వచ్చే వందేళ్ల కోసం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ ఇది: ప్రధాని మోదీ | PM Modi says Bugdet Brings in New Hopes, Ensures Bright Future for Youth | Sakshi
Sakshi News home page

Narendra Modi: వచ్చే వందేళ్ల కోసం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ ఇది: ప్రధాని మోదీ

Published Tue, Feb 1 2022 3:29 PM | Last Updated on Tue, Feb 1 2022 4:00 PM

PM Modi says Bugdet Brings in New Hopes, Ensures Bright Future for Youth - Sakshi

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ వచ్చే వందేళ్ల కోసం ప్రవేశపెట్టిన బడ్జెట్‌గా ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. నాలుగు ప్రధాన సూత్రాల ఆధారంగా బడ్జెట్‌ రూపకల్పన జరిగింది. 1. ప్రధాని గతిశక్తి యోజన 2. సమీకృత అభివృద్ధి 3. అభివృద్ధి ఆధారిత పెట్టుబడులు 4. పరిశ్రమలకు ఆర్థిక అండ ఈ అంశాలను ఆధారంగా చేసుకుంటూ బడ్జెట్‌ రూపొందించాము. దేశ యువత ఉజ్వల భవిష్యత్‌కు ఈ బడ్జెట్‌ ఉపయోగపడుతుంది.

ఉద్యోగాలు, మౌలిక వసతులు, అభివృద్ధి ప్రాతిపదికన ఈ బడ్జెట్‌ రూపొందించింది. ఈ బడ్జెట్‌లో భారత రక్షణకు పెద్దపీట వేశాం. బడ్జెట్‌లో మహిళల కోసం మిషన్‌ శక్తి, వాత్సల్య, సక్షమ్‌ అంగన్‌వాడీల రూపకల్పన వంటి 3 ప్రత్యేక పథకాలు తీసుకొచ్చాం. గంగానది తీర రాష్ట్రాల్లో సహజసిద్ధ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నాం. దేశ ఆర్థిక వ్యవస్థ సరైన దిశలోనే ప్రయాణిస్తోంది. అన్ని వర్గాలకు లబ్ధి చేకూరుతుంది. నవశకానికి నాంది పలికేలా ఈ బడ్జెట్‌ ఉంది' అని ప్రధాని నరంద్ర మోదీ అన్నారు.  

చదవండి: (Budget 2022: క్రిప్టో ట్రేడర్లకు శుభవార్త !)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement