ఉదయాన్నే పిల్లల్ని తయారు చేసి స్కూలుకు పంపించడం పేరెంట్స్‌కు పెద్దపని. ఇంతకంటే వాళ్లను నిద్రలేపడం అతిపెద్ద టాస్క్. ఎంత లేపినా నిద్ర లేవరు. కింద స్కూల్ ఆటోనో, బస్సో వచ్చి హారన్ కొడుతుంటుంది. కానీ వీళ్లు లేవరు. వీళ్లను తొందరగా నిద్ర లేపాలంటే ఇలా ప్రయత్నించి చూడండి....
సమస్యను అర్థం చేసుకోవాలి..
ముందుగా నిద్ర లేవడానికి ఏమైనా ఇబ్బంది పడుతున్నారేమో గమనించాలి. రాత్రి సరిగా పడుకున్నారా లేదా... అసలు నిద్రపట్టలేదా... ఇంకేదైనా సమస్య ఉంటే అనునయంగా అడిగి తెలుసుకోవాలి.
సరిపోయిందా లేదా?
స్కూలుకు వెళ్లే పిల్లలు కనీసం పది గంటలు నిద్రపోవాలి. గేమ్స్, ఫోన్లు చూస్తూ సరిగా పడుకోరు. రోజూ ఒక నిర్దేశిత సమయాన్ని కేటాయించి వాళ్లు కచ్చితంగా పడుకునేలా చేయాలి.
ప్రేమతో లేపాలి
ఉదయం ఎంత ఉత్సాహంగా లేస్తే రోజంతా అలానే గడుస్తుంది. అందుకే పిల్లలు త్వరగా లేవకపోయినా ప్రేమగా నిద్రలేపాలి. పిల్లలకు అర్థమయ్యే ప్రేమ భాషలోనే నిద్రలేపాలి. ఇందుకోసం వాళ్లకు నచ్చే మంచి విషయాలు, స్కూలుకు వెళ్లడం ఎంతముఖ్యమో ప్రేమతో చెప్పాలి.
ఇష్టమైన ఫుడ్
పిల్లలు ఇష్టంగా తినే ఆహారాన్ని బ్రేక్‌ఫాస్ట్‌లో ఇవ్వాలి. అది తినడం కోసం అయినా త్వరగా నిద్ర లేస్తారు. ఈ నాలుగు చిట్కాలు ప్రయత్నిస్తే మీ సమస్య
తీరినట్టే.
Comments
Please login to add a commentAdd a comment