గిరిజనులు అటవీ భూములను చదునుచేసుకునే క్రమంలో విషాదం చోటు చేసుకుంది. పోలీసులకు, గిరిజనులకు మధ్య జరిగిన వాగ్వాదంలో రమణయ్య అనే వ్యక్తి మృతి చెందాడు.
గిరిజనులు అటవీ భూములను చదునుచేసుకునే క్రమంలో విషాదం చోటు చేసుకుంది. నెల్లూరు జిల్లా రాపూరు మండలం వెలుగోను గ్రామంలో బుధవారం ఉదయం గిరిజనులు భూములు చదును చేసుకోడానికి ప్రయత్నించారు. పోలీసు శాఖ, అటవీ సిబ్బంది గిరిజనుల ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. ఈ క్రమంలో గిరిజనులకు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఇదే సమయంలో రమణయ్య(58) అనే గిరిజనుడు ఆందోళనతో కుప్పకూలాడు. అతడిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించే లోపే మరణించాడు.
ఇదిలా ఉంటే.. గిరిజనులు చదును చేసుకుంటున్న భూమి అటవీ భూమి అని అధికారులు చెబుతున్నారు. కాదు.. అది రెవెన్యూ భూమి అని గిరిజనులు వాదిస్తున్నారు.