సాక్షి, హైదరాబాద్: పోరాడి సాధించుకున్న తెలంగాణలో దొరల పాలనతో ప్రజలు కష్టాలపాలవుతున్నారని కరీంనగర్ జిల్లా కన్నారంకు చెందిన మిడిదోడ్డి మహేందర్ పేర్కొన్నారు. ఆదివారం ఆయన లోటప్‌పాండ్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ఈ పరిస్థితుల్లో నేనున్నా అంటూ తెలంగాణ ప్రజలకు అండగా నిలిచేందుకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి తనయురాలు వైఎస్ షర్మిల ముందుకు రావడం శుభపరిణామమన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను ఆమె దృష్టికి తీసుకువెళ్లినట్లు ఆయన తెలిపారు. ప్రజల గోసను వివరిస్తూ.. దొరల పాలనను అంతం చేసే విధి విధానాలతో పుస్తకం రాస్తున్న విషయాన్ని ఆమెకు వివరించానన్నారు.
రాబోయే ఎన్నికల్లో షర్మిల పార్టీ మంచి విజయం సాధించేందుకు ఈ పుస్తకం దిక్సూచిగా నిలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. గతంలో వైఎస్సార్ పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించే విధంగా సంక్షేమ పాలను అందించారని, వైఎస్సార్ స్ఫూర్తితో వైఎస్ షర్మిల మళ్లీ రాజన్న సంక్షేమ పాలన తీసుకువచ్చేందుకు కృషిచేస్తుందని అన్నారు. ఆమెతో కలిసి పని చేయడానికి తనలాంటి ఎంతో యువకులు నడుం బిగిస్తున్నారని మహేందర్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment