'ఈ రోజుల్లో జుట్టు రాలడం చాలా సాధారణం అయిపోయింది. సరైన ఆహారం తీసుకోకపోవడం, కాలుష్యం, ఒత్తిడి.. ఇలా రకరకాల కారణాలతో జట్టు ఊడిపోతుంటుంది. హెయిర్ ఫాల్‌ను నివారించేందుకు చాలామంది మార్కెట్లో దొరికే రకరకాల క్రీములు, షాంపులు, కండీషనర్లు వాడుతుంటారు. ఇవేవీ పనిచేయకపోతే ఖర్చుతో కూడుకున్న ట్రీట్‌మెంట్ల వైపు పరుగులు పెడుతుంటారు. కానీ మన వంటింట్లో దొరికే పదార్థాలతోనే జుట్టు రాలే సమస్యకు చెక్ పెట్టొచ్చు.'
ఇలా చేయండి..
జుట్టు కుదుళ్లు బలంగా ఉండాలంటే... ఒక పాత్రలో టీ స్పూన్ తేనె, టీ స్పూన్ ఆలివ్ ఆయిల్, ఒక టీ స్పూన్ నిమ్మరసం, కోడిగుడ్డు సొన ఒకదాని తరువాత ఒకటి వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని కుదుళ్ల దగ్గర నుండి చివరి వరకూ పట్టించి ఇరవై నిమిషాలుంచి కడిగేయాలి.
వారంలో ఒక్కసారయినా టీ డికాషన్ తో జుట్టును కడిగితే సిల్కీగా అవుతుంది.
తలంటుకునే ముందు షాంపూలో కొద్దిగా వెనిగర్ కలపాలి. ఈ మిశ్రమాన్ని కురులంతటికీ పట్టించి పది నిమిషాల తరువాత తలస్నానం చేస్తే జుట్టు మెరుస్తుంది.
ఇవి చదవండి: ప్రపంచంలోనే అత్యంత వరస్ట్ కర్రీగా చోటు దక్కించుకున్న భారతీయ వంటకం ఏంటంటే..?
Comments
Please login to add a commentAdd a comment