
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను పోలీసులు హౌజ్ అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో లోటస్ పాండ్‌లోని ఆమె నివాసం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. దీంతో, అక్కడ ఉద్రిక్తకర వాతావరణం చోటుచేసుకుంది.
వివరాల ప్రకారం.. వైఎస్ షర్మిలను పోలీసులు శుక్రవారం ఉదయం హౌజ్ అరెస్ట్ చేశారు. అయితే, షర్మిల నేడు సిద్దిపేటలోని గజ్వేల్ నియోజకవర్గంలో పర్యటించాల్సి ఉంది. కాగా, జగదేవ్‌పూర్ మండలంలోని తీగుల్ గ్రామంలో షర్మిల పర్యటించాల్సి ఉండగా.. శుక్రవారం ఉదయమే పోలీసులు ఆమె నివాసానికి చేరుకున్నారు. అనంతరం, జవదేవ్‌పూర్ వెళ్లకుండా షర్మిలను హౌజ్ అరెస్ట్ చేశారు. కాగా, దళితబంధు పథకంలో అక్రమాలు జరిగాయని ఇటీవల తీగుల్ గ్రామ ప్రజలు ఆందోళనలు చేపట్టారు. ఈనేపథ్యంలో వారిని కలిసేందుకు షర్మిల ప్లాన్ చేసుకున్నారు. దీంతో, పోలీసులు వైఎస్ షర్మిలను అడ్డుకున్నారు.
ఇది కూడా చదవండి: వర్షాలపై అప్రమత్తంగా ఉండండి: హైకోర్టు ఆదేశాలు
Comments
Please login to add a commentAdd a comment