![Central Cabinet Meeting Started - Sakshi](/styles/webp/s3/article_images/2020/06/24/modi.jpg.webp?itok=KphBVZoJ)
సాక్షి, న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం కేంద్ర మంత్రి వర్గ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో చైనాతో వివాదం, ప్రస్తుత కరోనా పరిస్థితులు, ఆర్థిక సంక్షోభం తదితర అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉంది. కాగా, దేశంలో కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. రోజు రోజుకు వైరస్ పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్య పెరుగుతూనే పోతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఏకంగా 15968 పాజిటివ్ కేసులు నిర్దారణ కాగా.. 465 మంది మృత్యువాతపడ్డారు. దీంతో దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 4,56,183కు చేరుకోగా మొత్తం 14,476 మంది మరణించారు.
Comments
Please login to add a commentAdd a comment