జంతు ప్రేమికులకు ఊరట కల్పించేలా కేంద్రం రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పెంపుడు జంతువులను రైలు ప్రయాణంలో వెంట తీసుకెళ్లేందుకు ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్ చేసుకునే వెసలు బాటు కల్పించనుంది. ఇందుకోసం టీటీఈలకూ ఈ టిక్కెట్లను జారీ చేసే అధికారాన్ని ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తోంది.
రైలు ప్రయాణంలో జర్నీ చేయాల్సి వస్తే మూగ జీవాలతో ఇబ్బందే. ఈ సమస్యను నివారించేందుకు రైల్వే శాఖ సరికొత్త విధానంతో ముందుకొస్తోంది. ఈ సమస్యకు పరిష్కార మార్గంగా భారతీయ రైల్వే మంత్రిత్వ శాఖ పెంపుడు జంతువులకు కూడా టికెట్లను అమ్మనుంది.
చదవండి👉 ఫోన్‌లో ట్రైన్ టికెట్ బుక్ చేస్తున్నారా? ఆ ‘యాప్’ వాడితే ఇక అంతే సంగతులు
ప్రస్తుతం, ప్రయాణికులు పెంపుడు జంతువుల్ని వెంట తీసుకొని వెళ్లాలంటే ఫస్ట్ క్లాస్ ఏసీ టికెట్లు, క్యాబిన్‌లు లేదా కూపేలను బుక్ చేసుకోవాలి. ఇందు కోసం ప్రయాణం రోజున ప్లాట్‌ఫామ్‌లోని పార్శిల్ బుకింగ్ కౌంటర్లను సంప్రదించి టికెట్‌ను రిజర్వ్ చేసుకోవాల్సి ఉంది. అనంతరం, ప్రయాణికులు తమ పెంపుడు జంతువులను బాక్స్‌లలో ఉంచి ట్రైన్‌లలోని సెకండ్ క్లాస్ లగేజీ, బ్రేక్ వ్యాన్‌లలో తీసుకొని వెళ్తున్నారు.
ఈ విధానం వల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను అధిగమించేలా ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లలో జంతువులకు టికెట్ బుక్ చేసుకునే సౌకర్యం కల్పించాలని రైల్వే మంత్రిత్వ శాఖ యోచిస్తోంది. ట్రైన్‌లలో జంతువులకు టికెట్‌లను బుక్ చేసే అధికారాన్ని టీటీఈలకు ఇచ్చే ప్రతిపాదన కూడా ఉంది.
ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లో జంతువులను ఆన్‌లైన్‌లో బుక్ చేసుకునే సౌకర్యాన్ని ప్రారంభించేందుకు వీలుగా సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేయాలని రైల్వే బోర్డు cris (సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్)ని కోరినట్లు ది స్టేట్స్‌మన్ నివేదిక వెల్లడించింది. గార్డు కోసం కేటాయించిన ఎస్‌ఎల్‌ఆర్ కోచ్‌లో జంతువులను ఉంచుతారు. జంతువుల యజమానులు తమ పెంపుడు జంతువులకు రైలు స్టాపేజ్‌లలో నీరు, ఆహారం మొదలైనవాటిని అందించవచ్చు.
అయితే ఆన్‌లైన్‌లో జంతువుల టిక్కెట్లను బుక్ చేసుకోవడానికి కొన్ని షరతులు విధించనుంది. ఆ నిబంధనలు ఇలా ఉన్నాయి.
👉ప్రయాణికుల టిక్కెట్ తప్పనిసరిగా ధృవీకరించాలి
👉ప్రయాణికుడు టిక్కెట్‌ను రద్దు చేస్తే, జంతువులకు బుక్ చేసిన టిక్కెట్ వాపసు ఇవ్వబడదు.
👉ట్రైన్ రద్దయినా లేదా మూడు గంటల కంటే ఎక్కువ ఆలస్యం అయితే, మూగజీవాల కోసం బుక్ చేసుకున్న టికెట్ రుసుము తిరిగి పొందలేరు. ప్రయాణీకుల టిక్కెట్ మాత్రమే తిరిగి చెల్లించబడుతుంది.
👉గుర్రాలు, ఆవులు, గేదెలు మొదలైన పెద్ద పెద్ద పెంపుడు జంతువులను గూడ్స్ రైళ్లలో బుక్ చేసి రవాణా చేస్తారని రైల్వే అధికారులు తెలిపారు.
👉ప్రయాణంలో మూగజీవాలకు సంరక్షణకు ఒక వ్యక్తి ఉండాలి.
👉జంతువులకు ఏదైనా నష్టం జరిగితే యజమాని బాధ్యత వహిస్తాడు. వాటికి రైల్వేశాఖ బాధ్యత వహించదు.
చదవండి👉 రైల్వే ప్రయాణికులకు బంపరాఫర్.. మీ ట్రైన్ టికెట్ వెయిటింగ్ లిస్టులో ఉందా?
Comments
Please login to add a commentAdd a comment