central ministry
-
రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. కేంద్రం ఆమోదిస్తే.. త్వరలో
జంతు ప్రేమికులకు ఊరట కల్పించేలా కేంద్రం రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పెంపుడు జంతువులను రైలు ప్రయాణంలో వెంట తీసుకెళ్లేందుకు ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకునే వెసలు బాటు కల్పించనుంది. ఇందుకోసం టీటీఈలకూ ఈ టిక్కెట్లను జారీ చేసే అధికారాన్ని ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తోంది. రైలు ప్రయాణంలో జర్నీ చేయాల్సి వస్తే మూగ జీవాలతో ఇబ్బందే. ఈ సమస్యను నివారించేందుకు రైల్వే శాఖ సరికొత్త విధానంతో ముందుకొస్తోంది. ఈ సమస్యకు పరిష్కార మార్గంగా భారతీయ రైల్వే మంత్రిత్వ శాఖ పెంపుడు జంతువులకు కూడా టికెట్లను అమ్మనుంది. చదవండి👉 ఫోన్లో ట్రైన్ టికెట్ బుక్ చేస్తున్నారా? ఆ ‘యాప్’ వాడితే ఇక అంతే సంగతులు ప్రస్తుతం, ప్రయాణికులు పెంపుడు జంతువుల్ని వెంట తీసుకొని వెళ్లాలంటే ఫస్ట్ క్లాస్ ఏసీ టికెట్లు, క్యాబిన్లు లేదా కూపేలను బుక్ చేసుకోవాలి. ఇందు కోసం ప్రయాణం రోజున ప్లాట్‌ఫామ్‌లోని పార్శిల్ బుకింగ్ కౌంటర్లను సంప్రదించి టికెట్‌ను రిజర్వ్ చేసుకోవాల్సి ఉంది. అనంతరం, ప్రయాణికులు తమ పెంపుడు జంతువులను బాక్స్‌లలో ఉంచి ట్రైన్లలోని సెకండ్ క్లాస్ లగేజీ, బ్రేక్ వ్యాన్లలో తీసుకొని వెళ్తున్నారు. ఈ విధానం వల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను అధిగమించేలా ఐఆర్సీటీసీ వెబ్సైట్లలో జంతువులకు టికెట్ బుక్ చేసుకునే సౌకర్యం కల్పించాలని రైల్వే మంత్రిత్వ శాఖ యోచిస్తోంది. ట్రైన్లలో జంతువులకు టికెట్లను బుక్ చేసే అధికారాన్ని టీటీఈలకు ఇచ్చే ప్రతిపాదన కూడా ఉంది. ఐఆర్సీటీసీ వెబ్సైట్లో జంతువులను ఆన్లైన్లో బుక్ చేసుకునే సౌకర్యాన్ని ప్రారంభించేందుకు వీలుగా సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేయాలని రైల్వే బోర్డు cris (సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్)ని కోరినట్లు ది స్టేట్స్‌మన్ నివేదిక వెల్లడించింది. గార్డు కోసం కేటాయించిన ఎస్ఎల్ఆర్ కోచ్‌లో జంతువులను ఉంచుతారు. జంతువుల యజమానులు తమ పెంపుడు జంతువులకు రైలు స్టాపేజ్‌లలో నీరు, ఆహారం మొదలైనవాటిని అందించవచ్చు. అయితే ఆన్లైన్లో జంతువుల టిక్కెట్లను బుక్ చేసుకోవడానికి కొన్ని షరతులు విధించనుంది. ఆ నిబంధనలు ఇలా ఉన్నాయి. 👉ప్రయాణికుల టిక్కెట్ తప్పనిసరిగా ధృవీకరించాలి 👉ప్రయాణికుడు టిక్కెట్‌ను రద్దు చేస్తే, జంతువులకు బుక్ చేసిన టిక్కెట్ వాపసు ఇవ్వబడదు. 👉ట్రైన్ రద్దయినా లేదా మూడు గంటల కంటే ఎక్కువ ఆలస్యం అయితే, మూగజీవాల కోసం బుక్ చేసుకున్న టికెట్ రుసుము తిరిగి పొందలేరు. ప్రయాణీకుల టిక్కెట్ మాత్రమే తిరిగి చెల్లించబడుతుంది. 👉గుర్రాలు, ఆవులు, గేదెలు మొదలైన పెద్ద పెద్ద పెంపుడు జంతువులను గూడ్స్ రైళ్లలో బుక్ చేసి రవాణా చేస్తారని రైల్వే అధికారులు తెలిపారు. 👉ప్రయాణంలో మూగజీవాలకు సంరక్షణకు ఒక వ్యక్తి ఉండాలి. 👉జంతువులకు ఏదైనా నష్టం జరిగితే యజమాని బాధ్యత వహిస్తాడు. వాటికి రైల్వేశాఖ బాధ్యత వహించదు. చదవండి👉 రైల్వే ప్రయాణికులకు బంపరాఫర్.. మీ ట్రైన్ టికెట్ వెయిటింగ్ లిస్టులో ఉందా? -
కేంద్ర మంత్రి వర్గ సమావేశం ప్రారంభం
సాక్షి, న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం కేంద్ర మంత్రి వర్గ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో చైనాతో వివాదం, ప్రస్తుత కరోనా పరిస్థితులు, ఆర్థిక సంక్షోభం తదితర అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉంది. కాగా, దేశంలో కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. రోజు రోజుకు వైరస్ పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్య పెరుగుతూనే పోతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఏకంగా 15968 పాజిటివ్ కేసులు నిర్దారణ కాగా.. 465 మంది మృత్యువాతపడ్డారు. దీంతో దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 4,56,183కు చేరుకోగా మొత్తం 14,476 మంది మరణించారు. -
కంప్యూటర్లపై దర్యాప్తు సంస్థల నిఘా కన్ను
-
అనిల్ దేశాయ్‌కి కేంద్ర మంత్రి పదవి?
లోక్‌సభ శీతాకాల సమావేశాలు కాగానే ప్రమాణస్వీకారం శివసేన అధినేత ఉద్ధవ్ పచ్చజెండా సాక్షి, ముంబై: శివసేన రాజ్యసభ సభ్యుడు అనిల్ దేశాయ్‌కి కేంద్ర మంత్రి పదవి వరించనుంది. ఢిల్లీలో శీతాకాల పార్లమెంటు సమావేశాలు పూర్తయిన తర్వాత ఆయనకు కేంద్ర మంత్రి పదవి కట్టబెట్టనున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ అదేవిధంగా శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో దేశాయ్‌కి మార్గం సుగమమైంది. కొద్ది రోజుల కిందట జరిగిన రెండవ విడత కేంద్ర మంత్రి మండలి విస్తరణలో మిత్రపక్షాల కోటాలో శివసేన తరఫున దేశాయ్ కేంద్ర మంత్రిగా ప్రమాణం చేయాల్సి ఉంది. అయితే బీజేపీ, శివసేన మధ్య రాష్ట్రస్థాయి పొత్తులపై చర్చలు కొలిక్కిరాకపోవడంతో చివరి నిమిషంలో ఆయన ఢిల్లీ నుంచి వెనుదిరిగారు. అయితే అప్పట్లో నెల కొన్న విభేదాలు, కలహాలు ఇప్పుడు సద్దుమణిగాయి. రాష్ట్ర ప్రభుత్వంలో శివసేన భాగస్వామి అయ్యింది. దీంతో అనిల్ దేశాయ్‌కి కేంద్ర మంత్రిపదవి కట్ట బెట్టేందుకు మార్గం సులభతరమైంది. ప్రస్తుతం కేంద్ర మంత్రివ ర్గంలో శివసేనకు చెందిన అనంత్ గీతే ఒక్కరే క్యాబినెట్ మంత్రిగా ఉన్నారు. త్వరలో జరగనున్న విస్తరణలో దేశాయ్ చేరితే ఈ సంఖ్య రెండుకు చేరుతుంది. ఎన్డీయే కూటమిలో శివసేనకు 18 మంది ఎంపీలు ఉన్నప్పటికీ, మంత్రివర్గంలో తగిన వాటా రాలేదు. దీంతో శివసేనలో తీవ్ర అసంతృప్తి ఉంది. త్వరలో జరిగే మంత్రి వర్గ విస్తరణంలో దేశాయ్‌కి చోటు లభించినప్పటికీ శివసేనలో నెలకొన్న అసంతృప్తి పూర్తిగా తొలగిపోదని విశ్లేషకులు భావిస్తున్నారు. -
'నా చురుకుదనం మరిచిపోవద్దు'
రాష్ట్ర విభజనతో కాంగ్రెస్ పార్టీ తమ ప్రాంతంలో అడ్రసు లేకుండా పోతుందని ముందే ఊహించి ఎంతోకాలంగా కొనసాగుతున్న 'హస్తం' పార్టీకి హ్యాండిచ్చి సైకిల్ ఎక్కేశారు. అంతేవేగంగా పచ్చ పార్టీ ఎంపీ టిక్కెట్ అందుకుని ఎంపీ అయిపోయారు. అంతేనా జాతీయ స్థాయిలో ఆహార, వినియోగదారుల వ్యవహారాల స్థాయి సంఘం ఛైర్మన్‌గా నియమితులయ్యారు. అంతటితో ఆగకుండా కేంద్రమంత్రి పదవిపై కన్నేశారు... అందుకోసం తన ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇంతకీ నిన్నకాక మొన్న సైకిల్ ఎక్కి ఆగకుండా సవారీ చేస్తుంది ఎవరు అని అనుకుంటున్నారా ? ఆయనేనండి జేసీ దివాకర్ రెడ్డి. ఇటీవల జరిగిన ఎన్నికల్లో అనంతపురం లోక్‌సభ సభ్యుడిగా టీడీపీ తరపున బరిలోకి దిగి జేసీ దివాకర్ రెడ్డి విజయకేతనం ఎగరవేశారు. ఇప్పుడు కేంద్రమంత్రి కావాలని ఆయన తహతహలాడుతున్నారు. ఇటీవలే పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడిని కూడా కలసి తన మనసులోని మాట అధినేత ముందుంచారు. పార్టీకి ఎంతో కాలంగా సేవ చేస్తున్న వారికి ప్రాధాన్యత ఇవ్వాలని జేసీకి బాబు వివరించారని సమాచారం. అయితే టీడీపీలోకి కొత్తగా వచ్చిన తమ పాత పార్టీ వారికి అత్యంత ప్రాధాన్యత పొస్ట్లు కట్టబెట్టారంటూ వారి జాబితాను బాబు ముందు జేసి ఉంచారు. అంతేకాకుండా జిల్లాలో మొత్తం 14 అసెంబ్లీ స్థానాల్లో 12 టీడీపీ రావడం వెనక తన చురుకుదనం మరిచిపోవద్దని బాబుకు జేసీ సూచించారట. దాంతో బాబుగారు కొద్దిగా డైలమాలో పడ్డారని సమాచారం. అదికాక ప్రధానమంత్రిగా మోడీ బాధ్యతలు స్వీకరించి 100 రోజుల పాలన పూర్తి అయింది. మోడీ ప్రభుత్వం మరోసారి మంత్రివర్గ విస్తరణ చేపట్టనుందని వార్తలు వెల్లువెత్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర పదవి చాన్స్ కొట్టేయాలని జేసీ ప్రయత్నాలు చేస్తున్నారు. మోడీ కేబినెట్లో ఏపీకి ఒకే ఒక్క మంత్రి పదవిని దక్కింది. విజయనగరం జిల్లాకు చెందినఎంపీ అశోక్ గజపతి రాజు పౌర విమానయాశాఖను కట్టబెట్టారు. దాంతో రాయలసీమ కోటాలో తనకు కేంద్రమంత్రి పదవి ఇప్పించేందుకు బాబును ఒప్పించేందుకు టీడీపీ నేతలను మచ్చిక చేసుకునే పనిలో పడ్డారు జేసీ. పార్టీ మారిన వెంటనే తనకే కాకుండా తన తమ్ముడు జేసీ ప్రభాకర్ రెడ్డికి తాడిపత్రి అసెంబ్లీ టికెట్ ఇప్పించుకోవడంతోపాటు ఎమ్మెల్యేగా గెలిపించుకోవడంలో సఫలీకృతుడైన జేసీ... కేంద్రమంత్రి బెర్తు సాధిస్తారో, లేదో చూడాలి. -
ఎవరికి ప్రాధాన్యత? ఎవరికి లేదు?
న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి మండలిలో ఉత్తరప్రదేశ్‌కు పెద్దపీట వేశారు. ఆ తరువాతి స్థానం మహారాష్ట్రకు దక్కింది. ముస్లీంలకు ప్రధాన్యత లేదు. ఒక్కరికి మాత్రమే స్థానం లభించింది. కేంద్ర మంత్రి మండలి ఎంపికలో మోడీ మార్కు స్పష్టంగా కనిపిస్తోంది. ఆర్ఎస్ఎస్ ప్రభావం కూడా ఉందని భావిస్తున్నారు యుపి నుంచి 9 మందికి మంత్రులుగా చోటు దక్కింది. యుపి నుంచి గెలుపొందిన రాజ్‌నాథ్, ఉమాభారతి, కల్ రాజ్ మిశ్రా, మేనకాగాంధీ , వీకే సింగ్, సంతోష్ గంగావార్, సంజీవ్ కుమార్, మనోజ్ సిన్హా కేంద్ర మంత్రులుగా ప్రమాణం చేశారు. మహారాష్ట్ర నుంచి ఆరుగురికి స్థానం దక్కింది. మహారాష్ట్రకు చెందిన నితన్ గడ్కరీ, గోపీనాథ్ ముండే, అనంత్ గీతె, ప్రకాష్ జవదేకర్, పీయూష్ గోయల్, రావుసాహెబ్‌లు మంత్రులుగా ప్రమాణం చేశారు. ముస్లీంలకు ప్రాధాన్యత ఇవ్వలేదు. ఒక్క నజ్మా హెప్తుల్లాకు మాత్రమే స్థానం దక్కింది. బిజెపిలో సీనియర్లకు మంత్రి మండలిలో స్థానం లభించలేదు. ఆ పార్టీ అగ్రనేతలైన అద్వానీ, అరుణ్ శౌరి, మురళీ మనోహర్ జోషీ, మన రాష్ట్రానికి చెందిన దత్తాత్రేయ వంటి వారికి మంత్రి పదవులు లభించలేదు. వారు లేకుండా బిజెపిని ఊహించడమే కష్టం. అటువంటి వారికి కేబినెట్లో స్థానం దక్కలేదు. అయితే వారికి ముందు ముందు ఇంకా ఏమైనా పదవులు ఇచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. -
ఆంటోని కమిటీని కలుస్తాం
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ :వచ్చే పార్లమెంటు సమావేశాల్లోనే తెలంగాణ బిల్లు పాసవుతుందని రాష్ట్ర భారీ, మధ్యతరహా నీటి పారుదల శాఖ మంత్రి పి.సుదర్శన్‌రెడ్డి పేర్కొన్నారు. కేంద్ర మంత్రివర్గం తెలంగాణపై నోట్ రూపొందించి రాష్ట్రపతికి పంపే విధంగా అధిష్టానవర్గం నియమించిన ఆంటోని క మిటీని కోరుతామన్నారు. ఇందుకోసం తెలంగాణ మంత్రులమంతా ఢిల్లీకి వెళ్తు తున్నట్టు ఆయన తెలిపారు. శుక్రవారం నిజామాబాద్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా ఆంటోని కమిటీని కలుస్తారన్నారు. రెండ్రోజుల్లో హైదరాబాద్‌లో తెలంగాణ ప్రజాప్రతినిధులు సమావేశమవుతున్నట్టు తెలి పారు. 1956లో ఆంధ్రప్రదేశ్‌లో తెలంగా ణ రాష్ట్రం కలిసినప్పుడే ప్రత్యేక పరిస్థితుల్లో మళ్లీ విడిపోవచ్చునని అప్పుడే నిర్ణయించారన్నారు. అందువల్లనే హైదరాబాద్‌తో కూడిన 10 జిల్లాల తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకుంటున్నామన్నారు. తెలంగాణ కొత్తగా ఏర్పడుతున్న రాష్ట్రమేమీ కాదని, పాత రాష్ట్రాన్ని పునరుద్ధరించుకుంటున్నామన్నారు. 40 ఏళ్ల ప్ర జల ఆకాంక్ష, ప్రజాప్రతినిధుల కోరికను సోని యా గాంధీ నాయకత్వంలో నెరవేరుతోంద న్నారు. కాంగ్రెస్‌తో టీఆర్ఎస్ కలసి పని చేసినప్పడే తెలంగాణ ప్రక్రియ ప్రారంభమైందన్నా రు. టీడీపీతో టీఆర్ఎస్ కలసి నప్పడు కూడా కాంగ్రెస్ నాయకత్వం ప్రజల ఆకాంక్షకే పెద్దపీట వేసిందన్నారు. అన్ని పార్టీల అభిప్రాయాలను పరిగణనలోనికి తీసుకున్న అధిష్టానవర్గం సీడబ్ల్యుసీ, యూపీఏలో తెలంగాణపై తీర్మానం చేసిందని, మళ్లీ వెనక్కు తీసుకునే సవాల్ లేదని మంత్రి అన్నారు. సీమాంధ్రులు ప్రజలు సాగునీరు, విద్యుత్ సమస్యలపై అపోహలు చెందాల్సిన అవసరం లేదన్నారు. 50ఏళ్లుగా నాగార్జునసాగర్, శ్రీశైలం గోదావరి జలాల వినియోగం లో కొనసాగుతున్న భాగస్వామ్యమే యథాతథంగా కొనసాగుతుందన్నారు. విద్యుత్ విని యోగంలో కూడా ఇలాంటి విధానమే ఉం టుందన్నారు. హైదరాబాద్‌తో పాటు తెలంగా ణ రాష్ట్రంలో సీమాంధ్రులకు భద్రత కల్పించే బాధ్యత తమదేనన్నారు. ఇప్పటిలాగానే సీ మాంధ్రులు తెలంగాణ రాష్ట్రంలో వ్యాపారాలు, పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవచ్చునని అన్నా రు. నిజామాబాద్ జిల్లాతో పాటు పలు ప్రాం తాల్లో కూడా సీమాంధ్ర ప్రజలు వ్యాపారాలు చేసుకోవడంతో పాటు ప్రజాప్రతినిధులుగా కొనసాగుతున్న విషయాన్ని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. తెలంగాణ ప్రజలు 50 ఏళ్ల చరిత్రలో ఎప్పుడు కూడా సీమాంధ్రుల ను ఎలాంటి వేధింపులకు గురిచేయకపోగా బా గా గౌరవించి అక్కున చేర్చుకున్నారని ఇక్కడి ప్రజల త్యాగనిరతిని కొనియాడారు. విడిపోయి కలిసుందాం ఒక కుటుంబంలోని అన్నదమ్ముల్లాగా విడిపో యి తెలంగాణ, సీమాంధ్ర ప్రజలుగా కలిసి ఉందామని మంత్రి పి.సుదర్శన్‌రెడ్డి అన్నారు. స్నేహపూర్వక పోటీతత్వం వల్లనే రెండు రాష్ట్రా లు అభివృద్ధి దశలో పయనిస్తాయన్నారు. తె లంగాణ రాష్ట్రంలో విద్యుత్, వ్యవసాయ రంగాలకు ప్రధాన్యత ఇవ్వగలమన్నారు. రాష్ట్రంలో 32లక్షల విద్యుత్ కనెక్షన్లు ఉండగా తెలంగాణ లో 24 లక్షలకుపైగా ఉన్నాయని అందువల్లనే విద్యుత్ ఉత్పత్తిపై తగిన శ్రద్ధ పెట్టగలమన్నా రు. హైదరాబాద్ లేకుండా తెలంగాణ రాష్ట్రా న్ని ఎట్టిపరిస్థితుల్లో ఒప్పుకొనే సమస్యలేదన్నారు. సోనియా దయతో తెలంగాణ -ఈరవత్రి అనిల్, ప్రభుత్వ విప్ సోనియా దయతో తెలంగాణ సాకారం అవుతోందని ప్రభుత్వ విప్ ఈరవత్రి అనిల్ అన్నారు. సీమాంధ్ర ప్రాంతానికి చెందిన మం డవ వెంకటేశ్వరరావును తెలంగాణ ప్రజలు నాలుగు సార్లుగా ఎమ్మెల్యేగా గెలిపించారంటే ఆ ప్రాంత వాసులను మనం ఏవిధంగా గౌరవించామన్న విషయం స్పష్టమవుతుందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తరువాత కూడా ఇదే పద్ధతిలో సీమాంధ్రులకు భద్రత ఉం టుందన్నారు. పది రోజుల్లో కాంగ్రెస్ కమిటీలు -తాహెర్ బిన్ హందాన్, డీసీసీ అధ్యక్షులు రానున్న పదిరోజుల్లో కాంగ్రెస్ పార్టీ జిల్లా, బ్లాక్, మండల కమిటీలను పునరుద్ధరించడం ద్వారా సంస్థాగతంగా బలోపేతం అయ్యేం దుకు కృషి చేస్తానని డీసీసీ అధ్యక్షుడు తాహెర్‌బిన్ తెలిపారు. ఈ మేరకు పీసీసీ నుంచి అనుమతి ఉందన్నారు. పూర్తి స్థాయిలో అన్ని కమిటీలను పునరుద్ధరించడం ద్వారా రానున్న ఎన్నికల్లో పార్టీని విజయపథం వైపు నడిపించగల మని ఆయన తెలిపారు. సమావేశంలో డీసీసీబీ అధ్యక్షుడు పట్వారి గంగాధర్, జిల్లా గ్రంథాల య చైర్మన్ శ్రీనివాస్‌యాదవ్, కాంగ్రెస్ నాయకులు గడుగు గంగాధర్, తిరుపతిరెడ్డిలు పాల్గొన్నారు.