Breadcrumb
Union Budget: కేంద్ర బడ్జెట్ 2022 అప్డేట్స్
Published Tue, Feb 1 2022 7:25 AM | Last Updated on Wed, Feb 2 2022 6:44 PM
Live Updates
లోక్‌సభలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న కేంద్ర ఆర్థిక మంత్రి
బడ్జెట్‌ను పూర్తిగా అర్థం చేసుకుని విమర్శిస్తే సమాధానం చెప్తా: నిర్మలా సీతారామన్
బడ్జెట్‌పై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఘాటుగా స్పందించారు. బడ్జెట్ అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో రాహుల్ గాంధీ ‘జీరో బడ్జెట్’ వ్యాఖ్యలను ఆమె తిప్పికొట్టారు. ట్విటర్లో త్వరగా స్పందిస్తూ చేసిన రాహుల్ వ్యాఖ్యలను చూసి జాలి పడుతున్నానని అన్నారు. ముందుగా బడ్జెట్‌ను అర్థం చేసుకోడానికి ప్రయత్నించాలని సూచించారు. బడ్జెట్‌పై అవగాహన పెంచుకుని, బడ్జెట్‌ను పూర్తిగా అర్థం చేసుకుని విమర్శిస్తే సమాధానం చెప్పేందుకు తాను రెడీ అని పేర్కొన్నారు.
#WATCH | I pity people who come up with quick responses...Just because you want to put something on Twitter, it doesn't help. He should first do something in Congress-govern states then talk about it: FM Nirmala Sitharaman on Congress leader Rahul Gandhi's comment on Budget 2022 pic.twitter.com/m90TGkq8s4
— ANI (@ANI) February 1, 2022
రాహుల్ గాంధీకి ప్రతీది సున్నాలాగే కనిపిస్తుంది: కేంద్ర మంత్రి పీయూష్ గోయల్
ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై విమర్శలు చేసిన కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీపై కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బడ్జెన్‌ను అర్థం చేసుకోడానికి తెలివి తేటలు ఉండాలని రాహుల్‌కు చురకలంటించారు. రాహుల్‌కు మ్యాథమెటిక్స్ కూడా తెలియదని మండిపడ్డారు. రాహుల్‌కు ప్రతీది సున్నాలాగే కనిపిస్తుందని ఎద్దేవా చేశారు. అర్థం చేసుకున్న వారు బడ్జెన్‌ను స్వాగతించారని తెలిపారు.
'గరీబ్ కల్యాణ్' బడ్జెట్‌ను కేంద్రం ప్రవేశపెట్టింది: జేపీ నడ్డా
కేంద్ర బడ్జెట్‌పై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రశంసలు కురిపించారు. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ గరీబ్ కళ్యాణ్ బడ్జెట్ అని కొనియాడారు. ఈ బడ్జెట్ పేదలు, కార్మికుల అభివృద్ధికి దోహదపడుతోందని అన్నారు. అలాగే అన్ని వర్గాల అంచనాలను, ఆకాంక్షలను నెరవేరుస్తుందని నడ్డా పేర్కొన్నారు..
కేంద్ర బడ్జెట్‌ను స్వాగతిస్తున్నాం: బిహార్ సీఎం నితీష్ కుమార్
కేంద్ర బడ్జెట్‌పై బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ప్రసంసలు కురిపించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ సానుకూలంగా ఉందని, స్వాగతిస్తున్నామని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం తమ బడ్జెట్ ద్వారా దేశాభివృద్ధి వేగాన్ని పెంచేందుకు అనేక చర్యలు చేపట్టడం అభినందనీయమన్నారు. దేశంలో మౌలిక వసతుల కల్పనకు పెద్ద ఎత్తున నిర్ణయం తీసుకోవడం కూడా స్వాగతించదగినదేని నితీష్ కుమార్ తెలిపారు.
ఏ ఆర్థిక మంత్రి చదవని పెట్టుబడిదారీ బడ్జెట్: చిదంబరం
నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో చేసిన బడ్జెట్ ప్రసంగంపై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం విమర్శలు గుప్పించారు. ఇప్పటి వరకు ఏ ఆర్థిక మంత్రి చదవని పెట్టుబడిదారీ బడ్జెట్ ప్రసంగం చేశారని మండిపడ్డారు. మొత్తం బడ్జెట్ ప్రసంగంలో పేదలన్న పదం కేవలం రెండుసార్లు మాత్రమే(పేరా ఆరులో) వచ్చిందన్నారు. ఈ దేశంలో పేద ప్రజలు ఉన్నారని గుర్తు చేసినందుకు ఆర్థిక మంత్రికి ధన్యవాదాలు అంటూ ఎద్దేవా చేశారు. ఈ పెట్టుబడిదారీ బడ్జెట్‌ను ప్రజలు తిరస్కరిస్తారని అన్నారు.
బడ్జెట్లో పేదలకు గుండుసున్నా: సీఎం కేసీఆర్
కేంద్ర బడ్జెట్‌పై తెలంగాణ సీఎం కేసీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. దిశ, దశ, నిర్దేశం లేని పనికిమాలిన.. పసలేని బడ్జెట్ అని విరుచుకుపడ్డారు. కేంద్ర బడ్జెట్లో మాటల గారడీ తప్ప ఏమీ లేదని, ఇది చాలా దారుణమైన బడ్జెట్ అని మండిపడ్డారు. సామాన్యులను నిరాశ, నిస్పృహకు గురిచేసిందన్నారు. దేశ ప్రజల్ని ఘోరంగా అవమనించారని, బడ్జెట్లో పేదలకు గుండుసున్నా అని విమర్శించారు. మసిపూసి మారేడుకాయ చేసిన గోల్మాల్ బడ్జెట్ అని ఎద్దేవా చేశారు. వ్యవసాయ రంగాన్ని ఆదుకునే చర్యలు శూన్యమని, దేశ చేనేత రంగానికి బడ్జెట్లో చేసిందేం లేదని దుయ్యబట్టారు.
వేటిపైనా పన్నులు పెంచలేదు: నిర్మలా సీతారామన్
ఎంఎస్ఎంఈలకు మార్కెటింగ్ సహకారానికి కొత్త పోర్టల్ తీసుకొస్తున్నామని ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత మధ్యాహ్నం ఆమె మీడియాతో మాట్లాడారు. పరిశ్రమల కోసం ప్రత్యేక క్రెడిట్ గ్యారెంటీ పథకం ప్రకటించినట్లు పేర్కొన్నారు. ఎయిరిండియాను టాటా సంస్థ కొనుగోలు చేసిందని, డిజిటల్ కరెన్సీని ఆర్బీఐ విడుదల చేస్తుందన్నారు. కరోనా కష్టకాలంలో ప్రధానమంత్రి సూచనల మేరకు వేటిపైనా పన్నులు పెంచలేదని స్పష్టం చేశారు.
తెలంగాణ పథకాలను కేంద్రం కాపీ కొట్టింది: టీఆర్ఎస్ ఎంపీ కేకే
కేంద్ర బడ్జెట్ పూర్తి నిరుత్సాహపూరిత బడ్జెట్ అని టీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు విమర్శించారు. తెలంగాణ పథకాలను కేంద్రం కాపీ కొట్టిందన్నారు. కేంద్ర బడ్జెట్ దిశ అనేది లేకుండా ఉందని కేకే మండిపడ్డారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ నిలబడిందని, అలాంటి పథకానికి 25% కేటాయింపులు తగ్గించారని ధ్వజమెత్తారు. ఇది వ్యవసాయ, నిరుపేద పక్షపాత బడ్జెట్ అని ప్రధాని అంటున్నారని, కానీ వ్యవసాయానికి అతి స్వల్పంగా కేటాయింపులు పెంచారే తప్ప ఇంకేం చేయలేదని దుయ్యబట్టారు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల కోసం ఎలాంటి కొత్త పథకాలు లేవన్నారు.
దేశ ఆర్థిక వ్యవస్థ సరైన దిశలోనే పయణిస్తోంది: ప్రధాని మోదీ
ప్రగతిశీల బడ్జెట్.. నిర్మలా సీతారామన్‌కు అభినందనలు: మోదీ
కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్పందించారు. ఇది ప్రగతిశీల బడ్జెట్ అని..ఈ బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ను అభినందనలు తెలిపారు. ఇది అందరికీ ఆమోదకరమైన బడ్జెట్ అని, అన్ని వర్గాలకు లబ్ది చేకూరుతుందని తెలిపారు. పేదలకు అనుకూలించే బడ్జెట్ అని, వచ్చే 100 ఏళ్లకు ఉపయోగకరంగా ఈ బడ్జెట్ ఉందన్నారు. దేశ ఉజ్వల భవిష్కత్తుకు ఈ బడ్జెట్ ఉపయోగం అని ప్రశంసించారు. నవ శకానికి నాంది పలికేలా ఈ బడ్జెట్ ఉందన్నారు.
దేశ ప్రగతికి దోహదపడేలా బడ్జెట్: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
దేశ ప్రగతికి దోహదపడేలా బడ్జెట్ ఉందని కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి అన్నారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, మౌలిక సదుపాయాల కల్పనకు బడ్జెట్లో అత్యధిక ప్రాధాన్యత లభించిందని చెప్పారు. ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి, పర్యాటక రంగానికి ఎక్కువ కేటాయింపులు చేయడం ఆనందంగా ఉందని కిషన్ రెడ్డి అన్నారు.
అద్భుతమైన బడ్జెట్: మాజీ మంత్రి రవిశంకర్ ప్రసాద్
కేంద్ర బడ్జెట్ అద్భుతమైన బడ్జెట్ అన్నారు బీజేపీ సీనియర్ నేత , కేంద్ర మాజీ మంత్రి రవిశంకర్ ప్రసాద్. 9శాతం వృద్ధి రేటు సాధన దిశగా పటిష్టమైన రోడ్‌మ్యాప్‌తో బడ్జెట్ రూపొందించారని వ్యాఖ్యానించారు. వ్యవసాయం, విద్య, మౌలిక వసతులు, టెక్నాలజీ సహా అన్ని రంగాలకు సమ ప్రాధాన్యం ఇస్తూ.. సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు విజయవంతంగా ముందుకు సాగేలా చర్యలు చేపట్టారని ప్రశంసించారు.
నిరాశాజనకంగా కేంద్ర బడ్జెట్: రాకేశ్ తికాయత్
కేంద్ర బడ్జెట్ నిరాశాజనకంగా ఉందని భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ తికాయత్ అసహనం వ్యక్తం చేశారు. వ్యవసాయ రంగానికి 2 లక్షల కోట్లకుపైగా కేటాయించినట్లు కేంద్రం చెబుతోందని, అయితే.. దాన్ని వల్ల రైతులకు ఎలాంటి ఉపయోదం లేదన్నారు. కనీస మద్దతు ధర చట్టం తీసుకొస్తేనే రైతన్నకు మేలు జరుగుతుందని స్పష్టం చేశారు.
పేదలు, మధ్యతరగతి ప్రజలకు బడ్జెట్లో మొండిచేయి: రాహుల్ గాంధీ
పార్లమెంట్లో ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై కాంగ్రెస్ నాయకుడు, పార్లమెంట్ సభ్యులు రాహుల్ గాంధీ స్పందించారు. మోదీ ప్రభుత్వం ‘జీరో’ సమ్ బడ్జెట్ ప్రకటించిందని ఎద్దేవా చేశారు. మధ్య తరగతి ప్రజలు, పేదలు, బడుగు బలహీన వర్గాలు, యువత, రైతులు, ఎంఎస్ఎంఈలకు ఈ బడ్జెట్లో మొండిచేయి చూపారని రాహుల్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.
M0di G0vernment’s Zer0 Sum Budget!
— Rahul Gandhi (@RahulGandhi) February 1, 2022
Nothing for
- Salaried class
- Middle class
- The poor & deprived
- Youth
- Farmers
- MSMEs
ముందుచూపుతో కూడిన బడ్జెట్
కేంద్ర బడ్జెట్-2022 ప్రగతిశీల, ముందుచూపుతో కూడిన బడ్జెట్ అని నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్‌కాంత్ అభివర్ణించారు. దేశాన్ని స్థిరమైనవృద్ధికి చేర్చే మరో దశకు ఈ బడ్జెట్ సిద్ధం చేస్తోందని తెలిపారు.
గతేడాది బడ్జెట్‌కు ఇది కొనసాగింపని చెప్పారు. బడ్జెట్-2022లో కీలకమైన అంశం.. మూలధన వ్యయంపై భారీ విస్తరణ అని తెలిపారు.
బడ్జెట్-2022 సామాన్యులకు శూన్యమే: సీఎం మమతా
కేంద్ర బడ్జెట్ 2022పై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి స్పందించారు. దేశంలో నిరుద్యోగం, ద్రవ్యోల్బణంతో సతమతమవుతున్న సామాన్యులకు సోమవారం ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ శూన్యమే మిగిల్చిందని ఎద్దేవా చేశారు.
అఛ్చేదిన్ కోసం.. మరో పాతికేళ్లు ఆగాలా?
కేంద్ర బడ్జెట్ నిరాశ పరిచిందని ఎంపీ శశిథరూర్ అన్నారు. బడ్జెట్లో MGNREGA గురించి, రక్షణ, నిత్యవసరాల ధరల సమస్యలను ప్రస్తావించలేదని శశిథరూర్ అన్నారు. మోదీ అఛ్చేదిన్ కోసం.. మరో 25 సంవత్సరాలు వేచిచూడాలా.. అంటూ సెటైర్ వేశారు.
ముగిసిన బడ్జెట్ ప్రసంగం.. లోక్‌సభ రేపటికి వాయిదా
ముగిసిన బడ్జెట్ ప్రసంగం.. లోక్‌సభ రేపటికి వాయిదా. దాదాపు గంటన్నరపాటు బడ్జెట్ ప్రసంగం కొనసాగింది. కేంద్ర బడ్జెట్ 2022 లోక్‌సభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్. 2022-23 మొత్తం బడ్జెట్ విలువ రూ. 39 లక్షల 45 వేల కోట్లు. 2022-23 మొత్తం వనరుల సమీకరణ రూ. 22.84 లక్షల కోట్లు. ద్రవ్యలోటు 6.9 శాతం. రూ.17 లక్షల కోట్ల లోటు బడ్జెట్.
‘వేతన జీవులకు నిరాశ’
ప్రస్తుత బడ్జెట్లో వేతన జీవులకు నిరాశ ఎదురైంది. ఆదాయ పన్నులో ఎలాంటి మార్పులేదు. ఇన్‌కంటాక్స్ స్లాబ్‌లలో ఎలాంటి మార్పులేదు. ఐటీ శ్లాబుల్లో కేంద్రం ఎలాంటి మార్పులు చేయలేదు.
దేశంలో 4 మల్టీమోడల్ లాజిస్టిక్ పార్క్‌లు: నిర్మల
తెలుగు రాష్ట్రాల్లో నదుల అనుసంధానానికి ప్రణాళికలు రూపొందించామని తెలిపారు. ప్రత్యేకంగా డిజిటల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నట్లు నిర్మల పేర్కొన్నారు. దేశంలో 4 మల్టీమోడల్ లాజిస్టిక్ పార్క్‌లు.
పీఎం ఈ- విద్య కోసం 200 టీవీ చానెళ్లను ఏర్పాటు చేశాం: నిర్మల
ఆతిథ్య రంగానికి రూ. 5లక్షల కోట్లు కేటాయించినట్టు నిర్మల తెలిపారు. మైక్రో, చిన్న తరహా పరిశ్రమలకు రూ. 2 లక్షల కోట్లు కేటాయించినట్లు పేర్కొన్నారు. పీఎం ఈ- విద్య కోసం 200 టీవీ చానెళ్లను ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రాంతీయ భాషల్లో 1-12 తరగతుల వరకు వర్తింపచేయనున్నారు.
‘వ్యవసాయ క్షేత్రాల పర్యవేక్షణకు కిసాన్డ్రోన్లు’
దేశ వ్యాప్తంగా సేంద్రీయ వ్యవసాయానికి ప్రోత్సాహం అందిస్తున్నట్లు నిర్మల తెలిపారు. చిన్న రైతులు, చిన్న పరిశ్రమలకు అనుగుణంగా రైల్వే నెట్‌వర్క్‌లను అభివృద్ధి చేస్తున్నామని పేర్కొన్నారు. వ్యవసాయ క్షేత్రాల పర్యవేక్షణకు కిసాన్‌డ్రోన్‌లను అభివృద్ధి చేశామని తెలిపారు. దేశవ్యాప్తంగా సేంద్రీయ వ్యవసాయానికి ప్రొత్సాహం ఇస్తున్నామని నిర్మల పేర్కొన్నారు.
కృష్ణా,పెన్నా,కావేరి నదుల అనుసంధానానికి ప్రణాళిక: నిర్మల
పట్టణ ప్రాంతాల్లో రోప్‌వేల నిర్మాణం జరుగుతుందన్నారు. అదే విధంగా, సరుకు రవాణాకు మరిన్ని కేటాయింపులు చేయనున్నట్లు నిర్మల తెలిపారు. 2023 నాటికి 2 వేల కి.మీ రైల్వే లైన్లు పెంచుతామని పేర్కొన్నారు. భూరికార్డులను డిజిటలైజేషన్ చేస్తామని నిర్మల తెలిపారు.
వచ్చే మూడేళ్లలో కొత్తగా 400 వందే భారత్ రైళ్లు: నిర్మల
పీఎం గతిశక్తి పథకం ద్వారా మౌళిక సదుపాయాలు కల్పిస్తున్నామని నిర్మల పేర్కొన్నారు. వచ్చే మూడేళ్లలో కొత్తగా 400 వందే భారత్ రైళ్లు ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు. రవాణ రంగంలో మౌలిక సదుపాయాల కోసం రూ.20 వేల కోట్టు కేటాయించినట్టు నిర్మల తెలిపారు. భారత్‌లో అవసరాలకు అనుగుణంగా మెట్రో రైలు కనెక్టివిటీ జరుగుతోందన్నారు.
వచ్చే ఐదేళ్లలో 13 లక్షల కోట్ల ఉత్పత్తి ఆధారిత ఇన్సెంటివ్‌లు: నిర్మల
దేశ వ్యాప్తంగా కొత్తగా 25 వేల కిలోమీటర్ల మేర జాతీయ రహదారుల నిర్మాణం చేపట్టినట్లు నిర్మల తెలిపారు. వచ్చే ఐదేళ్లలో 13 లక్షల కోట్ల ఉత్పత్తి ఆధారిత ఇన్సెంటివ్‌లు అందిస్తున్నట్లు నిర్మల పేర్కొన్నారు. ఒమిక్రాన్ వేవ్ మధ్యలో ఉన్నాం.. వ్యాక్సిన్ల వల్ల మేలు జరిగింది. చిన్న, మధ్యతరహా రైతుల కోసం వన్‌నేషన్ వన్‌ప్రొడక్ట్ పథకం అమలు చేస్తున్నామని నిర్మల తెలిపారు.
వందేళ్ల భారతానికి ప్రధాని మోదీ ఒక మిషన్ సూచించారు: నిర్మల
వందే భారత్ రైలు విజయవంతమైందని నిర్మల తెలిపారు. 75వ వడిలోకి వచ్చిన భారత్‌కు వందేళ్ల అభివృద్ధిని కాంక్షిస్తున్నట్లు తెలిపారు. వచ్చే మూడేళ్లలో ఆ దిశగా చర్యలు తీసుకుంటామని నిర్మల పేర్కొన్నారు. వైద్య ఆరోగ్య సౌకర్యాల అభివృద్ధి,వ్యాక్సినేషన్‌కు ప్రాధాన్యత ఇచ్చామని తెలిపారు. వందేళ్ల భారతానికి ప్రధాని మోదీ ఒక మిషన్ రూపొందించారని,దానికి అనుగుణంగా పనిచేస్తున్నామని నిర్మల అన్నారు.
ఎయిరిండియా బదిలీని సంపూర్ణం చేశాం: నిర్మల
ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల్లో ముందంజలో ఉన్నామని నిర్మల తెలిపారు. ఎయిరిండియా బదిలీని సంపూర్ణం చేశామని పేర్కొన్నారు. పీఎం గతిశక్తి పథకం ద్వారా మౌలిక సదుపాయాలు కల్పించామని తెలిపారు. రవాణా రంగంలో మౌలిక సదుపాయాల కోసం రూ. 20వేల కోట్లు కేటాయించామని నిర్మల తెలిపారు. ఐదేళ్లలో 60 లక్షల మందికి ఉద్యోగాల కల్పనకు ప్రణాళిక రూపొందించామని పేర్కొన్నారు.
కేంద్ర బడ్జెట్ 2022 అప్డేట్స్
ఎల్ఐసీ పబ్లిక ఇష్యూ త్వరలోనే ప్రారంభిస్తాం: నిర్మల
పేద, మధ్యతరగతి వర్గాల సంక్షేమం కోసం కృషి చేస్తున్నామని నిర్మల తెలిపారు. పేద వర్గాలకు మౌళిక సదుపాయాలు కల్పించేందుకు కట్టుబడి ఉన్నామన్నారు. ఎస్సీ, ఎస్టీలు, మహిళలు, వ్యవసాయ దారులకు సముచిత స్థానం కల్పిస్తున్నామని నిర్మల తెలిపారు.
కరోనా తర్వాత భారత్ వేగంగా పుంజుకుందిః నిర్మల
కొవిడ్ మహమ్మారి తర్వాత భారత్ వేగంగా కోలుకుందని నిర్మల అన్నారు. వచ్చే 5 ఏళ్లలో 60 లక్షల ఉద్యోగాల కల్పన జరుగుతుందన్నారు. వృద్ధిరేటులో మనం ముందున్నామని తెలిపారు. వచ్చే 25 ఏళ్లను దృష్టిలో పెట్టుకుని బడ్జెట్ రూపొందించామని పేర్కొన్నారు.
బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించిన నిర్మల
ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ లోక్‌సభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించారు. ప్రధాని మోదీ హయాంలో 10 వ బడ్జెట్, నిర్మలకు నాలుగో బడ్జెట్.
లోక్‌సభలో బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మలమ్మ
ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ లోక్‌సభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు
కేంద్ర బడ్జెట్‌కు కేబినెట్ ఆమోదం
కేంద్ర బడ్జెట్ 2022-23కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ నాలుగోసారి బడ్జెట్‌ను లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు.
ఈసారి కూడా పూర్తిగా పేపర్ లెస్ బడ్జెట్
బడ్జెట్ ట్యాబ్‌తో పార్ల మెంట్‌కు చేరుకున్న నిర్మలమ్మ టీమ్. ఈసారి కూడా పూర్తిగా పేపర్‌లెస్ వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. పరిమిత సంఖ్యలోనే ప్రతులను ఆర్థికశాఖ ముద్రించింది.
పార్లమెంట్‌కు చేరుకున్న నిర్మలా సీతారామన్
బడ్జెట్ సమావేశంలో భాగంగా 2022-23 బడ్జెట్ ప్రవేశపెట్టడానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ భవనానికి చేరుకున్నారు.
కాసేపట్లో కేంద్ర కేబినెట్ సమావేశం
2022-23 వార్షిక బడ్జెట్‌కు ఆమోదం తెలపనున్న కేంద్ర కేబినెట్
రాష్టపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలిసిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
వార్షిక బడ్జెట్ వివరాలు రాష్ట్రపతికి తెలిపిన నిర్మలా సీతారామన్
వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగులకు రూ.50 వేలు
బడ్జెట్ లో రైతులకు భారీ సాయం
మౌలిక రంగంలో పెట్టుబడులు పెంచే అవకాశం
తాజా బడ్జెట్ మౌలిక రంగంతోపాటు గ్రామీణాభివృద్ధి, వ్యవసాయ రంగం పురోగతిపై ప్రధానంగా దృష్టి సారించే వీలుంది. రోడ్లు, రైల్వేలు, జలవనరుల ప్రాజెక్టులకు అధిక నిధులు కేటాయించే అవకాశం ఉంది.
Related News By Category
Related News By Tags
-
బడ్జెట్ నిరుత్సాహ పరిచింది
సాక్షి, న్యూఢిల్లీ: వ్యాక్సిన్ బూస్టర్ డోస్‌లా ఉంటుందనుకున్న కేంద్ర బడ్జెట్ నిరుత్సాహ పరిచిందని వైఎస్సార్సీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి చెప్పారు. పైకి స్టైల్‌గా కనిపించినా.. వాస్తవంగా అం...
-
వచ్చే వందేళ్ల కోసం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఇది: ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ వచ్చే వందేళ్ల కోసం ప్రవేశపెట్టిన బడ్జెట్‌గా ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. నాలుగు ప్రధాన సూత్రాల ఆధారంగా బడ్జెట్ రూపక...
-
ఆంధ్రప్రదేశ్ కోణంలో ఇది చెత్త బడ్జెట్: విజయసాయిరెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ కోణంలో కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్.. చెత్త బడ్జెట్ అని వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత, ఎంపీ వి. విజయసాయిరెడ్డి అన్నారు. రాజ్యసభలో బుధవారం కేంద్ర బడ్జెట్‌పై...
-
బడ్జెట్ ఇంగ్లిష్‌లోనే ఎందుకు?
న్యూఢిల్లీ: మన దేశంలో ఒక రకంగా చూస్తే హిందీ అధికార భాష. దానికి తోడుగా 22 గుర్తింపు పొందిన స్థానిక భాషలు ఉన్నాయి. గుర్తింపు పొందిన భాషల్లో ఇంగ్లిష్ లేనే లేదు. మరి ఏటా బడ్జెట్ ప్రసంగాన్ని ఇంగ్లిష్‌లో ...
-
విద్యార్థికి ఫోను.. రైతుకు డ్రోను
ఉపాధి హామీకి అంటకత్తెర.. గత బడ్జెట్ కంటే 25 శాతం కోత, ఆహార సబ్సిడీకి క్షవరం.. ఎరువుల సబ్సిడీకి 4వ వంతు కటింగ్, మహిళలపై ‘సీత’కన్ను.. జెండర్ బడ్జెట్ కుదింపు వేతన జీవుల ఐటీ వేదన యథాతథం. విద్యార్థి...
Comments
Please login to add a commentAdd a comment