హైదరాబాద్: హైదరాబాద్ మెట్రో రైలు ఉద్యోగ నియామకాల్లో స్థానికులకు, ప్రత్యేకించి మహిళలకు ప్రాధాన్యం ఇవ్వాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మెట్రో నిర్వాహకులకు సూచించారు. మెట్రో నిర్వహణ బాధ్యతలు చూస్తున్న ఫ్రెంచి కంపెనీ కియోలిస్ సీఈవో బెర్నార్డ్ టబరీ గురువారం సీఎం కేసీఆర్‌తో క్యాంపు కార్యాలయంలో భేటీ అయ్యారు. స్థానిక ఇంజనీరింగ్ కాలేజీలను సందర్శించి క్యాంపస్ రిక్రూట్‌మెంట్ ద్వారా మెయింటెనెన్స్ ఇంజనీర్లను ఎంపిక చేస్తామని బెర్నార్డ్ హామీ ఇచ్చారు. అవకాశమున్న చోట మహిళలకు కూడా ఉద్యోగావకాశాలు కల్పిస్తామన్నారు.