న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సోమవారం కేంద్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఉంటుందని వార్తలు ఊపందుకుంటున్న వేళ జరుగుతున్న ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. తాజాగా, ఎన్‌సీపీ నుంచి వేరు కుంపటి పెట్టుకుని బీజేపీ–శివసేన ప్రభుత్వంలో అజిత్ పవార్ వర్గం చేరికపైనా చర్చించే అవకాశాలున్నాయి. ప్రగతి మైదాన్‌లో కొత్తగా నిర్మించిన కన్వెన్షన్ సెంటర్‌లో సమావేశం ఉంటుందని సమాచారం.
హోంమంత్రి అమిత్ షా, బీజేపీ చీఫ్ జేపీ నడ్డా తదితర అగ్రనేతలు ఇటీవలి కాలంలో పలుదఫాలుగా అంతర్గత చర్చలు జరపడంతో మంతివర్గ పునర్వ్యవస్థీకరణ చేపడతారనే ఊహాగానాలకు బలం చేకూరింది. తాజాగా శరద్ పవార్‌ను వీడి అజిత్ పవార్ వెంట బయటకు వచ్చిన సీనియర్ ఎన్‌సీపీ ఎంపీ ప్రఫుల్ పటేల్‌కూ ఇందులో అవకాశం ఇవ్వొచ్చని తెలుస్తోంది. ఈ ఏడాదిలోనే కొన్ని రాష్ట్లాల్లో అసెంబ్లీలకు ఎన్నికలు, వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికల దృష్ట్యా పార్టీ బలోపేతానికి చేపట్టాల్సిన సంస్థాగతమైన మార్పులపైనా చర్చిస్తారని తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment