వాషింగ్టన్: భారత్–అమెరికా భాగస్వామ్యానికి, స్నేహానికి ప్రపంచంలో అత్యధిక ప్రాముఖ్యత ఉందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఉద్ఘాటించారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు గతంలో ఎన్నడూ లేనంత బలంగా, సన్నిహితంగా, స్థిరంగా ఉన్నాయని వివరించారు. వ్యూహాత్మక సాంకేతిక భాగస్వామ్యాన్ని మరింత ఉన్నతస్థాయికి చేర్చాలని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన సందర్భంగా నిర్ణయించుకున్నామని తెలిపారు. ఈ మేరకు బైడెన్ తాజాగా ట్వీట్ చేశారు.
బైడెన్ ట్వీట్ పట్ల ప్రధాని మోదీ స్పందించారు. భారత్–అమెరికా స్నేహం ప్రపంచదేశాల అభ్యున్నతికి తోడ్పతుందని పేర్కొన్నారు. మన భూగోళం మరింత ఉత్తమంగా, స్థిరంగా మారడానికి ఇరుదేశాల భాగస్వామ్యం ఎంతగానో ఉపయోగపడుతుందని ట్విట్టర్‌లో స్పష్టం చేశారు. బైడెన్ అభిప్రాయంతో తాను ఏకీభవిస్తున్నానని తెలిపారు. ఇటీవల తాను చేపట్టిన పర్యటన భారత్–అమెరికా నడుమ సంబంధ బాంధవ్యాల బలోపేతానికి దోహదపడుతుందని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. భారత్, అమెరికా దేశాల మధ్యనున్న సన్నిహిత, లోతైన భాగస్వామ్యాన్ని మోదీ పర్యటన మరింత దృఢతరం చేసిందని అమెరికా అధ్యక్షుడి అధికారిక నివాసమైన వైట్‌హౌజ్ హర్షం వ్యక్తం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment