తెలంగాణ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఈ నెల 4న హైదరాబాద్ లోటస్‌పాండ్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరుగనుందని పార్టీ ప్రధాన కార్యదర్శి కె.శివకుమార్ తెలిపారు.
హైదరాబాద్ : తెలంగాణ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఈ నెల 4న హైదరాబాద్ లోటస్‌పాండ్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరుగనుందని పార్టీ ప్రధాన కార్యదర్శి కె.శివకుమార్ తెలిపారు. ఆ మేరకు ఆయన శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ సమావేశంలో రాష్ట్రంలో పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేయటంపై దృష్టి సారించనున్నారని పేర్కొన్నారు.
రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితులు, మంచినీటి సమస్య, ప్రాజెక్టుల రీడిజైన్ అంశం, రైతుల సమస్యలు, ప్రభుత్వ విధానాలు, ప్రస్తుత రాజకీయ పరిణామాలపై చర్చించనున్నట్లు చెప్పారు. సమావేశానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, సంయుక్త కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులు, జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర అనుబంధ విభాగ అధ్యక్షులు, రాష్ట్ర అధికార ప్రతినిధులు హాజరు కావాలని శివకుమార్ కోరారు.