ఈ రోజుల్లో జుట్టు రాలడం చాలా సాధారణం అయిపోయింది. సరైన ఆహారం తీసుకోకపోవడం, కాలుష్యం, ఒత్తిడి.. ఇలా రకరకాల కారణాలతో జట్టు ఊడిపోతుంటుంది. హెయిర్ ఫాల్‌ను నివారించేందుకు చాలామంది మార్కెట్లో దొరికే రకరకాల క్రీములు, షాంపులు, కండీషనర్లు వాడుతుంటారు. ఇవేవీ పనిచేయకపోతే ఖర్చుతో కూడుకున్న ట్రీట్‌మెంట్ల వైపు పరుగులు పెడుతుంటారు. కానీ మన వంటింట్లో దొరికే పదార్థాలతోనే జుట్టు రాలే సమస్యకు చెక్ పెట్టొచ్చు.
ఉసిరి
ఇండియన్ గూస్‌బెర్రీగా పిలిచే ఉసిరిలో జుట్టుకు బలం చేకూర్చే పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అధికమొత్తంలో విటమిన్ ఇ , విటమిన్ ఉ, ఎమినో యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి.ఇవి కేశాలను బలంగా దృఢంగా ఉండేందుకు తోడ్పడతాయి.ఇందుకోసం ఏం చేయాలంటే..ఉసిరికాయను ముక్కలుగా కోసి నీడలో ఆరబెట్టాలి.
ముక్కలు ఆరిన తరువాత పొడిచేసుకోవాలి. ఇప్పుడు ఉసిరి పొడి 2 టేబుల్ స్పూన్స్ తీసుకుని దానిలో నిమ్మరసం వేసుకుని పేస్ట్‌లా చేసుకుని స్కాల్ప్‌పై అఫ్లై చేసుకోవాలి. ఇలా పెట్టుకుని రెండు గంటల పాటు ఉంచుకుని ఆ తరువాత షాంపు, చల్లని నీళ్లతో కడుక్కోవాలి. ఇలా వారానికి రెండు సార్లు చేయడం వల్ల జుట్లు రాలడం తగ్గుతుంది.
క్యారెట్
క్యారెట్‌లో బీటా కెరోటిన్, యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ ఎ, ఇ లు పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ రక్త ప్రసరణ బాగా జరిగేందుకు తోడ్పడమేగాక, వెంట్రుకల పెరుగుదలను ప్రేరేపిస్తాయి. క్యారెట్ జ్యూస్ తెల్ల వెంట్రుకలు రాకుండా చేస్తుంది. అందువల్ల 100 మిల్లీ లీటర్ల క్యారెట్ జ్యూస్‌ను రోజూ తీసుకుంటే వెంట్రుకలు ఆరోగ్యంగా, నల్లగా పెరుగుతాయి.
స్వచ్ఛమైన కొబ్బరి నూనె
కల్తీలేని స్వచ్ఛమైన కొబ్బరినూనెలో ఉండే లారిక్ యాసిడ్ కేశాలను ధృడంగా ఉంచడంలో సాయపడుతుంది. వెంట్రుకలు తెగిపోకుండా కుదుళ్ల నుంచి బలంగా ఉంచుతుంది. కొబ్బరినూనెతో తలమీద మర్దన చేయడం వల్ల రక్త ప్రసరణ బాగా జరిగి కుదుళ్ల నుంచి కేశాలు పెరుగుతాయి. అంతేకాకుండా 15–20 నిమిషాలపాటు కొబ్బరినూనెతో స్కాల్ప్ మర్దన చేసి ఒక గంటపాటు లేదా ఒక రాత్రి మొత్తం అలా వదిలేయాలి. ఆతరువాత షాంపుతో వాష్ చేసుకుంటే జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది.
పోషకాహారం తీసుకోవడం ఎంత ముఖ్యమో, ఒత్తిడిని తగ్గించుకోవడం కూడా అంతే ముఖ్యం. ఒత్తిడిని వల్ల జుట్టు రాలడం ఎక్కువగా ఉంటుంది. అందుకే సరైన డైట్ పాటించడంతో పాటు యోగా, ధ్యానం, వర్కౌట్ చేయాలి.
Comments
Please login to add a commentAdd a comment