పిల్లల మానసిక స్థితి ఏయే దేశాల్లో ఏవిధంగా ఉందో తెలుసుకోవడానికి గత ఏడాది యునిసెఫ్ ఓ ప్రయత్నం చేసింది. అందులో భాగంగా 21 దేశాలలో 20,000 మంది పిల్లలు– పెద్దలతో ఒక సర్వే నిర్వహించింది. మిగతా దేశాలతో పోల్చితే భారతదేశంలోని పిల్లలు మానసిక ఆరోగ్య చికిత్సను పొందేందుకు ఇష్టపడరని తేలింది.
విదేశాలలో మానసిక ఆరోగ్య సమస్యల పట్ల సగటున 83 శాతం మంది స్పందిస్తే, 15 నుంచి 24 సంవత్సరాల మధ్య వయస్సు గల యువత 41 శాతం మాత్రమే మానసిక చికిత్సకు మద్దతునిచ్చారని తేలింది.
ఇతరులను కలవాలనుకోరు..
మిగతా దేశాలతో పోల్చితే భారతీయ పిల్లలలో మానసిక రుగ్మతలను గుర్తించడం పెద్దవాళ్లకు కష్టంగా ఉంటుంది. అమ్మాయి లేదా అబ్బాయి పెరుగుతున్నప్పుడు అనేక శారీరక, మానసిక భావోద్వేగ మార్పులకు లోనవుతారు. అందుకు తగిన చికిత్స లేదా సహాయం తీసుకోవడానికి ఇష్టపడరు.
2019లో ఇండియన్ జర్నల్ ఆఫ్ సైకియాట్రీలో ప్రచురించిన ఒక అధ్యయనం, కరోనా మహమ్మారి రాకముందే 50 మిలియన్ల మంది భారతీయ పిల్లలు మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారని నివేదించింది. వీరిలో 80 నుంచి 90 శాతం మంది చికిత్స తీసుకోలేదు. ఈ అసమానతలు ఉన్నప్పటికీ, ఇండియన్ జర్నల్ ఆఫ్ సైకియాట్రీ 2017 ప్రకారం, భారతదేశం తన హెల్త్ బడ్జెట్‌లో ఏటా 0.05 శాతం మాత్రమే మానసిక ఆరోగ్యం కోసం ఖర్చు చేస్తోంది.
సరైన తీర్మానాలివే!
►ఎడిహెచ్‌డి, ఆందోళన, ప్రవర్తనా సమస్యలు, నిరాశ అనేవి పిల్లలు– యుక్తవయస్కులలో అత్యంత ప్రబలంగా ఉన్న న్యూరో బిహేవియరల్ డిజార్డర్‌గా చెప్పవచ్చు.
►మానసిక నిపుణులు, మీరు.. పిల్లలతో కలిసి కూర్చుని, వారి నూతన సంవత్సర తీర్మానాలుగా నిర్దేశించాలనుకుంటున్న లక్ష్యాలను చర్చించాలి.
►ప్రవర్తనలో ఆకస్మిక మార్పులను గమనించాలి. ఇలాంటప్పుడు పిల్లలకి మానసిక బలం అవసరమని సూచించే అనేక సంకేతాలు కనిపిస్తాయి. ఇందులో స్నేహితులు,
►కుటుంబ సభ్యుల నుండి ఒంటరిగా ఉండటం, నిత్యకృత్యాలను పాటించకపోవడం, పిల్లలు సాధారణంగా ఆనందించే కార్యకలాపాల నుండి వైదొలగడం వంటి ప్రవర్తనలో ఆకస్మిక మార్పులు ఉంటాయి.
► పిల్లలు చెప్పేది ఓపికగా వినాలి. ఇబ్బందులు ఎదురైతే మద్దతుగా ఉంటానని భరోసా ఇవ్వాలి.
►పిల్లల పట్ల అధిక పర్యవేక్షణ, సానుభూతి చూపించడం తగ్గించాలి. అలాగే వారి మీద తక్కువ అంచనాలు ఉండాలి.
►రోజువారీ షెడ్యూల్‌లు, పనితీరు కారణంగా పిల్లలు తరచు అధిక స్థాయి ఒత్తిడి, ఆందోళన కు గురవుతారు. అందుకని, రోజువారీ దినచర్యలను అనుసరించడంలో ►పిల్లలకు సహాయపడాలి. చురుకైన జీవనశైలిని గడపడానికి ప్రోత్సహించాలి.
►పెద్దలు భావోద్వేగాలను వ్యక్తం చేసే విధానాన్ని పిల్లలు నిరంతరం గమనిస్తూనే ఉంటారు.
►ఒత్తిడిని తగ్గించుకోవడానికి తరచుగా దీర్ఘ శ్వాస తీసుకోవడం, రంగులు వేయడం, పెయింటింగ్ చేయడం, నడవడం లేదా సంగీతం వినడం వంటి కార్యకలాపాలలో పాల్గొంటాం.
►మన పిల్లలు ఒత్తిడిని ఎదుర్కోవడంలో, వారి జీవన నైపుణ్యాలను బలోపేతం చేయడంలో సహాయపడటానికి చిన్నప్పటినుంచే ఇలాంటి వ్యూహాలను పరిచయం చేయవచ్చు.
►ఆటలు, పాటలు, నృత్యం వంటి బృంద కార్యకలాపాలలో పాల్గొనడం ఒత్తిడిని తగ్గిస్తుంది. భావోద్వేగ, సామాజిక నైపుణ్యాలను అభివృద్ధి చేస్తుంది. విశ్వాసాన్ని పెంపొందించడంలో సహాయపడుతుంది. దీనివల్ల అవకాశాలూ పెంపొందుతాయి.
►సానుకూల అభిప్రాయం, ప్రోత్సాహం సరైన ప్రవర్తనను పునరావృతం చేసేలా వారిని ప్రేరేపించడమే లక్ష్యంగా ఎంచుకోవాలి. మీరు సపోర్ట్ గా ఉన్నారని చేతల్లో చూపడం, సురక్షితమైన వాతావరణాన్ని అందించడం కూడా అంతే ముఖ్యం.
చదవండి: అకస్మాత్తుగా గుండె పట్టేయడం.. గుండెపోటుతో చనిపోతాననే భయం! ఎందుకిలా? సమస్య ఏమిటంటే..
Comments
Please login to add a commentAdd a comment