kapurtala
-
అది దేశంలోనే అత్యంత చిన్న నగరం.. ఒకప్పుడు పారిస్‌తో పోల్చేవారు!
భారతదేశం పలు విభిన్నతలు, ప్రత్యేకతలు కలిగిన దేశం. దేశంలో అనేక చారిత్రక కట్టడాలు ఉన్నాయి. ఇవి మనదేశ ఘనతను చాటుతాయి. వీటికి ఆకర్షితులైన విదేశీ పర్యాటకులు కూడా ఇక్కడకు వస్తుంటారు. మనదేశంలో మ్తొతం 28 రాష్ట్రాలు ఉన్నాయి. ఈ రాష్ట్రాల్లో పలు నగరాలు ఉన్నాయి. అయితే దేశంలో అత్యంత చిన్న నగరం కూడా ఉంది. ఆ నగరంలో జనసంఖ్య 2011లో 98,916 మాత్రమే. కోవిడ్ కారణంగా జనాభా గణన ఇటీవలి కాలంలో జరగలేదు. పంజాబ్‌లోని కపూర్థలా అందమైన చారిత్రక కట్టడాలకు, విశాలమైన రహదారులకు పేరొందింది. ఒకానొక సమయంలో దీనిని పంజాబ్ పారిస్ అని పిలిచేవారు. ఇక నగరాన్ని స్ణాపించిన నవాబ్ కపూర్ పేరిట ఈ ప్రాంతానికి కపూర్థలా అనే పేరు వచ్చింది. భారతీయ రైల్వోలతో ఈ నగరానికి విడదీయరాని అనుబంధం ఉంది. ఇక్కడ ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ ఉంది. రైల్వే బోగీలు ఇక్కడే తుదిమెరుగులు దిద్దుకుంటాయి. ఇక్కడి జగత్జీత్ ప్యాలెస్ ఒకప్పుడు కపూర్థలా రాజ్యానికి రాజైన మహారాజా జగత్జీత్ సింగ్‌కు నివాసంగా ఉండేది. ఇప్పుడు ఈ ప్యాలెస్‌లో సైనిక స్కూల్ నడుస్తోంది. ఈ మహల్‌ను1908లో నిర్మించారు. ఇక్కడి వాస్తకళ ఈ నాటికీ అందరినీ అలరిస్తుంటుంది. కపూర్థలా నగరానికి పంజాబ్‌లోని అన్ని పట్టణాల నుంచి రవాణా సదుపాయం ఉంది. అలాగే అమృత్‌సర్‌లోని విమానాశ్రయం నుంచి కూడా ఇక్కడకు సులభంగా చేరుకోవచ్చు. జలంధర్ రైల్వే స్టేషన్ నుంచి కూడా కపూర్థలాకు చేరుకోవచ్చు. ఇది కూడా చదవండి: మత్స్యకారుల చేతికి డాల్ఫిన్.. ఇంటికెళ్లి కూర వండేసుకున్నాక.. -
ఆ నిందితులను బహిరంగంగా ఉరితీయాలి: నవజ్యోత్ సింగ్ సిద్ధూ
చంఢీఘడ్: పంజాబ్‌లోని స్వర్ణదేవాలయం, కపుర్త ఘటనలకు సంబంధించిన కుట్రదారులను బహిరంగంగా ఉరితీయాలని పంజాబ్ పీసీసీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ డిమాండ్ చేశారు. ఆయన మాలేర్‌కోట్లలో జరిగిన సమావేశంలో పాల్గోన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కొంత మంది కావాలనే మత విద్వేశాలు రెచ్చగొట్టేలా కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రజల విశ్వాసాలను, మనోభావాలను దెబ్బతీసేలా కుట్రలతో.. పంజాబ్‌లో అశాంతిని సృష్టిస్తున్నారన్నారు. ఇప్పటికే స్వర్ణదేవాలయం ఘటనపై సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీ ప్రభుత్వం సిట్ విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే. నిన్న సీఎం చన్నీ(డిసెంబరు 19)న స్వర్ణదేవాలయాన్ని సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. భద్రత ఏర్పాట్లను పర్యవేక్షించారు. వరుస ఘటనలతో ఆయా ప్రార్థనా మందిరాల వద్ద పోలీసులు భద్రతను పెంచాయి. ప్రజలు సంయమనం పాటించాలని సీఎం కోరారు. కాగా, స్వర్ణదేవాలయంలోని నిశిద్ధ ప్రాంతం, కపుర్త జిల్లా నిజాంపూర్ లోని గురుద్వారా పైకెక్కి పవిత్ర జెండా (నిషాన్ సాహిబ్)ను తొలగించడానికి ప్రయత్నించిన వ్యక్తులు స్థానికుల మూకదాడిలో మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనలను ఇప్పటికే పలు రాజకీయపార్టీలు ఖండించాయి. ఈ ఘటనపై ఇప్పటికే సిట్ దర్యాప్తును వేగవంతం చేసింది. చదవండి: 'పార్టీ కోసం నా జీవితం అర్పించా.. కాషాయం విడిచేది లేదు' -
'ఏ దాడిని ఎదుర్కొనేందుకైనా వాయుసేన సిద్ధం'
సాక్షి, కపుర్తలా : ఎలాంటి విదేశీ దాడినైనా ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని భారత ఎయిర్ చీఫ్ మార్షల్ ఎన్‌జేఎస్ ధిల్లాన్ అన్నారు. భారత్‌కు వ్యతిరేకంగా కవ్వింపు చర్య జరిగే అవకాశం కొంతమేరకు మాత్రమే ఉందన్నారు. ప్రస్తుతం పశ్చిమ వాయుసేనకు కమాండర్‌గా పనిచేస్తున్న ఆయన శనివారం కపుర్తలలో ఒకప్పుడు తాను చదివిన సైనిక పాఠశాలకు వచ్చి పాత్ర మిత్రులతో గడిపారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ భారత వాయుసేన ప్రపంచంలో నాలుగో స్థానంలో ఉందని అన్నారు. వచ్చే ఏడాది సెప్టెంబర్ నెలలో సైన్యంలోకి 18 రఫెల్ ఫైటర్ జెట్స్ ప్రవేశపెడుతున్నామని దాంతో తమ వాయుసేన బలం మరింత కానుందని తెలిపారు. ఈ సందర్భంగా మేజర్ జనరల్ బల్విందర్ సింగ్ కూడా మాట్లాడుతూ సైనిక పాఠశాల చేస్తున్న కృషిని కొనియాడారు. -
9 మంది మహిళలపై దారుణం
పంజాబ్: పంజాబ్‌లో దారుణం చోటు చేసుకుంది. కపుర్తలా పట్టణంలో ఓ వ్యక్తి తొమ్మిది మంది మహిళలపై యాసిడ్ దాడికి పాల్పడ్డాడు. రెండు కుటుంబాల మధ్య ఉన్న భూ వివాదమే ఇందుకు దారి తీసినట్లు తెలుస్తోంది. బాధితుల్లో ఓ మైనర్ కూడా ఉన్నట్టు తెలుస్తోంది. భూయి గ్రామానికి చెందిన సర్పంచ్ వినోద్ సెహగల్‌కు మరో కుటుంబానికి మధ్య భూవివాదం తలెత్తింది. దీంతో ఇరు వర్గాల వారు యాసిడ్ దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో ఓ కుటుంబానికి చెందిన ఇద్దరు మహిళలతో పాటు సంఘటనా స్థలంలో ఉన్న ఏడుగురు మహిళా కూలీలు గాయపడ్డారు. తమ స్థలంలో సర్పంచ్ కమ్యూనిటీ సెంటర్‌ను నిర్మిస్తున్నాడని బాధితులు వాపోతున్నారు. క్షతగాత్రులను స్ధానికులు ఆసుపత్రికి తరలించారు. కాగా, ఒక కుటుంబానికి సంబంధించిన వారిపై మాత్రమే పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటనలో సర్పంచ్‌కు ఎలాంటి ప్రమేయం లేనట్టు పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.