
( ఫైల్ ఫోటో )
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ తెలంగాణ పార్టీ(వైఎస్సార్‌టీపీ) అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అపోలో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. కాగా, షర్మిలకు 15 రోజులపాటు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు.
ఆమరణ నిరాహార దీక్షకు వైఎస్ షర్మిల పూనుకోగా, శనివారం అర్ధరాత్రి పోలీసులు ఆమె దీక్షను భగ్నం చేసి అపోలో ఆస్పత్రికి తరలించిన సంగతి తెలిసిందే. ఆదివారం అక్కడ చికిత్స పొందారు షర్మిల. దీక్ష కారణంగా లో బీపీ, బలహీనత ఉండటంతో వైఎస్ షర్మిలను అపోలో ఆస్పత్రిలో చేర్పించినట్లు నిన్నటి బులిటెన్‌లో వైద్యులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment