సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోగ్యం క్షీణించింది. ఆమెకు వైఎస్ వివేకా కుమార్తె డాక్టర్ సునీత, ప్రవీణ్ బృందం వైద్య పరీక్షలు నిర్వహించారు. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయాల్సిన అవసరం ఉందని వైద్యులు వెల్లడించారు.
బ్లడ్ లాక్ట్ లెవెల్స్ పెరిగాయని, బీపీ లెవెల్స్ పడిపోయాయన్నారు. ఫ్లూయిడ్స్ తీసుకోకపోవడంతో డీహైడ్రేషన్‌కు గురయ్యారన్నారు. ముందు ముందు కీడ్నీలపై ప్రభావం చూపే అవకాశం ఉందని.. తక్షణమే షర్మిలను ఆసుపత్రిలో చేర్చాలన్నారు.
కాగా, షర్మిల పాదయాత్రకు హైకోర్టు అనుమతిచ్చినా పోలీసులు మాత్రం నిరాకరించడంతో గురువారం ఆమె ట్యాంక్ బండ్ వద్ద అంబేద్కర్ వద్ద ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. అక్కడ ఆమె దీక్షను భగ్నం చేసి పోలీసులు లోటస్‌పాండ్‌కు తరలించారు. అక్కడ కూడా షర్మిల ఆమరణ దీక్ష కొనసాగిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment