
సాక్షి, హైదరాబాద్: ట్యాంక్‌బండ్‌పై ఉద్రిక్తత నెలకొంది. పాదయాత్రకు అనుమతి ఇవ్వకపోవడంపై అంబేద్కర్ విగ్రహం వద్ద వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల దీక్షకు దిగారు. ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తున్న గొంతులను ఎందుకు నొకేస్తున్నారంటూ సీఎం కేసీఆర్‌పై షర్మిల మండిపడ్డారు.
తమ పాదయాత్రను ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకుని లోటస్‌పాండ్‌కు తరలించారు. దీంతో ఆ పార్టీ కార్యాలయం ముందు దీక్షకు దిగారు. రోడ్డుపైనే షర్మిల దీక్ష చేస్తున్నారు. కోర్టు అనుమతిచ్చినా పోలీసులు పాదయాత్రను అడ్డుకోవడంపై షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులకూ, షర్మిలకూ మధ్య వాగ్వాదం జరిగింది. ప్రభుత్వం తనను చంపేందుకు ప్రయత్నిస్తోందన్నారు. తెలంగాణ ప్రజల కోసం ప్రాణాలు అర్పించేందుకు సిద్ధం అన్నారు.
వైఎస్ షర్మిల దీక్షకు వైఎస్ విజయమ్మ సంఘీభావం
వైఎస్ షర్మిల దీక్షకు వైఎస్ విజయమ్మ సంఘీభావం తెలిపారు. షర్మిలకు భయపడి పాదయాత్రను అడ్డుకుంటున్నారని వైఎస్ విజయమ్మ అన్నారు. పాదయాత్రకు స్పందన చూసి టీఆర్‌ఎస్ ప్రభుత్వం భయపడుతుందనిపిస్తుందని విజయమ్మ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment