నరేంద్ర మోడీ
న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి మండలిలో ఉత్తరప్రదేశ్కు పెద్దపీట వేశారు. ఆ తరువాతి స్థానం మహారాష్ట్రకు దక్కింది. ముస్లీంలకు ప్రధాన్యత లేదు. ఒక్కరికి మాత్రమే స్థానం లభించింది. కేంద్ర మంత్రి మండలి ఎంపికలో మోడీ మార్కు స్పష్టంగా కనిపిస్తోంది. ఆర్ఎస్ఎస్ ప్రభావం కూడా ఉందని భావిస్తున్నారు యుపి నుంచి 9 మందికి మంత్రులుగా చోటు దక్కింది. యుపి నుంచి గెలుపొందిన రాజ్‌నాథ్, ఉమాభారతి, కల్ రాజ్ మిశ్రా, మేనకాగాంధీ , వీకే సింగ్, సంతోష్ గంగావార్, సంజీవ్ కుమార్, మనోజ్ సిన్హా కేంద్ర మంత్రులుగా ప్రమాణం చేశారు.
మహారాష్ట్ర నుంచి ఆరుగురికి స్థానం దక్కింది. మహారాష్ట్రకు చెందిన నితన్ గడ్కరీ, గోపీనాథ్ ముండే, అనంత్ గీతె, ప్రకాష్ జవదేకర్, పీయూష్ గోయల్, రావుసాహెబ్‌లు మంత్రులుగా ప్రమాణం చేశారు.
ముస్లీంలకు ప్రాధాన్యత ఇవ్వలేదు. ఒక్క నజ్మా హెప్తుల్లాకు మాత్రమే స్థానం దక్కింది.
బిజెపిలో సీనియర్లకు మంత్రి మండలిలో స్థానం లభించలేదు. ఆ పార్టీ అగ్రనేతలైన అద్వానీ, అరుణ్ శౌరి, మురళీ మనోహర్ జోషీ, మన రాష్ట్రానికి చెందిన దత్తాత్రేయ వంటి వారికి మంత్రి పదవులు లభించలేదు. వారు లేకుండా బిజెపిని ఊహించడమే కష్టం. అటువంటి వారికి కేబినెట్లో స్థానం దక్కలేదు. అయితే వారికి ముందు ముందు ఇంకా ఏమైనా పదవులు ఇచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.