సాక్షి, హైదరాబాద్: తెలంగాణపై కేంద్రం చిన్నచూపు చూస్తోందని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల ఆరోపించారు. కేంద్ర బడ్జెట్‌పై ఆమె ట్విట్టర్ వేదికగా స్పందించారు. బడ్జెట్‌లో బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, కాజీపేట్ కోచ్ ఫ్యాక్టరీ ప్రస్తావించలేదని మండిపడ్డారు. నిజామాబాద్‌కు పసుపు బోర్డు ఏమైందని ప్రశ్నించారు. రాష్ట్రానికి నిధులు రాబట్టడంలో సీఎం కేసీఆర్ విఫలమయ్యారని విమర్శించారు.
‘అభయహస్తం’పునఃప్రారంభించండి పేదల పక్షపాతిగా వైఎస్‌ఆర్ తీసుకువచ్చిన పథకాలను తెలంగాణ ప్రభుత్వం రద్దు చేస్తోందంటూ షర్మిల ఆగ్రహం వ్యక్తంచేశారు. వైఎస్‌ఆర్ తెచ్చిన అభయహస్తం పథకాన్ని మళ్లీ అమలుచేయాలని వేదికగా డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment