లక్షలమంది విదేశాలకు శరణార్ధులుగా తరలిపోయినట్లు ఐరాస అంచనా వేసింది. రూబుల్స్‌లో వద్దు రష్యా గ్యాస్‌కు యూరోపియన్ కంపెనీలు రూబుల్స్‌లో చెల్లించాల్సిన అవసరం లేదని రష్యా నుంచి హామీ పొందినట్లు జర్మనీ తెలిపింది. తమ వద్ద గ్యాస్ కొనుగోళ్లను రూబుల్స్‌లో జరపాలని ఇటీవల రష్యా అల్టిమేటం జారీ చేయడం యూరప్ దేశాల్లో కలకలం సృష్టించింది. మరోవైపు ఈ ఏడాది చివరకు రష్యా దిగుమతులపై ఆధారపడడాన్ని ఆపివేస్తామని పోలండ్ ప్రకటించింది. టర్కీలో జరిగిన చర్చల్లో కొంత పురోగతి కనిపించినా రష్యా, జెలెన్స్కీ ప్రకటనలతో సంధిపై ఆశలు అడుగంటాయి. తమపై రష్యా దాడి కొనసాగిస్తూనే ఉందని కీవ్ తదితర నగరాల మేయర్లు ఆరోపించారు. ఉక్రెయిన్ ఇంధన డిపోలను, స్పెషల్ ఫోర్స్ కేంద్రకార్యాలయాన్ని ధ్వంసం చేశామని రష్యా ప్రకటించింది. రష్యా సైనికులు ఆజ్ఞలు పాటించడం లేదు! ఉక్రెయిన్‌లోకి పంపిన రష్యా సైనికులు తమకిచ్చిన ఆజ్ఞలు పాటించేందుకు తిరస్కరిస్తున్నారని బ్రిటన్ ఇంటెలిజెన్స్ చీఫ్ జెరెమీ ఫ్లెమింగ్ చెప్పారు. పై అధికారుల మాట వినకపోవడమే కాకుండా సొంత ఆయుధాలనే ధ్వంసం చేస్తున్నారని, ఈ ప్రక్రియలో అనుకోకుండా ఒక ఎయిర్‌క్రాఫ్ట్‌ను కూడా కూల్చేశారని గురువారం జెరెమీ చెప్పారు. ఉక్రెయిన్‌పై దురాక్రమణను పుతిన్ తక్కువగా అంచనా వేశారని ఆస్ట్రేలియా పర్యటనలో ఆయన అభిప్రాయపడ్డారు. ఉక్రెయిన్ ప్రజల నుంచి ఇంత ప్రతిఘటన వస్తుందని పుతిన్ ఊహించలేదని, ఆంక్షల వల్ల వచ్చే ఆర్థిక ఇబ్బందులను అంచనా వేయలేదని, సొంత మిలటరీ శక్తిని ఎక్కువగా అంచనా వేసుకొని వేగంగా విజయం సాధిస్తామని భావించారని చెప్పారు. ప్రస్తుతం రష్యా సైనికులు నైతిక స్థైర్యం కోల్పోయి ఆజ్ఞలు తిరస్కరిస్తున్నారన్నారు. -
ఉక్రెయిన్ పరిణామాలు.. భారత్ వైఖరి నిరుత్సాహకరం
వాషింగ్టన్: ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణను ఖండిస్తూ భద్రతామండలిలో ప్రవేశపెట్టిన తీర్మానంపై ఓటింగ్‌లో భారత్ పాల్గొనకపోవడం నిరుత్సాహం కలిగించిందని రిపబ్లిక్ పార్టీకి చెందిన అమెరికా టాప్ సెనేటర్ జాన్ కొర్నిన్ వ్యాఖ్యానించారు. రష్యాతో ఉన్న వ్యూహాత్మక సంబంధాలను కొనసాగించేందుకే ఆ దేశాన్ని విమర్శించకుండా ఇలా తప్పించుకునే వైఖరిని అనుసరించిందని ఆయన ట్విట్టర్ వేదికగా భారత్‌ను విమర్శించారు. సెనేట్ ఇండియా కాకస్ సహాధ్యక్షుడి భారత్– అమెరికా సంబంధాలు బలోపేతానికి కృషి చేస్తున్న కొర్నిన్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. అమెరికా కాంగ్రెస్ సభ్యులురో ఖన్నా, ఎరిక్ స్వాల్వెల్ కూడా మండలిలో భారత్ వైఖరిని తప్పుబట్టారు. -
తైవాన్‌కు మద్దతు తెలిపిన అమెరికా ప్రజాప్రతినిధులు
తైపీ: తైవాన్ను దురాక్రమణ చేయాలని చైనా రంకెలు వేస్తున్న నేపథ్యంలో అయిదుగురు అమెరికా ప్రజాప్రతినిధులు ఆకస్మికంగా ఆదేశానికి వెళ్లారు. తైవాన్ అధ్యక్షురాలు సాయ్ ఇంగ్ వెన్ను శుక్రవారం కలుసుకున్నారు. తైవాన్ స్వయం పాలనకు తమ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. కొన్ని దశాబ్దాలుగా ఎన్నడూ లేని విధంగా తైవాన్, చైనా మధ్య ఘర్షణలు తారాస్థాయికి వెళ్లాయి. తైవాన్ స్వాతంత్య్ర ఉద్యమానికి మద్దతు ఇస్తే చూస్తూ ఊరుకోబోమని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ అమెరికా అధినేత బైడెన్‌కు ఇటీవల హెచ్చరించడం తెల్సిందే. -
‘పక్కా’గా కట్టేస్తోంది
న్యూఢిల్లీ: అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుల్లో డ్రాగన్ దేశం తన దురాక్రమణను యధేచ్ఛగా కొనసాగిస్తోంది. గుట్టు చప్పుడు కాకుండా ఏడాది కాలంలోనే వాస్తవాధీన రేఖ వెంబడి 60 భవనాల సముదాయాన్ని నిర్మించింది. అంతర్జాతీయ సరిహద్దులు, వాస్తవాధీన రేఖ మధ్యలో భారత్ భూభాగంలో 6 కి.మీ. పరిధిలో ఈ కొత్త భవనాలు వెలిశాయి. 2019లో తీసిన ఉపగ్రహ ఛాయాచిత్రాల్లో ఈ ప్రాంతంలో భవనాలేవీ లేవు. ఎన్డీటీవీ వార్తా సంస్థ తాజాగా సంపాదించిన ఉపగ్రహ ఛాయాచిత్రాల్లో ఈ భవనాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే అరుణాచల్ సరిహద్దుల్లో 100 ఇళ్లతో కూడిన ఒక గ్రామాన్నే నిర్మించిన చైనా దానికి 93 కి.మీ. దూరంలో తూర్పున ఈ భవన సముదాయాన్ని నిర్మించింది. మరోవైపు భారత్ ఆర్మీ ఈ శాటిలైట్ చిత్రాలను చూసి వాస్తవాధీన రేఖకి ఉత్తరాన ఈ భవన నిర్మాణం జరిగిందని, ఆ ప్రాంతం చైనా వైపే ఉందని అంటోంది. అరుణాచల్ సీఎం ప్రేమ ఖాండూ ఇతర ప్రభుత్వ అధికారులెవరూ ఈ కొత్త నిర్మాణాలపై పెదవి విప్పడం లేదు. చైనా గత దశాబ్దకాలంగా సరిహద్దుల్లో అక్రమ నిర్మాణాలను పెంచుతోంది. నిఘా రెట్టింపు చేస్తోంది. భారత్‌తో కయ్యానికి కాలు దువ్వుతూ వస్తోంది. అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుల్లో ఏకంగా 100 ఇళ్లతో కూడిన గ్రామాన్నే నిర్మించినట్టు ఈ ఏడాది మొదట్లోనే ఉపగ్రహ ఛాయా చిత్రాల ద్వారా వెల్లడింది. ఇటీవల అమెరికా రక్షణ కార్యాలయం పెంటగాన్ కూడా ఈ విషయాన్ని తన నివేదికలో ధ్రువీకరించింది. ఇలా ఇష్టారాజ్యంగా సరిహద్దుల్లో ఆక్రమణలు పెంచుకుంటూ వెళితే చేతులు ముడుచుకొని చూస్తూ ఊరుకోమని భారత్ హెచ్చరిస్తూనే ఉంది. అయినప్పటికీ చైనా ఏకపక్షంగా సరిహద్దుల్లో పౌరులు నివాసాలు ఏర్పరుచుకోవడానికి వీలుగా కొత్త భూ సరిహద్దు చట్టాన్ని కూడా తీసుకువచ్చింది. భూటాన్‌లో 4 గ్రామాలు నిర్మించిన చైనా భూటాన్‌లో చైనా దురాక్రమణ జోరుగా సాగుతోంది. డోక్లాం పీఠభూమికి సమీపంలో ఇటీవల చైనా 4 గ్రామాలను నిర్మించింది. దీనికి సంబంధించిన ఉపగ్రహ ఛాయా చిత్రాలను కాంగ్రెస్ నేతలు పలువురు గురువారం ట్వీట్‌చేశారు. ఈ ఏడాది మే–నవంబర్ మధ్య చైనా ఈ నిర్మాణాలను పూర్తి చేసినట్టు తెలుస్తోంది. ఇలా సరిహద్దుల్లో చైనా భూముల్ని ఆక్రమించడం దేశ భద్రతకు పెనుముప్పుగా మారుతుందని కాంగ్రెస్ పార్టీ ప్రధానకార్యదర్శి, ప్రధాన అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా ట్విటర్ వేదికగా ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నిర్మాణాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎందుకు మౌనంగా ఉన్నారని ఆయన నిలదీశారు. -
తైవాన్‌కు అమెరికా అండ
బీజింగ్: తైవాన్‌పై చైనా దురాక్రమణకు సిద్ధమైతే తాము చూస్తూ ఊరుకోబోమని అగ్రరాజ్యం అమెరికా హెచ్చరించింది. తైవాన్‌కు అండగా ఉంటూ రక్షిస్తామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్పష్టం చేశారు. సీఎన్ఎన్ వార్తా సంస్థ నిర్వహించిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న బైడెన్ అమెరికా ఎలాంటి యుద్ధాన్ని కోరుకోవడం లేదని చెప్పారు. కానీ, డ్రాగన్ దేశం తప్పులు చేస్తూ ఆ దిశగా తమని ప్రేరేపిస్తోందని ఆరోపించారు. తైవాన్ను కాపాడే విషయంలో వెనుకడుగు వేసే ప్రసక్తే లేదని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. చైనాకు అర్థం కావడానికే ఈ విషయం చెబుతున్నానని, తమ బలమేంటో అందరికీ తెలుసని అన్నారు. తైవాన్ను తమ దేశంలో కలిపేసుకోవడానికి చైనా ఇటీవల కపట వ్యూహాలు పన్నుతోంది. తైవాన్ గగన తలం మీదుగా యుద్ధ విమానాలతో విన్యాసాలు చేస్తూ కయ్యానికి కాలు దువ్వుతోంది. సరిహద్దుల వెంబడి సైనిక కవాతు నిర్వహిస్తోంది. కాగా, బైడెన్ వ్యాఖ్యల్ని చైనా తిప్పి కొట్టింది. తైవాన్ అంశంలో తాము ఎలాంటి రాజీ పడే ప్రసక్తే లేదంది. తైవాన్ తమ భూభాగం కిందకే వస్తుందని పునరుద్ఘాటించింది. సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రత, ప్రయోజనాలపై రాజీ పడబోమని తేల్చి చెప్పింది. -
కాబుల్ వైపు దూసుకొస్తున్న తాలిబన్ సైన్యం.. 15 కిలో మీటర్ల దూరంలో
కాబుల్: అఫ్ఘనిస్తాన్‌లో పలు ప్రాంతాలను తాలిబన్లు తమ ఆధీనంలోని తెచ్చుకుంటున్నాయి. అందులో భాగంగా తాలిబన్ సైన్యం దేశ రాజధాని కాబుల్ వైపు దూసుకువెళ్తోంది. కాబుల్‌కు దక్షిణాన ఉన్న నగరాన్ని తాలిబన్ల స్వాధీనం చేసుకున్నాయి. ఈ క్రమంలో ఆమెరికా బలగాలు రాయబార కార్యాలయాన్ని, ఇతర పౌరులను ఖాళీ చేయటంలో సహాయ పడుతున్నాయి. కాబుల్‌కు సమీపంలోని మైదాన్ వార్దక్ ప్రావిన్స్ రాజధాని మైదాన్ షార్ పట్టనాన్ని తాలిబన్లు స్వాధీనం చేసుకోవటంతో రాజధాని వైపు దూసుకోస్తున్నారు. ప్రస్తుతం కాబుల్‌కు 15 కీలో మీటర్ల దూరంలో తాలిబన్ బలగాలు ఉన్నట్లు తెలుస్తోంది. అమెరికా తుది విడత బలగాలను ఉపసంహరించడానికి వారంముందే దేశంలో 66% భూభాగం తాలిబన్ల నియంత్రణలోకి వెళ్లిపోయింది. ఇప్పటికే దేశంలో రెండో అతిపెద్ద నగరమైన కాందహార్‌ను ఆక్రమించుకున్నారు. దక్షిణాది ఆర్థిక హబ్‌గా పేరున్న కాందహార్‌లో గురువారం రాత్రి తాలిబన్లు, అఫ్ఘనిస్తాన్ సైన్యానికి మధ్య భీకర ఘర్షణ జరిగింది. అర్ధరాత్రి దాటాక తాలిబన్లు కాందహార్‌ని స్వాధీన పరచుకొని ప్రభుత్వ కార్యాలయాలపై తాలిబన్ జెండాలు ఎగురవేసినట్టు అధికారులు పేర్కొన్నారు. #Taliban are less than 15 kilometers away from #Kabul after they captured the town of Maidan Shar, capital of Maidan Wardak Province,#Afganistan pic.twitter.com/KZyLn02lAQ — Muhammad Waqas Khan (@AllahuAkbarr313) August 14, 2021 -
తాలిబన్ల గుప్పిట్లో కాందహార్
కాబూల్: అఫ్గానిస్తాన్‌లో తాలిబన్ల దురాక్రమణ జోరందుకుంది. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ముఖ్య నగరాలను శరవేగంతో స్వాధీనం చేసుకుంటున్నారు. దేశంలో రెండో అతి పెద్ద నగరమైన కాందహార్‌ను ఆక్రమించుకున్నారు. దక్షిణాది ఆర్థిక హబ్‌గా పేరున్న కాందహార్‌లో గురువారం రాత్రి తాలిబన్లు, అఫ్గాన్ సైన్యానికి మధ్య భీకర ఘర్షణ జరిగింది. అర్ధరాత్రి దాటాక తాలిబన్లు కాందహార్‌ని స్వాధీన పరచుకొని ప్రభుత్వ కార్యాలయాలపై తాలిబన్ జెండాలు ఎగురవేసినట్టు అధికారులు చెప్పారు. మరో వారంలో రాజధాని కాబూల్ సహా మొత్తం దేశం తమ వశమవుతుందని తాలిబన్ల ప్రతినిధి ఒకరు చెప్పారు. తాము విదేశీ సంస్థలపై దాడులకు దిగబోమని, ఈ సంక్షోభం సమయంలో అన్ని దేశాలు తమకు సహకరించాలని ఆ ప్రతినిధి విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం అఫ్గాన్ దక్షిణ భాగమంతా తాలిబన్ల పెత్తనం కిందకు వచ్చేసింది. కాబూల్‌కు కేవలం 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న హెల్మాండ్ నగరాన్ని ఆక్రమించుకోవడంతో ఇక దేశం యావత్తూ వారి చేతుల్లోకి వెళ్లిపోవడం ఎంతో దూరం లేదనే ఆందోళన పెరుగుతోంది. ఘాజ్నీ, హెరత్, లోగర్, ఫెరోజ్ కోహ్ వంటి కీలక నగరాల్లోనూ తాలిబన్లు పాగా వేశారు. ఆయా నగరాల్లోని స్థానిక నేతలు తాలిబన్ల ఎదుట లొంగిపోయారు. అమెరికా తుది విడత బలగాలను ఉపసంహరించడానికి వారం ముందే దేశంలో 66% భూభాగం తాలిబన్ల నియంత్రణలోకి వెళ్లిపోయింది. దేశంలో 34 ప్రావిన్షియల్ రాజధానులు ఉండగా, సగం రాజధానులను ఇప్పటికే ఆక్రమించారు. కాబూల్‌కు 80 కిలోమీటర్ల దూరంలోని లోగర్ ప్రావిన్స్‌లో ఇరుపక్షాల మధ్య ఘర్షణ కొనసాగుతోంది. అమెరికా, యూకే సిబ్బంది వెనక్కి తాలిబన్లు రెచ్చిపోతుండగా పశ్చిమ దేశాలు తమ దౌత్య కార్యాలయాలను మూసేస్తూ, సిబ్బంది వెనక్కి తీసుకువస్తున్నారు. అమెరికా, బ్రిటన్, కెనడా అవే ప్రయత్నాల్లో నిమగ్నమయ్యాయి. ఐరాస ఆందోళన అఫ్గానిస్తాన్‌లో రోజురోజుకూ మారుతున్న పరిణామాలపై ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియా గుటేరస్ ఆందోళన వ్యక్తం చేశారు. అఫ్గాన్ ప్రభుత్వం, తాలిబన్ల మధ్య దోహాలో జరిగే చర్చలతో సంక్షోభం పరిష్కారమవుతుందని భావిస్తున్నట్లు చెప్పారు. అధికారాన్ని కలిసి పంచుకుందామని అధ్యక్షుడు ఘనీ తాలిబన్లకు ప్రతిపాదనలు పంపిన సంగతి తెలిసిందే. మహిళలపై వేధింపులు షురూ అఫ్గానిస్తాన్‌పై పట్టు బిగిస్తున్న తాలిబన్ల అరాచకాలు మళ్లీ మొదలయ్యాయి. బందీలుగా చిక్కిన అఫ్గాన్ సైనికుల్ని ఉరి తీయడం, తమ ఆధీనంలో ఉన్న ప్రాంతాల్లోని పెళ్లి కాని అమ్మాయిల్ని ఉగ్రవాదులకు కట్టబెట్టాలని చూడడం వంటి పనులు చేస్తున్నట్టుగా మానవ హక్కుల సంఘాలు చెప్పినట్టు వాల్‌స్ట్రీట్ జర్నల్ వెల్లడించింది. తమ వల్ల ఎవరికీ ఎలాంటి హానీ ఉండదని పదే పదే ప్రకటిస్తున్న తాలిబన్లు విరుద్ధంగా ప్రవరిస్తున్నారు. -
జీహెచ్ఎంసీ అధికారులపై హైకోర్టు ఆగ్రహం
సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీ పరిధిలోని ఫుట్‌పాత్‌లు ఆక్రమణకు గురవుతున్నా సంబంధిత అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలోనే పాదచారులు గాల్లో నడవాలా అని ప్రశ్నించింది. ఫుట్‌పాత్‌లపై వెంటనే ఆక్రమణలను తొలగించాలని, ఇంతకుముందు తీసుకున్న చర్యలను వివరిస్తూ స్థాయి నివేదిక సమర్పించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. సమగ్ర సర్వే చేసి గతంలో ఉన్న ఫుట్‌పాత్‌లను తొలగిస్తే ఆ ప్రాంతంలో తిరిగి నిర్మించాలని, ప్రజలు సౌకర్యం గా నడిచేలా ఫుట్‌పాత్‌లను ఏర్పాటు చేయాలని స్పష్టం చేసింది. ఫుట్‌పాత్‌లు ఆక్రమణకు గురవుతున్నా చర్యలు చేపట్టకపోవడాన్ని సవాల్ చేస్తూ న్యాయవాది మామిడాల తిరుమలరావు వ్యక్తిగతంగా దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ బి.విజయసేన్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం గురువారం విచారించింది. నగరంలోని అనేక ప్రాంతా ల్లో ఫుట్‌పాత్‌లను తొలగించారని, కొన్ని చోట్ల ఫుట్‌పాత్‌లను వీధి వ్యాపారులు ఆక్రమించుకుంటున్నారని తిరుమలరావు వివరించారు. దీంతో గత్యంతరం లేక పాదచారులు రోడ్డుపై నడవాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని, ఈ సమయంలో ప్రమాదాలు జరిగితే పాదచారుల నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగినట్లుగా పేర్కొంటున్నారని తెలిపారు. ఇండియన్ రోడ్స్ కాంగ్రెస్ మార్గదర్శకాల ప్రకారం ఫుట్‌పాత్‌లను నిర్మించాలని పలుమార్లు విజ్ఞప్తి చేసినా స్పందన లేదని వివరించారు. ఈ పిటిషన్లో నగర పోలీసు కమిషనర్‌ను ఎందుకు ప్రతివాదిగా చేర్చారని ధర్మాసనం ప్రశ్నించగా.. కమిషనర్ కార్యాలయంతోపాటు పోలీస్స్టేషన్ల ఎదురుగా రోడ్లపైనే వాహనాలను అడ్డగోలుగా పార్క్ చేస్తున్నా పట్టించుకోవట్లేదని నివేదించారు. ‘రోడ్లు విస్తరణ చేయడంతో ఫుట్‌పాత్‌లను తొలగిస్తున్నారు. 1990ల్లో 10 ఫీట్లున్న ఫుట్‌పాత్‌లు రోడ్ల విస్తరణతో 5 ఫీట్లకు తగ్గాయి. ఇటీవల మెట్రో నిర్మాణానికి సంబంధించి పిల్లర్లను ఏర్పాటు చేయడంలో పూర్తిగా ఫుట్‌పాత్‌లను తొలగించారు. అక్కడక్కడ ఉన్న ఫుట్‌పాత్‌లను చిరువ్యాపారులు ఆక్రమించుకుంటున్నారు. దీంతో ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు’అని జస్టిస్ విజయసేన్‌రెడ్డి పేర్కొన్నారు. చిరువ్యాపారుల కోసం ప్రత్యేకంగా ప్రాంతాన్ని కేటాయించలేదా అని ధర్మాసనం ప్రశ్నించగా.. కొన్ని ప్రదేశాలను కేటాయించామని ప్రభుత్వ న్యాయవాది నివేదించారు. ఫుట్‌పాత్‌లపై ఉన్న ఆక్రమణలను తొలగించాలని, ఈ దిశగా తామిచ్చిన ఆదేశాలను అమలు చేయాలని, తీసుకున్న చర్యలను వివరిస్తూ నివేదిక సమర్పించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశిస్తూ తదుపరి విచారణను ఏప్రిల్ 15కు వాయిదా వేసింది. -
8 ఏళ్ల తర్వాత కూడా అదే తీరు
తిరువనంతపురం : టీమిండియా క్రికెటర్.. కేరళ స్పీడస్టర్ శ్రీశాంత్ 8 ఏళ్ల తర్వాత మళ్లీ మైదానంలోకి దిగిన సంగతి తెలిసిందే. ఇటీవలే సయ్యద్ ముస్తాక్ టోర్నీకి సంబంధించి కేరళ జట్టు ప్రాబబుల్స్‌లో శ్రీశాంత్ చోటు దక్కించుకున్నాడు. జనవరి 10 నుంచి సయ్యద్ ముస్తాక్ టోర్నీ జరగనుంది. ఈ క్రమంలో తన ప్రాక్టీస్‌ను ఆరంభించిన శ్రీశాంత్ 8 ఏళ్ల తర్వాత అదే కోపాన్ని చూపించడం ఆసక్తికరంగా మారింది. (చదవండి : 'ఆ మ్యాచ్‌లో నన్ను గెట్ అవుట్ అన్నారు') ఆది నుంచి టీమిండియాలో అగ్రెసివ్ క్రికెటర్‌గా పేరు పొందిన శ్రీశాంత్‌కు బాధ వేసినా.. సంతోషం కలిగినా అస్సలు తట్టుకోలేడు. ఎదుటివారిని బోల్తా కొట్టించేందుకు తనదైన శైలిలో కవ్వింపు చర్యలకు పాల్పడేవాడు. శ్రీశాంత్ కెరీర్లో ఇలాంటివి చాలానే చూశాం. తాజాగా శ్రీశాంత్ సయ్యద్ ముస్తాక్ టోర్నీ సన్నాహకంగా వార్మప్ మ్యాచ్‌ల్లో ఆడుతున్నాడు. ఈ సందర్భంగా శ్రీశాంత్ వేసిన బంతిని ప్రత్యర్థి బ్యాట్స్‌మన్ భారీ షాట్ ఆడాడు. ఆ షాట్‌ను కోపంతో చూస్తూ శ్రీశాంత్ మళ్లీ పాతరోజులకు వెళ్లిపోయాడు. పిచ్‌పై నిలబడి బ్యాట్స్‌మన్‌పై స్లెడ్జింజ్‌కు దిగాడు. కాగా శ్రీశాంత్ బౌలింగ్ వీడియోనూ కేరళ క్రికెట్ అసోసియేషన్ యూట్యూబ్‌లో షేర్ చేసింది. కాగా శ్రీశాంత్ చర్యపై నెటిజన్లు తమదైశ శైలిలో కామెంట్లు చేస్తున్నారు. 8 ఏళ్ల తర్వాత కూడా శ్రీశాంత్ తీరులో ఏ మార్పు లేదు. శ్రీశాంత్ అంటేనే కోపానికి మారుపేరు.. అతను అలా ఉంటేనే కరెక్ట్.. అని పేర్కొన్నారు. కాగా 2013 ఐపీఎల్ సీజన్లో స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు తేలడంతో బీసీసీఐ శ్రీశాంత్‌తో పాటు అంకిత్ చవాన్, అజిత్ చండీలాపై జీవితకాలం నిషేధం విధించింది. అయితే బీసీసీఐ శ్రీశాంత్‌పై విధించిన నిషేధాన్ని ఏడేళ్లకి కుదించగా.. గతేడాది సెప్టెంబరుతో అది ముగిసింది. -
నాలాల దురాక్రమణపై హైకోర్టుకు వెళ్లండి..
సాక్షి, చెన్నై: హైదరాబాద్‌లో వరదలకు కారణమైన చెరువులు, నాలాల దురాక్రమణపై ఎన్జీటీ చెన్నై బెంచ్ గురువారం విచారణ చేపట్టింది. నాలాలు, చెరువుల దూరాక్రమణల విషయంలో కిర్లాస్కర్ కమిటీ ప్రతిపాదనలు అమలు చెయాలని తాము చెప్పలేమని ఎన్జీటీ స్పష్టం చేసింది. హైదరాబాద్‌లో భారీ వరదలకు కారణమైన చెరువులు, నాలాల దురాక్రమణకు సంబంధించి జర్నలిస్టు సిల్వేరి శ్రీశైలం పిటిషన్ దాఖలు చేశారు. గతంలో ఆక్రమణలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కిర్లాస్కర్ కమిటీ ఏర్పాటు చేసిందని తెలిపారు. అయితే కమిటీ ప్రతిపాదనలు అమలు కావడం లేదని ఎన్జీటీకి విన్నవించారు. ఈ విషయంలో కిర్లాస్కర్ కమిటీ ప్రతిపాదనలు అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వానికి తాము చెప్పలేమని ఎన్జీటీ స్పష్టం చేసింది. హైకోర్టుకు వెళ్లాలని పిటిషనర్‌కు సూచించింది. దాంతో పిటిషన్‌ని ఉపసంహరించుకున్నారు. (చదవండి: అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌కు ఎన్జీటీ షాక్) -
ఏకం చేసిన ఘనత పటేల్‌దే
న్యూఢిల్లీ: దేశవిభజన తర్వాత వందలాది స్వతంత్ర రాజ్యాలుగా మిగిలిపోయిన భారత్‌ను ఏకం చేసిన ఘనత సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్‌దేనని ప్రధాని నరేంద్ర మోదీ గుర్తుచేశారు. అప్పటి హోంమంత్రిగా ఉన్న పటేల్ సరైన సమయంలో ప్రతిస్పందించడంతో జమ్మూకశ్మీర్‌ను విదేశీ దురాక్రమణ నుంచి కాపాడుకోగలిగామన్నారు. అక్టోబర్ మాసాంతపు ’మన్ కీ బాత్’ రేడియో కార్యక్రమంలో భాగంగా ఆదివారం ప్రసంగించిన మోదీ.. ఈ నెల 31 సర్దార్ పటేల్ జయంతి సందర్భంగా నిర్వహించనున్న ‘రన్ ఫర్ యూనిటీ’ మారథాన్‌లో పాల్గొనాలని యువతకు పిలుపునిచ్చారు. ‘ఇప్పుడు మనం భారత్‌ను ఒక దేశంగా చూస్తున్నామంటే సర్దార్ పటేల్ తెలివితేటలు, వ్యూహాత్మక నిర్ణయాలే కారణం. అక్టోబర్ 31న çపటేల్ విగ్రహాన్ని జాతికి అంకితం చేయడమే ఆయనకు మనం ఇవ్వబోయే నిజమైన నివాళి. గుజరాత్లో నర్మదా నదీతీరాన నిర్మించిన సర్దార్ పటేల్ విగ్రహం ప్రపంచంలోనే ఎత్తైనది. ఇప్పటివరకూ ప్రపంచంలోనే ఎత్తయిన రెండో విగ్రహంగా ఉన్న న్యూయార్క్‌లోని ‘స్టాట్యూ ఆఫ్ లిబర్టీ’కి రెండింతల ఎత్తులో పటేల్ విగ్రహం ఉండనుంది. భారత మాజీ ప్రధాని దివంగత ఇందిరాగాంధీ వర్ధంతి కూడా అక్టోబర్ 31నే. ఈ సందర్భంగా ఇందిరాజీకి నివాళులు అర్పిస్తున్నాను’ అని మోదీ తెలిపారు. అభివృద్ధితోనే నిజమైన శాంతి.. ‘యుద్ధం లేకపోవడం నిజమైన శాంతి కాదు. అభివృద్ధి ఫలాలు సమాజంలోని చిట్టచివరి వ్యక్తులకు అందడమే నిజమైన శాంతికి సూచిక. ప్రపంచశాంతి గురించి ఎక్కడైనా ప్రస్తావించాల్సి వస్తే అందులో భారత్ పాత్రను సువర్ణాక్షరాలతో లిఖించాల్సి ఉంటుంది. మొదటి ప్రపంచయుద్ధంలో మనకు ఎలాటి సంబంధం లేకపోయినా భారతీయ సైనికులు కదనరంగంలో దూకారు. ఈ యుద్ధంలో కోటి మంది సైనికులతో పాటు మరో కోటి మంది పౌరులు ప్రాణాలు కోల్పోయిన తర్వాత ప్రపంచానికి శాంతి ప్రాముఖ్యత అర్థమయింది. గత వందేళ్లలో శాంతి అన్న పదానికి నిర్వచనమే మారిపోయింది. ఇప్పుడు శాంతి అంటే కేవలం యుద్ధం లేకపోవడం మాత్రమే కాదు. ఇందుకోసం ఉగ్రవాదం, వాతావరణ మార్పులు, ఆర్థికాభివృద్ధి, సామాజిక న్యాయం తదితర సమస్యల పరిష్కారినికి కలిసికట్టుగా పోరాడాల్సిన అవసరం ఉంది’ అని మోదీ అన్నారు. క్రీడారంగంలో రాణించాలంటే స్పిరిట్ (స్ఫూర్తి), స్ట్రెంత్ (శక్తి), స్కిల్ (నైపుణ్యం), స్టామినా (సామర్థ్యం) ఉండటం కీలకమన్నారు. సైనిక చర్యలో ఆలస్యం ఉండొద్దన్న సర్దార్ ‘కశ్మీర్‌ను ఆక్రమించుకున్న పాక్ బలగాలను తరిమికొట్టేందుకు భారత సైన్యాన్ని పంపడంలో జరుగుతున్న జాప్యంపై సర్దార్ పటేల్ అప్పట్లో తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. భారత సైనిక చర్యలో ఎలాంటి ఆలస్యం ఉండరాదని అప్పటి ఫీల్డ్ మార్షల్ మానెక్ షాకు పటేల్ సూచించారు. ఆతర్వాత వెంటనే రంగంలోకి దిగిన భారత బలగాలు కశ్మీర్‌ను పాక్ దురాక్రమణ నుంచి కాపాడాయి. భారత్‌కు ఏకం చేయగల, దేశ విభజన గాయాలను మాన్పగల శక్తిఉన్న వ్యక్తిగా పటేల్‌ను 1947, జనవరిలో ప్రఖ్యాత టైమ్ మ్యాగజీన్ కీర్తించింది. స్వదేశీ సంస్థా నాలను దేశంలో విలీనం చేసే సామర్థ్యం కేవలం పటేల్‌కే ఉందని మహాత్మా గాంధీ సైతం గుర్తించారు. హైదరాబాద్, జునాగఢ్, ట్రావెన్కోర్.. ఒకటితర్వాత మరొకటి ఇలా 562 స్వదేశీ సంస్థానాలను పటేల్ భారత్‌లో విలీనం చేశారు. ఇందులో పూర్తి ఘనత పటేల్‌కే దక్కుతుంది’ అని మోదీ పేర్కొన్నారు. -
'ఏ దాడిని ఎదుర్కొనేందుకైనా వాయుసేన సిద్ధం'
సాక్షి, కపుర్తలా : ఎలాంటి విదేశీ దాడినైనా ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని భారత ఎయిర్ చీఫ్ మార్షల్ ఎన్‌జేఎస్ ధిల్లాన్ అన్నారు. భారత్‌కు వ్యతిరేకంగా కవ్వింపు చర్య జరిగే అవకాశం కొంతమేరకు మాత్రమే ఉందన్నారు. ప్రస్తుతం పశ్చిమ వాయుసేనకు కమాండర్‌గా పనిచేస్తున్న ఆయన శనివారం కపుర్తలలో ఒకప్పుడు తాను చదివిన సైనిక పాఠశాలకు వచ్చి పాత్ర మిత్రులతో గడిపారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ భారత వాయుసేన ప్రపంచంలో నాలుగో స్థానంలో ఉందని అన్నారు. వచ్చే ఏడాది సెప్టెంబర్ నెలలో సైన్యంలోకి 18 రఫెల్ ఫైటర్ జెట్స్ ప్రవేశపెడుతున్నామని దాంతో తమ వాయుసేన బలం మరింత కానుందని తెలిపారు. ఈ సందర్భంగా మేజర్ జనరల్ బల్విందర్ సింగ్ కూడా మాట్లాడుతూ సైనిక పాఠశాల చేస్తున్న కృషిని కొనియాడారు. -
అబ్బాయిలతో ఆడటమే నా దూకుడుకు కారణం
హైదరాబాద్: అబ్బాయిలతో క్రికెట్ ఆడటమే దూకుడుగా ఆడేలా చేసిందని భారత మహిళా క్రికెటర్ హర్మన్ ప్రీత్ కౌర్ అభిప్రాయపడింది. మహిళా ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియాపై చెలరేగిన కౌర్ 7 సిక్సులు, 20 ఫోర్లతో 171 పరుగులు చేసిన విషయం తెలిసిందే. కెరీర్ మొదట్లో అబ్బాయిలతో ఆడుతూ అలవోకగా సిక్సులు కొట్టడం నేర్చుకున్నానని కౌర్ గుర్తు చేసుకుంది. దూకుడుగా ఆడటం అంటే ఇష్టమని ఈ దూకుడైన శైలి చిన్నప్పటి నుంచి సహజంగానే వచ్చిందేనని ఈ వైస్ కెప్టెన్సీ చెప్పుకొచ్చింది. ఫైనల్లో ఇంగ్లండ్‌తో ఓటమి నిరాశపరిచిందని, ఫీల్డర్స్ చుట్టుముట్టడంతో పరుగుల కోసం షాట్ ప్రయత్నించి క్యాచ్ అవుటయ్యానని పేర్కొంది. డొమెస్టిక్ క్రికెట్లో దూకుడుగా ఆడటంతోనే అంతర్జాతీయ క్రికెట్లో అవకాశం వచ్చిందని అయితే పెద్ద స్కోర్లు చేయలేదని కౌర్ చెప్పుకొచ్చింది. సెమీస్‌లో ఆస్ట్రేలియాపై నా ప్రదర్శన మరిచిపోలేనిదని ఈ మ్యాచ్ ప్రసారం కావడం అందరూ చూడటం మరింత సంతోషాన్ని ఇచ్చిందని కౌర్ ఆనందం వ్యక్తం చేసింది. -
గ్రీకు వీరుడు
-
ఇది మాపై దురాక్రమణే: సిరియా
తమ సైనిక స్థావరంపై అమెరికా తోమహాక్ క్షిపణులతో దాడి చేయడాన్ని సిరియా తీవ్రంగా ఖండించింది. ఇది కచ్చితంగా దురాక్రమణే అని సిరియా అధికారిక టీవీ చానల్ ప్రకటించింది. సిరియా రసాయన దాడులలో 70 మంది వరకు మరణించిన విషయాన్ని తీవ్రంగా ఖండించిన ఒక్క రోజు తర్వాతే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ దాడులకు ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే ఈ దాడులపై సిరియా అధ్యక్షుడు అసద్ అల్ బషర్ నేరుగా ఇంతవరకు స్పందించలేదు. అంతర్జాతీయ సమాజం నుంచి కూడా దీనిపై ఇంకా ఎలాంటి స్పందనలు రాలేదు. కానీ, తాము ముందుగానే సిరియాలో ఉన్న రష్యా దళాలకు తమ దాడుల గురించి సమాచారం అందించామని పెంటగాన్ ఓ ప్రకటనలో తెలిపింది. అక్కడ వైమానిక స్థావరంలో ఉన్న రష్యన్, సిరియన్ బలగాలకు ముప్పు వీలైనంత తక్కువగా ఉండేందుకు గాను అమెరికా సైనిక వ్యూహకర్తలు అన్ని రకాల ముందు జాగ్రత్తలు తీసుకున్నారని కూడా ఆ ప్రకటనలో వివరించింది. -
శఠగోపం
► కౌలు రూ.15 లక్షలు, నీటితీరువా బకాయి ఐదు లక్షలు ► 27న ఆలయ భూముల సాగుకు వేలం జలుమూరు ప్రసిద్థ శైవక్షేత్రం శ్రీముఖలింగేశ్వరునికి కౌలుదారులు శఠగోపం పెడుతున్నారు. మరికొంతమంది ఆలయ భూముల కబ్జాకు పూనుకుంటున్నారు. భూములను అనుభవిస్తున్నవారు కూడా శిస్తు, చెల్లించకుండా ఎగనామం పెడుతున్నారు. ఇంత జరుగుతున్నా దేవాదాయ, రెవెన్యూశాఖల అధికారులు కనీస చర్యలు తీసుకోపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. (నరసన్నపేట): శ్రీముఖలింగేశ్వరస్వామి పేరున జిల్లాలోని పలుచోట్ల భూములున్నాయి. ముఖలింగంలోని ఆలయ పరిధిలోనే 28.99 ఎకరాలు ఉండగా.. ఎల్‌ఎన్‌పేట మండలంలో 15, పాతపట్నంలో 18 ఎకరాలు ఉన్నాయి. అలాగే ఈ పరిధిలోకి వచ్చే రా«ధాగోవిందస్వామి ఆలయానికి చెందిన 60 ఎకరాలతోపాటు.. నరసింహాస్వామి దేవాలయ భూములు 120 ఎకరాలు ఉన్నాయి. వీటిలో చాలా వరకూ ఆక్రమణలకు గురైంది. అలాగే మరికొందరు కౌలు పద్ధతిలో ఆలయ భూములను సాగు చేస్తున్నప్పటికీ దేవాదాయశాఖకు మాత్రం రూపాయి కూడా చెల్లించడం లేదు. భూమి శిస్తుగా సుమారు 15 లక్షల రూపాయలు రైతులు చెల్లించాల్సి ఉందని ఆలయ ఈఓ వీవీఎస్ నారాయణ ‘సాక్షి’కి తెలిపారు. దీనిపై న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్నట్టు పేర్కొన్నారు. ఆలయ భూములకు నీటితీరువా బకాయి సుమారు ఐదు లక్షల రూపాయలు ఉన్నట్లు తహసీల్దార్ కె.ప్రవళ్లికా ప్రియ తెలిపారు. నీటి తీరువా వసూలు కోసం రైతులకు నోటీసులు జారీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. అధికారులు విఫలం: స్వామి వారి భూముల పరిరక్షించడంలో ఆలయ అధికారులతోపాటు రెవెన్యూ అధికారులు విఫలమవుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. శ్రీముఖలింగం దేవాలయ భూమికి సంబంధించి రెండేళ్ల క్రితం వంశధార కరకట్టల నిర్మాణ కాంట్రాక్టర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల, భేమేశ్వర ఆలయం పక్కనే సుమారు రూ. 50 లక్షలు విలువైన మట్టిని ఎటువంటి అనుమతులు లేకుండానే తరలించాడు. స్వామి వారి భూములకు రక్షణ లేదనేందుకు దీన్ని ఉదాహరణగా చెప్పవచ్చు. కేంద్రపురావస్తు శాఖ ఆదేశాల మేరకు ఆలయాలకు 100 నుంచి నుంచి 200 మీటర్ల దూరం వరకూ ఎటువంటి తవ్వకాలు జరపకూడదన్న నిబంధన ఉన్నా దీన్ని ఎవరూ పట్టించుకోవడం లేదు. ఆర్టీవో స్థాయి అధికారి అప్పట్లో సందర్శించినప్పటికీ కాంట్రాక్టర్‌పై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. వీటితోపాటు డబ్బపాడు, శ్రీముఖలింగం తదితర గ్రామాల్లో ఆలయ భూములకు చాలా వరకూ అక్రమణదారులు చెరలో ఉన్నాయి. అధికారులు మేల్కొకపోతే ఆలయ భూములు కనుమరుగు కావడం ఖాయమని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఫిర్యాదు చేస్తే ఆక్రమణలు తొలగిస్తాం: శ్రీముఖలింగేశ్వరుని దేవాలయ భూములు అన్యాక్రాంతం, ఆక్రమణలు జరిగినట్లుగా ఫిర్యాదులు వస్తే సర్వేతోపాటు పరిశీలన చేసి చర్యలు తీసుకుంటాం. అలాగే నీటి తీరువాకు సంబంధించిచి బకాయి వసూలుకు నోటీసీలు సిద్ధం చేస్తున్నాం. ---కె.ప్రవళ్లికా ప్రియ, తహసీల్దార్, జలుమూరు. 27న దేవాలయ భూముల సాగుకు వేలం శ్రీముఖలింగంలో ఉన్న సుమారు 29.99 సెంట్ల భూమిని సాగుకు ఇచ్చేందుకు ఈనెల 27వ తేదీన వేలం నిర్వహించనున్నాం. అలాగే శ్రీముఖలింగంతోపాటు ఇతర గ్రామాల్లో ఉన్న స్వామి వారి భూములు ఆక్రమణల్లో ఉన్నాయి. దీనిపై రెవెన్యూ అధికారులు సర్వే జరిపి మాకు అప్పచెప్పాలి. అక్రమ తవ్వకాలు సమయంలో తాను ఇక్కడ లేను. ---వీవీఎస్ నారాయణ, ఈవో, శ్రీముఖలింగం దేవాలయం -
హద్దులు లేక అన్యాక్రాంతం నగరంలో కానరాని చెరువులు
యథేచ్ఛగా ఆక్రమణలు చెరువుల భూముల్లో వెలుస్తున్న అక్రమ నిర్మాణాలు అధికారుల పాత్రపై అనుమానాలు గ్రేటర్ పరి«ధిలోని పలు చెరువులకు హద్దులు పెట్టకపోవడంతో అవి ఆక్రమణకు గురవుతున్నాయి. జలాశయాలను పరిరక్షించాలని స్వచ్ఛంద సంస్థల ప్రతి నిధులు, చెరువుల రక్షణ సొసైటీలు జిల్లా యంత్రాంగానికి ఎన్ని వినతి పత్రాలు ఇస్తున్నా స్పందన కరువైంది. వరంగల్: గ్రామీణ ప్రాంతాల్లో జీవనోపాధి ఇబ్బందిగా మారడంతో గ్రామాల్లోని కూలీలు నగరానికి వలస వస్తున్నారు. ఇలాంటి వారు నివాసముండేందుకు ప్రభుత్వ స్థలాలే దిక్కయ్యాయి. వీటితో పాటు చెరువుల శిఖం భూముల్లో వీరు తాత్కాలికంగా నివాసం ఏర్పాటు చేసుకుంటున్నారు. కానీ, వారి ముసుగులో రియల్టర్లు చెరువుల భూములను చెరపడుతున్నారు. ఒకనాటి రామసముద్రం నేడు ఎస్ఆర్ నగర్‌గా మారింది. కాలనీ వాసులు మౌలిక వసతుల కోసం కేటాయించిన ప్రభుత్వ భూమి సైతం ఆక్రమణకు గురైంది. దీనిపై స్థానికులు, రెవెన్యూ అధికారులకు సమాచారం అందించినా పట్టించుకోకపోవడంపై అధికారుల పాత్రపై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నగరంలో చెరువులు ప్రశ్నార్థకమే... గ్రేటర్ వరంగల్ పరిధిలో సమ్మర్ స్టోరేజీ రిజర్వాయర్లుగా, మినీ ట్యాంక్ బండ్‌గా అభివృద్ధి చేస్తున్న కొన్ని చెరువులు మినహాయిస్తే మిగిలిన చెరువులు కనిపించని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. హన్మకొండ, వరంగల్, కాజీపేట, హస¯Œపర్తి రెవెన్యూ గ్రామాల పరిధిలో 34 చెరువులు ఆక్రమణకు గురయ్యాయి. హన్మకొండలోని న్యూశాయంపేట కోట చెరువు, కాజీపేట దంతాల చెరువు, బంధం చెరువు, భట్టుపల్లి కోట చెరువు, తిమ్మాపూర్ బెస్తం చెరువు, మడికొండ లోయకుంట, అయో«ధ్యాపురం దాసరి కుంట, సోమిడి ఊర చెరువు, పైడిపెల్లిలోని ఉగాది చెరువు, పురిగిద్దు చెరువు, మొగుళ్లబంధం, ఆరెపల్లి తుర్కకుంట, తిమ్మాపూర్‌లోని మద్దెలకుంట, మంగళకుంట, ఎర్రకుంట, మామునూరులోని భగవాన్ చెరువు, సాయికుంట, ఎనుమాములలోని సాయి చెరువు, రామసముద్రం, బ్రాహ్మణకుంట, గోపాలపురంలోని ఎనకెర్ల సూరం కుంట, ఊర చెరువు, పలివేల్పులలోని పెద్ద చెరువు, ఉంగల చెరువు, మాలకుంటలు ఉన్నాయి. వరంగల్ మండలం పరిధిలో ఉర్సు రంగసముద్రం, మట్టెవాడ కోట చెరువు, నిమ్మల చెరువు, దేశాయిపేట కొత్త వడ్డేపల్లి చెరువు, హసన్‌పర్తి మండల పరిధిలో వంగపహాడ్ చింతల్ చెరువు, ఎల్లాపూర్ సాయన్న చెరువు, బీమారం శ్యామల చెరువు, హసనపర్తి చెన్నంగి చెరువు, ముచ్చర్ల వెంకటాద్రి చెరువులు ఉన్నాయి. ఈ చెరువుల పరిధిలోని వేలాది ఎకరాల్లో ఇళ్లు, ఫ్లాటింగ్ చేసినట్లు నీటి పారుదల శాఖ అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. అసలు చెరువు విస్తీర్ణం ఎంత ఉంది. అందులో ఎన్ని ఎకరాలు అన్యాక్రాంతమైందన్న వివరాలు ఇరిగేషన్ అధికారులు చెప్పలేకపోతున్నారు. హద్దులు తేల్చని రెవెన్యూ శాఖ... నగరంలోని చెరువులు మైనర్ ఇరిగేషన్ శాఖ పరిధిలో ఉన్నప్పటికీ వాటి విస్తీర్ణం ఎంత ఉన్నదన్న విషయాలను రెవెన్యూ శాఖ నిర్ధారించాల్సి ఉంది. విస్తీర్ణం ఎంత ఉందో అన్నది రెవెన్యూ శాఖ గుర్తించి హద్దులు నిర్ణయిస్తే ఇరిగేషన్ శాఖ అధికారులు ఎఫ్టీఎల్ (ఫుల్ ట్యాంక్ లెవల్) నిర్ధారించాల్సి ఉంటుంది. ఇరు శాఖల్లో సమన్వయం లేకపోవడంతో చెరువుల భూములు ఆక్రమణకు గురువుతున్నాయి. ఈ చెరువుల పరిధిలో పట్టా భూములు ఉన్నాయని, హద్దులు గుర్తిస్తే తమ భూముల్లో హద్దులు పెట్టుకుంటామని భూహక్కుదారులు రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులను సంప్రదిస్తున్నా పట్టించుకోని పరిస్థితులు నెలకొన్నాయి. చెరువుల ఎఫ్టీఎల్ ఏమేరకు విస్తరించి ఉన్నది...విస్తీర్ణం ఎంత ఉన్నదన్న విషయాలను ప్రయివేటు ఏజెన్సీలతో సర్వే చేసి నిర్ణయిస్తామని అప్పటి ఉమ్మడి జిల్లా కలెక్టర్ కరుణ ప్రకటించినా నేటి వరకు ఎలాంటి సర్వేలూ చేపట్టలేదు. నిలిచిన ‘బతుకమ్మ’ గద్దె నిర్మాణ పనులు చిన్నవడ్డేపల్లి చెరువులో ప్రతి ఏటా బతుకమ్మ ఆడేందుకు స్థలాన్ని ఎఫ్టీఎల్ పరిధిలో కేటాయించారు. ఈ స్థలంలో గద్దె నిర్మించి బతుకమ్మ విగ్రహం ఏర్పాటు చేసేందుకు ప్రారంభమైన పనులు నిలిచిపోయాయి. రెండు రోజుల క్రితం పనులు జరుగుతున్న స్థలంతో పాటు సుమారు నాలుగున్నర ఎకరాల భూమిపై కోర్టు తీర్పు ఇచ్చిందని స్థల యాజమాని చెప్పడంతో బతుకమ్మ గద్దె పనులు నిలిచిపోయాయి. అసలు చెరువు ఎఫ్టీఎల్ ఎంత వరకు విస్తరించి ఉన్నది. అందులో ప్రభుత్వ భూమి ఏమేరకు ఉన్న విషయాలను గుర్తించి హద్దులు పెట్టాలని చెరువుల పరిరక్షణ కమిటీలు డిమాండ్ చేస్తున్నాయి. -
ఇరాక్ దురాక్రమణ జరిగిన రోజు
ఆ నేడు 2 ఆగస్టు 1990 సెల్ఫోన్లు లేవు. ఇంత సోషల్ నెట్వర్క్ లేదు. అయినప్పటికీ కువైట్‌ను ఇరాక్ దురాక్రమించిన వార్త కొద్ది నిమిషాల్లోనే ప్రపంచాన్ని యుద్ధ మేఘంలా కమ్ముకుంది. 700 యుద్ధట్యాంకులను వెంటేసుకుని, లక్షమంది ఇరాక్ సైనికులు తెల్లవారుజామున చప్పుడు చెయ్యకుండా వెళ్లి కువైట్‌ని ఆక్రమించుకున్నారు. ఏ దేశం అయినా తమ ఆక్రమణను అడ్డుకుంటే ఆ దేశాన్ని మరుభూమిగా మార్చేస్తామని ఇరాక్ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్ గర్జించారు. ఇరాక్ జెట్ విమానాలు కువైట్‌లోని ప్రధాన కేంద్రాలను నేలమట్టం చేసేశాయి. ఆక్రమణ మొదలైన కొన్ని గంటల్లోనే 200 మంది కువైట్ పౌరులు దుర్మరణం చెందారు. ఐక్యరాజ్య సమితి రంగంలోకి దిగింది. వెంటనే కువైట్‌ను వదలివెళ్లకుంటే తీవ్ర పరిణామాలు తప్పమని ఇరాక్‌ని హెచ్చరించింది. అగ్రరాజ్యాలు ఇరాక్‌ను బెదిరించాయి. ఆఖరికి ఇరాక్‌కు ఆయుధాలు విక్రయిస్తుండే రష్యా సైతం ఇరాక్ చర్యకు నిరసనగా ఆయుధ సామగ్రిని సరఫరా చెయ్యడం మానేసింది. అనేక దేశాలు ఇరాక్‌పై ఆర్థిక ఆంక్ష లు విధించాయి. అయినా సద్దాం తొణక లేదు. బెణక లేదు. ఇక లాభం లేదని అమెరికా అధ్యక్షుడు జార్జి బుష్... కువైట్ నుంచి ఇరాక్‌ను బయటికి తరిమేసేటందుకు గగనతల పోరాటానికి సిద్ధమయ్యారు. గడువులోపల కువైట్ నుంచి వైదొలగకపోతే ఇరాక్‌ను కోలుకోలేనంతగా దెబ్బతీయవలసి వస్తుందని హెచ్చరించారు. గడువులు పెట్టినా, గడువులను పొడిగించినా సద్దాం లెక్కచెయ్యలేదు. చివరికి ఐదు నెలల తర్వాత 1991 జనవరి 17న ఇరాక్‌కు వ్యతిరేకంగా ఇజ్రాయిల్, సౌదీ అరేబియా సహా అనేక ప్రపంచ దేశాలు సంకీర్ణ దళంగా ఏర్పడి ఇరాక్‌పై ‘డెజర్ట్ స్టార్మ్ అపరేషన్’ పేరుతో యుద్ధం ప్రారంభించాయి. అయినా ఇరాక్ లొంగలేదు! తన దగ్గరకున్న స్కడ్ క్షిపణులతో పోరాటం చేసింది. ‘స్కడ్’ అన్న పేరు ఆ సమయంలోనే బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. హోరాహోరీ పోరు తర్వాత, తన సైన్యం శక్తి సామర్థ్యాలన్నిటినీ కోల్పోయాక ఫిబ్రవరి 28న ఇరాక్ లొంగిపోయింది! ఇంతకీ కువైట్‌ను ఇరాక్ ఎందుకు ఆక్రమించినట్టు? రెండు దేశాల మధ్య పెట్రోల్ గొడవ. తమ ఆయిల్ బావుల్లోంచి కువైట్ అక్రమంగా పెట్రోల్ తోడేసుకుంటోందని ఇరాక్ ఆరోపణ.