ఆంటోని కమిటీని కలుస్తాం we will meet antony commitee | Sakshi
Sakshi News home page

ఆంటోని కమిటీని కలుస్తాం

Published Sat, Aug 17 2013 3:17 AM | Last Updated on Fri, Sep 1 2017 9:52 PM

we will meet antony commitee


 సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ :వచ్చే పార్లమెంటు సమావేశాల్లోనే తెలంగాణ బిల్లు పాసవుతుందని రాష్ట్ర భారీ, మధ్యతరహా నీటి పారుదల   శాఖ మంత్రి పి.సుదర్శన్‌రెడ్డి పేర్కొన్నారు. కేంద్ర మంత్రివర్గం తెలంగాణపై నోట్ రూపొందించి రాష్ట్రపతికి పంపే విధంగా అధిష్టానవర్గం నియమించిన ఆంటోని క మిటీని కోరుతామన్నారు. ఇందుకోసం   తెలంగాణ మంత్రులమంతా ఢిల్లీకి వెళ్తు తున్నట్టు ఆయన తెలిపారు. శుక్రవారం నిజామాబాద్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా ఆంటోని కమిటీని కలుస్తారన్నారు. రెండ్రోజుల్లో హైదరాబాద్‌లో తెలంగాణ ప్రజాప్రతినిధులు సమావేశమవుతున్నట్టు  తెలి పారు.
 
 1956లో ఆంధ్రప్రదేశ్‌లో తెలంగా ణ రాష్ట్రం కలిసినప్పుడే ప్రత్యేక పరిస్థితుల్లో మళ్లీ విడిపోవచ్చునని అప్పుడే నిర్ణయించారన్నారు. అందువల్లనే హైదరాబాద్‌తో కూడిన 10 జిల్లాల తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకుంటున్నామన్నారు. తెలంగాణ కొత్తగా ఏర్పడుతున్న రాష్ట్రమేమీ కాదని, పాత రాష్ట్రాన్ని పునరుద్ధరించుకుంటున్నామన్నారు. 40 ఏళ్ల ప్ర జల ఆకాంక్ష, ప్రజాప్రతినిధుల కోరికను సోని యా గాంధీ నాయకత్వంలో నెరవేరుతోంద న్నారు. కాంగ్రెస్‌తో టీఆర్‌ఎస్ కలసి పని చేసినప్పడే తెలంగాణ ప్రక్రియ ప్రారంభమైందన్నా రు. టీడీపీతో టీఆర్‌ఎస్ కలసి నప్పడు కూడా కాంగ్రెస్ నాయకత్వం ప్రజల ఆకాంక్షకే పెద్దపీట వేసిందన్నారు. అన్ని పార్టీల అభిప్రాయాలను పరిగణనలోనికి తీసుకున్న అధిష్టానవర్గం సీడబ్ల్యుసీ, యూపీఏలో తెలంగాణపై తీర్మానం చేసిందని, మళ్లీ వెనక్కు తీసుకునే సవాల్ లేదని మంత్రి అన్నారు.
 
  సీమాంధ్రులు ప్రజలు సాగునీరు, విద్యుత్ సమస్యలపై అపోహలు చెందాల్సిన అవసరం లేదన్నారు. 50ఏళ్లుగా నాగార్జునసాగర్, శ్రీశైలం గోదావరి జలాల వినియోగం లో కొనసాగుతున్న భాగస్వామ్యమే యథాతథంగా కొనసాగుతుందన్నారు. విద్యుత్  విని యోగంలో కూడా ఇలాంటి  విధానమే ఉం టుందన్నారు. హైదరాబాద్‌తో పాటు తెలంగా ణ రాష్ట్రంలో సీమాంధ్రులకు భద్రత కల్పించే బాధ్యత తమదేనన్నారు. ఇప్పటిలాగానే సీ మాంధ్రులు తెలంగాణ రాష్ట్రంలో వ్యాపారాలు, పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవచ్చునని అన్నా రు. నిజామాబాద్ జిల్లాతో పాటు పలు ప్రాం తాల్లో కూడా సీమాంధ్ర ప్రజలు వ్యాపారాలు చేసుకోవడంతో పాటు ప్రజాప్రతినిధులుగా కొనసాగుతున్న విషయాన్ని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. తెలంగాణ ప్రజలు 50 ఏళ్ల చరిత్రలో ఎప్పుడు కూడా సీమాంధ్రుల ను ఎలాంటి వేధింపులకు గురిచేయకపోగా బా గా గౌరవించి అక్కున చేర్చుకున్నారని ఇక్కడి ప్రజల త్యాగనిరతిని కొనియాడారు.
 
 విడిపోయి కలిసుందాం
 ఒక కుటుంబంలోని అన్నదమ్ముల్లాగా విడిపో యి తెలంగాణ, సీమాంధ్ర ప్రజలుగా కలిసి ఉందామని మంత్రి పి.సుదర్శన్‌రెడ్డి అన్నారు. స్నేహపూర్వక పోటీతత్వం వల్లనే రెండు రాష్ట్రా లు అభివృద్ధి దశలో పయనిస్తాయన్నారు. తె లంగాణ రాష్ట్రంలో విద్యుత్, వ్యవసాయ రంగాలకు ప్రధాన్యత ఇవ్వగలమన్నారు. రాష్ట్రంలో 32లక్షల విద్యుత్ కనెక్షన్లు ఉండగా తెలంగాణ లో 24 లక్షలకుపైగా ఉన్నాయని అందువల్లనే విద్యుత్ ఉత్పత్తిపై తగిన శ్రద్ధ పెట్టగలమన్నా రు. హైదరాబాద్ లేకుండా తెలంగాణ రాష్ట్రా న్ని ఎట్టిపరిస్థితుల్లో ఒప్పుకొనే సమస్యలేదన్నారు.
 సోనియా దయతో తెలంగాణ  
 -ఈరవత్రి అనిల్, ప్రభుత్వ విప్
 
 సోనియా దయతో తెలంగాణ సాకారం అవుతోందని ప్రభుత్వ విప్ ఈరవత్రి అనిల్ అన్నారు.  సీమాంధ్ర ప్రాంతానికి చెందిన మం డవ వెంకటేశ్వరరావును తెలంగాణ ప్రజలు నాలుగు సార్లుగా ఎమ్మెల్యేగా గెలిపించారంటే ఆ ప్రాంత వాసులను మనం ఏవిధంగా గౌరవించామన్న విషయం స్పష్టమవుతుందన్నారు.  తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తరువాత కూడా ఇదే పద్ధతిలో సీమాంధ్రులకు భద్రత ఉం టుందన్నారు.
 పది రోజుల్లో కాంగ్రెస్ కమిటీలు
 -తాహెర్ బిన్ హందాన్, డీసీసీ అధ్యక్షులు
 
 రానున్న పదిరోజుల్లో కాంగ్రెస్ పార్టీ జిల్లా, బ్లాక్, మండల కమిటీలను పునరుద్ధరించడం ద్వారా సంస్థాగతంగా బలోపేతం అయ్యేం దుకు కృషి చేస్తానని డీసీసీ అధ్యక్షుడు తాహెర్‌బిన్ తెలిపారు. ఈ మేరకు పీసీసీ నుంచి అనుమతి  ఉందన్నారు. పూర్తి స్థాయిలో అన్ని కమిటీలను పునరుద్ధరించడం ద్వారా రానున్న ఎన్నికల్లో  పార్టీని విజయపథం వైపు నడిపించగల మని ఆయన తెలిపారు.  సమావేశంలో డీసీసీబీ అధ్యక్షుడు పట్వారి గంగాధర్, జిల్లా గ్రంథాల య చైర్మన్ శ్రీనివాస్‌యాదవ్, కాంగ్రెస్ నాయకులు గడుగు గంగాధర్, తిరుపతిరెడ్డిలు పాల్గొన్నారు.
 

Advertisement
 
Advertisement
 
Advertisement