మెగా కోడలు లావణ్య త్రిపాఠి.. న్యూ ఇయర్ రిజల్యూషన్స్ ఏంటో తెలుసా! | Heroine lavanya Tripathi New Year Resolutions Goes Viral | Sakshi
Sakshi News home page

Lavanya Tripathi: కొత్త ఏడాదిలోకి మెగా కోడలు.. రిజల్యూషన్స్ ఇవేనట!

Published Mon, Jan 1 2024 8:37 PM | Last Updated on Tue, Jan 2 2024 6:50 AM

Heroine lavanya Tripathi New Year Resolutions Goes Viral - Sakshi

గతేడాది హీరోయిన్ లావణ్య త్రిపాఠి వివాహబంధంలోకి అడుగుపెట్టింది. మెగా హీరో వరుణ్‌ తేజ్‌ను పెళ్లాడిన ముద్దుగుమ్మ.. ప్రస్తుతం ఎలాంటి సినిమాల్లో నటించడం లేదు. వ‌రుణ్ తేజ్‌, హీరోయిన్ లావ‌ణ్య త్రిపాఠి పెళ్లి వేడుక ఇటలీలో ఘనంగా జరిగింది. టుస్కానీలో జరిగిన గ్రాండ్ వెడ్డింగ్‌లో కుటుంబ సభ్యులు, సన్నిహితులు పాల్గొని సందడి చేశారు. గతేడాది జూన్‌లో ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్న వీరిద్దరు పెళ్లిబంధంతో ఒక్కటయ్యారు. అయితే కొత్త ఏడాదికి స్వాగతం పలికిన లావణ్య తన న్యూ ఇయర్ రిజల్యూషన్స్‌ను సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. 

మెగా కోడలు అభిమానులకు న్యూ ఇయర్ విషెస్ తెలిపింది. అంతే కాకుండా 2024లో తన న్యూ రిజల్యూషన్స్‌ను ఇన్‌స్టా స్టోరీస్‌లో పంచుకుంది. కొత్త ఏడాదిలో మరింత మానవత్వంతో ఉండాలని.. తనపై తనకు మరింత ప్రేమ, అలాగే సోషల్  మీడియాకు తక్కువ టైమ్ కేటాయించాలని.. ఎక్కువ సమయం ప్రకృతితో మమేకం కావాలని కోరుకుంటున్నట్లు రాసుకొచ్చింది. 

2012లో అందాల రాక్షసి చిత్రం ద్వారానే టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది ముద్దుగుమ్మ. అందాల రాక్షసి చిత్రానికి లావణ్య ఉత్తమ నటిగా అవార్డును అందుకుంది. అయితే సినిమాల్లో రాకముందు ఆమె హిందీ సీరియల్ ప్యార్ కా బంధన్ (2009)తో తొలిసారిగా నటించింది. వరుణ్ తేజ్- లావణ్య జంటగా మిస్టర్ (2017), అంతరిక్షం చిత్రాల్లో నటించిన సంగతి తెలిసిందే. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement