సాక్షి, హైదరాబాద్: ఉద్యోగాల భర్తీ కోసం చేపట్టిన 72 గంటల దీక్షను వైఎస్ షర్మిల ఆదివారం విరమించారు. హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌లో ఉన్న తన కార్యాలయంలో షర్మిల కొనసాగిస్తున్న ఉద్యో గ దీక్షను నిరుద్యోగ అమరుల కుటుంబ సభ్యులు ఆమెకు నిమ్మరసం ఇచ్చి విరమింపజేశారు. ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వట్లేదనే మనస్తాపంతో ఆత్మహత్యలకు పాల్పడిన గుగులోత్ రవిందర్ నాయక్, కొప్పు రాజు, మురళి ముది రాజు కుటుంబ సభ్యులను షర్మిల ఈ సంద ర్భంగా ఓదార్చారు. రవిందర్ నాయక్ భార్య, కొప్పు రాజు తల్లి, మురళి ముదిరాజు తల్లికి రూ. 50 వేల చొప్పున తన వంతుగా ఆర్థిక సాయం అందించారు.
నిరుద్యోగ అమరుల కుటుంబ సభ్యులను ఓదారుస్తున్న వైఎస్ షర్మిల
అనంతరం దీక్షా శిబిరం నుంచి ప్రసంగించిన షర్మిల కేసీఆర్ సర్కార్‌పై తీవ్రస్థాయిలో విరు చుకుపడ్డారు. ప్రైవేటు ఉద్యోగాలు కూడా రావట్లేద ని ఎందరో నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నార న్నారు. అయినా ప్రభుత్వం పైసా సహాయం చేయలేదని మండిపడ్డారు. పాలకులకున్నది గుండెనా.. బండరాయా? అని నిలదీశారు. నిరుద్యోగులవి ప్రభుత్వ హత్యలు కావా? అని ప్రశ్నించారు. 40 లక్షల మంది నిరుద్యోగులు ప్రతిరోజూ మానసికంగా చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల్ని తొలగించారని విమర్శించారు. 3.85 లక్షల ఉద్యోగాలను ఎందుకు భర్తీ చేయట్లేదని ప్రశ్నించారు. ‘‘మాట మీద నిలబడే వైఎస్సార్ బిడ్డగా చెబుతున్నా. కేసీఆర్ మెడలు వంచైనా ఉద్యోగాలు భర్తీ చేయిస్తా. నోటిఫికేషన్లు వచ్చే వరకు ప్రతి జిల్లాలో రిలే నిరాహారదీక్షలు కొనసాగుతాయి. రెండేళ్లలో మన ప్రభుత్వం వస్తుంది. ఏ నిరుద్యోగీ ఆత్మహత్య చేసుకోవద్దు.’’అని షర్మిల స్పష్టం చేశారు.
చదవండి: ఉద్యోగ నోటిఫికేషన్లు వెంటనే ప్రకటించాలి: వైఎస్ షర్మిల
కేసీఆర్ వారిపట్ల ఎందుకు సవతి తల్లి ప్రేమ: షర్మిల
Comments
Please login to add a commentAdd a comment