Lotus Pond
-
లోటస్‌పాండ్‌లో వైఎస్ షర్మిల దీక్ష విరమణ
సాక్షి, హైదరాబాద్: గజ్వేల్ పర్యటనను పోలీసులు అడ్డుకోవడంపై నిరసనగా ఉదయం నుంచి లోటస్ పాండ్‌లో వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల దీక్షకు దిగారు. సాయంత్రం వరకు దీక్ష కొనసాగించిన షర్మిలకు గజ్వేల్ ప్రజలు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. కాగా, వైఎస్ షర్మిలను పోలీసులు శుక్రవారం ఉదయం హౌజ్ అరెస్ట్ చేశారు. అయితే, షర్మిల నేడు సిద్దిపేటలోని గజ్వేల్ నియోజకవర్గంలో పర్యటించాల్సి ఉంది. కాగా, జగదేవ్‌పూర్ మండలంలోని తీగుల్ గ్రామంలో షర్మిల పర్యటించాల్సి ఉండగా.. శుక్రవారం ఉదయమే పోలీసులు ఆమె నివాసానికి చేరుకున్నారు. పోలీసులు తనను హౌస్ అరెస్ట్ చేయడంపై షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు తనను అడ్డుకున్న పోలీసులకు హారతిచ్చి నిరసన తెలిపారు. బీఆర్ఎస్ అంటే బందిపోట్ల రాష్ట్ర సమితి అంటూ షర్మిల మండిపడ్డారు. దళితబంధులో అవకతవకలు జరిగాయని ఆమె ధ్వజమెత్తారు. చదవండి: తెలంగాణలో బీజేపీ దూకుడు.. ప్లాన్ ఫలించేనా? -
వైఎస్ షర్మిల హౌజ్ అరెస్ట్.. లోటస్ పాండ్ వద్ద ఉద్రిక్తత!
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను పోలీసులు హౌజ్ అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో లోటస్ పాండ్‌లోని ఆమె నివాసం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. దీంతో, అక్కడ ఉద్రిక్తకర వాతావరణం చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. వైఎస్ షర్మిలను పోలీసులు శుక్రవారం ఉదయం హౌజ్ అరెస్ట్ చేశారు. అయితే, షర్మిల నేడు సిద్దిపేటలోని గజ్వేల్ నియోజకవర్గంలో పర్యటించాల్సి ఉంది. కాగా, జగదేవ్‌పూర్ మండలంలోని తీగుల్ గ్రామంలో షర్మిల పర్యటించాల్సి ఉండగా.. శుక్రవారం ఉదయమే పోలీసులు ఆమె నివాసానికి చేరుకున్నారు. అనంతరం, జవదేవ్‌పూర్ వెళ్లకుండా షర్మిలను హౌజ్ అరెస్ట్ చేశారు. కాగా, దళితబంధు పథకంలో అక్రమాలు జరిగాయని ఇటీవల తీగుల్ గ్రామ ప్రజలు ఆందోళనలు చేపట్టారు. ఈనేపథ్యంలో వారిని కలిసేందుకు షర్మిల ప్లాన్ చేసుకున్నారు. దీంతో, పోలీసులు వైఎస్ షర్మిలను అడ్డుకున్నారు. ఇది కూడా చదవండి: వర్షాలపై అప్రమత్తంగా ఉండండి: హైకోర్టు ఆదేశాలు -
బంజారా హిల్స్ లోటస్ పాండ్ చెరువులో చేపల మృత్యువాత
-
అయ్యయ్యో.. చేపలు! లోటస్‌పాండ్ చెరువులో 3 వేలకుపైగా మృతి
సాక్షి, హైదరాబాద్: బంజారాహిల్స్‌లోని లోటస్‌పాండ్ అంటేనే అందమైన చెరువు, చుట్టూ పచ్చని మొక్కలు, చెరువులో పెద్ద ఎత్తున కనిపించే వివిధ రకాల చేపలు, తాబేళ్లు, పక్షులు కనిపిస్తుంటాయి. ఏమైందో ఏమో.. ఎవరేం చేశారో తెలియదు.. గడిచిన నాలుగు రోజులుగా చెరువులోని చేపలు వేలాదిగా మృతి చెందుతున్నాయి. చేపలు విలవిల్లాడుతూ గాల్లోకి ఎగురుతూ మృతి చెందుతున్న వైనాన్ని చూసి నిత్యం పార్కు వచ్చే వాకర్లు, సందర్శకులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. చెరువులోకి మురుగు నీరు పారడం వల్ల అని కొందరు అంటుంటే, చెరువులో నీళ్లలో ఎవరో విష ప్రయోగం చేశారని ఇంకొందరు ఆరోపిస్తున్నారు. చేపలతో పాటు పెద్ద ఎత్తున ఈ నీళ్లలో వేలాదిగా తాబేళ్లు సైతం ఉన్నాయి. ఇవి కూడా చనిపోతున్నాయి. సంబంధిత అధికారులు మాత్రం నాలుగు రోజుల నుంచి విషయాన్ని గమనిస్తున్నా ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం శోచనీయం. విష ప్రయోగమా? కలుషిత నీరా..? వారం రోజుల క్రితం కురిసిన భారీ వర్షానికి చెరువులోకి పెద్ద ఎత్తున వరద నీరు వచి్చంది. వర్షాలు తగ్గిన తర్వాత కూడా చుట్టు పక్కల ప్రాంతాల్లోని కొంత మంది నివాసితులు తమ సెల్లార్లలో నిండిన వరద నీటిని బయటికి పంపింగ్ చేశారు.ఈ నీరు సైతం చెరువులోకి వచ్చి చేరింది. దీనికి తోడు నిర్మాణంలో ఉన్న కొంత మంది భవన నిర్మాణదారులు బ్లాస్టింగ్‌లో వినియోగించే కెమికల్ వ్యర్థాలను కూడా ఈ చెరువులోకి పంపింగ్ చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ కెమికల్ వ్యర్థాలు అత్యంత ప్రమాదకరంగా ఉంటాయని వాటి వల్లే చేపలు చనిపోయి ఉంటాయని ఇంకొంత మంది భావిస్తున్నారు. శాంపిల్స్ సేకరించిన అధికారులు గడిచిన నాలుగు రోజులుగా చేపలు చనిపోతున్న విషయాన్ని స్థానికులు పొల్యూషన్ కంట్రోల్ బోర్డుతో పాటు ఎని్వరాన్‌మెంట్ అధికారులు, బయోడైవర్సిటీ, జీహెచ్ఎంసీ, జలమండలి అధికారులకు ఫిర్యాదు చే శారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు ఇక్కడ నీటి శాంపిల్స్‌ను తీసుకొని వెళ్లారు. మంగళవారం జలమండలి అధికారుల సైతం పార్కులో పర్యటించి పార్కులోకి మురుగు నీరు రావడం లేదని తెలిపారు. చేపలకు ఆహారం... నిత్యం ఈ పార్కుకు పెద్ద సంఖ్యలో స్థానికులు, సందర్శకులు వస్తుంటారు. వాకింగ్ చేయడంతో పాటు కొంత మంది చేపలకు వివిధ రకాల ఆహార పదార్థాలను వేస్తుంటారు. చేపలకు ఏం ఆహారం వేయాలి, ఎవరు వేయాలి అనే నియంత్రణ ఇక్కడ ఏ మాత్రం లేదు. ఎవరు పడితే వారు వచ్చి వారికి తోచిన ఆహార పదార్థాలను వేసి వెళ్తుంటారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే సందర్శకులు చేపలకు బిస్కెట్లు, బన్ను, బ్రెడ్, రొట్టెలు ఇలా ఇష్టమొచి్చన ఆహార పదార్థాలను వేస్తుంటారు. చదవండి: ఐశ్వర్య మృతదేహాన్ని హైదరాబాద్ తరలించేందుకు సహకరిస్తున్నాం -
పోలీసులతో షర్మిల వాగ్వాదం
-
హైదరాబాద్: లోటస్ పాండ్ వద్ద ఉద్రిక్తత
-
వైఎస్ షర్మిలకు జ్యూడిషియల్ రిమాండ్ విధించిన నాంపల్లి కోర్టు
బంజారాహిల్స్ (హైదరాబాద్): వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలతోపాటు ఆమె డ్రైవర్‌ను బంజారాహిల్స్ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. టీఎస్పీఎస్సీ పరీక్ష పత్రాల లీకేజీ వ్యవహారంలో సిట్ అధికారులకు వినతి పత్రం ఇవ్వడానికి సోమవారం షర్మిల లోటస్‌పాండ్‌లోని తన కార్యాలయం నుంచి బయలుదేరుతుండగా.. పోలీసులు అక్కడకు చేరుకుని పార్టీ కార్యాలయాన్ని ముట్టడించారు. బయటకి వెళ్లేందుకు అనుమతి లేదంటూ షర్మిలను అడ్డుకోవడంతో ఆమెకు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఆ సమయంలో ఆమె కారులో ఉన్న డ్రైవర్‌ను పోలీసులు బలవంతంగా కిందికి దింపేశారు. ఈ పరిణామంతో షర్మిల, పోలీసులమధ్య ఉద్రిక్త వాతావరణ నెలకొంది. పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని జూబ్లీహిల్స్ ఠాణాకు తరలించారు. విధి నిర్వహణలో ఉన్న తనపై షర్మిల చేయి చేసుకున్నారని, నేమ్ ప్లేట్‌ను చించేశారని, తమ కానిస్టేబుల్ గిరిబాబు కాలు పైకి బలవంతంగా కారు ఎక్కించారని ఎస్సై రవీందర్ బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా షర్మిల తదితరులపై కేసు నమోదు చేశారు. ఏ1గా షర్మిల, ఏ2గా ఆమె కారు డ్రైవర్ బాబు, ఏ3గా మరో డ్రైవర్ జాకబ్‌లను చేర్చారు. షర్మిల, బాబులను అరెస్టు చేయగా.. జాకబ్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. సాయంత్రం గాంధీ ఆసుపత్రిలో షర్మిల, బాబులకు వైద్య పరీక్షలు చేయించి నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. కోర్టు మే 8 వరకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించగా, పోలీసులు షర్మిలను చంచల్‌గూడ జైలుకు తరలించారు. పోలీసుల తీరు సరిగాలేదు: షర్మిల ‘సిట్ అధికారులకు వినతి పత్రం ఇచ్చేందుకు వెళ్తుండగా పోలీసులు అడ్డుకోవడమే కాకుండా దౌర్జన్యంగా వ్యవహరించారు. ఒక పార్టీ అధ్యక్షురాలి పట్ల పోలీసుల తీరు సరిగాలేదు. ఈ విధుల్లో మహిళా కానిస్టేబుల్‌ను నియమించలేదు. పోలీసులు ప్రవర్తించిన తీరుకు నిరసనగానే రోడ్డుపై బైఠాయించా’అని షర్మిల మీడియాతో పేర్కొన్నారు. కాగా, జూబ్లీహిల్స్ పోలీసుస్టేషన్లో షర్మిలను పరామర్శించేందుకు భర్త అనిల్, తల్లి వైఎస్ విజయమ్మ వెళ్లగా పోలీసులు అనుమతించలేదు. కాగా, అరెస్ట్‌ను నిరసిçస్తూ వైఎస్సార్టీపీ రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చింది. షర్మిలపై కక్ష సాధింపు చర్యలు వైఎస్ విజయమ్మ ధ్వజం వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిలను పోలీసులు అరెస్ట్ చేయడంపై వైఎస్ విజయమ్మ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం షర్మిలను ఎందుకు అడ్డుకుంటోందని గట్టిగా నిలదీశారు. సోమవారం ఆమె తన నివాసంలో మీడియా తో మాట్లాడుతూ.. షర్మిలపై పోలీసులు వ్యవహరించిన తీరుపై కోర్టుకు వెళ్తామని తెలిపారు. తాను షర్మిలను చూడటానికి పోలీస్‌స్టేషన్‌లోకి వెళ్తోంటే పోలీసులు అనుమతించలేదన్నారు. ‘నా కూతురుని చూసి పోతానన్నా పోలీసులు ఒప్పుకోలేదు. షర్మిలను ఎందుకు అరెస్ట్ చేశారని అడిగితే పోలీసుల దగ్గర సమాధానం లేదు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే ఏకైక వ్యక్తి షర్మిల కాబట్టి ప్రభుత్వం ఇంతటి కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోంది’అని విజయమ్మ చెప్పారు. ప్రశ్నపత్రాల లీకేజీపై సిట్‌కు ఫిర్యాదు చేసేందుకు ఒంటరిగా వెళ్తున్న షర్మిలను ఎందుకు అరెస్టు చేశారన్నారు. ప్రతిపక్షాలు ప్రశ్నించిన అంశాలకు పరిష్కారం చూపకుండా ప్రభుత్వం ఇలా వ్యవహరించడమేంటని మండిపడ్డారు. ప్రజల కోసం పోరాడుతున్న ఆమె వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయాలు సాకారం చేయడానికి ఎంతో కష్టపడుతోందని చెప్పారు. ‘అంతమంది పోలీసులు కనీస గౌరవం లేకుండా ఒక మహిళ పట్ల దురుసుగా ప్రవర్తిస్తుంటే ఆవేశం రాదా? పది మంది మహిళా పోలీసులు నాపై పడు తూ కార్లో ఎక్కించబోతే నాకు కూడా ఆవేశం వచ్చింది. పోలీసులు షర్మిల డ్రైవర్, గన్మెన్లను కొట్టారు. చివరికి మీడియా వాళ్లను కూడా కొట్టారు. మీడియాకు చేతులెత్తి అభ్యర్థిస్తున్నా.. ప్రజల తరఫున నిలబడి నిజాలు చూపించండి. చిన్నచిన్న విషయాలను పెద్దగా చూపించడం కాదు.. ప్రజల కోసం పని చే యాలి’అని చెప్పారు. -
అర్ధరాత్రి వైఎస్ షర్మిల దీక్ష భగ్నం
-
అర్ధరాత్రి వైఎస్ షర్మిల దీక్ష భగ్నం.. ఆసుపత్రికి తరలింపు
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆమరణ దీక్షను శనివారం అర్ధరాత్రి జూబ్లీహిల్స్ పోలీసులు భగ్నం చేశారు. బలవంతంగా అపోలో ఆస్పత్రికి తరలించారు. తన పాదయాత్రకు అనుమతి ఇవ్వాలంటూ ఆమె శుక్రవారం లోటస్‌పాండ్ వద్ద దీక్షకు దిగిన విషయం తెలిసిందే. కాగా షర్మిల దీక్ష శనివారం రెండోరోజు కూడా కొనసాగింది. దీక్ష చేస్తున్న షర్మిలను వైఎస్ విజయమ్మ కలిసి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడారు. ‘ఇది ముఖ్యమంత్రి కేసీఆర్ పతనానికి నాంది. న్యాయస్థానమంటే ఆయనకు గౌరవం లేదు..’ అని విమర్శించారు. తన పాదయాత్రకు హైకోర్టు అనుమతి ఇచ్చినా కేసీఆర్ అడ్డుకుంటున్నారని ఆరోపించారు. తమ పార్టీ కార్యకర్తలను, నాయకులను పోలీసులు అకారణంగా అరెస్ట్ చేయడమే కాకుండా వారిపై కేసులు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘మా పార్టీ కార్యాలయం చుట్టూ బారికేడ్లు పెట్టారు. సామాన్యులను కూడా రానివ్వడం లేదు. వచి్చన వాళ్లందరినీ అదుపులోకి తీసుకుంటున్నారు..’అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘కేసీఆర్ దేశమంతా రాజకీయాలు చేసుకోవచ్చు. ఆయనకు మాత్రం అన్ని పరి్మషన్లు వస్తాయి. కానీ, ప్రజల కోసం కొట్లాడే మా పార్టీపై మాత్రం దాడులా?..’అని మండిపడ్డారు. షర్మిల ప్రాణాలకు ప్రమాదం: వైద్యులు శనివారం సాయంత్రం వైద్యులు ఆమెకు పరీక్షలు నిర్వహించారు. షరి్మల ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తోందని, ఆమె 30 గంటలుగా మంచినీళ్లు సైతం తీసుకోవడం లేదని డాక్టర్ ప్రవీణ్‌కుమార్ తెలిపారు. వైద్య పరీక్షలు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. లాక్టేట్ లెవెల్స్ బాగా పెరిగాయని, యూరియా, బీపీ, గ్లూకోజ్ లెవెల్స్ పడిపోతున్నాయన్నారు. ఈ పరిస్థితుల్లో ఆమె వెంటనే ఆసుపత్రిలో చేరకపోతే ప్రాణాలకు ప్రమాదమని చెప్పారు. ఈ నేపథ్యంలో శనివారం అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో పోలీసులు ఆమెను బలవంతంగా ఆస్పత్రికి తరలించారు. -
YS Sharmila: ‘సర్కార్ దిగొచ్చేదాకా దీక్ష ఆపను’
సాక్షి, హైదరాబాద్: వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష రెండో రోజు కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో నగరంలోని లోటస్‌పాండ్‌లోని నివాసం వద్ద శనివారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వైఎస్ షర్మిల ఆమరణ నిరహార దీక్ష నేపథ్యంలో.. లోటస్ పాండ్‌ను పోలీసుల దిగ్బంధించారు. కర్ఫ్యూ వాతావరణం నెలకొంది అక్కడ. పార్టీ కార్యకర్తలను ఎవరినీ లోపలకు రానివ్వకుండా అడ్డుకుంటున్నారు పోలీసులు. ఇంకోవైపు ఆమె వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం ఆమె మీడియాను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రభుత్వం దిగొచ్చే వరకు తన దీక్ష కొనసాగుతుందని స్పష్టం చేశారు. నా పాదయాత్రకు అనుమతి ఇవ్వండి అంటూ ఆమె పోలీసులకు విజ్ఞప్తి చేశారు. కేసీఆర్ నియంతలా వ్యవహరిస్తున్నారని ఈ సందర్భంగా ఆమె వ్యాఖ్యానించారు. ‘‘బాధితుల మీదే కేసులు పెట్టి వేధిస్తున్నారని, వైఎస్సార్టీపీ కార్యకర్తలను అరెస్ట్ చేయడానికి కారణాలేవీ లేవని, ప్రశ్నించే గొంతుకలను అణచివేస్తున్నార’’ని ఆమె మండిపడ్డారు. మరోవైపు వైఎస్ఆర్టీపీ పార్టీ నేతల, కార్యకర్తల అరెస్టుల పర్వం కొనసాగుతోంది. శుక్రవారం నుంచి బొల్లారం పోలీస్ స్టేషన్లోనే 40 మంది పార్టీ ముఖ్య నేతలు ఉన్నారు. మరోవైపు బంజారాహిల్స్ పీఎస్‌లో ఏడుగురు పార్టీ నేతలు పోలీసుల అదుపులో ఉన్నారు. అర్ధాంతరంగా నిలిచిపోయిన తన పాదయాత్రను తిరిగి ప్రారంభించేందుకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో పాటు అరెస్ట్ అయిన పార్టీ నేతలను విడుదల చేసేంత వరకు దీక్ష ఆపేది లేదంటున్నారు వైఎస్ షర్మిల. ఈ మేరకు శుక్రవారం ఆమె ఆమరణ నిరాహార దీక్షను చేపట్టారు. హైకోర్టు అనుమతి ఇచ్చినా.. పాదయాత్ర చేసుకోనివ్వకుండా న్యాయస్థానం తీర్పునే సీఎం కేసీఆర్ అగౌరవ పరస్తున్నారన్నారని షర్మిల దీక్ష చేపట్టిన సందర్భంగా మండిపడ్డారు. -
రేపటి నుంచి షర్మిల ప్రజాప్రస్థానం
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తెలంగాణలో సుదీర్ఘ పాదయాత్రకు రేపు శ్రీకారం చుడుతున్నారు. సోమవారం లోటస్‌పాండ్‌లోని పార్టీ కార్యాలయంలో పార్టీ అధికార ప్రతినిధి తూడి దేవేందర్‌రెడ్డి పాదయాత్ర వివరాలను మీడియాకు వెల్లడించారు. షర్మిల పాదయాత్ర దాదాపు 400 రోజులు.. 90 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 4 వేల కిలోమీటర్ల మేర సాగుతుందన్నారు. 14 పార్లమెంట్ నియోజక వర్గాల పరిధిలో కొనసాగుతుందని చెప్పారు. ఉదయం 8.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు, మధ్యాహ్నం 3.00 నుంచి సాయంత్రం 6.00 గంటల వరకు పాదయాత్ర సాగుతుందన్నారు. 9 ప్రాంతాల్లో బహిరంగ సభలకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. రోజూ సాయంత్రం పలు సమస్యల పరిష్కారంపై షర్మిల స్థానిక నాయకులు, ప్రజలతో భేటీ అవుతారని చెప్పారు. రచ్చబండ తరహాలో ప్రజలతో మాటముచ్చట కార్యక్రమం సాగుతుందని తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో మూడు మండలాలను కలుపుకొనిపోయేలా రూట్ మ్యాప్‌ను రూపొందిస్తున్నట్లు తెలిపారు. ప్రజల సమస్యలను తెలుసుకోవడమే లక్ష్యంగా షర్మిల పా దయాత్ర సాగుతుందన్నారు. ప్రతి మంగళవారం పాదయాత్ర ఎక్కడ జరుగుతుంటే అక్కడే నిరుద్యోగ నిరాహార దీక్ష జరుగుతుందని వెల్లడించారు. నేడు తల్లి విజయమ్మతో ఇడుపులపాయకు.. తన తల్లి విజయమ్మతో కలసి షర్మిల మంగళవారం ఉదయం ఇడుపులపాయ వెళ్తారు. అక్కడ వైఎస్సార్ సమాధి వద్ద నివాళులు అర్పిస్తారు. సాయంత్రం తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు. కాగా, ఇడుపులపాయకు వెళ్తున్న నేపథ్యంలో నేడు జరగాల్సిన నిరుద్యోగ నిరాహార దీక్షను వాయిదా వేసినట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. షర్మిలను ఆదరించండి.. రాజన్న అమలు చేసిన సంక్షేమం, అభివృద్ధి కోసం.. మీ కోసం మీ రాజన్న బిడ్డ షర్మిల చేపడుతున్న ప్రజాప్రస్థానం పాదయాత్రను ఆదరించాలని వైఎస్ విజయమ్మ ప్రజలకు పిలుపునిచ్చారు. షర్మిల పాదయాత్ర చేపడుతున్న నేపథ్యంలో ఆమె సోమవారం ఓ సందేశాన్ని విడుదల చేశారు. చేవెళ్ల నుంచి ప్రారంభించనున్న షర్మిల పాదయాత్రను జయప్రదం చేయాలని కోరారు. షర్మిల అడుగులో అడుగు వేసి ఓ ప్రభంజనాన్ని సృష్టించాలన్నారు. -
దీక్ష విరమించిన వైఎస్ షర్మిల
సాక్షి, హైదరాబాద్: ఉద్యోగాల భర్తీ కోసం చేపట్టిన 72 గంటల దీక్షను వైఎస్ షర్మిల ఆదివారం విరమించారు. హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌లో ఉన్న తన కార్యాలయంలో షర్మిల కొనసాగిస్తున్న ఉద్యో గ దీక్షను నిరుద్యోగ అమరుల కుటుంబ సభ్యులు ఆమెకు నిమ్మరసం ఇచ్చి విరమింపజేశారు. ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వట్లేదనే మనస్తాపంతో ఆత్మహత్యలకు పాల్పడిన గుగులోత్ రవిందర్ నాయక్, కొప్పు రాజు, మురళి ముది రాజు కుటుంబ సభ్యులను షర్మిల ఈ సంద ర్భంగా ఓదార్చారు. రవిందర్ నాయక్ భార్య, కొప్పు రాజు తల్లి, మురళి ముదిరాజు తల్లికి రూ. 50 వేల చొప్పున తన వంతుగా ఆర్థిక సాయం అందించారు. నిరుద్యోగ అమరుల కుటుంబ సభ్యులను ఓదారుస్తున్న వైఎస్ షర్మిల అనంతరం దీక్షా శిబిరం నుంచి ప్రసంగించిన షర్మిల కేసీఆర్ సర్కార్‌పై తీవ్రస్థాయిలో విరు చుకుపడ్డారు. ప్రైవేటు ఉద్యోగాలు కూడా రావట్లేద ని ఎందరో నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నార న్నారు. అయినా ప్రభుత్వం పైసా సహాయం చేయలేదని మండిపడ్డారు. పాలకులకున్నది గుండెనా.. బండరాయా? అని నిలదీశారు. నిరుద్యోగులవి ప్రభుత్వ హత్యలు కావా? అని ప్రశ్నించారు. 40 లక్షల మంది నిరుద్యోగులు ప్రతిరోజూ మానసికంగా చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల్ని తొలగించారని విమర్శించారు. 3.85 లక్షల ఉద్యోగాలను ఎందుకు భర్తీ చేయట్లేదని ప్రశ్నించారు. ‘‘మాట మీద నిలబడే వైఎస్సార్ బిడ్డగా చెబుతున్నా. కేసీఆర్ మెడలు వంచైనా ఉద్యోగాలు భర్తీ చేయిస్తా. నోటిఫికేషన్లు వచ్చే వరకు ప్రతి జిల్లాలో రిలే నిరాహారదీక్షలు కొనసాగుతాయి. రెండేళ్లలో మన ప్రభుత్వం వస్తుంది. ఏ నిరుద్యోగీ ఆత్మహత్య చేసుకోవద్దు.’’అని షర్మిల స్పష్టం చేశారు. చదవండి: ఉద్యోగ నోటిఫికేషన్లు వెంటనే ప్రకటించాలి: వైఎస్ షర్మిల కేసీఆర్ వారిపట్ల ఎందుకు సవతి తల్లి ప్రేమ: షర్మిల -
రెండో రోజు కొనసాగుతున్న వైఎస్ షర్మిల దీక్ష
-
రెండో రోజు కొనసాగుతున్న వైఎస్ షర్మిల దీక్ష
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఉద్యోగ నోటిఫికేషన్లు వెంటనే ప్రకటించాలని కోరుతూ వైఎస్ షర్మిల చేపట్టిన దీక్ష రెండో రోజుకు చేరుకుంది. శుక్రవారం ఉదయం వైఎస్ షర్మిలకు డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహించారు. కాగా, ఇందిరాపార్క్ వద్ద గురువారం ఆమె దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే, అక్కడ దీక్ష కొనసాగించడానికి అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకోవడంతో లోటస్‌పాండ్ వద్ద దీక్ష కొనసాగించేందుకు వైఎస్ షర్మిల ధర్నా చౌక్ నుంచి పాదయాత్ర చేపట్టారు. ఈ క్రమంలో బీఆర్కే భవన్ వద్ద పోలీసులు ఆమెను మరోసారి అడ్డుకున్నారు. ప్రత్యేక వాహనంలో ఆమెను తరలించే ప్రయత్నం చేయడంతో కార్యకర్తలు తీవ్రంగా ప్రతిఘటించారు. ఈ సందర్భంగా తోపులాట జరగడం, పోలీసులు కొంత దురుసుగా వ్యవహరించడంతో ఒక దశలో వైఎస్ షర్మిల స్పృహతప్పి పడిపోయారు. దుస్తులు స్వల్పంగా చిరిగిపోవడంతో పాటు ఎడమ చేతికి గాయమైంది. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పాదయాత్ర చేస్తూ లోటస్‌పాండ్‌కు చేరుకున్న వైఎస్ షర్మిల దీక్షను కొనసాగిస్తున్నారు. పచ్చి మంచినీళ్లు కూడా ముట్టనని ప్రతినబూనారు. నిరుద్యోగులకు న్యాయం జరిగేంత వరకు పోరాటాన్ని కొనసాగిస్తానని స్పష్టం చేశారు. చదవండి: ఉద్యోగ నోటిఫికేషన్లు వెంటనే ప్రకటించాలి: వైఎస్ షర్మిల తెలంగాణలో పదో తరగతి పరీక్షలు రద్దు -
కేసీఆర్ వారిపట్ల ఎందుకు సవతి తల్లి ప్రేమ: షర్మిల
సాక్షి, హైదరాబాద్: దళిత ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పి కేసీఆర్ దళితులను దగా చేశారని వైఎస్ షర్మిల విమర్శించారు. ముఖ్యమంత్రి పదవి కావాలని ఏ దళితుడు అడగలేదని, కేసీఆరే మాట ఇచ్చి, దగా చేశారని మండిపడ్డారు. ఇప్పటి పాలకులకు దళితుల సంక్షేమం పట్ల చిత్తశుద్ధి లేదనడానికి ఇదే నిదర్శనమని దుయ్యబట్టారు. హైదరాబాద్ లోటస్‌పాండ్‌లోని బుధవారం ఆమె తన కార్యాలయంలో బీఆర్ అంబేడ్కర్ 130వ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. ఇంకా వారిపట్ల సవతి తల్లి ప్రేమ చూపిస్తూ మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఎస్సీ, ఎస్టీలను ఓటు బ్యాంకుగా చూస్తున్నారని మండిపడ్డారు. మూడెకరాల భూమి, రిజర్వేషన్ల పెంపు, డబుల్ బెడ్రూం ఇళ్లు, పెన్షన్లు ఇలా ఎన్నో హామిలిచ్చి నెరవేర్చకుండా దళితులను కేసీఆర్ మోసం చేశారన్నారు. రాజయ్య మీద ఒక్క ఆరోపణ రాగానే పదవి నుంచి తప్పించిన కేసీఆర్.. మల్లారెడ్డిపై ఎన్ని ఆరోపణలు వచ్చినా పట్టించుకోవట్లేదని దుయ్యబట్టారు. దళితులపై కేసీఆర్ ప్రేమకు ఇదే నిదర్శనమన్నారు. నాగార్జునసాగర్ ఎన్నికలకు అడ్డురాని కోవిడ్ నిబంధనలు అంబేద్కర్ జయంతి వేడుకలకు మాత్రం అడ్డొస్తాయా అని వైఎస్ షర్మిల ప్రశ్నించారు. ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టుకు అంబేడ్కర్ పేరు పెట్టడం కేసీఆర్‌కు ఇష్టం లేదని ఆరోపించారు. ఆ ప్రాజెక్ట్‌ను రీడిజైన్ పేరిట అంచనాలు పెంచి అవినీతికి పాల్పడ్డారని విమర్శించారు. ట్యాంక్‌బండ్‌లో 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం పెడతానని ఇప్పటికీ దాని ఊసే లేదని ఎద్దేవా చేశారు. సమానత్వం కోసం అంబేడ్కర్ పోరాడితే.. సమాన అభివృద్ధి, సంక్షేమం అందించేందుకు కృషి చేసింది వైఎస్ రాజశేఖరరెడ్డి అని పేర్కొన్నారు. అణగారిన వర్గాలు ఆత్మగౌరవంగా జీవించాలనే ఉద్దేశంతో 46 లక్షల పక్కా ఇళ్లు కట్టించారని గుర్తు చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల పేదలకు 6 లక్షల ఎకరాలు భూ పంపిణీ చేసిన నేత వైఎస్ అని కొనియాడారు. రాజ్యాంగ రూపశిల్పి అంబేడ్కర్ ఆశయ సాధన దిశగా రాజన్న సంక్షేమ పాలనను తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో దళిత నేత, ప్రజా గాయకుడు ఏపూరి సోమన్న, బి.సంజీవరావు, డేవిడ్ శాంతరాజ్, జార్జ్ హెర్బర్ట్, పాకాల డానియేల్, దయానంద్, బి.మరియమ్మ, పోలీసు రాంచందర్, బి.భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. -
దొరల పాలనతో ప్రజలు కష్టాల పాలు
సాక్షి, హైదరాబాద్: పోరాడి సాధించుకున్న తెలంగాణలో దొరల పాలనతో ప్రజలు కష్టాలపాలవుతున్నారని కరీంనగర్ జిల్లా కన్నారంకు చెందిన మిడిదోడ్డి మహేందర్ పేర్కొన్నారు. ఆదివారం ఆయన లోటప్‌పాండ్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ఈ పరిస్థితుల్లో నేనున్నా అంటూ తెలంగాణ ప్రజలకు అండగా నిలిచేందుకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి తనయురాలు వైఎస్ షర్మిల ముందుకు రావడం శుభపరిణామమన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను ఆమె దృష్టికి తీసుకువెళ్లినట్లు ఆయన తెలిపారు. ప్రజల గోసను వివరిస్తూ.. దొరల పాలనను అంతం చేసే విధి విధానాలతో పుస్తకం రాస్తున్న విషయాన్ని ఆమెకు వివరించానన్నారు. రాబోయే ఎన్నికల్లో షర్మిల పార్టీ మంచి విజయం సాధించేందుకు ఈ పుస్తకం దిక్సూచిగా నిలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. గతంలో వైఎస్సార్ పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించే విధంగా సంక్షేమ పాలను అందించారని, వైఎస్సార్ స్ఫూర్తితో వైఎస్ షర్మిల మళ్లీ రాజన్న సంక్షేమ పాలన తీసుకువచ్చేందుకు కృషిచేస్తుందని అన్నారు. ఆమెతో కలిసి పని చేయడానికి తనలాంటి ఎంతో యువకులు నడుం బిగిస్తున్నారని మహేందర్ తెలిపారు. -
లోటస్‌పాండ్@లక్ష్మీస్ ఎన్టీఆర్
ఏపీలో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా రిలీజ్‌ని ఆపగలిగారు కానీ.. ముక్కలు ముక్కలుగా సినిమా మొత్తం రిలీజ్ అవడాన్ని ఎవరూ ఆపలేకపోయారు. ‘‘లక్ష్మీస్ ఎన్టీఆర్’కి కౌంటర్‌గా మనకు పనికొచ్చే డైలాగులున్న సినిమా ఏదైనా ఉంటే బయటకు తీయండి’’ అన్నాడు చంద్రబాబు. ‘‘ఆల్రెడీ తీయించి పెట్టాను నాయుడు గారూ..’’ అన్నాడు రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు. ఆయన ముందుచూపు ప్రణాళికకు మెచ్చుకోలుగా చూశాడు చంద్రబాబు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు, అశోక్ గజపతిరాజు, యనమల రామకృష్ణుడు, లోకేశ్ కూడా అక్కడే ఉన్నారు. లోకేశ్ తప్ప మిగతా అందరూ చెమటతో తడిసి ముద్దయి ఉన్నారు! లోకేశ్ ఫ్రెష్‌గా ఉన్నాడు. ‘‘టన్నుల కొద్దీ ఏసీ ఉన్నా మనకిలా డ్రమ్ముల కొద్దీ చెమటలు పడుతున్నాయేమిటి’’ అన్నాడు గజపతిరాజు. ‘‘పట్టడం కాదు. కారుతున్నాయి’’ అన్నాడు కుటుంబరావు. ‘‘ఏసీ పాడైనట్లుంది. ఆ ఫ్యాన్ వెయ్యండి’’ అన్నాడు యనమల. ‘‘స్టాప్.. స్టాప్ ద షిట్ టాకింగ్’’ అని అరిచాడు చంద్రబాబు. కళా వెంకట్రావు బెదురుగా చూశాడు. చంద్రబాబు కోపం చూసి కాదు ఆ బెదురు. చంద్రబాబు అన్న మాటల్లో స్టాప్, షిట్, టాకింగ్.. ఈ మూడూ విడివిడిగా అర్థమయ్యాయి కానీ, మూడు కలిపితే మాత్రం మీనింగ్ అర్థం కావడం లేదు. ‘‘నేను చెప్పానా.. నాన్గారికి ఫ్యాన్ పడదని’’ అన్నాడు లోకేశ్.. పేపర్లోంచి తల పైకెత్తకుండానే. ఆవేళ్టి పేపర్ హెడ్డింగుల్ని కూడదీసుకుని చదువుతూ, మాటల్ని ప్రాక్టీస్ చేస్తున్నాడు లోకేశ్. ‘‘సినిమా చూపిస్తానన్నారు. చూపించండి..’’ అన్నాడు చంద్రబాబు చెమటలు తుడుచుకుంటూ. కుటుంబరావు ప్లే బటన్ నొక్కాడు. స్క్రీన్‌పై సినిమా మొదలైంది. కానీ ఎవరూ స్క్రీన్ వైపు చూడడం లేదు! సినిమా దారి సినిమాది. వీళ్ల దారి వీళ్లది. లోకేశ్ దారి లోకేశ్‌ది. ‘‘లోటస్ పాండ్‌లో ఏదో జరుగుతోంది. ఏం జరుగుతోందో తెలియడం లేదు’’ అన్నాడు చంద్రబాబు టెన్షన్‌గా. ‘‘తెలిసింది’’ అని చిటికేశాడు కళా వెంక్రటావు. ‘‘ఏం తెలిసింది?’’ అన్నాడు యనమల. ఏసీ ఉన్నా మనకు చెమటలు ఇంతగా ఎందుకు పడుతున్నాయో తెలిసింది. ప్రచారానికి బ్రేక్ ఇచ్చి లోటస్ పాండ్‌లో జగన్ ఏం చేస్తున్నాడోనన్న విషయంపై మనం ఎక్కువ ఆలోచిస్తున్నాం’’ అన్నాడు వెంకట్రావు. ‘‘అంతేనంటావా..’’ అన్నాడు చంద్రబాబు కాస్త ఊరట చెందుతూ. ‘‘అంతకాకుండా ఏముంటుంది నాయుడుగారూ... ‘ఈ’పేపర్ రాసిందనీ, ‘ఆ’పేపర్ రాసిందనీ మరీ చెమటలు పట్టి తడిసిపోయేంతగా మనం లోటస్ పాండ్ గురించి భయపడక్కర్లేదు. జగన్ ఇంటికి జగన్ వెళ్తున్నాడు. ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్నాడు. ఇంటికి వెళ్లకపోతుంటే డౌట్ పడాలి కానీ, ఇంటికి వెళ్లొస్తుంటే డౌటెందుకు?’’ అన్నాడు వెంకట్రావ్. ‘‘హీ.. హీ.. హీ..’’ అని నవ్వాడు లోకేశ్. అంతా అతడి వైపు చూశారు. అతడు ఎవరి వైపూ చూడడం లేదు. పేపర్లో హెడ్డింగ్‌లు చదువుతూ నవ్వుకుంటున్నాడు. ‘‘అన్నీ నాన్గారి హెడ్డింగులే. అన్నీ నాన్గారి ఫొటోలే. నాన్గారు చెయ్యూపిన ఫొటో, నాన్గారు చెయ్యూపించిన ఫొటో. ఈరోజైతే నాన్గారి పేద్ద బయోగ్రఫీ కూడా ఇచ్చారు’’ అంటూ ఒక్కో హెడ్డింగూ చదువుతున్నాడు. సడన్‌గా స్క్రీన్ మీద సినిమా సౌండ్ పెరిగింది. ‘‘నువ్వేం చేస్తున్నా.. పేపర్ చదువుతున్నావా?’’.. అంటున్నాడు కోట శ్రీనివాసరావు. ‘‘మీకెలా తెలుసు సార్?!!’’ ‘‘ఇందులో తెలియడానికేముందీ.. పైన చదువుతున్నావ్, కింద కోసుకెళ్లిపోయాడు’’.. అన్నాడు కోట. ‘‘సినిమా సౌండ్ ఎందుకు పెరిగిందీ? అన్నాడు చంద్రబాబు విసుగ్గా. ‘‘నేనే పెంచా నాయుడు గారూ.. ఈ సీన్ భలే ఉంటుంది’’ అని చెమటలు తుడుచుకుంటూ పడీపడీ నవ్వుతున్నాడు కుటుంబరావు. - మాదవ్ -
ప్రత్యేక హోదా కోసం సంతకం పెట్టిన తర్వాతనే మద్దతిస్తాం
-
‘మాట తప్పితే చరిత్ర హీనులుగా మిగిలిపోతాం’
సాక్షి, హైదరాబాద్ : కేంద్రంలో ఏ పార్టీకి పూర్తి మెజార్టీ రాదని, హంగ్ ఏర్పడే అవకాశాలున్నట్లు పలు సర్వేలు చెబుతున్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఏ పార్టీతో పొత్తు పెట్టుకోమని... ప్రత్యేక హోదా ఫైల్‌పై సంతకం పెట్టిన పార్టీకి మాత్రమే మద్దతిస్తామని స్పష్టం చేశారు. లోటస్‌పాండ్‌లో ఆయన గురువారం తటస్థులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తమ పార్టీ విధివిధానాల గురించి వారికి వివరించారు. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా హంగ్ వస్తేనే మంచిదని వైఎస్ జగన్ అభిప్రాయపడ్డారు. 25 ఎంపీ స్థానాలను ప్రజలు వైఎస్సార్ సీపీకే కట్టబెడతారని.. తద్వారా కేంద్రం మెడలు వంచి హోదా సాధిస్తామని పేర్కొన్నారు. విశాఖకు రైల్వేజోన్ రావాలి.. రైల్వేజోన్ అంశంపై తనకు పూర్తి అవగాహన ఉందని వైఎస్ జగన్ అన్నారు. దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాలకు రైల్వేజోన్ ఉందని.. చట్టప్రకారం విశాఖకు రైల్వే జోన్ రావాలన్నారు. రైల్వే జోన్ కోసం వైఎస్సార్ సీపీ పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా, రైల్వేజోన్, కడప స్టీల్ ప్లాంట్ కోసం అలుపెరుగని కృషి చేస్తామని పేర్కొన్నారు. మగ్గం ఉన్న ప్రతీ ఇంటికీ రూ. 2 వేలు తమ పార్టీ ప్రకటించిన పథకాలను ఎంతగా కాపీ కొట్టినా ప్రజలు చంద్రబాబును నమ్మే పరిస్థితి లేదని వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు. మగ్గం ఉన్న ప్రతీ ఇంటికీ రూ. 2 వేలు ఇస్తామని, పవర్లూమ్ ఉన్న వారికి కరెంటు చార్జీలు తగ్గిస్తామని తెలిపారు. ప్రతీ పార్లమెంటు నియోజకవర్గాన్ని జిల్లా చేస్తామన్న మాటకు కట్టుబడి ఉన్నామని ఈ సందర్భంగా వైఎస్ జగన్ పేర్కొన్నారు. ప్రతీ కులానికి ఓ కార్పోరేషన్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. వైఎస్సార్ హయాంలో చేపట్టిన అన్ని ప్రాజెక్టులకు సంబంధించిన నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేస్తామని తెలిపారు. ఆర్థిక భరోసా కల్పిస్తాం.. వైఎస్సార్ చేయూత ద్వారా 45 ఏళ్లు దాటిన మహిళలకు ఆర్థిక భరోసా కల్పిస్తామని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. నాలుగేళ్లలో రూ. 75 వేలు ఉచితంగా ఇస్తామని పేర్కొన్నారు. గ్రామ సెక్రటేరియట్ ద్వారా పరిపాలనలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తామని తెలిపారు. ప్రతీ గ్రామంలో 10 మంది ఉద్యోగాలు కల్పిస్తామని తెలిపారు. ప్రభుత్వ పథకాలను డోర్ డెలివరీ చేసేందుకు ప్రతీ 50 కుటుంబాలకు రూ. 5 వేల జీతంతో ఒకరిని నియమిస్తామన్నారు. దరఖాస్తు చేసుకున్న 72 గంటల్లోగా ప్రభుత్వ పథకాలను మంజూరు చేస్తామని తెలిపారు. తొలి అసెంబ్లీ సమావేశంలోనే చట్టం తెస్తాం ప్రభుత్వ కాంట్రాక్టులన్నీ సీఎం చంద్రబాబు తన బినామీలకే కట్టబెడుతున్నారని వైఎస్ జగన్ అన్నారు. దేవాలయాల్లోని కాంట్రాక్టులు కూడా తన బంధువులకే అప్పగిస్తున్నారని ఆరోపించారు. కియా ఫ్యాక్టరీ ఘనత చంద్రబాబు తీసుకున్నా సరే గానీ.. అందులో 5 శాతం ఉద్యోగాలు కూడా స్థానికులకు ఇవ్వకపోవడం బాధాకరమన్నారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఏర్పాటైన, ఏర్పాటుకానున్న పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలని తొలి అసెంబ్లీ సమావేశంలోనే చట్టం తెస్తామని పేర్కొన్నారు. అదేవిధంగా కేలండర్ ప్రకారం ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని తెలిపారు. ప్రతీ మే నెలలో రూ. 12,500 వైఎస్సార్ రైతు భరోసా ద్వారా 85 లక్షల మందికి పైగా రైతులకు ప్రతీ మే నెలలో రూ. 12,500 ఇస్తామని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. వైఎస్సార్ తన పదవీకాలంలో పథకాల తీరుపై స్వయంగా అధికారులకు ఫోన్ చేసేవారని.. సీఎం సీటులో ఉన్న వ్యక్తి ధ్యాసను బట్టి పథకాల అమలు ఆధారపడి ఉంటుందన్న విషయాన్ని గమనించాలన్నారు. ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న వాళ్లనే ఈ లోకం గుర్తుపెట్టుకుంటుందని.. అలా చేయని పక్షంలో చరిత్ర హీనులుగా మిగిలిపోతామని వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు. -
రాజన్న రాజ్యం రావాలి : గణనాథుడికి ప్రత్యేక పూజలు
సాక్షి, హైదరాబాద్ : లోటస్ పాండ్‌లో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరిగాయి. పార్టీ నేతలు విజయ సాయి రెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, బత్తుల బ్రహ్మానంద రెడ్డి హాజరై వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వచ్చే వినాయక చవితి నాటికి ఏపీలో ప్రజలు పడుతున్న కష్టాలన్నీ తొలగిపోవాలని, రాజన్న పాలన రావాలని, ప్రజలందరికీ మంచి జరగాలని కోరుకున్నట్టు పార్టీ రాజ్యసభ ఎంపీ విజయ సాయి రెడ్డి తెలిపారు. గణేష్ ఉత్సవాలు ప్రజలందరిలో ఐక్యమత్యం పెంచుతాయని అన్నారు మండలి విపక్ష నేత ఉమ్మారెడ్డి. ‘వైఎస్సార్సీపీ విజయానికి ప్రధమ మెట్టుగా భావిస్తూ.. 2019 జరుగబోయే సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి, పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డికి రాజ్యాధికారి సిద్ధిస్తుంది. ముఖ్యమంత్రి అవుతారనే విశ్వాసంతో ఈ రోజు వినాయక చవితిని పండుగగా జరుపుకున్నాం. రాష్ట్ర ప్రజలందరూ సుఖ శాంతులతో కలకాలం వర్థిల్లాలి. రాష్ట్రం మంచిగా అభివృద్ధి చెందాలనే భావనతో ఈ పండుగను చేసుకోవడం జరిగింది’ అని విజయ సాయి రెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రజానీకం అంతా కోరుకునేది కూడా ఈ నాడు ఉన్న ప్రభుత్వం పోయి, రాజన్న రాజ్యం రావాలని, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని అందరూ ఏకాభిప్రాయంతో ఉన్నారని ఉమ్మారెడ్డి వెంకటేశ్వార్లు చెప్పారు. ఎటువంటి ఆటంకాలు లేకుండా తప్పకుడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని, రాష్ట్రాప్రజానీకం సుభిక్షంగా ఉండాలని వినాయకుడిని ప్రార్థించినట్టు తెలిపారు. రాజశేఖర్ రెడ్డి మొదలు పెట్టిన పోలవరం ప్రాజెక్ట్ దగ్గర్నుంచి, 87 జలయజ్ఞాలు ప్రాజెక్టులు కూడా రాబోయే సంవత్సరంలో అధికారంలోకి రాగానే తప్పకుండా పూర్తిచేయాలి. రైతాంగం సుభిక్షంగా ఉండాలని, అన్ని వర్గాల వారు ఎటువంటి ఆటంకాలు లేకుండా సుభిక్షంగా ఉండాలని నేడు పార్టీ ఆఫీసులో పూజ చేశామని ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు చెప్పారు. -
వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో న్యూ ఇయర్ వేడుకలు
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్సీపీ కేంద్ర కార్యా లయంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. ఆదివారం హైదరాబాద్‌లోని లోటస్ పాండ్‌లో ఉన్న కేంద్ర కార్యాలయానికి ముఖ్య నాయకులు చేరుకొని వేడుకలను నిర్వహించారు. నూతన సంవత్సర కేక్‌ను రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి కట్ చేసి అందరికీ పంచారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్ర ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు, నాయకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పారు. ఈ కార్యక్రమంలో పార్టీ ఏపీ ప్రధాన కార్యదర్శి దుర్గాప్రసాద్‌రాజు, కార్య దర్శులు పుత్తా ప్రతాప్‌రెడ్డి, చల్లా మధుసూదన్ రెడ్డి, నాయకులు బుర్రా సురేష్‌గౌడ్, బి.మోహన్ కుమార్, రమాభాస్కర్ పాల్గొన్నారు. -
కొత్త జిల్లాలతో పార్టీ బలపడుతోంది
వైఎస్సార్సీపీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన జిల్లాలతో పార్టీ బలపడుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. రాబోయే రోజుల్లో పార్టీకి మంచి భవిష్యత్ ఉందని పేర్కొన్నారు. శనివారం హైదరాబాద్ లోటస్ పాండ్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో శ్రీకాంత్‌రెడ్డి, పార్టీ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు బి.అనిల్‌కుమార్ సమక్షంలో కాంగ్రెస్ ఆదిలాబాద్ జిల్లా కార్యదర్శి లోకా లక్ష్మారెడ్డి తదితరులు పార్టీలో చేరారు. వారికి శ్రీకాంత్‌రెడ్డి పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. వైఎస్సార్ కాంగ్రెస్ తెలంగాణ లీగల్ సెల్ అధ్యక్షుడి నియామకం వైఎస్సార్ కాంగ్రెస్ తెలంగాణ లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడిగా మందాడి సరోజ్‌రెడ్డి నియమితులయ్యారు. అలాగే పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా మునిగాల కల్యాణ్రాజ్ను నియమించారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు గట్టు శ్రీకాంత్‌రెడ్డి ఆయా నియామకాలు చేసినట్లు వైఎస్సార్ కాంగ్రెస్ తెలంగాణ శనివారం ఒక ప్రకటనలో తెలిపింది. -
రేపు వైఎస్సార్సీపీ 3 జిల్లాల విస్తృత భేటీ
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్సీపీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి అధ్యక్షతన ఆదివారం ఉదయం 11 గంటలకు హైదరాబాద్ లోటస్‌పాండ్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో రంగారెడ్డి, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల విస్తృత సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి ఆయా జిల్లాల నాయకులు, కార్యకర్తలు హాజరవుతారని పార్టీ ప్రధాన కార్యదర్శి కె.శివకుమార్ ప్రకటనలో తెలిపారు. -
నేడు వైఎస్సార్సీపీ తెలంగాణ నేతల భేటీ
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ముఖ్య నాయకుల సమావేశం గురువారం ఉదయం హైదరాబాద్ లోటస్‌పాండ్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరగనుంది. రాష్ట్ర పార్టీ ముఖ్య నాయకులు, ప్రధాన కార్యదర్శులు, అధికార ప్రతినిధులు, జిల్లా పార్టీ అధ్యక్షులు, ముఖ్య నేతలు, అనుబంధ సంఘాల నాయకులు సమావేశంలో పాల్గొంటారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి రాజకీయ కార్యదర్శి, తెలంగాణ ఇన్చార్జి సజ్జల రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో జరిగే ఈ భేటీలో.. పార్టీపరంగా చేపట్టాల్సిన కార్యాచరణను రూపొందిస్తారు. రాష్ర్టంలో పార్టీ పటిష్టత, తీవ్ర దుర్భిక్ష పరిస్థితుల నేపథ్యంలో పార్టీపరంగా చేపట్టాల్సిన కార్యాచరణ, పాలేరు అసెంబ్లీ ఉప ఎన్నిక తదితర అంశాలపై చర్చిస్తామని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి తెలిపారు. -
ఈ ఏడాది వైఎస్ఆర్ సీపీకి బ్రహ్మాండం
హైదరాబాద్ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో దుర్ముఖి నామ సంవత్సర ఉగాది వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. ఉగాది వేడుకల్లో వైఎస్ఆర్ సీపీ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మారేపల్లి రామచంద్రశాస్త్రి పంచాంగ శ్రవణం చేశారు. 'ఆంధ్రప్రదేశ్ లో పాలకులు స్వార్థాన్ని వీడితేనే అభివృద్ధి. పాలకులకు గ్రహాలు అనుకూలించడం లేదు. అకాల వర్షాల వల్ల నష్టాలు, పరిపాలన ఇబ్బందులు తలెత్తుతాయి. వైఎస్ఆర్ సీపీకి ఈ ఏడాది బ్రహ్మాండంగా కలిసి వస్తుంది. పార్టీ ఫిరాయించినవారికి రాజకీయంగా భవిష్యత్ లేదు. అక్రమ కేసులు, కుట్రలు కుతంత్రాలు నుంచి వైఎస్ జగన్ కడిగిన ముత్యంలా బయపపడతారు. వైఎస్ఆర్ సీపీ మరింతగా ప్రజల మన్నన చూరగొంటుంది. రాబోయే రోజుల్లో యువ నాయకత్వానిదే భవిష్యత్' అని మారేపల్లి పంచాంగం చెప్పారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ ఈ ఉగాది ప్రతిఒక్కరి జీవితాల్లో ఆనందం నింపాలన్నారు. అంతకు ముందు ఆయన 'శ్రీ దుర్ముఖి నామ సంవత్సరం ప్రతీ తెలుగు ఇంటికి శాంతి సౌభాగ్యం ఆనందం ఆరోగ్యం తీసుకురావాలని కోరుకుంటున్నాను' అని ట్విట్ చేశారు. అలాగే రెండు రాష్ట్రాల ప్రజలు, తెలుగువారికి శుభం కలగాలని వైఎస్ విజయమ్మ ఆకాంక్షించారు. ఉగాది వేడుకల్లో పార్టీ నేతలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, విజయ సాయిరెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.