
సాక్షి, కపుర్తలా : ఎలాంటి విదేశీ దాడినైనా ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని భారత ఎయిర్ చీఫ్ మార్షల్ ఎన్‌జేఎస్ ధిల్లాన్ అన్నారు. భారత్‌కు వ్యతిరేకంగా కవ్వింపు చర్య జరిగే అవకాశం కొంతమేరకు మాత్రమే ఉందన్నారు. ప్రస్తుతం పశ్చిమ వాయుసేనకు కమాండర్‌గా పనిచేస్తున్న ఆయన శనివారం కపుర్తలలో ఒకప్పుడు తాను చదివిన సైనిక పాఠశాలకు వచ్చి పాత్ర మిత్రులతో గడిపారు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ భారత వాయుసేన ప్రపంచంలో నాలుగో స్థానంలో ఉందని అన్నారు. వచ్చే ఏడాది సెప్టెంబర్ నెలలో సైన్యంలోకి 18 రఫెల్ ఫైటర్ జెట్స్ ప్రవేశపెడుతున్నామని దాంతో తమ వాయుసేన బలం మరింత కానుందని తెలిపారు. ఈ సందర్భంగా మేజర్ జనరల్ బల్విందర్ సింగ్ కూడా మాట్లాడుతూ సైనిక పాఠశాల చేస్తున్న కృషిని కొనియాడారు.