Know Interesting Facts About Smallest City Of India Punjab Kapurthala - Sakshi
Sakshi News home page

Smallest City Of India Kapurthala: అది దేశంలోనే అత్యంత చిన్న నగరం.. ఒకప్పుడు పారిస్‌తో పోల్చేవారు!

Published Tue, Jul 25 2023 1:19 PM | Last Updated on Tue, Jul 25 2023 1:35 PM

smallest city of india punjab kapurthala - Sakshi

భారతదేశం పలు విభిన్నతలు, ప్రత్యేకతలు కలిగిన దేశం. దేశంలో అనేక చారిత్రక కట్టడాలు ఉన్నాయి. ఇవి మనదేశ ఘనతను చాటుతాయి. వీటికి ఆకర్షితులైన విదేశీ పర్యాటకులు కూడా ఇక్కడకు వస్తుంటారు. మనదేశంలో మ్తొతం 28 రాష్ట్రాలు ఉన్నాయి. ఈ రాష్ట్రాల్లో పలు నగరాలు ఉన్నాయి. అయితే దేశంలో అత్యంత చిన్న నగరం కూడా ఉంది. ఆ నగరంలో జనసంఖ్య 2011లో 98,916 మాత్రమే. కోవిడ్‌ కారణంగా జనాభా గణన ఇటీవలి కాలంలో జరగలేదు. 

పంజాబ్‌లోని కపూర్థలా అందమైన చారిత్రక కట్టడాలకు, విశాలమైన రహదారులకు పేరొందింది. ఒకానొక సమయంలో దీనిని పంజాబ్‌ పారిస్‌ అని పిలిచేవారు. ఇక నగరాన్ని స్ణాపించిన నవాబ్‌ కపూర్‌ పేరిట ఈ ప్రాంతానికి కపూర్థలా అనే పేరు వచ్చింది.  భారతీయ రైల్వోలతో ఈ నగరానికి విడదీయరాని అనుబంధం ఉంది. ఇక్కడ ఇంటిగ్రల్‌ కోచ్‌ ఫ్యాక్టరీ ఉంది. రైల్వే బోగీలు ఇక్కడే తుదిమెరుగులు దిద్దుకుంటాయి. 

ఇక్కడి జగత్‌జీత్‌ ప్యాలెస్‌ ఒకప్పుడు కపూర్థలా రాజ్యానికి రాజైన మహారాజా జగత్‌జీత్‌ సింగ్‌కు నివాసంగా ఉండేది. ఇప్పుడు ఈ ప్యాలెస్‌లో సైనిక స్కూల్‌ నడుస్తోంది. ఈ మహల్‌ను1908లో నిర్మించారు. ఇక్కడి వాస్తకళ​ ఈ నాటికీ అందరినీ అలరిస్తుంటుంది. కపూర్థలా నగరానికి పంజాబ్‌లోని అన్ని పట్టణాల నుంచి రవాణా సదుపాయం ఉంది. అలాగే అమృత్‌సర్‌లోని విమానాశ్రయం నుంచి కూడా ఇక్కడకు సులభంగా చేరుకోవచ్చు. జలంధర్‌ రైల్వే స్టేషన్‌ నుంచి కూడా కపూర్థలాకు చేరుకోవచ్చు. 
ఇది కూడా చదవండి: మత్స్యకారుల చేతికి డాల్ఫిన్‌.. ఇంటికెళ్లి కూర వండేసుకున్నాక..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement