ys sharmila padayatra
-
మహబూబాబాద్ జిల్లా: వైఎస్ షర్మిల అరెస్ట్
సాక్షి, మహబూబాబాద్ జిల్లా: వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల పాదయాత్ర రద్దు అయింది. ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌పై షర్మిల చేసిన వ్యాఖ్యలపై ఆయన అనుచరులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బీఆర్ఎస్ శ్రేణుల ఆందోళనతో షర్మిల పాదయాత్ర అనుమతిని పోలీసులు రద్దు చేశారు. షర్మిలను అరెస్ట్ చేసిన పోలీసులు.. ఆమెను హైదరాబాద్ తరలించారు. చదవండి: బహిరంగ చర్చకు సిద్ధమేనా -
TS: వైఎస్ షర్మిల పాదయాత్రకు అనుమతి
సాక్షి, వరంగల్: వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల తిరిగి చేపట్టబోయే పాదయాత్రకు పోలీసుల అనుమతి లభించింది. ఫిబ్రవరి 12వ తేదీ నుంచి 18వ తేదీ వరకు పాదయాత్ర చేసుకునేందుకు ఆమెకు వరంగల్ సీపీ రంగనాథ్ అనుమతి ఇచ్చారు. ఇదిలా ఉంటే షరతులతో కూడిన అనుమతి షర్మిల యాత్రకు ఇచ్చినట్లు తెలుస్తోంది. కిందటి ఏడాది నవంబర్ 28వ తేదీన వరంగల్ జిల్లా లింగగిరి వద్ద షర్మిల పాదయాత్ర నిలిచిపోయిన సంగతి తెలిసిందే. షరతులు.. ఉదయం నుంచి 10 నుంచి సాయంత్రం 7 గంటల వరకు మాత్రమే పాదయాత్రకు అనుమతి. పార్టీలు, కులాలు, మతాలు, వ్యక్తిగతంగా ఉద్దేశించి వివాస్పదవాఖ్యలు చేయవద్దు. ర్యాలీల్లో ఫైర్ క్రాకర్స్ ఉపయోగించవద్దు. ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థల విధులకు ఆటంకం కలిగించకూడదు. లింగగిరి గ్రామం నుంచి నెక్కొండ, పర్వతగిరి, వర్థన్నపేట, వరంగల్, హనుమకొండ, కాజీపేట ఘన్ పూర్ , జఫర్ గడ్, ఘన్ పూర్, నర్మెట్ట, జనగామ, దేవుర్పుల , పాలకుర్తి మండలం దరిదేపల్లి వరకు షర్మిల పాదయాత్రకు అనుమతి లభించింది. -
వైఎస్ షర్మిల పాదయాత్రకు ఓకే
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రజా ప్రస్థానం పాదయాత్రకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. గత విచారణ సందర్భంగా విధించిన షరతులు పాటించాలని ఆదేశించింది. పాదయాత్రకు అనుమతి ఇవ్వాలని పోలీసులకు స్పష్టం చేసింది. నర్సంపేటలో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డిని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో గత నెల వరంగల్‌లో షర్మిల పాదయాత్రను పోలీసులు అడ్డుకుని ఆమెను అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. దీనిపై ఆమె హైకోర్టును ఆశ్రయించి.. అనుమతి పొందారు. ఆ తర్వాత కూడా పోలీసులు అనుమతి ఇవ్వకపోవడాన్ని సవాల్ చేస్తూ వైఎస్సార్టీపీ సభ్యుడు డి.రవీంద్రనాథ్‌రెడ్డి మంగళవారం హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై న్యాయమూర్తి జస్టిస్ బి.విజయ్‌సేన్‌రెడ్డి విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫున జీవీఎన్‌ఆర్‌ఎస్‌ఎస్‌ఎస్ వరప్రసాద్ వాదనలు వినిపించారు. రాష్ట్రంలో 3,500 కి.మీ. మేర షర్మిల పాదయాత్ర ప్రశాంతంగా సాగిందన్నారు. గత విచారణ సందర్భంగా తాము ఆదేశాలు ఇచ్చినా పాదయాత్రకు అనుమతి ఎందుకు ఇవ్వలేదని ప్రభుత్వ న్యాయవాదిని న్యాయమూర్తి ప్రశ్నించారు. ఆయన బదులిస్తూ.. హైకోర్టు అభ్యంతర వ్యాఖ్యలు చేయవద్దని చెప్పినా కూడా తెలంగాణను షర్మిల తాలిబన్ రాజ్యంతో పోల్చారన్నారు. పోలీసులు విధించిన ఆంక్షలను ఉల్లంఘించారని చెప్పారు. రాజకీయ నేతలకు పాదయాత్రలు, సభలు, సమావేశాలు నిర్వహించుకునే స్వేచ్ఛ ఉంటుందన్న న్యాయమూర్తి.. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రం వాటిపై ఆంక్షలు విధించాల్సి వస్తుందన్నారు. టీఆర్ఎస్ తరఫున వకాల్తా పుచ్చుకున్నట్లు మాట్లాడటం సరికాదని జీపీకి సూచించారు. రాజకీయ నాయకులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం సర్వ సాధారణంగా మారిందన్నారు. అసలు రాజకీయ నాయకులంతా పాదయాత్ర కోసం ఎందుకు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని ప్రశ్నించారు. అనంతరం యాత్రకు అనుమతి ఇచ్చారు. సీఎం కేసీఆర్‌పైనా, రాజకీయంగా, మతపరంగా అభ్యంతరకర వ్యాఖ్యలు చేయరాదని ఆదేశించారు. ఇతర నాయకులను రెచ్చగొట్టేలా ప్రసంగాలు చేయరాదని స్పష్టం చేస్తూ విచారణను ఈ నెల 27కు వాయిదా వేశారు. -
క్షీణించిన వైఎస్ షర్మిల ఆరోగ్యం
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోగ్యం క్షీణించింది. ఆమెకు వైఎస్ వివేకా కుమార్తె డాక్టర్ సునీత, ప్రవీణ్ బృందం వైద్య పరీక్షలు నిర్వహించారు. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయాల్సిన అవసరం ఉందని వైద్యులు వెల్లడించారు. బ్లడ్ లాక్ట్ లెవెల్స్ పెరిగాయని, బీపీ లెవెల్స్ పడిపోయాయన్నారు. ఫ్లూయిడ్స్ తీసుకోకపోవడంతో డీహైడ్రేషన్‌కు గురయ్యారన్నారు. ముందు ముందు కీడ్నీలపై ప్రభావం చూపే అవకాశం ఉందని.. తక్షణమే షర్మిలను ఆసుపత్రిలో చేర్చాలన్నారు. కాగా, షర్మిల పాదయాత్రకు హైకోర్టు అనుమతిచ్చినా పోలీసులు మాత్రం నిరాకరించడంతో గురువారం ఆమె ట్యాంక్ బండ్ వద్ద అంబేద్కర్ వద్ద ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. అక్కడ ఆమె దీక్షను భగ్నం చేసి పోలీసులు లోటస్‌పాండ్‌కు తరలించారు. అక్కడ కూడా షర్మిల ఆమరణ దీక్ష కొనసాగిస్తున్నారు. -
YS Sharmila: వైఎస్ షర్మిల నిరాహార దీక్ష
సాక్షి, హైదరాబాద్: ట్యాంక్‌బండ్‌పై ఉద్రిక్తత నెలకొంది. పాదయాత్రకు అనుమతి ఇవ్వకపోవడంపై అంబేద్కర్ విగ్రహం వద్ద వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల దీక్షకు దిగారు. ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తున్న గొంతులను ఎందుకు నొకేస్తున్నారంటూ సీఎం కేసీఆర్‌పై షర్మిల మండిపడ్డారు. తమ పాదయాత్రను ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకుని లోటస్‌పాండ్‌కు తరలించారు. దీంతో ఆ పార్టీ కార్యాలయం ముందు దీక్షకు దిగారు. రోడ్డుపైనే షర్మిల దీక్ష చేస్తున్నారు. కోర్టు అనుమతిచ్చినా పోలీసులు పాదయాత్రను అడ్డుకోవడంపై షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులకూ, షర్మిలకూ మధ్య వాగ్వాదం జరిగింది. ప్రభుత్వం తనను చంపేందుకు ప్రయత్నిస్తోందన్నారు. తెలంగాణ ప్రజల కోసం ప్రాణాలు అర్పించేందుకు సిద్ధం అన్నారు. వైఎస్ షర్మిల దీక్షకు వైఎస్ విజయమ్మ సంఘీభావం వైఎస్ షర్మిల దీక్షకు వైఎస్ విజయమ్మ సంఘీభావం తెలిపారు. షర్మిలకు భయపడి పాదయాత్రను అడ్డుకుంటున్నారని వైఎస్ విజయమ్మ అన్నారు. పాదయాత్రకు స్పందన చూసి టీఆర్ఎస్ ప్రభుత్వం భయపడుతుందనిపిస్తుందని విజయమ్మ అన్నారు. -
టీఆర్ఎస్ గుండాల నుంచి నాకు ప్రాణహాని ఉంది : వైఎస్ షర్మిల
-
టీఆర్ఎస్ అంటే.. తాలిబన్ల రాష్ట్ర సమతి: వైఎస్ షర్మిల ఫైర్
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ ప్రభుత్వంపై వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు టీఆర్ఎస్ గుండాలతో ప్రాణహాని ఉందంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. కాగా, ఆదివారం వైఎస్ షర్మిల మీడియాతో మాట్లాడుతూ.. మహిళ పాదయాత్ర చేస్తే పోలీసు స్టేషన్లో కూర్చోబెడతారా?. ఎమ్మెల్యేల అవినీతిని హైలైట్ చేస్తే జీర్ణించుకోలేక దాడులు చేస్తారా. ప్రజాఫోరం ఏర్పాటు చేసి మీ నిజాయితీ నిరూపించుకోవాలి. టీఆర్ఎస్ గూండాల నుంచి నాకు ప్రాణహాని ఉంది. నా బస్సును వాళ్లే తగలబెట్టి నన్ను సారీ చెప్పమంటారా!. మీది తాలిబన్ల భాష, తాలిబన్ల రాష్ట్ర సమితి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. -
ఫ్రెండ్లీ పోలీసింగ్ టీఆర్ఎస్ పార్టీకె వర్తిస్తుంది : వైఎస్ షర్మిల
-
వైఎస్ షర్మిలను విడుదల చేయాలంటూ YSRTP కార్యకర్తల ఆందోళన
-
కుమార్తె ను చూడడానికి వెళ్తుంటే అడ్డుకుంటారా : వైఎస్ విజయమ్మ
-
నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది : బ్రదర్ అనిల్ కుమార్
-
వైఎస్ షర్మిల పాదయాత్రకు హైకోర్టు అనుమతి
-
వైఎస్ షర్మిల పాదయాత్రకు హైకోర్టు అనుమతి
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పాదయాత్రకు తెలంగాణ హైకోర్టు అనుమతించింది. పాదయాత్రకు నర్సంపేట పోలీసులు అనుమతి రద్దు చేశారని హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది వైఎస్సార్టీపీ. ఈ పిటిషన్‌పై విచారించిన హైకోర్టు అనుమతులు ఇచ్చింది. మరోవైపు.. వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. పాదయాత్ర సందర్భంగా సోమవారం రోజు టీఆర్ఎస్ నేతలు చేసిన దాడికి నిరసనగా ప్రగతి భవన్ ముట్టడికి బయలుదేరిన క్రమంలో పోలీసులు అడ్డుకున్నారు. రాజ్‌భవన్ రోడ్డులో వైఎస్ షర్మిలను అడ్డుకుని పోలీసులు అరెస్ట్ చేశారు. కారు అద్దాలు మూసివేసి వైఎస్ షర్మిల లోపలే కూర్చున్నారు. డోర్ లాక్ చేసి కారు దిగేందుకు నిరాకరించారు. దీంతో షర్మిల కారును క్రేన్ ద్వారా లిఫ్ట్ చేసి ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఇదీ చదవండి: వైఎస్ షర్మిలపై కేసు.. విజయమ్మను అడ్డుకున్న పోలీసులు -
పోలీసుల తీరుపై షర్మిల ఆగ్రహం
-
వరంగల్‌లో వైఎస్ షర్మిల అరెస్ట్
వరంగల్: తీవ్ర ఉద్రిక్తతల నడుమ వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను వరంగల్‌లో అరెస్ట్ చేశారు. ఈరోజు(సోమవారం) షర్మిల చేపట్టిన పాదయాత్ర ఉద్రిక్తతలకు దారి తీయడంతో షర్మిలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తొలుత ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డిపై షర్మిల చేసిన వ్యాఖ్యలతో టీఆర్ఎస్ ఆందోళన చేపట్టింది. ఈ క్రమంలోనే షర్మిల కేర్వాన్కు ఆందోళన కారులు నిప్పుపెట్టారు. దాంతో వైఎస్సార్టీపీ-టీఆర్ఎస్ శ్రేణుల మధ్య తీవ్ర వాగ్వాదం, బాహాబాహీ జరిగింది. అయితే ఈ ఉద్రిక్తల నడుమే షర్మిల పాదయాత్రను కొనసాగించాలని భావించినా పోలీసులు అందుకు అనుమతి ఇవ్వలేదు. పరిస్థితి మరింత ఉద్రిక్తతంగా మారే అవకాశం ఉండటంతో షర్మిలను నర్సంపేట పేట పోలీసులు అరెస్ట్ చేశారు. వైఎస్సార్టీపీ శ్రేణులను పోలీసులు అడ్డుకోవడంతో షర్మిల మండిపడ్డారు. పోలీసులు వ్యవరించిన తీరును తప్పుబట్టారు. బస్సుకు నిప్పుపెట్టిన వారిని వదిలేసి మమ్మల్ని అరెస్ట్ చేస్తారా? అంటూ షర్మిల ధ్వజమెత్తారు. చదవండి: రెచ్చిపోయిన టీఆర్ఎస్ శ్రేణులు.. వైఎస్ షర్మిల కేరవాన్‌కు నిప్పు.. -
షర్మిల పోరుతో తెలంగాణ సర్కారులో అలజడి
నర్సంపేట: వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వై.ఎస్.షర్మిల చేపట్టిన పాదయాత్రతో తెలంగాణ ప్రభుత్వంలో అలజడి మొదలైందని దివంగత నేత వైఎస్సార్ సతీమణి వై.ఎస్.విజయమ్మ అన్నారు. షర్మిల చేపట్టిన పాదయాత్ర ఆదివారం వరంగల్ జిల్లా నర్సంపేటకు చేరుకుంది. యాత్ర 3,500 కిలోమీటర్లకు చేరుకున్న సందర్భంగా షర్మిలతో కలసి విజయమ్మ వైఎస్సార్ పైలాన్‌ను ఆవిష్కరించారు. అనంతరం విజయమ్మ మాట్లాడుతూ గొప్ప ఆశయం, సంకల్పంతో యాత్ర సాగుతోందన్నారు. పాదయాత్రకు ప్రజలనుంచి మంచి ఆదరణ వస్తోందని చెప్పారు. ‘ఒక మహిళ పదేళ్ల కిందట 3,200 కిలోమీటర్లు నడిచింది, ఆ మహిళే ఇప్పుడు మళ్లీ 3,500 కిలోమీటర్లు నడిచింది’అని షర్మిలను ఉద్దేశించి అన్నారు. దేశ చరిత్రలో ఇదొక రికార్డు అని పేర్కొన్నారు. ఇది తల్లిగా తనకు ఎంతో ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. షరి్మల వైఎస్సార్‌కు గారాలపట్టి అని చెప్పారు. వైఎస్ తర్వాత రాష్ట్రంలో అభివృద్ధి లేదని, షర్మిల ఎక్కడికి వెళ్లినా వైఎస్సార్‌ను గుర్తు చేస్తున్నారని పేర్కొన్నారు. జలయజ్ఞంలో భాగంగా వైఎస్సార్ రూ.1.40 లక్షల కోట్లతో 86 ప్రాజెక్టులు చేపట్టారన్నారు. దీంతో ప్రజల గుండెల్లో వైఎస్సార్ గుడి కట్టుకున్నారన్నారు. తెలంగాణలో సంక్షేమం, సమన్యాయం లేవని, అందుకే వైఎస్సార్ తెలంగాణ పార్టీ మీ ముందుకు వచ్చిందని పేర్కొన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన ప్రతిపక్షాలు మౌనంగా ఉన్నాయని, అందుకే షర్మిల ప్రశ్నించే నాయకురాలిగా మీ ముందుకు వచ్చారని చెప్పారు. షర్మిల ఆందోళనలు చేస్తుంటే మంగళవారం వ్రతాలు అని హేళన చేస్తున్నారని, కానీ తెలంగాణలో ఆమె ఒక ప్రభంజనంలా మారబోతోందని, దమ్ముంటే షర్మిలతో ఒక రోజు పాదయాత్రకు రావాలని సవాల్ విసిరారు. రాబోయే యుద్ధానికి ప్రజలు సమరశంఖం పూరించాలని పిలుపునిచ్చారు. షర్మిలతో నిలబడి సరికొత్త ప్రభుతాన్ని తీసుకురావాలని కోరుకుంటున్నానని తెలిపారు. ఇదీ చదవండి: కేసీఆర్‌కు పాలించే అర్హత పోయింది -
కేసీఆర్ మోసం చేయని వర్గం లేదు : వైఎస్ షర్మిల
-
రాజశేఖర్ రెడ్డి బిడ్డను ఆశీర్వదించిన మీ అందరికి ధన్యవాదాలు : వైఎస్ షర్మిల
-
మీ అందరి దీవెనలే షర్మిలను నడిపిస్తున్నాయి : వైఎస్ విజయమ్మ
-
మరో మైలురాయి దాటిన షర్మిల పాదయాత్ర
సాక్షి, మంచిర్యాల: మంచిర్యాల జిల్లాలో వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పాదయాత్ర కొనసాగుతోంది. ఈ క్రమంలో పాదయాత్ర 3వేల కిలోమీటర్లు మైలురాయి దాటిన సందర్భంగా హజీపూర్ వద్ద వైఎస్ఆర్ పైలాన్‌ను వైఎస్ విజయమ్మ, షర్మిల ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వైఎస్ విజయమ్మ మాట్లాడుతూ.. ‘మీ అందరి దీవెనలే షర్మిలను నడిపిస్తున్నాయి. 3వేల కిలోమీటర్లు నడవటం సాధారణ విషయం కాదు. షర్మిల పాదయాత్ర మనుషులతో మమేకమయ్యే యాత్ర. పాదయాత్ర ద్వారా ప్రజల కష్టాలను షర్మిల తెలుసుకుంటోంది. పాదయాత్ర అంటే గుర్తుకొచ్చే పేరు వైఎస్ఆర్. వైఎస్ఆర్ ఆశయాలతోనే షర్మిల పాదయాత్ర చేస్తోంది. ఇది ఓట్ల కోసం చేస్తున్న యాత్ర కాదు. సమస్యలకు ముగింపు పలకాలని చేస్తున్న యాత్ర అని స్పష్టం చేశారు. అనంతరం, వైఎస్ షర్మిల మాట్లాడుతూ.. ‘మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి బిడ్డను ఆశీర్వదించిన మీ అందరికీ ధన్యవాదాలు. మహానేతకు మరణం లేదని మరోసారి నిరూపించారు. నడిచింది నేనైనా.. నడిపించింది మీరే. వైఎస్ఆర్ పేదల కోసం ఎన్నో పథకాలు అమలు చేశారు’ అని తెలిపారు. -
నేడు మూడువేల కిలోమీటర్ల మైలురాయి దాటనున్న షర్మిల పాదయాత్ర
-
రాష్ట్ర ఖజానాను కొల్లగొట్టారు: వైఎస్ షర్మిల
బిచ్కుంద (జుక్కల్): మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్ర ఖజానాను సీఎం కేసీఆర్ ప్రాజెక్టులు, మిషన్ భగీరథ పేరుతో కొల్లగొట్టి తన జేబులు నింపుకొన్నారని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి ప్రజలను ఆగం చేశారని విమర్శించారు. కామారెడ్డి జిల్లా బిచ్కుంద, మద్నూర్, నస్రుల్లాబాద్ మండలాల మీదుగా షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా ప్రజలనుద్దేశించి ఆమె మాట్లాడుతూ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి రూ.38 వేల కోట్లకు పూర్తి చేయాలనుకున్నారని, అదే ప్రాజెక్టును కేసీఆర్ రీడిజైన్ చేయించి కాళేశ్వరం పేరుతో రూ.లక్ష 20 వేలకు పెంచి రూ.70 వేల కోట్లను మింగారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ, కాంగ్రెస్ ఏనాడూ సీఎం కేసీఆర్ అవినీతిపై నిలదీయలేదని, రెండు పార్టీలూ తమ స్వార్థం చూసుకుంటున్నాయని ఆరోపించారు. కార్యక్రమంలో పార్టీ రాçష్ట్ర అధికార ప్రతినిధి పిట్ల రాంరెడ్డి, జిల్లా అధ్యక్షుడు ఎన్.సుధాకర్ పాల్గొన్నారు. -
పాలన గాలికొదిలేసి కొట్లాట: షర్మిల
సాక్షి, నిజాంసాగర్ (జుక్కల్): రాష్ట్రంలో పరిపాలన గాలి కొదిలేసి మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రతిపక్ష పార్టీ నేతలు మునుగోడు ఉప ఎన్నికలో కుక్కల్లా కొట్లాడుతున్నారని వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. గురువారం కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో ప్రజా ప్రస్థాన బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి మాట్లాడారు. ఉప ఎన్నికల్లో ఊరికొక ఎమ్మె ల్యేను ఇన్చార్జిగా నియమించి మందు సీసాలు, నాటుకోళ్లు, విచ్చలవిడిగా డబ్బు పంపిణీ చేసి ఓట్లు కొంటున్నారని ఆమె ఆరోపించారు. సీఎం కేసీఆర్ తన బిడ్డను కాపాడుకోవడానికి ఢిల్లీ వెళ్లి పైరవీలు చేసుకుంటున్నారన్నారు. రెండుసార్లు సీఎం అయిన కేసీఆర్ అభివృద్ధిని విస్మరించి అక్రమ సంపాదనకు పాల్పడుతున్నారని ఆరోపించారు. వైఎస్సార్ బతికి ఉంటే డిండి ప్రాజెక్టు పూర్తి చేసి ఆయకట్టు ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసేవారన్నారు. నిజాంసాగర్ ప్రాజెక్టు కాలువల మరమ్మతులకు రూ.450 కోట్లు కేటాయించిన ఘనత వైఎస్సార్‌దేనని షర్మిల స్పష్టం చేశారు. -
అధికారమిస్తే రుణమాఫీ, సున్నావడ్డీకే రుణాలు: వైఎస్ షర్మిల
సాక్షి, నిజాంసాగర్: తమకు అధికారమిస్తే పంట రుణాలు మాఫీ చేస్తా మని, సున్నావడ్డీకి రుణాలు ఇస్తామని వైఎస్సార్ తెలంగాణ పార్టీ రాష్ట్ర అధ్యక్షు రాలు వైఎస్ షర్మిల హామీ ఇచ్చారు. ఆమె చేపట్టిన ప్రజాప్రస్థానం పాదయాత్ర బుధవారం కామారెడ్డి జిల్లాలోని నిజాంసాగర్, పిట్లం మండలాల మీదుగా సాగింది. పిట్లంలో ప్రజలనుద్దేశించి ఆమె మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో కేసీఆర్ సర్కార్ రూ.వేల కోట్ల అవినీతి, అక్రమాలకు పాల్పడిందని ఆరోపించారు. అక్రమంగా సంపాదించిన డబ్బు లతో సీఎం కేసీఆర్ హెలికాప్టర్ కొనుగోలు చేశారని ఆరోపించారు. రాష్ట్రంలోని ప్రజా సమస్యలను పట్టించుకోకుండా అభివృద్ధిని విస్మరించి దేశాన్ని దోచుకునేందుకు కేసీఆర్ ముందుకు వెళ్తున్నారని విమర్శించారు. వైఎస్సార్ అందించిన సువర్ణ పాలన కోసం తమ పార్టీని ఆశీర్వదించాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
కామారెడ్డి జిల్లాలో కొనసాగుతున్న వైఎస్ షర్మిల పాదయాత్ర
-
రాష్ట్రాన్నే పాలించరాదు.. ఢిల్లీ వెళతారట!
షాద్‌నగర్/షాద్‌నగర్ రూరల్/ సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ ఓ గజదొంగ అని వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ధ్వజమెత్తారు. ఆమె చేపట్టిన ప్రజాప్రస్థానం పాదయాత్ర సోమవారం రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌కు చేరుకుంది. ఈ సందర్భంగా రోడ్‌షోలో షర్మిల మాట్లాడుతూ, కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచారని, బంగారు తెలంగాణ కాదు.. బీరు, బారు తెలంగాణగా మార్చారని ఎద్దేవా చేశారు. రాష్ట్రాన్నే సరిగా పాలించని కేసీఆర్‌కు ఢిల్లీ రాజకీయాలపై ఆశ పుట్టుకొచ్చిందని విమర్శించారు. అవినీతి, అక్రమాలను ప్రశ్నిస్తున్నందుకు మంత్రులు, ఎమ్మెల్యేలు తనపై స్పీకర్‌కు ఫిర్యాదు చేశారని షర్మిల గుర్తు చేశారు. ఈ విషయంపై మాట్లాడేందుకు దమ్ముంటే తనను అసెంబ్లీకి పిలవాలని సవాల్ విసిరారు. ‘సమయం మీరు చెబుతారా, నన్ను చెప్పమంటారా? అసెంబ్లీ లోపలికి రావాలా.. ముందుకు రావాలా.. అందరి ముందు మాట్లాడదామా?’ అని షర్మిల పేర్కొన్నారు. మంత్రి నిరంజన్‌రెడ్డి తనను మరదలుగా సంబోధించడం ఎంత వరకు సమంజసం అని ప్రశ్నించారు. ఆ మంత్రిపై ఫిర్యాదు చేస్తే పోలీసులు ఎందుకు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం లేదన్నారు. వైఎస్ మృతిపై విచారణ జరిపించాలి: కొండా ఇదిలా ఉండగా, దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి మరణంపై అనుమానాలున్నాయని వైఎస్సార్టీపీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి అన్నారు. సోమవారం హైదరాబాద్ లోటస్‌పాండ్‌లోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, వైఎస్ మరణంపై పూర్తి స్థాయి విచారణ జరపాల్సిన అవసరం ఉందన్నారు. మంత్రి నిరంజన్‌రెడ్డి.. తమ పార్టీ అధ్యక్షురాలు షర్మిలను మరదలు అనడాన్ని తీవ్రంగా ఆక్షేపిస్తూ.. వావి వరుసలు లేని ఒక కంత్రి మంత్రి అని వ్యాఖ్యానించారు. -
నన్ను చంపాలని చూస్తున్నారు.. వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా వైఎస్ షర్మిల మీడియాతో మాట్లాడుతూ.. నన్ను చంపాలని చూస్తున్నారు. నాకు బేడీలంటే భయం లేదు.. నేను పులి బిడ్డను. దమ్ముంటే నన్ను అరెస్ట్ చేయండి. ప్రాణం ఉన్నంత వరకు ప్రజల మధ్యే ఉంటాను. అవినీతిపై మాట్లాడితే టీఆర్ఎస్ నేతలకు అంత వణుకెందుకు?. అవినీతిపై చర్చించే దమ్ముందా అని సవాల్ విసిరారు. పాదయాత్ర ఆపేందుకు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కుట్ర చేస్తున్నారు. మంత్రి నిరంజన్ రెడ్డిది నోరా? మోరినా? అని ఆగ్రహం చేశారు. తెలంగాణలో మహిళలకు గౌరవం లేదు. పోలీసులు టీఆర్ఎస్కు గులాంగిరి చేస్తున్నారు. తెలంగాణ పోలీసులను టీఆర్ఎస్లో విలీనం చేయాలి. మంత్రి నిరంజన్ రెడ్డిపై మేము ఇచ్చిన ఫిర్యాదులపై చర్యలేవి అంటూ ప్రశ్నించారు. నన్ను అరెస్ట్ చేసి పాదయాత్ర ఆపాలని కుట్ర చేస్తున్నారు అంటూ వ్యాఖ్యలు చేశారు. మరోవైపు.. వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల చేపట్టిన ప్రజాప్రస్థానం పాదయాత్ర శనివారం మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గంలో కొనసాగింది. ఈ సందర్భంగా ఆమె గంగాపూర్‌లో ప్రజలనుద్దేశించి మాట్లాడారు. కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్‌సాగర్ ప్రాజెక్టులతో ఉమ్మడి జిల్లాలో లక్షలాది ఎకరాలకు సాగునీరందించిన ఘనత వైఎస్సార్‌దే అన్నారు. వైఎస్ హయాంలో ప్రాజెక్టులు నిర్మిస్తే అక్కడక్కడా మిగిలిన పనులను సైతం సీఎం కేసీఆర్ పూర్తి చేయలేకపోయారని ఆరోపించారు. -
వ్యవసాయాన్ని పండుగ చేస్తాం: వైఎస్ షర్మిల
కొత్తకోట రూరల్: తెలంగాణలో వ్యవసాయాన్ని పండుగ చేసి, వైఎస్సార్ చేపట్టిన సంక్షేమ పథకాలను కొనసాగిస్తామని వైఎస్సార్టీపీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. షర్మిల చేపట్టిన పాదయాత్ర శనివారం వనపర్తి జిల్లా కొత్తకోట వద్ద 2,000 కి.మీ. పూర్తి చేసుకున్న సందర్భంగా కొత్తకోట సమీపంలో పైలాన్ ఆవిష్కరించారు. అక్కడే నూతనంగా ఏర్పాటు చేసిన దివంగత మహానేత వైఎస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం కొత్తకోట బహిరంగసభలో షర్మిల మాట్లాడుతూ రాజన్న పాలనలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని, ఐదేళ్ల పాలనలో ఏ రోజు ఆర్టీసీ, కరెంట్ చార్జీలు పెంచిన సందర్భాలు లేవన్నారు. ఎనిమిదేళ్లుగా ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ ప్రజలకు ఏం చేశారని ప్రశ్నించారు. నీళ్ల నిరంజన్‌రెడ్డి పేరు పెట్టుకున్న మంత్రి నిరంజన్‌రెడ్డి ప్రజలకు కన్నీళ్లు మిగిలిస్తున్నారని మండిపడ్డారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేయాలని ఈనెల 14న 24 గంటల దీక్ష చేపట్టనున్నట్లు షర్మిల ప్రకటించారు. డబ్బులు సంపాదించుకోవడం కోసం వీళ్లకు పదవులొచ్చాయని, మహిళల పట్ల గౌరవం లేకుండా సిగ్గులేని మంత్రి నిరంజన్‌రెడ్డి నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతారని విరుచుకుపడ్డారు. మహిళలను తల్లి, చెల్లి మాదిరిగా చూడాల్సిన మంత్రి ఇష్టం వచ్చినట్టు మాట్లాడం సరికాదన్నారు. నిరంజన్‌రెడ్డికి వీధి కుక్కకు ఏం తేడా అని అన్నారు. వనపర్తి జిల్లా కేంద్రానికి షర్మిల వస్తే ప్రజలు బ్రహ్మరథం పడితే ఓర్చుకోలేక కడుపు మండి రాజశేఖర్‌రెడ్డిది రక్తచరిత్ర అని మాట్లాడుతున్న మంత్రికి సిగ్గుందా? అని దుయ్యబట్టారు. సభ సమయంలో వర్షం కురుస్తున్నా.. ప్రజల అభివాదంతో షర్మిల ప్రసంగాన్ని అలాగే కొనసాగించారు. షర్మిలను ఆశీర్వదించండి: వైఎస్ విజయమ్మ రాజశేఖరరెడ్డి బిడ్డను మీ బిడ్డ అనుకొని ఆశీర్వదించండని, ఆయన కొనసాగించిన సంక్షేమ పథకాలను మళ్లీ కొనసా గాలంటే షర్మిల ముఖ్యమంత్రి అయితే సాధ్యమవుతుందని వైఎస్ విజయమ్మ అన్నారు. ఎక్కడ అవసరం ఉన్నా అక్కడ ఉద్యమాలు చేస్తే ప్రజల్లోకి దూసుకెళ్తున్న షర్మిలకు ప్రజలకు అండగా ఉండాలని కోరారు. ఇదీ చదవండి: కాళేశ్వరం ప్రాజెక్టుపైనే ప్రేమ: వైఎస్ షర్మిల -
‘వైఎస్సార్‌లా తెలంగాణ కూడా స్వచ్ఛమైనది’
సాక్షి, వనపర్తి: మహానేత వైఎస్సార్ కుటుంబాన్ని ప్రేమించే ప్రతీ ఒక్కరికీ కృతజ్ఞతలని పేర్కొన్నారు వైఎస్ విజయమ్మ. తెలంగాణలో వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల చేపట్టిన పాదయాత్ర 2వేల కిలోమీటర్ల మైలురాయి పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా శనివారం సాయంత్రం జిల్లాలోని కొత్తకోట బస్టాండ్ వద్ద పైలాన్ ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా వైఎస్ విజయమ్మ పాల్గొని ప్రసంగించారు. ‘‘వైఎస్సార్ కుటుంబాన్ని ప్రేమించే ప్రతీ ఒక్కరికీ కృతజ్ఞతలు. కులాలు, మతాలు, పార్టీలకు అతీతం వైఎస్సార్. వైఎస్సార్‌లా తెలంగాణ కూడా స్వచ్ఛమైంది. మీ ప్రేమ, ఆప్యాయతలతోనే షర్మిల 2వేల కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేయగలిగింది. నడిచింది షర్మిలే అయినా.. నడిపించింది మీరే అంటూ అక్కడి కార్యక్రమానికి హాజరైన ప్రజలను, వైఎస్సార్టీపీ నేతలు.. కార్యకర్తలను ఉద్దేశించి వైఎస్ విజయమ్మ ధన్యవాదాలు తెలియజేశారు. బంగారు తెలంగాణ కోసమే షర్మిల అడుగులు వేస్తోందని, అందుకు తెలంగాణ ప్రజానీకం ఆశీర్వాదం కావాలని ఆకాక్షించారు వైఎస్ విజయమ్మ. ఇదిలా ఉంటే.. 148 రోజుల్లో 2వేల కిలోమీటర్ల ప్రజాప్రస్థానం పూర్తి చేసుకున్నారు వైఎస్ షర్మిల. వనపర్తి జిల్లాలో షర్మిల పాదయాత్ర మైలురాయి దాటగా.. కొత్తకోట వద్ద పైలాన్ ఆవిష్కరించారు. ఇదీ చదవండి: తెలంగాణలో వెస్ట్ బెంగాల్ వ్యూహమా? -
పాలేరు నియోజకవర్గం నుంచిచే అసెంబ్లీకి పోటీ చేస్తాను: వైఎస్ షర్మిల
-
YS Sharmila: పాలేరు నుంచే పోటీ చేస్తా
నేలకొండపల్లి: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాను పాలేరు నియోజకవర్గం నుంచే పోటీ చేస్తానని వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రకటించారు. పాలేరులో గెలవడం సమస్య కాదని, కనీవినీ ఎరగని మెజారిటీ వచ్చేందుకు ప్రతి ఒక్కరూ సైనికుల్లా పని చేయాలని ఆమె పిలుపునిచ్చారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో ఆదివారం జరిగిన పాలేరు నియోజకవర్గ పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో షర్మిల మాట్లాడారు. వైఎస్ బిడ్డ పాలేరు నుంచి పోటీ చేయాలనే కోరిక తెలంగాణ ఏర్పడిన దగ్గర నుంచీ ఉందని, ప్రస్తుతం ప్రజలతోపాటు తన అభీష్టం కూడా అదేనని ఆమె తెలిపారు. రాష్ట్రానికి ఆదర్శంగా నిలిచేలా పార్టీ కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. వైఎస్సార్ అనే పేరుకు తామే వారసులమని, ఇతర వ్యక్తులకు, ఏ పార్టీకి ఆ హక్కు లేదని ఆమె స్పష్టం చేశారు. ఖమ్మం అంటే వైఎస్సార్ జిల్లా అని, ఈ జిల్లాలో ఎంతో మంది వైఎస్సార్ ఫొటో పెట్టుకుని గెలిచారని గుర్తు చేశారు. వైఎస్ సంక్షేమ పాలన పాలేరు నుంచే మొదలు కావాలని ఆకాంక్షించారు. ‘ఇకపై షర్మిల ఊరు పాలేరు. జిల్లాకు చెందిన మంత్రి పువ్వాడ అజయ్ కార్యకర్తలను భయపెట్టాలని చూస్తారు. వైఎస్ వారసులమైన మనం భయపడతామా?’అని పేర్కొన్నారు. ఆయన అవినీతి గురించి మాట్లాడితే సమాధానం చెప్పలేక అవాకులు, చెవాకులు పేలుతున్నారన్నారు. బయ్యారం మైనింగ్‌లో తమకు వాటాలు ఉన్నాయని ఆరోపిస్తున్నారని, తన బిడ్డలపై ఒట్టేసి చెబుతున్నానని.. ఎలాంటి భాగాలు లేవని ఆమె తెలిపారు చదవండి: (‘నాకు, నా భర్తకు ఎమ్మెల్యే నుంచి ప్రాణహాని ఉంది’) -
కేసీఆర్ 8 ఏళ్ళ పాలనలో 8 వేల మంది రైతులు బలి
-
93వ రోజు ఖమ్మం జిల్లాలో కొనసాగుతున్న వైఎస్ షర్మిల ప్రజా ప్రస్థానం పాదయాత్ర
-
అప్పుల తెలంగాణగా మార్చారు: వైఎస్ షర్మిల
బోనకల్: రూ.16 వేల కోట్ల మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణను సీఎం కేసీఆర్ నేడు రూ.4 లక్షల కోట్ల అప్పుల రాష్ట్రంగా మార్చారని వైఎస్సార్టీపీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షరి్మల విమర్శించారు. ఆమె చేపట్టిన ప్రజాప్రస్థానం పాదయాత్ర అదివారం ఖమ్మం జిల్లా బోనకల్ మండలంలో కొనసాగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్నికల ముందు రైతు రుణమాఫీ చేస్తానని చెప్పి ఇంతవరకూ ప్రకటించలేదని, దీంతో రాష్ట్రంలో ఎనిమిది వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రూ.25 వేలు రుణం తీసుకున్న రైతుకు ప్రస్తుతం వడ్డీతో కలిపి రూ.40 వేలు దాటిందని తెలిపారు. వడ్డీలు కట్టమని బ్యాంకు అధికారులు రైతులను వేధిస్తున్నారని ఆరోపించారు. పంటలకు మద్దతు ధర చెల్లించడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయన్నారు. పోడు భూముల కోసం పోరాడిన రైతులను జైల్లో పెట్టించిన ఘనత కేసీఆర్‌కే దక్కిందన్నారు. రాష్ట్రాన్ని బార్లు, బీర్ల తెలంగాణగా మార్చారని, గాడిదకు రంగుపూసి ఆవు అని నమ్మించగల శక్తి కేసీఆర్‌కు మాత్రమే ఉందన్నారు. కాగా, మండలంలోని ఆళ్లపాడులో షరి్మల.. 33 జిల్లాల పార్టీ అధ్యక్షులు, సమన్వయకర్తలతో సమావేశమయ్యారు. పార్టీ నిర్మాణం, బలోపేతం, సభ్యత్వ నమోదుపై నేతలకు సూచనలు చేశారు. వైఎస్సార్ మరణాన్ని జీరి్ణంచుకోలేక తెలంగాణలో 400 మంది గుండెలు ఆగాయని, వారి కుటుంబాలకు భరోసా కలి్పంచాల్సిన బాధ్యత పార్టీపై ఉందన్నారు. -
ప్రజల పక్షాన ఎవరూ లేరనే పార్టీ స్థాపించాం: షర్మిల
మధిర: ప్రస్తుతం పాలకపక్షంతో పాటు ప్రతిపక్షం ఎవరూ కూడా ప్రజల పక్షాన నిలబడక పోవడంతో తాము పార్టీని స్థాపించాల్సి వచ్చిందని వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వెల్లడించారు. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పగ్గాలు ఒక దొంగ, బ్లాక్‌మెయిలర్ చేతిలో ఉన్నాయని ఆరో పించారు. ప్రజాప్రస్థానం పాదయాత్ర శనివారం ఖమ్మం జిల్లా మధిరకు చేరుకోగా స్థానికంగా వైఎస్సార్, అంబేడ్కర్ విగ్రహాలకు ఆమె పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం షర్మిల బహిరంగ సభలో మాట్లాడారు. భట్టి విక్రమార్కకు వైఎస్సార్ రాజకీయ భవిష్యత్ కల్పించి వేలు పట్టి నడిపించారని, ఈక్రమంలో ఎన్ని ఒత్తిళ్లు ఎదురైనా ఆయన టీఆర్ఎస్ పార్టీలో చేరకపోవడం మంచిదేనని అభిప్రాయపడ్డారు. కానీ, వైఎస్సార్ ఫొటో పెట్టుకుని గెలిచిన ఆయన.. మహానేత పేరును కాంగ్రెస్ పార్టీ ఎఫ్ఐఆర్లో చేరిస్తే ఏం చేశారో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. ‘వైఎస్సార్ బిడ్డగా చెబుతున్నా.. తమను ప్రజలు ఆశీర్వదిస్తే మళ్లీ రాజన్న సంక్షేమ పాలనను తీసుకువస్తా’ అని హామీ ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీలంటే వైఎస్సార్‌కు ఎంతో అభిమానమని, ప్రస్తుత సీఎం కేసీఆర్ మాత్రం దళిత మహిళ మరియమ్మను జైలులో చంపించారని ఆవేదన వ్యక్తం చేశారు. యాత్రలో వైఎస్సార్ టీపీ రాష్ట్ర, జిల్లా నాయకులు పాల్గొన్నారు. -
వైఎస్ఆర్ విగ్రహం మీద చెయ్యేస్తే తాట తీస్తాం: వైఎస్ షర్మిల
-
ఉద్యమ నాయకుడని నమ్మితే... వమ్ము చేశారు
బోనకల్: ఉద్యమ నాయకుడని నమ్మి ప్రజలు రెండు సార్లు అధికారం అప్పగిస్తే ఎన్నికలకు ముందు ఇచ్చిన ఏ హామీని కూడా అమలు చేయ కుండా సీఎం కేసీఆర్ ప్రజల నమ్మకాన్ని వమ్ము చేశారని వైఎస్సార్ టీపీ అధ్యక్షు రాలు వైఎస్ షర్మిల విమర్శించారు. ఆమె చేపట్టిన ప్రజా ప్రస్థానం పాదయాత్ర శుక్రవారం ఖమ్మం జిల్లా బోనకల్ మండలంలో కొనసాగింది. ఈ సందర్భంగా పలు గ్రామాల్లో ప్రజలనుద్దేశించి షర్మిల మాట్లాడారు. ప్రజలు తమకు అధికారం అప్పగిస్తే వైఎస్సార్ సంక్షేమ పథకాలన్నింటినీ తిరిగి అమలు చేస్తానని, మాట మీద నిలబడే రాజన్న బిడ్డగా మాట ఇస్తున్నానని తెలిపారు. వైఎస్సార్ వ్యవసాయాన్ని పండుగలా చేస్తే.. కేసీఆర్ తన విధానాలతో రైతులు ఆత్మహత్య చేసుకునేలా చేశారని మండిపడ్డారు. వైఎస్సార్ ఏక కాలంలో రుణమాఫీ చేయగా, కేసీఆర్ నేటికీ రుణమాఫీ చేయకుండా రైతులను నిస్సహాయ స్థితిలోకి నెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశా రు. రైతుబంధు పేరిట రూ.5వేలు ఇస్తూ మిగతా పథకాన్నీ తొలగించారని విమర్శించారు. పలు గ్రామాల్లో పొలాల్లో పనిచేస్తున్న రైతుల సమస్యలు తెలుసుకున్న షర్మిల.. కాసేపు ట్రాక్టర్ నడిపారు. తరువాత అరక దున్నారు. -
కేసీఆర్‌కు ‘ముందస్తు’కు వెళ్లే ధైర్యం లేదు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మధ్యంతర ఎన్నికలు వచ్చే అవకాశమే లేదని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తేల్చిచెప్పారు. సీఎం కేసీఆర్‌కు ముందస్తు ఎన్నికలకు వెళ్లే ధైర్యం లేదన్నారు. శనివారం ప్రజాప్రస్థానం పాదయాత్ర పునఃప్రారంభం సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలకు వెళ్తారన్నారు. ప్రజల కోసం చేపట్టిన ప్రజాప్రస్థానం పాదయాత్ర అధికార పార్టీకి వణుకు పుట్టిస్తోందని చెప్పారు. నడిచేది తానే అయినా నడిపించేది మాత్రం ప్రజలేనన్నారు. షర్మిలను ఆదరిస్తున్నారంటే.. అందుకు వైఎస్సారే కారణమని పేర్కొన్నారు. కాగా, శనివారం నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా ట్విట్టర్లో షర్మిల ఘన నివాళి అర్పించారు. పరిపాలనలో నూతన సంస్కరణలు చేపట్టిన గొప్ప నాయకులు ఎన్టీఆర్ అని అన్నారు. తాళ్లమడలో పునఃప్రారంభం.. ‘టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఒక బ్లాక్ మెయిలర్. ఓటుకు నోటు కేసులో దొరి కిన దొంగ. రెడ్డి స మాజానికి అధికారం ఇవ్వాలని, నాయకత్వం కట్టబెట్టాలని ఆయన చెబుతున్నా రు. అంటే మిగిలిన కులాలు నాయకత్వానికి పనికిరావా? పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కుల రాజకీయం చేస్తుంటే.. అధిష్టానం కనీస చర్యలు ఎందుకు తీసుకోవ డం లేదో చెప్పాలి’అని వైఎస్ షర్మిల ప్రశ్నించారు. ఆమె చేపట్టిన ప్రజాప్రస్థానం పాద యాత్ర ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం తాళ్లమడలో శనివారం పునఃప్రారంభం అయ్యింది. ఈ సం దర్భంగా మాట్లాడుతూ.. వైఎస్సార్ వల్లే కేంద్రం, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందనే ఒక్క నిజాన్ని మాత్రమే రేవంత్ చెప్పాడన్నారు. అయితే, వైఎస్సార్ ఏనాడూ ఒక కులం తక్కువ.. ఒక కులం ఎక్కువ అని చెప్పలేదని గుర్తు చేశారు. ఇక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మత రాజకీయాలు చేస్తూ, పిచ్చివాడిలా మాట్లాడుతున్నారన్నారు. -
'ప్రజల ఆకాంక్షను పూర్తి చేసే వరకు ప్రజా ప్రస్థానం ఆగదు'
సాక్షి, ఖమ్మం: వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చేపడుతున్న మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర సత్తుపల్లి మండలం తాళ్ళమడ వద్ద 1000 కిలోమీటర్లు చేరుకుంది. ఈ సందర్భంగా నిర్మించిన వైఎస్సార్ పైలాన్‌ను వైఎస్ షర్మిల, వైఎస్ విజయమ్మతో కలిసి ఆవిష్కరించారు. అనంతరం సత్తుపల్లి బస్టాండ్ చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన బహిరంగసభలో వైఎస్ విజయమ్మ మాట్లాడుతూ.. షర్మిలమ్మ పాదయాత్రకు మద్దతుగా వచ్చిన అందరికీ నమస్కారాలు. తెలంగాణ ప్రజల ఆకాంక్షను పూర్తి చేసే వరకు ప్రజా ప్రస్థానం ఆగదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్ పాదయాత్ర సరికొత్త చరిత్ర సృష్టించింది. మాట తప్పని మడమ తిప్పని నేత రాజశేఖర్ రెడ్డి కూతురు షర్మిల. అందరి సంక్షేమం కోసమే షర్మిల పాదయాత్ర. రాజశేఖర్‌రెడ్డి ముద్దు బిడ్డ షర్మిలమ్మ. సంక్షేమంలో తెలంగాణకు వైఎస్సార్ పెద్దపీట వేశారు. రాజశేఖర్‌రెడ్డి లేని లోటు ఎవరూ తీర్చలేనిది. వైఎస్సార్ చనిపోయాక ఆయన పేరును ఎఫ్ఐఆర్లో పెట్టి ఆ కుటుంబాన్ని వేధించారు. జగన్‌ను అక్రమంగా నిర్భందించినపుడు 3012 కిలోమీటర్ల మేర షర్మిల పాదయాత్ర చేపట్టింది. పాదయాత్ర మరలా చేయాల్సి వస్తుందని ఏనాడు అనుకోలేదు. బంగారు తెలంగాణ కోసం, గొప్ప సంకల్పంతో పాదయాత్రతో షర్మిల మీ ముందుకు వచ్చింది ఆశీర్వదించండి' అని వైఎస్ విజయమ్మ కోరారు. చదవండి: (పాలమూరుపై టీఆర్ఎస్ కక్ష కట్టింది: బండి సంజయ్) -
‘బలిదానాలతోనే తెలంగాణ’
సాక్షి,బూర్గంపాడు(భద్రాద్రి): వందల మంది ప్రాణత్యాగం..వేల మంది ఆస్తుల త్యాగంతో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిందని, తెలంగాణ కోసం సీఎం కేసీఆర్ కుటుంబంలో ఎంతమంది ప్రాణత్యాగం చేశారో చెప్పాలని వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రశ్నించారు. ఆమె చేపట్టిన ప్రజాప్రస్థానం పాదయాత్ర గురువారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలో కొనసాగింది. జిన్నెగట్టు గ్రామం నుంచి ప్రారంభమైన పాదయాత్ర వివిధ గ్రామాల్లో సాగింది. ఉప్పుసాక గ్రామంలో జరిగిన రైతుగోస సభలో షర్మిల మాట్లాడుతూ..ఉద్యమ సమయం నుంచి నేటి వరకు టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ సెంటిమెంట్‌ను వాడుకుంటూ అధికారాన్ని అనుభవిస్తోందని, తెలంగాణ ఆత్మగౌరవం కేసీఆర్ పాదాల కింద నలిగిపోతోందని ఆరోపించారు. రాజన్న బిడ్డగా ఆశీర్వదిస్తే తిరిగి రాష్ట్రంలో వైఎస్సార్ పాలన తీసుకొస్తామన్నారు. దీక్షలో వైఎస్సార్ టీపీ ఉమ్మడి ఖమ్మం జిల్లా కో ఆర్డినేటర్ గడిపల్లి కవిత, భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు నరాల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
కేసీఆర్ అన్ని వర్గాలను మోసం చేశారు: షర్మిల
సాక్షి,భద్రాద్రి(పాల్వంచ): ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలోని అన్ని వర్గాలను మోసం చేశారని వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్ర బుధవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మున్సి పాలిటీ పరిధిలోని కరకవాగు గ్రామానికి చేరుకుంది. ఈ సందర్భంగా గ్రామంలో ఏర్పాటు చేసిన రైతుగోస దీక్షలో ఆమె మాట్లాడారు. కేజీ టు పీజీ ఉచిత విద్య పేరిట విద్యార్థులను, పోడు భూములకు పట్టాలిస్తామని ఆదివాసులను, నిరుద్యోగ భృతి అని యువకులను, డబుల్ బెడ్రూం ఇళ్ల పేరిట పేదలను ఇలా సీఎం కేసీఆర్ మోసం చేయని వర్గమం టూ లేదని విమర్శించారు. దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఖమ్మం జిల్లాలో 1.9 లక్షల ఎకరాలకు పట్టాలు ఇస్తే, ఆ తర్వాత ఎవరికీ పట్టాలు ఇచ్చిన దాఖలాలే లేవని తెలి పారు. కొత్తగూడెం ఎమ్మెల్యే, ఆయన కుమారుడి అరాచకాలకు అంతే లేదని షర్మిల ధ్వజమెత్తారు. ఈ దీక్షలో ఉమ్మడి ఖమ్మం జిల్లా కో ఆర్డినేటర్ గడిపెల్లి కవిత, భద్రాద్రి జిల్లా అధ్య క్షుడు నరాల సత్యనారాయణ పాల్గొన్నారు. -
వరి పండించొద్దు అనే అధికారం నీకెక్కడిది: వైఎస్ షర్మిల
సాక్షి, సూర్యాపేట: నిరుద్యోగుల పక్షాన మేము దీక్ష చేస్తే కానీ విపక్షాలకు సోయి, ప్రభుత్వానికి బుద్ధి రాలేదని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల అన్నారు. ఈ మేరకు ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలోని వెలుగుపల్లి గ్రామంలో మంగళవారం రోజున చేపట్టిన నిరుద్యోగ నిరాహార దీక్షలో వైఎస్ షర్మిల మాట్లాడారు. 'రాష్ట్రంలో మూడు లక్షల తొంభై వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని పీఆర్సీ నివేదికుంది, బస్వాల్ కమిటీ కూడా అదే చెప్పింది. 89 వేల ఉద్యోగాల ఖాళీ లెక్క మీరు ఎవరిచ్చారు. ఏ నిరుద్యోగి అడగక ముందే నిరుద్యోగ భృతి 3,116 ఇస్తానని ఎన్నికల్లో హామీ ఇచ్చారు. కేసీఆర్ మాటిచ్చి 40 నెలలు గడుస్తోంది. ఉద్యోగాలు రాలేదు, నిరుద్యోగ భృతి అమలు కాలేదు. అంటే ప్రతి నిరుద్యోగికి ఈ 40 నెలల కాలంలో మీరు లక్షా ఇరవై వేల రూపాయలు నిరుద్యోగభృతి ఇవ్వాలని వైఎస్సార్ తెలంగాణ పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నాం. ప్రతి మంగళవారం నిరుద్యోగుల కోసం నిరుద్యోగ వారంగా ప్రకటించి దీక్ష చేస్తున్న. చదవండి: (కాంట్రాక్ట్ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త) కేసీఆర్ పండించిన ప్రతి వరి గింజ కొంటానని హామీ ఇచ్చాడు. ఇప్పుడు పంట వద్దు అంటున్నాడు. వరి పండించొద్దు అనే అధికారం నీకెక్కడిది. కేసీఆర్ మెడలు వంచయినా సరే వడ్లు కొనిపిస్తాం. ఆమరణ నిరాహార దీక్ష చేసైనా సరే వడ్లు కొనేదాకా పోరాడదాం. తెలంగాణ తల్లి సాక్షిగా ఇందిరా పార్కు వద్ద మూడు రోజులు నిరాహార దీక్ష చేయాలని నిరుద్యోగ పక్షాన దీక్ష చేస్తుంటే గాయపరచి దీక్ష భగ్నం చేశారు. అయినా దీక్ష కొనసాగించాం. 10 లక్షల మంది కార్పొరేషన్ లోన్లు పెట్టుకుంటే వాళ్లకు ఇవ్వడం చేతకాలేదు. కేసీఆర్ ఉద్యోగ నియామకాలు చేపట్టి ఉంటే ఇంత మంది నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకునేవారూ కాదు. నీకు చేత కాకుంటే పక్కకు తప్పుకొని ఒక దళితున్ని ముఖ్యమంత్రి చేయమని వైఎస్సార్ తెలంగాణ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం' అని వైఎస్ షర్మిల అన్నారు. -
39వ రోజు వైఎస్ షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్ర
-
అడుగడుగునా ప్రజల నీరాజనం
-
వైఎస్సార్ పాలనను తిరిగి తెస్తాం: షర్మిల
సాక్షి, రామన్నపేట: వైఎస్సార్ కాలం నాటి సంక్షేమ పాలనను తిరిగి తీసుకురావడమే వైఎస్సార్ తెలంగాణ పార్టీ లక్ష్యమని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చెప్పారు. షర్మిల చేపట్టిన ప్రజాప్రస్థానం పాదయాత్ర సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం సిరిపురం, వెల్లంకి, గొల్నేపల్లి గ్రామాల మీదుగా 10 కి.మీ. సాగింది. ఆయా గ్రామాల ప్రధాన కూడళ్లలో జరిగిన సభల్లో ఆమె ప్రజలనుద్దేశించి మాట్లాడారు. ప్రజలు ఆశీర్వదించి అధికారమిస్తే రాజన్నబిడ్డగా చివరిక్షణం వరకు తెలంగాణ ప్రజల బాగు కోసం పాటుపడతానని హామీ ఇచ్చారు. వైఎస్ తన ఐదేళ్ల పాలనలో ఎలాంటి పన్నులు విధించకుండా అన్నివర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందించి మోడల్ సీఎంగా నిలిచారని అన్నారు. పారదర్శక పాలన అందించాలనే పరితపించి ప్రజలవద్దకు వెళ్తుంటే ప్రాణాలు వదిలాడని భావోద్వేగంతో చెప్పారు. రాష్ట్రంలో రైతులు, చేనేత కార్మికులు, యువకుల ఆత్మహత్యలు సీఎం కేసీఆర్‌కు పట్టడం లేదని విమర్శించారు. ఆమె వెంట పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిట్ట రాంరెడ్డి, జిల్లా కో–ఆర్డినేటర్ మహ్మద్‌అత్తార్ తదితరులు ఉన్నారు. -
యాదాద్రి: 25వ రోజుకు చేరిన వైఎస్ షర్మిల పాదయాత్ర
-
సీఎం కేసీఆర్ పై సంచలన కామెంట్స్ చేసిన వైఎస్ షర్మిల
-
ప్రజా ప్రస్థానం పాదయాత్ర వాయిదా
సాక్షి, నార్కట్‌పల్లి: ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ప్రజా ప్రస్థానం పాదయాత్రను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తెలిపారు. కోడ్ ముగిసిన వెంటనే తిరిగి యాత్ర ప్రారంభమవుతుందని చెప్పారు. 21 రోజుల్లో సాగిన యాత్రలో ఆరు నియోజకవర్గాల్లోని 150 గ్రామాలను సందర్శించినట్లు పేర్కొన్నారు. నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం కొండపాకగూడెం గ్రామంలో బుధవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం యాసంగిలో వరి ధాన్యం మొత్తాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రైతులకు మద్దతుగా తాను హైదరాబాద్‌లో ఈ నెల 12వ తేదీ నుంచి 72 గంటల పాటు నిరాహార దీక్ష చేయనున్నట్లు ప్రకటించారు. రాష్టంలో సమస్యలే లేవని పాలకులు చెబుతున్నారని, కానీ తన పాదయాత్రలో ప్రజలు ఎన్నో సమస్యలు వివరించారని, తాను కూడా కళ్లారా చూశానని అన్నారు. ఈ ప్రాంత ప్రజల సాగు, తాగునీటి సమస్య పరిష్కరించేందుకు దివంగత మహానేత వైఎస్సార్ ప్రాజెక్టులను ప్రారంభిస్తే నేటికీ వాటిని పూర్తి చేయకుండా టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ధ్వజమెత్తారు. యాసంగిలో వరి ధాన్యం కోనుగోలు చేయబోమని కేసీఆర్ ప్రకటించడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు. కేసీఆర్ ఏడేళ్ల పాలనలో 8 వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారన్నారు. టీఆర్ఎస్ పార్టీ తిరిగి అధికారంలోకి రాకుండా ప్రతి ఒక్కరూ చూడాలని, అప్పుడే అందరి బతుకుల్లో మార్పు వస్తుందని పేర్కొన్నారు. వైఎస్సార్ తెలంగాణ పార్టీని రానున్న ఎన్నికల్లో గెలిపిస్తే రైతులను ఆదుకుంటామని, నచ్చిన పంటలు సాగుచేసుకోవచ్చని, దానికి మద్దతు ధర ప్రకటించి కొనుగోళ్లు చేస్తామని చెప్పారు. ఉద్యోగాలు, రైతుల బ్యాంక్ రుణాల మాఫీ, పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, అర్హులందరికీ పెన్షన్లు అందిస్తామని షర్మిల హామీ ఇచ్చారు. -
పాదయాత్రకు విరామం
-
చందమామను చూసి కుక్కలు మొరగటం సహజం: వైఎస్ షర్మిల
-
తెలంగాణలో తాలిబన్ల పాలన
ఇబ్రహీంపట్నం రూరల్/కందుకూరు: రాష్ట్రంలో తాలిబన్ల పాలన సాగుతోందని వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ను గద్దె దింపి, సంక్షేమ పాలనను తీసుకొస్తానని, తనకు ఒక్కసారి అవకాశం ఇస్తే జీవితాంతం ప్రజాసేవకే అంకితమవుతానని ఆమె తెలిపారు. షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్ర 8వ రోజు బుధవారం రంగారెడ్డి జిల్లా కందుకూరు, ఇబ్రహీంపట్నం మండలాల్లో కొనసాగింది. ఎల్మినేడు గ్రామంలో అమృతసాగర్ ఆధ్వర్యంలో బతుకమ్మలతో స్వాగతం పలికారు. అనంతరం గ్రామస్తులతో కలసి షర్మిల బతుకమ్మ ఆడారు. వైఎస్సార్ విగ్రహం వద్ద ఆ పార్టీ జెండాను ఆవిష్కరించిన అనంతరం మాటాముచ్చట కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి షర్మిల మాట్లాడారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, అర్హులకు పింఛన్లు రావడం లేదని, డబుల్ బెడ్రూం ఇళ్ల ఊసే లేదన్నారు. దళితులకు మూడెకరాల భూమి ఏమైందని ప్రశ్నించారు. పంటలు వేసుకునే స్వేచ్ఛను రైతులకు వదిలేయాలని, ఈ విషయంలో అవసరమైతే రైతుల పక్షాన పోరాటం చేస్తామని చెప్పారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్పులు ఇవ్వకుండా ప్రభుత్వం చదువులను అడ్డుకుంటోందని, ముస్లిమ్ రిజర్వేషన్లు 12 శాతం పెంచుతామని మాట తప్పారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏడేళ్లలో 8 వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని తెలిపారు. ప్రజలకోసం వైఎస్ఆర్లా పనిచేస్తా.. ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం జరుగుతోందని, రెండుసార్లు అధికారం ఇచ్చినా ప్రజలకు ఆయన చేసిందేమీ లేదని షర్మిల విమర్శించారు. వైఎస్ ఎంత అద్భుతంగా పాలన సాగించారో అందరికీ తెలుసని, తానూ ఆయనలా మాట మీద నిలబడి పని చేస్తానని హామీ ఇచ్చారు. ప్రజల కోసం పుట్టిన పార్టీ వైఎస్సార్టీపీ మాత్రమేనన్నారు. కాగా, మధ్యాహ్నం సమయంలో వైఎస్ విజయమ్మ షర్మిలను కలిశారు. టీవీ యాంకర్ శ్యామల షర్మిలతో కలసి పాదయాత్రలో పాల్గొని సంఘీభావం తెలిపారు. షర్మిల ఎల్మినేడులో రాత్రి బస చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్టీపీ అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి, నియోజకవర్గం ఇన్చార్జి వేణుగోపాల్‌రెడ్డి, పిట్టా రాంరెడ్డి, ఏపూరి సోమన్న, ముజితాబ్ హైమాద్, స్థానిక నాయకులు అమృతసాగర్ , కేసరి సాగర్, జంగయ్యగౌడ్, భాస్కర్, రవి, వేణుగోపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
YS Sharmila: చేతకాకపోతే గద్దె దిగు
కందుకూరు: ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పాలన చేతకాక పోతే దిగిపోవాలని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. నిరుద్యోగులను నిండా ముంచారని, టీఆర్ఎస్ పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం జరుగు తోందని మండిపడ్డారు. షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్ర మంగళవారం ఉదయం అగర్ మియాగూడ నుంచి తిమ్మాపూర్‌కు చేరుకుంది. అక్కడ నిరుద్యోగుల కోసం నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అమెరికా నుంచి ఊడిపడ్డ తన బిడ్డలకే కేసీఆర్ ఉద్యోగాలు ఇచ్చారన్నారు. నిజామాబాద్‌లో తన కుమారై ఉద్యోగాన్ని జనాలు ఊడకొడితే ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టారని దుయ్యబట్టారు. ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి ఏమైందని ప్రశ్నించారు. నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే కేసీఆర్‌కు సోయిలేదని, దున్నపోతు మీద వాన పడినట్లుగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. వైఎస్సార్ పాలనలో ఏ ఒక్కరూ ఆత్మహత్య చేసుకోలేదని ఆమె చెప్పారు. ఐదేళ్ల పాలనలో మూడుసార్లు నోటిఫికేషన్లు ఇచ్చి లక్షల ఉద్యోగాలు భర్తీ చేశారని, 2008లో డీఎస్సీతో 54 వేల టీచర్ ఉద్యోగాలను భర్తీ చేసి రికార్డు సృష్టించారని పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన కేసీఆర్.. లిక్కర్‌తోనే పాలన సాగిస్తున్నారని ఆరోపించారు. కేజీ టు పీజీ ఉచిత విద్య, దళితులకు మూడెకరాల భూమి, ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు ఇంతవరకు అమలు చేయలేదని పేర్కొన్నారు. మాట తప్పితే రాళ్లతో కొట్టమన్న కేసీఆర్‌ను ఇప్పుడు ఏం చేయమంటారో చెప్పాలన్నారు. ‘నక్కలు ఎరుగని బొక్కలు లేవు, నాగులు ఎరుగని పుట్టలు లేవన్న’ చందంగా కేసీఆర్ పాలన ఉందని ఎద్దేవా చేశారు. ఖాళీగా ఉన్న 1.91 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేయాలని, కొత్త జిల్లాలు, మండలాల్లో ఉన్న 3.85 లక్షల ఖాళీలను సైతం భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే అర్హులందరికీ ఉద్యోగాలు ఇస్తామని షర్మిల హామీ ఇచ్చారు. అంతకుముందు షర్మిల వైఎస్సార్, అంబేడ్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కాగా బుధవారం రాచులూరు, గాజులబురుజుతండా, బేగంపేట, మాదాపూర్ గ్రామాల్లో పాదయాత్ర కొనసాగనుంది. సాయంత్రం ఇబ్రహీంపట్నం మండలం ఎలిమినేడుకు చేరుకోనుంది. -
కేసీఆర్ కుటుంబానికే ఉద్యోగాలు వచ్చాయి
-
మహేశ్వరంలో షర్మిల పాదయాత్ర
-
‘వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ’
సాక్షి,మహేశ్వరం( హైదరాబాద్): బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలతో పొత్తులు పెట్టుకోబోమని, వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పష్టం చేశారు. అత్యధిక స్థానాలను కైవసం చేసుకొని అధికారం చేపడతామని ధీమా వ్యక్తం చేశారు. టీఆర్ఎస్, బీజేపీ కలిసి పని చేస్తున్నాయని చెప్పారు. బీజేపీతో వైఎస్సార్టీపీ పొత్తు ఉంటుందని టీఆర్ఎస్ అనడం వారి అవివేకానికి నిదర్శనమని పేర్కొన్నారు. షర్మి ల ప్రజా ప్రస్థానం పాదయాత్ర ఆదివారం రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండల పరిధిలోని నాగారం, కొత్త తండా చౌరస్తా, డబిల్‌గూడ చౌరస్తా, మన్సాన్పల్లి చౌరస్తా, మన్సాన్పల్లి, కేసీ తండా చౌరస్తా మీదుగా సాగింది. ఈ సందర్భంగా మహేశ్వరంలో ఏర్పాటు చేసిన సభలో ఆమె మాట్లాడారు. సీఎం కేసీఆర్ కేసులకు భయపడి ఢిల్లీలో నరేంద్ర మోదీ, అమిత్‌షాల వద్దకు వెళ్లి ఒంగి ఒంగి దండాలు పెడుతున్నారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం చేతిలో కేసీఆర్ అవినీతి చిట్టా ఉన్నా.. తమకు భవిష్యత్తులో అవసరమొస్తారనే ఉద్దేశంతో ఏమీ అనడం లేదన్నారు. కేసీఆర్ ఫాం హౌస్‌లకు సాగునీరు అందించేందుకే కాళేశ్వరం ప్రాజెక్టును యుద్ధ ప్రాతిపదికన నిర్మించారని ఆరోపించారు. రాష్ట్రంలో ఉద్యోగాలు దొరక్క నిత్యం ఏదో ఒకచోట నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రజలకు ఎలాంటి సమస్యలు లేవని నిరూపిస్తే, తాను పాదయాత్ర నిలిపివేసి క్షమాపణ చెప్పి ముక్కు నేలకు రాస్తానని పునరుద్ఘాటించారు. కాంగ్రెస్‌తో టీఆర్ఎస్ పొత్తు ఉంటుందని జోస్యం చెప్పారు. దివంగత నేత వైఎస్సార్ పాలనలో సువర్ణ పాలన కొనసాగిందని, వైఎస్సార్టీపీకి ఆవకాశం ఇస్తే మళ్లీ రాజన్న రాజ్యం తీసుకొస్తామని హామీ ఇచ్చారు. పాదయాత్రలో భాగంగా రైతులు, వృద్ధులు, మహిళలు, యువకులు, కూలీలతో షర్మిల ముచ్చటించి వారి సమస్యలు తెలుసుకున్నారు. భారీయెత్తున ప్రజలు హాజరైన సభలో వైఎస్సార్టీపీ అధికార ప్రతినిధులు కొండా రాఘవారెడ్డి, ఏపూరి సోమన్న, పిట్ట రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాగా పాదయాత్రలో ఉన్న షర్మిలను ఆదివారం టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, వైఎస్ విజయమ్మ వేర్వేరుగా కలుసుకుని మాట్లాడారు. చదవండి: పొమ్మనలేక పొగపెట్టారు: ఈటల ∙ -
ఐదో రోజు ముగిసిన వైఎస్ షర్మిల పాదయాత్ర
సాక్షి, రంగారెడ్డి జిల్లా: వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పాదయాత్ర ఐదో రోజు ముగిసింది. ఐదోరోజు మొత్తం 12.6 కిలోమీటర్ల మేర వైఎస్ షర్మిల పాదయాత్ర చేశారు. కొత్తతండా, డబీల్ గూడ, మన్సాన్ పల్లి, కొత్వాల్ తండా మహేశ్వరం వరకు పాదయాత్ర సాగింది. ఇప్పటివరకు చేవెళ్ల నుంచి మహేశ్వరం వరకు 60 కిలో మీటర్లు పాదయాత్ర సాగింది. మహేశ్వరంలో జరిగిన బహిరంగ సభలో వైఎస్ షర్మిల మాట్లాడుతూ, కేసీఆర్ ఫాం హౌస్ కోసమే కాళేశ్వరం నీళ్లు అంటూ విమర్శలు గుప్పించారు. విద్యా శాఖమంత్రి ఇలాకాలో కనీసం డిగ్రీ కాలేజీ కూడా లేదని ధ్వజమెత్తారు. ఎన్నికల్లో ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోమని వైఎస్ షర్మిల స్పష్టం చేశారు. -
కేసీఆర్ అన్ని వర్గాలను మోసం చేశారు
-
వైఎస్సార్ సంక్షేమ పాలన రావాలి..
శంషాబాద్ రూరల్: ‘కేసీఆర్ సర్కారు పోవాలి.. వైఎస్సార్ సంక్షేమ పాలన రావాలి.. ఇందుకోసం మనమంతా చేయి చేయి కలపాలి’అని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి షర్మిల అన్నారు. రెండు సార్లు కేసీఆర్‌కు ఓటేసి తెలంగాణ ప్రజలు మోసపోయారని, మరోసారి అలా కాకుండా తనను ఆశీర్వదించాలని ఆమె కోరారు. ‘ప్రజా ప్రస్థానం’మహా పాదయాత్రలో భాగంగా రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని పెద్దగోల్కొండలో శనివారం స్థానికులతో మాటా ముచ్చట కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్ షర్మిల మాట్లాడుతూ.. కేసీఆర్ పరిపాలన చేస్తున్నారా.. గాడిదలు కాస్తున్నారా? అని ప్రశ్నించారు. ఫాంహౌస్‌లో నిద్రపోతున్న కేసీఆర్ పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం జరుగుతోందన్నారు. వైఎస్సార్ హయంలో రెండేళ్లకోసారి నోటిఫికేషన్ ఇచ్చి లక్షల ఉద్యోగాలు భర్తీ చేశారని గుర్తు చేశారు. జంబో డీఎస్సీ ద్వారా 58 వేల టీచరు ఉద్యోగాలను ఒకే సారి భర్తీ చేసిన ఘనత వైఎస్సార్‌కు దక్కుతుందన్నారు. రైతులకు ఒకేసారి రూ.లక్ష వరకు రుణ మాఫీ చేసిన వైఎస్సార్, ప్రజలపై ఎలాంటి పన్నుల భారం లేకుండా పాలన సాగించారని పేర్కొన్నారు. మీ అందరి ఆశీర్వాదంతో మళ్లీ వైఎస్సార్ సంక్షేమ పాలన సాధ్యమవుతుందని అన్నారు. కేజీ టు పీజీ చదువులెక్కడ.. ‘కేజీ టు పీజీ వరకు ఉచితంగా చదివిస్తానని కేసీఆర్ హామీ ఇచ్చారు.. కాని తెలంగాణలో పిల్లల చదువుల కోసం తల్లులు తాళీబొట్టు అమ్ముకుంటూ ఫీజులు కడుతున్న పరిస్థితులు ఉన్నాయి’అని షర్మిల ధ్వజమెత్తారు. ఇంటికో ఉద్యోగం ఏమైందని నిలదీశారు. ఉద్యోగం ఇవ్వకుంటే రూ.3,016 నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి అది కూడా ఇవ్వకుండా మోసం చేశారని దుయ్యబట్టారు. పెట్రోలు, డీజిల్ ధరల పెంపులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సమాన వాటా ఉందన్నారు. ఏ ఒక్క విషయంలో తెలంగాణ ప్రజలను కేసీఆర్ ఆదుకున్నారో చెప్పాలన్నారు. ఇందుకోసమేనా కేసీఆర్‌ను సీఎం చేసింది అని ప్రశ్నించారు. ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్, రైతులకు రుణ మాఫీ, పావలావడ్డీ రుణాలు, మైనార్టీలకు 4 శాతం రిజర్వేషన్.. ఇలా ప్రతి వర్గానికి మేలు చేసి ఐదేళ్లలో ఒక్కసారి కూడా ఎలాంటి చార్జీలు పెంచకుండానే సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అద్భుతంగా చేసి చూపించిన నాయకుడు వైఎస్సార్ అని కొనియాడారు. ‘మళ్లీ అదే వైఎస్సార్ సంక్షేమ పాలన తీసుకురావడానికి నేను వచ్చాను’అని స్పష్టం చేశారు. తొండుపల్లి శివారు నుంచి శనివారం ప్రారంభమైన షర్మిల పాదయాత్ర గొల్లపల్లి, రషీద్‌గూడ, హమీదుల్లానగర్, చిన్నగోల్కొండ, పెద్దగోల్కొండ మీదుగా రాత్రికి మహేశ్వరం మండలం నాగారం గ్రామానికి చేరుకుంది. ఆయా గ్రామాల్లో వృద్ధులు, మహిళలు వారి సమస్యలను షర్మిలకు విన్నవించుకున్నారు. -
కేసీఆర్ ఉప ఎన్నికల ముఖ్యమంత్రి
శంషాబాద్: ‘కేసీఆర్ తెలంగాణకు సీఎంలా పనిచేస్తలేడు.. ఉప ఎన్నికల ప్రాంతాలకు మాత్రమే సీఎంగా పనిచేస్తుండు. దళితబంధు హుజూరాబాద్‌లోనే ఎందుకు పెట్టారు? ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గాల్లో ఎందుకు ప్రవేశపెట్టలేదు?’అని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల ప్రశ్నిం చారు. ఎన్నికల కోసం పథకాలు ప్రవేశపెట్టి ఆ తర్వాత వాటిని నిలిపేయడం కేసీఆర్‌కు అలవాటుగా మారిందని దుయ్యబట్టారు. మూడోరోజు పాదయాత్రలో భాగంగా వైఎస్ షర్మిల శంషాబాద్‌లోని రాళ్లగూడదొడ్డి, ఇంద్రానగర్, మధురానగర్ కాలనీల మీదుగా పాదయాత్ర చేశారు. అనంతరం శంషాబాద్‌లోని అంబేడ్కర్ విగ్రహానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ‘నా పాదయాత్రపై విమర్శలు చేసిన కేటీఆర్ రాష్ట్రంలో సమస్యలు లేవని నిరూపిస్తే నేను ముక్కు నేలకు రాసి పాదయాత్ర ముగిస్తాను. సమస్యలుంటే మీరు రాజీనామాలు చేస్తారా?’అని సవాల్ విసిరారు. మహానేత వైఎస్సార్‌ది సుపరిపాలన మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి సుపరిపాలన చేసి చూపెట్టారన్నారు. ఐదేళ్లలో పన్నులు పెంచకుండా రాష్ట్ర ప్రజలకు మంచి చేసి మార్గదర్శకులుగా నిలిచారని షర్మిల అన్నారు. మళ్లీ అలాంటి పరిపాలన రావాలంటే ప్రజలు చైతన్యవం తులై టీఆర్ఎస్ గద్దె దింపాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌కు ఓటేస్తే టీఆర్ఎస్కు వేసినట్లేనన్నారు. రాజన్న రాజ్యం రావాలంటే వైఎస్సార్ తెలంగాణ పార్టీని ఆశీర్వదించాలని కోరారు. అనంతరం పాదయాత్ర గొల్లపల్లి మీదుగా పోశెట్టిగూడ వరకు చేరుకుంది. కార్యక్రమంలో కొండా రాఘవరెడ్డి, ఏపూర్తి సోమన్న, శంషాబాద్ నేతలు అక్రమ్‌ఖాన్ ఉన్నారు. జనాన్ని పలకరిస్తూ ముందుకు.. శంషాబాద్ రూరల్: షర్మిల చేపట్టిన ‘ప్రజాప్రస్థానం’పాద యాత్ర శుక్రవారం మూడో రోజు మండలంలోని కాచారం నుంచి ప్రారంభమైంది. సుల్తాన్‌పల్లి చౌరస్తా, నర్కూడ, రాళ్లగూడ మీదుగా సాయంత్రం శంషాబాద్‌కుS చేరుకుంది. దాదాపు 10 కి.మీటర్ల దూరం వరకు సాగిన యాత్రలో దారి పొడవునా జనాన్ని పలకరిస్తూ, వారి సమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగారు. -
రెండోరోజు ముగిసిన వైఎస్ షర్మిల పాదయాత్ర
సాక్షి, రంగారెడ్డి: వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పాదయాత్ర రెండోరోజు ముగిసింది. శంషాబాద్ మండలం క్యాచారం వరకు పాదయాత్ర సాగింది. అక్కడే క్యాచారంలో వైఎస్ షర్మిల బస చేయనున్నారు. నేడు 12 కిలోమీటర్ల మేర షర్మిల పాదయాత్ర చేశారు. మొయినాబాద్ మండలం నక్కలపల్లి నుంచి క్యాచారం వరకు సాగిన పాదయాత్రకు భారీగా అభిమానులు తరలి వచ్చారు. ఇప్పటి వరకు 24 కిలోమీటర్లు పాదయాత్ర కొనసాగింది. రేపు ఉదయం 10 గంటలకు శంషాబాద్ మండలంలో తిరిగి పాదయాత్ర ప్రారంభం కానుంది. -
ప్రజాసమస్యలు నేను చూపిస్తా
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ‘అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్, ఆయన తనయుడు కేటీఆర్ తెలంగాణ అంతా ఎంతో సుభిక్షంగా ఉందని, ఇక్కడి ప్రజలకు ఎలాంటి సమస్యలు లేవని పదేపదే చెబుతున్నారు. నేను పాదయాత్రకు వెళ్తున్నా..దమ్ముంటే నాతో కలిసి పాదయాత్రకు రండి. చేసిన అభివృద్ధిని మీరు చూపించండి. ప్రజా సమస్యలను నేను చూపిస్తా. మీరు చెప్పినట్లు తెలంగాణలో ప్రజా సమస్యలే లేకపోతే..నా ముక్కు నేలకురాసి, ఇంటికెళ్లిపోతా. అదే సమస్యలున్నట్లు నిరూపిస్తే సీఎం పదవికి కేసీఆర్, మంత్రి పదవికి కేటీఆర్ రాజీనామా చేస్తారా?..’ అని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల ప్రశ్నించారు. బుధవారం చేవెళ్ల నుంచి ‘ప్రజా ప్రస్థానం’ పేరుతో ఆమె పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బంగారు తెలంగాణ పేరుతో మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని విమర్శించారు. ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పి అనేక మందిని ఉద్యోగాల నుంచి తొలగించారని, రైతులు, విద్యార్థులు, నిరుద్యోగుల ఆత్మహత్యల కు, హత్యలకు కేసీఆర్, ఆయన కుటుంబమే కారణమని ఆరోపించారు. పాదయాత్రలో ప్రజలకు అభివాదం చేస్తున్న వైఎస్ షర్మిల. చిత్రంలో వైఎస్ విజయమ్మ తదితరులు నిధులు ఆయన ఇంటికి : ‘దివంగత నేత వైఎస్సార్ హయాం లో రూ.33 వేల కోట్ల అంచనాతో రూపొందించిన కాళేశ్వరం ప్రాజెక్టును కేవలం కమీషన్ల కోసం రీడిజైన్ చేసి, లక్షా 33 కోట్లకు పెంచారు. తెలంగాణ వచ్చిన తర్వాత నిధులు కేసీఆర్ ఇంటికెళ్లగా..నీళ్లు ఆయన ఫాంహౌస్‌కు, నియామకాలు ఆయన కుటుంబసభ్యులకు వెళ్లాయి. ప్రజా సంక్షేమ పథకాలు, సమగ్ర అభివృద్ధి, నీళ్లు, నిధులు, నియామకాలే లక్ష్యంగా పాదయాత్రను ప్రారంభిస్తున్నా..’ అని షర్మిల చెప్పారు. కేసీఆర్ చేతిలో రేవంత్ పిలక ‘ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేసి, కుటుంబ సంక్షేమానికి పాటు పడుతున్న కేసీఆర్‌ను గద్దె దింపాల్సిన సమయం ఆసన్నమైంది. కాంగ్రెస్ అరువు తెచ్చుకున్న రేవంత్‌రెడ్డి పిలక కేసీఆర్ చేతిలో ఉంది. ఆయన రాహుల్ మాట వినక పోయినా..కేసీఆర్ మాట వినితీరాల్సిందే. కేసీఆర్ అవినీతి చిట్టా చేతిలో ఉందంటూ బీజేపీ అధినేత బండి సంజయ్ పదేపదే చెబుతున్నారు. ఆధారాలు ఉంటే ఎందుకు బయటపెట్టడం లేదు? తెలంగాణలో బీజేపీ, టీఆర్ఎస్ రెండూ ఒక్కటే. వాటిని నమ్మి మరోసారి మోసపోవద్దు..’ అని షర్మిల హెచ్చరించారు. అంతకుముందు ఉదయం 11.30 గంటలకు తల్లి విజయమ్మ సహా షర్మిల సభావేదికపైకి చేరుకున్నారు. సర్వమత ప్రార్థనల అనంతరం తొలుత విజయమ్మ, ఆ తర్వాత షర్మిల మాట్లాడారు. అనంతరం విజయమ్మ పాదయాత్రను ప్రారంభించి, షర్మిలను ఆశీర్వదించారు. కాగా ఎర్రోనికోటాల, కందవాడ, నారాయణదాసుగూడల మీదుగా చేవెళ్ల–మెయినాబాద్ శివారులోని నక్కలపల్లి బస కేంద్రానికి సాయంత్రం 7.30 గంటలకు షర్మిల చేరుకున్నారు. తొలిరోజు మొత్తం పది కిలోమీటర్లు పాదయాత్ర చేసినట్లు పార్టీ వర్గాలు ప్రకటించాయి. అప్పగిస్తున్నా.. ఆశీర్వదించండి: విజయమ్మ పాదయాత్ర ప్రారంభ సభలో దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి సతీమణి వైఎస్ విజయమ్మ మాట్లాడారు. ‘చేవెళ్లకు మా కుటుంబానికి విడదీయరాని అనుబంధం ఉంది. దివంగత నేత వైఎస్సార్ పాదయాత్ర సహా సంక్షేమ పథకాల ప్రారంభోత్సవాలు కూడా ఈ గడ్డ నుంచే ప్రారంభించారు. ఆయన అడుగులో అడుగు వేసేందుకు, ఆయన ఆశయాలకు అనుగుణంగా పని చేసేందుకు ఆయన రక్తం పంచుకుపుట్టిన బిడ్డ షర్మిలను మీకు అప్పగిస్తున్నా. మీరంతా ఆమెకు అండగా నిలవండి. ఆశీర్వదించండి..’ అని పిలుపునిచ్చారు. -
అక్టోబర్ 20 నుంచి ప్రజాప్రస్థాన పాదయాత్ర
సాక్షి, హైదరాబాద్: కేసీఆర్ పాలనలో దగాపడ్డ తెలంగాణ జనానికి గుండె ధైర్యం కల్పిస్తూ అక్టోబర్ 20 నుంచి ప్రజాప్రస్థాన పాదయాత్ర చేయనున్నట్లు వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తెలిపారు. తన తండ్రి, దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి చూపిన బాటలో చేవెళ్ల నుంచే తన యాత్ర మొదలవుతుందని, అక్కడే ముగుస్తుందని ఆమె వెల్లడించారు. లోటస్‌పాండ్‌లో ప్రజా ప్రస్థానం పోస్టర్‌ను విడుదల చేస్తున్న వైఎస్ షర్మిల హైదరాబాద్ లోటస్‌పాండ్‌లోని పార్టీ కార్యాలయంలో సోమవారం షర్మిల మీడియాతో మాట్లాడుతూ, పాదయాత్ర స్వరూపాన్ని, ఉద్దేశాన్ని వివరించారు. గ్రేటర్ హైదరాబాద్ ప్రాంతం మినహా.. 90 నియోజకవర్గాల్లో ప్రతీ పల్లెను, గడపనూ తాకుతూ ఏడాదికిపైగా పాదయాత్ర కొనసాగుతుందని తెలిపారు. పాదయాత్ర మొత్తం తాను రోడ్డు పక్కే ఆవాసం ఏర్పాటు చేసుకుంటానని, ప్రజలతోనే మమేకమవుతానని స్పష్టం చేశారు. ప్రజల కష్టాలు, కన్నీళ్లు ఆలకించేందుకే సమయం కేటాయిస్తానని చెప్పారు. పాదయాత్రలో భాగంగా బహిరంగ సభలూ నిర్వహిస్తామన్నారు. ఈ సందర్భంగా ఆమె కేసీఆర్ పాలనపై నిప్పులు చెరిగారు. 3 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేసి, 36 లక్షల మందికి ఎగ్గొట్టారని, దీంతో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, 16 లక్షల మంది కౌలు రైతులు దిక్కులేని స్థితిలో ఉన్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కేసీఆర్ వచ్చాక దళితులపై 800 శాతం, మహిళలపై 300 శాతం దాడులు పెరిగాయని తెలిపారు. నిరుద్యోగులు బలవన్మరణాలకు పాల్పడుతున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్టయినా లేదన్నారు. పాదయాత్రలకు వైఎస్సార్ కుటుంబమే పెట్టింది పేరని, వైఎస్సార్ పాదయాత్రలోంచే ఉచిత విద్యుత్, ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ పుట్టాయని చెప్పిన షర్మిల.. వైఎస్సార్ సంక్షేమ పాలనను ప్రజలకు గుర్తు చేస్తామన్నారు. ప్రభుత్వం ఉద్యోగ నియామక నోటిఫికేషన్ ఇచ్చే దాకా.. పాదయాత్రలోనూ మంగళవారం దీక్షలు కొనసాగుతాయని షర్మిల చెప్పారు. -
అక్టోబర్ 20 నుంచి వైఎస్ షర్మిల పాదయాత్ర
-
అక్టోబర్ 20 నుంచి వైఎస్ షర్మిల పాదయాత్ర
సాక్షి, హైదరాబాద్: అక్టోబర్ 20 నుంచి పాదయాత్ర చేపడుతున్నట్లు వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రకటించారు. సోమవారం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ‘ప్రజా ప్రస్థానం’ పేరుతో చేవెళ్ల నుంచి పాదయాత్ర ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. తెలంగాణలో ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు కాలేదని మండిపడ్డారు. గత ఏడేండ్ల కేసీఆర్ పాలనలో 7 వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని.. రైతులకు రుణమాఫీ చేస్తానని చెప్పి, సీఎం కేసీఆర్ మోసం చేశారని నిప్పులు చెరిగారు. కేవలం 3 లక్షల మందికే మాఫీ చేసి, 30 లక్షల మంది రైతులకు రుణమాఫీ ఎగ్గొట్టారని దుయ్యబట్టారు. తెలంగాణలో 91 శాతం మంది రైతులకు కనీసం రూ.లక్షన్నర అప్పు ఉన్నట్లు ఓ సర్వే చెబుతోంది. ఈ లెక్కన రైతులందరూ అప్పులపాలయ్యారని వైఎస్ షర్మిల అన్నారు. చదవండి: గణేశ్ నిమజ్జనం: ఈ ఫొటో చూసి వావ్ అనాల్సిందే! ప్రభుత్వం, పోలీసులు చేయలేని న్యాయం దేవుడు చేశాడు: వైఎస్ షర్మిల -
అక్టోబర్ 18 నుంచి షర్మిల పాదయాత్ర!
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల చేపట్టబోయే పాదయాత్రకు ముహూర్తం ఖరారైనట్లు సమాచారం. అక్టోబర్ 18 నుంచి చేపట్టే పాదయాత్రను ఆమె చేవెళ్ల నుంచి ప్రారంభించనున్నట్లు తెలిసింది. గతంలో మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి కూడా చేవెళ్ల నుంచి పాదయాత్రను ప్రారంభించిన విషయం విదితమే. ఇప్పటికే రెండుసార్లు పాదయాత్రను విజయవంతంగా పూర్తి చేసిన షర్మిల ఇప్పుడు మూడో పర్యాయం నిర్వహించతలపెట్టారు. తెలంగాణలో రాజన్న రాజ్యాన్ని తీసుకురావడమే తన లక్ష్యమని ప్రకటించిన షర్మిల అందుకు అనుగుణంగా పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ఈ కార్యక్రమం దోహదపడుతుందని భావిస్తున్నారు. కాగా, మంగళవారం హుజురాబాద్ నియోజకవర్గం ఇల్లంతకుంట మండలం సిరిసేడులో ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగి మహమ్మద్ షబ్బీర్ కుటుంబాన్ని పరామర్శించి నిరుద్యోగ నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు ఆ పార్టీ ఒక ప్రకటనలో తెలిపింది. -
చేవెళ్ల నుంచి పాదయాత్ర మొదలుపెడతా
-
వైఎస్ షర్మిల ప్రజా ప్రస్థానం పాదయాత్రకు ఏడేళ్లు పూర్తి
-
షర్మిలమ్మ పాదయాత్ర చారిత్రక ఘట్టం
సాక్షి, ఇచ్ఛాపురం: కుటిల రాజకీయాలు జఠిల సమస్యలు సృష్టిస్తున్నప్పుడు, ఒక నాయకుడిని ఒంటరిని చేసి వేధిస్తున్నప్పుడు, ఒక కుటుంబాన్ని లక్ష్యంగా పెట్టుకుని దాడులు చేస్తున్నప్పుడు ఆ అన్న కు అండగా, కుటుంబానికి తోడుగా, పార్టీకి ఓ ధైర్యంగా ఓ అతివ అడుగులు వేశారు. తండ్రి చూపిన బాటలో రాష్ట్రమంతా కలియదిరిగారు. అన్న పెట్టిన పార్టీ సంస్థాగతంగా బలోపేతం కావడానికి తన నడకతోనే ఇంధనం నింపారు. ఆమే వైఎస్ షర్మిల. ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకు ఆమె సాగించిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర నేటితో ఏడేళ్లు పూర్తి చేసుకుంది. చెల్లెమ్మలకు అండగా ఉండే అన్నల కథలు అందరికీ తెలిసినవే. కానీ అన్నకు బలంగా నిలిచిన చెల్లెలి కథ ఆమెది. వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం అందరూ బాగానే ఉండేవారు. కానీ ఆయన హఠాన్మరణం తర్వాత రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోయాయి. అందులో భాగంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్థాపించారు. అది మొదలు ఆయనపై కుట్రలు మొదలైపోయాయి. ఒక్కడినే చేసి అన్ని రాజకీయ పక్షాలు తమకు తోచిన విధాన దాడు లు చేయడం మొదలుపెట్టాయి. అలాంటి దుర్మార్గ, దుశ్చర్యలకు నిరసనగా అన్నకు తోడుగా నిలిచి జగనన్న విడిచిన బాణంగా ప్రజల మధ్య నడిచి నాయకులకు భరోసా కలిగించింది వైఎస్ షర్మిల. ఎలాంటి ప్రతిఫలాన్ని ఆశించకుండా అన్న వదిలిన బాణంలా అన్ని గ్రామాలు కలియదిరిగారు. 2012 అక్టోబర్ 18న ఇడుపుల పాయ నుంచి మరోప్రజాప్రస్థానం పేరిట సుదీర్ఘ పాదయాత్ర ప్రారంభించారు. షర్మిలమ్మతో కలసి పాదయాత్ర చేస్తున్న ధర్మాన కృష్ణదాస్(ఫైల్) నిత్యం ప్రజల మధ్యలోనే ఉంటూ ప్రజలతో మమేకమై వారి కష్టాలను తెలుసుకుంటూ, కన్నీళ్లు తుడుస్తూ పాదయాత్ర కొనసాగించారు. అప్పటి రాష్ట్రంలో 14 జిల్లాలు, 116 నియోజకవర్గాల గుండా 230 రోజుల పాటు 3112 కిలోమీటర్ల పాదయాత్రను కొనసాగించి 2013 ఆగస్టు 4 వ తేదీన ఇచ్ఛాపురంలో ముగించారు. అన్నకిచ్చిన మాటకోసం ప్రజల శ్రేయస్సును కోరి ప్రపంచ చరిత్రలో మొట్టమొదటి సారిగా సుదీర్ఘ పాదయాత్రను పూర్తి చేసిన మహిళగా చరిత్ర పుటల్లో పేరు లిఖించుకున్నారు. నేటి వైఎస్సార్సీపీ అఖండ విజయానికి అప్పుడే బలమైన పునాదులు వేశారు. ఆ పాదయాత్రను ముగింపునకు గుర్తుగా ఇచ్ఛాపురం పట్టణంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా మైదానానికి ఆనుకొని మరోప్రజాప్రస్థానం పేరిట విజయ స్థూపం ఏర్పాటు చేశారు. ఇచ్ఛాపురంలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతున్న వైఎస్ షర్మిలమ్మ షర్మిలమ్మ పాదయాత్ర చారిత్రక ఘట్టం ఒక మహిళ వేల కిలోమీటర్ల దూరం పాదయాత్ర చేయడమనేది చరిత్రలో నిలిచిపోయే ఘట్టం. వైఎస్ షరి్మలమ్మ అప్పడు పాదయాత్ర ద్వారా నాటి న విత్తనమే ఇప్పుడు మహావృక్షంగా ఈ స్థాయి లో ఉంది. వైఎస్ రాజశేఖర రెడ్డి, షర్మిలమ్మ, వైఎస్ జగన్ అందరూ ఇచ్ఛాపురంలోనే పాదయాత్ర ముగించారు. ఆ కుటుంబంతో ఇచ్ఛాపురానికి విడదీయలేని అనుబంధం ఉంది. – పిరియా సాయిరాజ్, డీసీఎంఎస్ చైర్మన్, నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్చార్జి ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
నడిచారు గెలిచారు
-
అడుగుజాడ
-
పేదవారికి అండ దండ.. వైఎస్ఆర్
-
వైఎస్ ఉంటే ప్రతీ ఇల్లు కళకళలాడేది
♦ కరీంనగర్ జిల్లా పరామర్శయాత్రలో షర్మిల ♦ ఏ ఒక్క చార్జీ పెంచకుండానే అద్భుతంగా పాలించిన గొప్ప నేత ♦ ఆయన ఆశయాలను మనమే బతికించుకోవాలి ♦ చేయి చేయి కలిపి రాజన్న రాజ్యం తెచ్చుకుందామని పిలుపు ♦ రాజన్న బిడ్డను చూసేందుకు బారులు తీరిన జనం సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : పేదప్రజల పెన్నిధి వైఎస్ రాజశేఖరరెడ్డి బతికి ఉండుంటే రాష్ట్రం లోని ప్రతీ ఇల్లు కళకళలాడేదని... రైతులంతా సంతోషంగా ఉండేవారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల అన్నారు. ఆయన మరణించి ఆరేళ్లయినా కోట్లాది మంది గుండెల్లో రాజన్నగా కొలువై ఉన్నాడని చెప్పారు. వైఎస్సార్ ఆకస్మిక మరణాన్ని తట్టుకోలేక చనిపోయినవారి కుటుంబాలను పరామర్శించేందుకు జగన్మోహన్రెడ్డి తరఫున షర్మిల చేపట్టిన పరామర్శయాత్ర... శుక్రవారం కరీంనగర్ జిల్లాలో రెండో విడత కొనసాగింది. శుక్రవారం హుజూరాబాద్, మానకొండూరు నియోజకవర్గాల్లో ఏడు కుటుంబాలను షర్మిల కలుసుకున్నారు. ఈ సందర్భంగా జమ్మికుంట, కరీంనగర్ పట్టణాల్లో షర్మిలను చూసేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి డాక్టర్ నగేష్ ఆధ్వర్యంలో కరీంనగర్‌లోని తెలంగాణ చౌరస్తా వద్ద భారీ కార్యక్రమం నిర్వహించారు. పార్టీ తెలంగాణ అధ్యక్షుడు, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డితోపాటు పార్టీ జిల్లా ఇన్చార్జి నల్లా సూర్యప్రకాశ్, అధ్యక్షుడు సింగిరెడ్డి భాస్కర్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి కుమార్ తదితరులతో కలసి షర్మిల ప్రసంగించారు. ఆ ప్రసంగంలోని ముఖ్యాంశాలు షర్మిల మాటల్లోనే.. ‘‘ఒక నాయకుడు చనిపోతే దానిని జీర్ణించుకోలేక కొన్ని వందల గుండెలు ఆగిన దాఖలాలు దేశ చరిత్రలోనే లేవు. ఒక్క రాజశేఖరరెడ్డి విషయంలోనే అది జరిగింది. ఎందుకంటే.. ఆయన ప్రజల గుండెల్లో కొలువై ఉన్నాడు. ఫీజు రీరుుంబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ, 108 వంటి ఎన్నో అద్భుతమైన పథకాలను ప్రవేశపెట్టాడు. ఉచిత విద్యుత్, పావలా వడ్డీ రుణాలు, రైతులకు పూర్తి రుణ మాఫీ వంటి కార్యక్రమాలను అమలు చేసి రైతులు, కూలీలు, కార్మికులు, మహిళలకు భరోసా కల్పించాడు. ఏ చార్జీ పెంచినా, ఏ పన్ను పెంచినా ఆ భారం మహిళలపై పడుతుందనే ఉద్దేశంతో ఐదేళ్ల పాలనలో కరెంటు, గ్యాస్, ఆర్టీసీ సహా ఏ చార్జీలను పెంచలేదు. ఆయన బతికుంటే ప్రతి పేదవాడి ఇల్లు కళకళలాడేది. రైతులంతా సంతోషంగా ఉండేవారు. ప్రతి ఇంటికీ నీరుండేది. ఉచిత విద్య అందేది. మనిషిని మనిషిలా గౌరవించిన మహనీయుడు ఆయన. ఆయన ఆశయాలను మనమే బతికించుకోవాలి. అందుకోసం మీరు, మేము చేయి, చేయి కలిపి మళ్లీ రాజన్న రాజ్యాన్ని తెచ్చుకుందాం..’’ అని షర్మిల పిలుపునిచ్చారు. అంతకుముందు పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మంద రాజేష్ ఆధ్వర్యంలో జమ్మికుంట చౌరస్తాలో ఏర్పాటు చేసిన సభలోనూ షర్మిల మాట్లాడారు. వైఎస్‌నే గుర్తుచేస్తున్నారు: పొంగులేటి పరామర్శయాత్రలో భాగంగా ఏ ఇంటికి వెళ్లినా, ఏ గ్రామానికి వెళ్లినా అందరూ వైఎస్ రాజశేఖరరెడ్డి పాలననే గుర్తుచేసుకుంటున్నారని వైఎస్సార్సీపీ తెలంగాణ అధ్యక్షుడు, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. వైఎస్ పాలనలోనే తామంతా సంతోషంగా ఉన్నామని చెబుతున్నారన్నారు. రాష్ట్రంలోని ఆరు జిల్లాల్లో షర్మిల యాత్ర చేశామని, కొద్దిరోజుల్లోనే మిగతా జిల్లాల్లోనూ పరామర్శ యాత్ర చేపడతామని చెప్పారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి గట్టు శ్రీకాంత్‌రెడ్డి, యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు బీష్వ రవీందర్, రాష్ట్ర కార్యదర్శులు బోయిన్పల్లి శ్రీనివాస్‌రావు, అక్కెనపెల్లి కుమార్, వేముల శేఖర్‌రెడ్డి, షర్మిల సంపత్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు కె.నగేష్, సెగ్గెం రాజేష్, నగర అధ్యక్షుడు సిరి రవి, మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి సింగిరెడ్డి ఇందిర, యువజన విభాగం ప్రధాన కార్యదర్శి ఎల్లాల సంతోష్‌రెడ్డి, కార్యదర్శి మంద వెంకటేశ్వర్లు, సాంస్కృతిక విభాగం ప్రధాన కార్యదర్శి సందమల్ల నరేష్, సొల్లు అజయ్‌వర్మ, మంద రాజేశ్ తదితరులు పాల్గొన్నారు. -
మత్తయ్య కుటుంబానికి వైఎస్ షర్మిల పరామర్శ
-
'సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఘనత వైఎస్సార్‌ది'
వరంగల్: అన్ని వర్గాల ప్రజల సమస్యలను తీర్చేందుకు ఎన్నో రకాల సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన ఘనత దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ కే దక్కుతుందని వైఎస్ షర్మిల తెలిపారు. వరంగల్ జిల్లా రెండో విడత పరామర్శయాత్రలో భాగంగా మూడో రోజు నర్సంపేటలో ఏర్పాటు చేసిన సభలో షర్మిల ప్రసంగించారు. తెలంగాణ ప్రజలు వైఎస్ ను గుండెల్లో పెట్టుకుని పూజించారని తెలిపారు. వైఎస్ మరణం తట్టుకోలేక ఎన్నో గుండెలు ఆగిపోయామన్నారు. రాజన్న రాజ్యం తెచ్చుకోవడానికి చేయి చేయి కలపాలంటూ షర్మిల పిలుపునిచ్చారు. -
ఐలయ్య కుటుంబానికి వైఎస్ షర్మిల పరామర్శ
-
మూడు కుటుంబాలకు షర్మిల పరామర్శ
వరంగల్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల వరంగల్ జిల్లాలో రెండో విడత పరామర్శ యాత్ర చేపట్టారు. సోమవారం పాలకుర్తి నియోజకవర్గంలో ఈ యాత్ర ప్రారంభమైంది. దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణాన్ని తట్టుకోలేక చనిపోయిన వారి కుటుంబ సభ్యులను షర్మిల పరామర్శిస్తున్నారు. గండ్లకుంటలో ఎడెల్లి వెంకటయ్య కుటుంబాన్ని, రేగులలో కొత్తగట్టు శాంతమ్మ కుటుంబాన్ని ఓదార్చారు. వారికి అండగా ఉంటామని షర్మిల భరోసా ఇచ్చారు. అక్కడి నుంచి బయల్దేరి రాయపర్తి మండలం కేశవపురంలో రావుల మహేందర్ కుటుంబాన్ని పరామర్శించారు. వరంగల్ జిల్లాలో షర్మిల 5 రోజుల పాటు 31 కుటుంబాలను పరామర్శిస్తారు. -
వరంగల్ జిల్లా పరామర్శ యాత్రకు వైఎస్ షర్మిల
హైదరాబాద్ : దివంగత మహానేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మరణాన్ని తట్టుకోలేక చనిపోయిన వారి కుటుంబ సభ్యులను ఆయన కుమార్తె వైఎస్ షర్మిల పరామర్శించనున్నారు. సోమవారం ఉదయం వైఎస్ షర్మిల వరంగల్ జిల్లాలో రెండోదశ పరామర్శ యాత్రకు బయల్దేరారు. వైఎస్ఆర్ మరణవార్తను జీర్ణించుకోలేక మృతి చెందిన వారి కుటుంబాలను తమ కుటుంబంగా భావించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల పరామర్శించనున్నారు. తొలి రోజు ఇలా... హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌లో ఉదయం 8.30 గంటలకు షర్మిల పరామర్శయాత్రకు బయల్దేరారు. జనగామ మీదుగా కొడకండ్ల మండలంలోని గండ్లకుంటకు చేరుకుని ఎడెల్లి వెంకన్న కుటుంబాన్ని పరామర్శిస్తారు. తర్వాత ఇదే మండలంలోని రేగులలో కొత్తగట్టు శాంతమ్మ ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను ఓదారుస్తారు. అక్కడి నుంచి రాయపర్తి మండలం కేశవపురంలో రావుల మహేందర్ కుటుంబాన్ని పరామర్శిస్తారు. అనంతరం రాయపర్తి మండల కేంద్రంలోని ముద్రబోయిన వెంకటయ్య కుటుంబాన్ని ఓదారుస్తారు. అక్కడి నుంచి తొర్రూరు మండలంలోని నాంచారీ మడూరులో గద్దల ముత్తయ్య, మందపురి కొండమ్మ ఇళ్లకు వెళ్లి వారి కుటుంబసభ్యులను పరామర్శిస్తారు. -
రేపట్నుంచి వరంగల్ జిల్లాలో షర్మిల పరామర్శయాత్ర
వరంగల్: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అకాల మృతిని తట్టుకోలేక గుండెపగిలి చనిపోయిన వారి కుటుంబాలను పరామర్శించేందుకు వైఎస్సార్ తనయ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సోదరి వైఎస్ షర్మిల సోమవారం నుంచి వరంగల్ జిల్లాలో రెండోవిడత పరామర్శ యాత్ర చేపడుతున్నారు. సెప్టెంబర్ 7వ తేదీ నుంచి 11వ తేదీ వరకు ఐదు రోజుల పాటు ఆమె యాత్ర ఉంటుంది. ఈనెల 9,10 తేదీల్లో నర్సంపేట నియోజకవర్గంలో వైఎస్ షర్మిల పరామర్శయాత్ర చేపట్టనున్నారు. పరామర్శయాత్రలో భాగంగా నర్సంపేటలో వైఎస్సార్ కాంస్య విగ్రహాన్ని షర్మిల ఆవిష్కరించనున్నట్లు పార్టీ నేత గోవర్థన్ రెడ్డి తెలిపారు. -
7 నుంచి వరంగల్‌లో వైఎస్ షర్మిల పరామర్శ యాత్ర
-
వైఎస్సార్ సీపీలో చేరిన గార్ల ఎంపీపీ
వరంగల్: జిల్లాలోని గార్ల ఎంపీపీ , వైస్ ఎంపీపీలు శుక్రవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వరంగల్ జిల్లాలో వైఎస్ షర్మిల చేపట్టిన తొలి విడత పరామర్శయాత్రలో గార్ల ఎంపీపీ సుశీల, వైస్ ఎంపీపీ నర్సింగరావులు వైఎస్సార్ సీపీలో చేరారు. ఈ సందర్భంగా ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ పరిపాలన రావాలని కోరుకుంటున్నారని తెలిపారు. తెలంగాణ ప్రజలు షర్మిలపై చూపిస్తున్న అభిమానం మరువలేనిదని ఆయన పేర్కొన్నారు. జిల్లాలో వైఎస్ షర్మిల చేపట్టనున్న రెండో విడత పరామర్శయాత్ర సెప్టెంబర్ 7 వ తేదీ నుంచి 11 వ తేదీ వరకూ కొనసాగుతుందని పొంగులేటి తెలిపారు. వైఎస్ షర్మిల వరంగల్ జిల్లాలో చేపట్టిన తొలి విడత పరామర్శయాత్ర ముగిసింది. ఈరోజు పరకాల నియోజకవర్గం సంగెం మండలం రామచంద్రాపురంలోని బొల్లు ఎల్లమ్మ కుటుంబాన్ని ముందుగా పరామర్శించారు. అనంతరం వర్ధన్నపేట నియోజకవర్గం పర్వతగిరిలోని పుల్లూరు కొమురమ్మ ఇంటికి వెళ్లారు. చివరగా పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరు మండలం సోమారంలో మేడిద శాంతమ్మ కుటుంబ సభ్యలకు భరోసా ఇచ్చారు. మొదటి విడత యాత్రలో మొత్తం 7 నియోజకవర్గాల్లో 32 కుటుంబాలను వైఎస్ షర్మిల పరామర్శించారు. -
రాజన్నకు మరణం లేదు
పరామర్శ యాత్రలో షర్మిల సాక్షి, ప్రతినిధి, వరంగల్: ప్రాంతాలకు అతీతంగా, అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా పాలన సాగించిన వైఎస్ రాజశేఖరరెడ్డికి మరణంలేదని ఆయన కుమార్తె, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల అన్నారు. ‘‘ముఖ్యమంత్రిగా ప్రజలను సొంత బిడ్డల్లా చూసుకున్న వైఎస్ ఇప్పటికీ కోట్ల మంది ప్రజల గుండెల్లో బతికే ఉన్నారు. తెలుగుజాతి ఉన్నంతకాలం వారి మనసుల్లో జీవించే ఉంటారు’’ అని పేర్కొన్నారు. పరామర్శ యాత్రలో భాగంగా వరంగల్ జిల్లాలో రెండో రోజు మంగళవారం జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆమె పర్యటించారు. తాటికొండలో తనకు ఆత్మీయస్వాగతం పలికిన ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ‘‘ప్రజల కోసం వైఎస్ ఏం చేశారో నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు. నాయకుడికి మనసుంటే, ఆ మనసుతో ప్రేమిస్తే ఆ పాలన ఎంత అద్భుతంగా ఉంటుందో రాజన్న మనందరికీ చూపించారు. పేదలను భుజాన మోశారు. రైతును రాజును చేశారు. మహిళలను లక్షాధికారులను చేశారు. తన హయాం లోదేశమంతటా కలిపి 46 లక్షల ఇళ్లు నిర్మిస్తే ఒక్క మన రాష్ట్రంలోనే 46 లక్షల ఇళ్లను నిర్మించి ఇచ్చారాయన! ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో పేద పిల్లలకు పెద్ద చదువులు చదివించారు. పేదలకు కార్పొరేట్ వైద్యమందించేందుకు ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టారు. గ్రామీణ ప్రాంతాల్లో వైద్యానికి 104 సేవలు తెచ్చారు. అభయహస్తం, పావలావడ్డీ పథకాలతో మహిళలకు అండగా నిలిచారు. ఉచిత విద్యుత్, రుణమాఫీతో రైతులకు భరోసా కల్పించారు. నాయకుడంటే ఇలా ఉండాలని వైఎస్ చూపించారు. ఆయన్ను మీరంతా గుండెల్లో పెట్టుకున్నారు గనకే నేడిక్కడికి వచ్చారు. వైఎస్‌పై అభిమానంతో ఇక్కడికొచ్చిన ప్రతి అవ్వకు, అయ్యకు, అక్కకు, చెల్లెకు, అన్నకు తమ్ముళ్లకు చేతులు జోడించి, శిరసు వంచి మనస్ఫూర్తిగా నమస్కరిస్తున్నా. అనుక్షణం ప్రజల సంక్షేమం కోసం తపించారు వైఎస్. తెలుగు ప్రజలను ప్రాంతాలకతీతంగా సొంత బిడ్డల్లా చూసుకున్న వైఎస్ ఆశయాలను బతికించుకుందాం. అందుకు అందరం చేయీ చేయీ కలుపుదాం. రాజన్న రాజ్యాన్ని మళ్లీ తెచ్చుకుందాం’’ అంటూ పిలుపునిచ్చారు. 78 కిలోమీటర్లు పర్యటన మంగళవారం షర్మిల వరంగల్ జిల్లాలో 78 కిలోమీటర్లు పర్యటించి ఏడు కుటుంబాలను పరామర్శించారు. జనగామ నియోజకవర్గం బచ్చన్నపేటలోని గుడిసెల లచ్చవ్వ, అలువాల యాదగిరి కుటుంబాలకు భరోసా ఇచ్చారు. పోచన్నపేటలో నేలపోగుల యాదగిరి కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం స్టేషన్‌ఘన్‌పూర్ మండలం నమిలిగొండలో గాదె శంకర్ కుటుంబాన్ని పరామర్శించారు. తర్వాత స్టేషన్‌ఘన్‌పూర్‌లో వల్లాల లక్ష్మయ్య, తాటికొండలో ఎడమ మల్లయ్య, కిష్టాజిగూడెంలో జక్కుల కొమురయ్య కుటుంబాలను పరామర్శించారు. అండగా ఉంటామంటూ ధైర్యం చెప్పారు. బుధవారం స్టేషన్‌ఘన్‌పూర్, వర్ధన్నపేట అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏడు కుటుంబాలను షర్మిల పరామర్శించనున్నారు. వైఎస్సార్సీపీ తెలంగాణ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి నేతృత్వంలో సాగుతున్న పరామర్శ యాత్రలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యద ర్శులు గట్టు శ్రీకాంత్‌రెడ్డి, నల్లా సూర్యప్రకాశ్‌రావు, ముఖ్య అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి, యువజన విభాగం అధ్యక్షుడు బీష్వ రవీందర్, వరంగల్ జిల్లా పార్టీ అధ్యక్షుడు మహేందర్‌రెడ్డి, రాష్ట్ర నాయకులు విలియం మునిగాల, నాడెం శాంతికుమార్, జి.సూర్యనారాయణరెడ్డి, జి.రాంభూపాల్‌రెడ్డి, జి.శివకుమార్, జి.జైపాల్‌రెడ్డి, షర్మిల సంపత్, వి.శంకరాచారి, ఎం.కల్యాణ్‌రాజ్, ఎ.మహిపాల్‌రెడ్డి, ఎ.కిషన్, డి.కిశోర్‌కుమార్, ఎన్.నర్సింహారెడ్డి, ఎల్.జశ్వంత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అంతా వైఎస్‌నే గుర్తు చేస్తున్నారు: పొంగులేటి సాక్షి, హన్మకొండ: ప్రజల మనసు తెలుసుకుని పాలించిన జన నాయకుడు వైఎస్ అని వైఎస్సార్సీపీ తెలంగాణ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. అభివృద్ధి, సంక్షేమంలో ప్రస్తుత పాలనకు, వైఎస్సార్ పాలనకు పొంతన లేదన్నారు. వైఎస్సార్ కలలను నెరవేర్చేందుకు అందరం కలిసి కష్టపడదామని పిలుపునిచ్చారు. షర్మిల పరామర్శ యాత్రలో భాగంగా మంగళవారం స్టేషన్‌ఘన్‌పూర్ మండలం తాటికొండలో ప్రజలనుద్దేశించి ఆయన ప్రసంగించారు. ‘ముఖ్యమంత్రిగా వైఎస్ పాలన ఎలా సాగిందోనాకంటే, షర్మిల కంటే మీ ఊరిలోని ఎడమ మల్లయ్య కుటుంబసభ్యులే బాగా చెప్పారు. వైఎస్ చేసిన అభివృద్ధి, ఆయన అమలు చేసిన సంక్షేమ పథకాల గురించి రాష్ట్రంలో ఏ ఇంటి తలుపు తట్టినా చెబుతారు. అందుకే ఆయన మరణించి ఆరేళ్లవుతున్నా ప్రజలంతా ఇప్పటికీ గుర్తు చేసుకుంటూనే ఉన్నారు. రాజకీయాలకు అతీతంగా, అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేసిన నాయకుడు వైఎస్. ప్రజల అవసరాలను తెలుసుకుని వారడిగినవి, అడగనవి అన్నీ అందేలా పాలించారు. తర్వాత వచ్చిన పాలకులు ఆయన పథకాలను తుంగలో తొక్కారు’’ అని విమర్శించారు. -
ముగిసిన వైఎస్ షర్మిల రెండో రోజు పరామర్శయాత్ర
వరంగల్:వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల మంగళవారం జిల్లాలో చేపట్టిన రెండో రోజు పరామర్శయాత్ర ముగిసింది. పరామర్శయాత్రలో భాగంగా ఆమె జనగామ, స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గాల్లో ఏడు కుటుంబాలను పరామర్శించారు. జనగామ నియోజకవర్గం బచ్చన్నపేట మండల కేంద్రంలోని గుడిసెల లచ్చవ్వ, అలువాల యాదగిరి కుటుంబాలను షర్మిల పరామర్శించారు. ఇదే మండలంలోని పోచన్నపేటలోని నేలపోగుల యాదగిరి ఇంటికి వెళ్లి పరామర్శించారు. తర్వాత స్టేషన్‌ఘన్‌పూర్ మండలం నమిలిగొండలోని గాదె శంకర్ కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం స్టేషన్‌ఘన్‌పూర్ మండల కేంద్రంలోని వల్లాల లక్ష్మయ్య కుటుంబానికి, ఇదే మండలంలోని తాటికొండలోని ఎడమ మల్లయ్య కుటుంబాన్ని షర్మిల పరామర్శించారు.. చివరగా కిష్టాజిగూడెంలోని జక్కుల కొమురయ్య కుటుంబాన్ని పరామర్శించారు. పరామర్శయాత్రలో వైఎస్ షర్మిలతో పాటు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొండా రాఘవరెడ్డి, శ్రీకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. బుధవారం స్టేషన్ ఘనపూర్, వర్థన్నపేట నియోజకవర్గాల్లో షర్మిల పరామర్శయాత్ర కొనసాగనుంది. తొలి రెండు రోజులు 14 కుటుంబాలను పరామర్శించిన షర్మిల.. రేపు మరో ఏడు కుటుంబాలను పరామర్శించనున్నారు. -
వరంగల్ జిల్లాకు బయల్దేరిన వైఎస్ షర్మిల
హైదరాబాద్ : మహానేత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల పరామర్శ యాత్రకు బయల్దేరారు. సోమవారం ఉదయం ఆమె హైదరాబాద్ లోటస్ పాండ్ నుంచి వరంగల్ జిల్లా పర్యటనకు పయనం అయ్యారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్...తన సోదరిని దగ్గరుండి యాత్రకు సాగనంపారు. వరంగల్ జిల్లాలో ఆమె అయిదు రోజుల పాటు పర్యటిస్తారు. వైఎస్ రాజశేఖరరెడ్డి అకాల మృతిని తట్టుకోలేక ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను వైఎస్ షర్మిల పరామర్శించనున్నారు. ఇందులో భాగంగా ఆమె వరంగల్ జిల్లాలో ఇవాళ్టి నుంచి జిల్లాలో తొలి విడత పరామర్శ యాత్రలో 32 మంది కుటుంబాలను పరామర్శిస్తారు. తొలి రోజు ఏడు కుటుంబాలను వైఎస్ షర్మిల పరామర్శించనున్నారు. చేర్యాల నుంచి ఆమె యాత్ర మొదలవుతుంది. కాగా జనగామ, స్టేషన్ ఘన్పూర్, వర్థన్నపేట, వరంగల్ తూర్పు, వరంగల్ పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గాల్లో పూర్తిగా, పరకాల, పాలకుర్తి అసెంబ్లీ నియోజకవర్గాల్లో పాక్షికంగా వైఎస్ షర్మిల పర్యటన జరగనుంది. ఇందుకు సంబంధించి పార్టీ యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. -
వరంగల్ జిల్లాకు బయల్దేరిన వైఎస్ షర్మిల
-
24 నుంచి వరంగల్ జిల్లాలో వైఎస్ షర్మిల పరామర్శ యాత్ర
హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల ఈ నెల 24 నుంచి వరంగల్ జిల్లాలో పరామర్శయాత్ర చేపట్టనున్నారు. మొదటి విడత యాత్రలో భాగంగా 32 కుటుంబాలను ఆమె పరామర్శిస్తారని వైఎస్సార్ సీపీ నేతలు కొండా రాఘవరెడ్డి, మహేందర్ రెడ్డి, అహ్మద్ తెలిపారు. మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి మరణాన్ని తట్టుకోలేక వరంగల్ జిల్లాలో 72 మంది అశువులు బాశారని చెప్పారు. షర్మిల పరామర్శయాత్రకు తెలంగాణ వైఎస్సార్ సీపీ నేతలందరూ హాజరై విజయవంతం చేస్తారన్నారు. ఇది రాజకీయ యాత్ర కాదని స్పష్టం చేశారు. ఇప్పటికే తెలంగాణలోని 4 జిల్లాల్లో పరామర్శయాత్ర పూర్తైందని తెలిపారు. -
బ్రహ్మరథం
♦ షర్మిల భరోసా అధైర్యపడొద్దు.. అండగా ఉంటాం.. ♦ ధైర్యంగా ఉంటే పిల్లలు భయపడరు ♦ మర్పల్లిలో నారాయణ కుటుంబాన్ని పరామర్శించిన వైఎస్ తనయ జిల్లాలో ముగిసిన షర్మిల పరామర్శ యాత్ర తండ్రిపై చూపిన అభిమానాన్నే జిల్లా ప్రజలు ఆయన తనయపైనా కన బరిచారు. వైఎస్ రాజశేఖరరెడ్డి మరణాన్ని తట్టుకోలేక ప్రాణాలు విడిచిన కుటుంబాలను పరామర్శించిన ఆయన కూతురు షర్మిలకు అడుగడుగునా ఆత్మీయ స్వాగతం లభించింది. నాలుగు రోజుల పర్యటనలో 15 కుటుంబాలను కలుసుకున్న షర్మిల.. వైఎస్‌ను అభిమానించే ప్రతి కుటుంబానికి అండగా ఉంటామని మాటిచ్చారు. ఏ కష్టమొచ్చినా తనకు ఫోన్ చేయమని భరోసా ఇచ్చారు. ఏడు నియోజకవర్గాల్లో 600 కి లోమీటర్ల మేర సాగిన యాత్రలో.. ప్రజలను ఆమె ఆత్మీయంగా పలకరించారు. కుటుంబసభ్యులను కోల్పోయి ఆవేదనతో ఉన్నవారికి సాంత్వన కలిగించేలా ధైర్యం చెప్పారు. వైఎస్ మరణించి ఆరేళ్లయినా.. తమను గుర్తుంచుకొని సాక్షాత్తూ ఆయన తనయే రావడం ఆ కుటుంబాల్లో ఎనలేని సంతోషాన్ని కలిగించింది. మారుమూల పల్లెల్లోనూ రాజన్న బిడ్డకు ఘనస్వాగతం లభించింది. - సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆకస్మిక మరణాన్ని టీవీలో చూస్తూ తట్టుకోలేక మర్పల్లిలో ఆత్మహత్య చేసుకున్న కమ్మరి నారాయణ కుటుంబాన్ని వైఎస్ తనయ షర్మిల గురువారం పరామర్శించారు. ముందుగా వైఎస్ చిత్రపటానికి, వైఎస్ మరణాన్ని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న నారాయణ చిత్ర పటానికి షర్మిల పూలమాల వేసి రెండు నిమిషాలు మౌనం పాటించి, వారిని స్మరించుకున్నారు. ఆ తర్వాత నారాయణ కుటుంబసభ్యులను షర్మిల పరిచయం చేసుకున్నారు. నారాయణ భార్య నీరజ, కూతురు వైష్ణవి, కుమారుడు నవదీప్‌చారి ఒక్కసారిగా కంటతడిపెట్టారు. దీంతో చలించిన షర్మిల.. ‘అధైర్యపడొద్దు... నీవు ధైర్యంగా ఉంటే పిల్లలు భయపడరు..’ అని నీరజను ఓదార్చారు. నీకు ఏదైనా కష్టం వస్తే మేము ఉన్నామని నారాయణ కుటుంబసభ్యులకు ఆమె భరోసా ఇచ్చారు. - మర్పల్లి షర్మిల పరామర్శించిన తీరు ఇలా సాగింది.. షర్మిల: నీరజ బాగున్నావా? ఎంతమంది పిల్లలు ఎక్కడుంటున్నారు? నీరజ: బాగానే ఉన్నాను. ప్రస్తుతం ఇంటి వద్దే ఉంటున్నాను. ఇద్దరు పిల్లలు షర్మిల: పిల్లల పేర్లు? నీరజ: కూతురు వైష్ణవి, కుమారుడు నవదీప్‌చారి. భర్త చనిపోయిన మూడు నెలలకు కుమారుడు పుట్టాడు. షర్మిల: మీ భర్త ఎట్లా చనిపోయాడు? నీరజ: రచ్చబండ కోసం వైఎస్ వెళుతున్న హెలికాప్టర్ కనిపించటం లేదని టీవీలో వార్తలు చూస్తూ.. రెండు రోజులపాటు టీవీ ముందే కుర్చున్నాడు. ‘వైఎస్ ఇక లేరు’ అని మరణవార్త విన్నాడు. అంతలోనే కరెంటు పో గానే ఇంట్లో నుంచి తాడు తీసుకొని వెళ్లి చెట్టు కు ఉరివేసుకొని ఆత్మహత్యకు చేసుకున్నాడు. షర్మిల: నారాయణ టీవీ చూసేటప్పుడు ఇంట్లో ఎవ్వరెవ్వరు ఉన్నారు? నీరజ: టీవీ చూసేటప్పుడు బావ రాములు, భర్త నారాయణ, నాయనమ్మ చెంద్రమ్మ ఉన్నా రు. మీ బావ రాములు ఉన్నాడా? పిలవండి. షర్మిల: (రాములు ఇంట్లోకి రాగానే) మీరేమి పనులు చేస్తారు? ఎంతమంది అన్నదమ్ములు ఉన్నారు? ఏం పనులు చేస్తారు? రాములు: మేము నలుగురం అన్నదమ్ములం.. నేను పెద్దవాడిని.. రెండో తమ్ముడు బ్రహ్మం, మూడో తమ్ముడు మృతుడు నారాయణ, నాలుగో తమ్ముడు మోనాచారి. కమ్మరి, కార్పెంటరీ పనులు చేస్తాం. షర్మిల: నారాయణ ఏమి చేసేవాడు? రాములు: టెయిలరింగ్ పనులు చేస్తుండేవాడు. షర్మిల: నీవేమి చేస్తున్నావమ్మా నీరజ? నీరజ: భర్త చనిపోగానే కొన్నిరోజులపాటు ఇంటివద్ద ఉన్నాను. ఆ తరువాత తమ పోషణభారం కావటంతో మెదక్ జిల్లా వీఎస్టీ కంపెనీలో కూలీ పనులకు వెళుతూ కుటుంబాన్ని పోషించుకొంటున్నాను. షర్మిల: వ్యవసాయ పొలం ఉన్నదా? నీరజ: నలుగురు అన్నదమ్ములకు కలిపి ఆరెకరాల పొలం ఉంది. కౌలుకు ఇచ్చాం. షర్మిల: మా నుంచి గతంలో ఏదైనా ఆర్థిక సహాయం అందిందా? నీరజ: లక్ష రూపాయలు చెక్కు అందింది. ఆ డబ్బులను పిల్లల పేరున డిపాజిట్ చేశాం. షర్మిల: మీ భర్తకు వైఎస్ అంటే ఎందుకు ఇష్టం? నీరజ: వైఎస్ సభలు, సమావేశాలు ఎక్కడ ఉన్నా వెళ్లేవాడు. పేదప్రజలకోసం వైఎస్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికీ అందటంతో అభిమానిగా ఉండేవాడు. షర్మిల: వైఎస్ హయాంలో ప్రవేశపెట్టిన పథకాలు ఏ విదంగా ఉంవేవి? జెడ్పీటీసీ సభ్యురాలు శోభరాణి: వైఎస్ అంటే ఈ ప్రాంతంలో ప్రతి ఒక్కరికీ అభిమానం, వైఎస్ ప్రవేశపెట్టిన పథకాల్లో ఏదో ఒక్కటి ప్రతి ఇంటింకి అందింది. 2007 ప్రజాపథంలో మర్పల్లికి వచ్చి రూ.50 లక్షలతో సీసీ రోడ్లకు ఇచ్చాడు. ఇతర పనులకు నిధులు ఇచ్చి ఈ ప్రాంతం అభివృద్ధికి కృషిచేశాడు. దీంతో వైఎస్ ప్రజల గెండెల్లో నిల్చాడు. షర్మిల: అమ్మ నీరజా.. ఇక వెళతాను.. ఏమై నా సమస్య ఉంటే మీకిచ్చిన నంబర్‌కు ఫోన్ చేయండి. నీరజ: సరే మేడం.. వెళ్లి రండి. మీరు మా కుటుంబానికి అండగా నిలిచినందుకు మీకు రుణపడి ఉంటాం. మోమిన్‌పేటలో యాదయ్య కుటుంబసభ్యులతో.. మోమిన్‌పేట చేరుకొన్న షర్మిల యాదయ్య ఇంట్లో ఉన్న వైఎస్ చిత్రపటానికి, యాదయ్య చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం యాదయ్య కుమారుడు ప్రసాద్, కూతురు ప్రమీలను పరిచయం చేసుకున్నారు. షర్మిల: ఎలా ఉన్నారమ్మా? ప్రసాద్: కష్టాల్లో ఉన్నామమ్మా.. షర్మిల: నాన్న మృతిచెందిన తర్వాత మీ నాన్న ఎన్ని రోజులకు చనిపోయారు? ప్రసాద్: రాజన్న హెలికాప్టర్ కనిపించకుండా పోయాక ఆరు రోజులు టీవీ ముందే కూర్చొని దిగులుతో మంచం పట్టి కింద పడిపోయాడు. తట్టి చూస్తే అప్పటికే చనిపోయాడు. షర్మిల: అమ్మ ఎప్పుడు చనిపోయింది? ప్రసాద్: నాన్న కంటే ఒక ఏడాది ముందే.. షర్మిల: ఈయన ఎవరు? (పక్కనున్న చిత్రపటాన్ని చూపుతూ..) ప్రసాద్: మా అన్నయ్య. షర్మిల: ఎలా? ఎప్పుడు చనిపోయాడు? ప్రసాద్: ఆరు నెలల క్రితం చనిపోయాడు. షర్మిల: మీరు ఇద్దరే ఉన్నారా? ప్రసాద్: అవునమ్మా. మా చెల్లికి పెళ్లి అయింది.. కానీ విడాకులు ఇచ్చాడు. షర్మిల: ఇద్దరు ఇష్టంతోనే చేసుకొన్నారా? ప్రమీల: అవునమ్మా.. షర్మిల: వారితో మాట్లాడి నేను న్యాయం జరి గేలా చూస్తా.. ఇక్కడ ఎవరు పెద్దమనిషి? హబీబ్ సలాం (పార్టీ నాయకుడు): అబ్బాయివారితో మాట్లాడి న్యాయం చేస్తా. ప్రమీల: మాకు ఎవరు లేరమ్మా.. మాకు ఎదైన దారి చూపాలమ్మా.. షర్మిల: ఎక్కడైనా పనిచేస్తారా..? ప్రమీల: సరేనమ్మా.. షర్మిల: ఎంతవరకు చదువుకున్నారు? ప్రసాద్: ఏడో తరగతి వరకు.. చెల్లి పదో తరగతి వరకు చదివావమ్మా.. షర్మిల: దేవుడున్నాడు.. తప్పనిసరిగా మేలు జరుగుతుంది. ఈ నంబరుకు ఫోన్ చేసి రండి. మీ వెంట మేమున్నాం.. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆకస్మిక మరణాన్ని తట్టుకోలేక మృతిచెందిన కుటుంబాలను షర్మిల గురువారం పరామర్శించారు. మేమున్నామంటూ మోమిన్‌పేటలోని యాదయ్య కుటుంబసభ్యులను, ఎన్కతలలోని వెంకటేశ ం కుటుంబానికి భరోసా కల్పించారు. మండలంలో వైఎస్ఆర్ సీపీ శ్రేణులు, అభిమానులు పార్టీలకతీతంగా దారి పొడవునా నీరాజనం పలికారు. - మోమిన్‌పేట ఎన్కతలలో అలంపల్లి వెంకటేశం కుటుంబసభ్యులతో.. మోమిన్‌పేట నుంచి నేరుగా ఎన్కతలలోని అలంపల్లి వెంకటేశం ఇంటికి వచ్చిన షర్మిల వెంకటేశం, వైఎస్ చిత్రపటాలకు పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం వెంకటేశం భార్య సంగమ్మ, కూతురు కృష్ణవేణి, కుమారుడు మహేందర్లను పరిచయం చేసుకొన్నారు. వెంటనే వారు ఏడవడంతో షర్మిల ‘నాకు నాన్న లేరు.. నీకు నాన్నా లేరు’ అధైర్య పడవద్దు, ధైర్యంగా ఉండాలి. నీకు ఫీజు కట్టేందుకు డబ్బులు లేకున్నా నేనిస్తానని ధైర్యం చెప్పారు. అప్యాయంగా ముద్దాడి ధ్యైరం చెప్పి ఓదార్చారు. షర్మిల: ఏమమ్మా బాగున్నారా? సంగమ్మ: బాగున్నాం అమ్మా. షర్మిల: మీ ఆయన ఏం పనిచేసేవాడు? సంగమ్మ: ఉన్న ఎకరంన్నర పొలంలో వ్యవసాయం చేసుకుంటూ కూలీ పనులకు వెళ్లేవాడు. వైఎస్ సారు పాదయా త్ర చేసినప్పుడు రోజంతా ఆయన వెంటే ఉన్నాడు. బాగా అభిమానించేవాడు. టీవీలో సారు చనిపోయినట్లు తెలుసుకొన్న వెంటనే ఛాతిలో నొ ప్పంటూ కిందపడిపోగా ఆస్పత్రికి తీసుకెళుతుంటే చనిపోయాడు. షర్మిల: నీవు ఎం చదువుకుంటున్నావు (కూతురు కృష్ణవేణిని ఉద్దేశించి..) కృష్ణవేణి: ఇంటర్ మొదటి సంవత్సరం ప్రైవే టు కాలేటీలో చదువుతున్నాను. షర్మిల: బాగా చదువుకో ఫీజుకు డబ్బులు లేకుంటే నాకు ఫోన్ చెయ్యి. కృష్ణవేణి: నాన్న లేరని బాధేస్తుందమ్మా.. షర్మిల: అందరి ముందు తలెత్తుకునేలా బాగా చదువుకోవాలి. నాకు నాన్న లేరు.. నీకు నాన్న లేరు.. బాధపడొద్దు. షర్మిల: నీవు ఏం చదువుతున్నావు? (కొడుకు మహేందర్‌ను ఉద్దేశించి..) మహేందర్: ఆరో తరగతి చదువుతున్నాను. షర్మిల: నాన్న ఎలా చనిపోయాడు? మహేందర్: నాకు తెలియదు.. చిన్నగా ఉన్నా. షర్మిల: దేవుడున్నాడు, ధ్యైరంగా ఉండండి.. ఆరోగ్యశ్రీతోనే... పునర్జన్మ తాండూరు రూరల్: దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్‌రెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకం ద్వారా నాకు పునర్జన్మ వచ్చిందని మండలంలోని జినుగుర్తి గ్రామానికి చెందిన పందుగొట్టె బాలప్ప, వైఎస్ తనయ షర్మిలతో తన సంతోషాన్ని పంచుకున్నాడు. తాండూరు పట్టణం నుంచి గురువారం ప్రారంభమైన పరామర్శ యాత్ర తాండూరు మండలం జినుగుర్తి గ్రామం మీదుగా పెద్దేముల్ మండలానికి వెళుతోంది. జినుగుర్తి గ్రామంలో ఆరోగ్యశ్రీ పథకం ద్వారా లబ్ధిపొందిన బాలప్ప తన ఇం టివద్ద వైఎస్ చిత్రపటాన్ని ఏర్పాటు చేశారు. పరామర్శలో భాగంగా బస్సులో నుంచి వెళుతున్న షర్మిల, బాలప్ప ఇంటివద్ద ఆగి వైఎస్ చిత్రపటానికి పూలమాల వేసింది. ఈ సందర్భంగా షర్మిల మట్లాడుతూ... వైఎస్ అభిమానులు అధైర్యపడొద్దని, వారికి వైఎస్ఆర్ సీపీ అండగా ఉంటుందన్నారు. వెంటనే అక్కడే ఉన్న బాలప్ప నాలుగు సంవత్సరాల క్రితం ఆరోగ్యశ్రీ పథకం ద్వారా హైదరాబాద్‌లోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో ఆపరేషన్ చేసుకున్నానని షర్మిలకు వివరించారు. వైఎస్ ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీతోనే నాకు పునర్జన్మ వచ్చిందని ఆమెతో తన సంతోషాన్ని పంచుకున్నారు. అనంతరం మహిళలు షర్మిలను శాలువాతో సన్మానించారు. అనంతరం వడ్డెరులను ఎస్టీ జాబితాలో చేర్చాలని వడ్డెర సంఘం నాయకులు చెన్నప్ప, రాములు షర్మిలకు వినతిపత్రాన్ని ఇచ్చారు. వైఎస్ అభిమానులు బోయిని కన్నప్ప, కమ్మరి కిషన్, శంకరయ్య, అనంతయ్య, అంజిలయ్య పాల్గొన్నారు. -
'రేవంత్ విషయంలో టీడీపీది మేకపోతు గాంభీర్యమే'
మోమినపేట (రంగారెడ్డి): ఓటుకు కోట్లు కేసులో నిందితుడుగా ఉన్న ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి విషయంలో టీడీపీ పార్టీ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తోందని తెలంగాణ రాష్ట్ర వైఎస్ఆర్సీపీ కమిటీ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి విమర్శించారు. వైఎస్ఆర్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల రంగారెడ్డి జిల్లాలో చేపట్టిన నాలుగు రోజుల పరామర్శయాత్ర విజయవంతమైందని ఆయన తెలిపారు. ఈ నెలాఖరులోగా తెలంగాణ లోని మరో జిల్లాలో షర్మిల పరామర్శయాత్ర చేపడుతారని పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వివరించారు. -
వైఎస్ షర్మిల నేటి పర్యటన ఇలా...
తాండూరు : పరామర్శ యాత్రలో భాగంగా వైఎస్ షర్మిల గురువారం వికారాబాద్ నియోజకవర్గం నుంచి పర్యటించనున్నారు. * ఉదయం తాండూరు నుంచి బయలుదేరి నేరుగా మర్పల్లి మండలానికి చేరుకుంటారు. అక్కడ కమ్మరి నారాయణ కుటుంబ సభ్యులను కలుసుకుంటారు. * అక్కడ నుంచి మోమిన్‌పేటకు చేరుకుని అరిగె యాదయ్య కుటుంబాన్ని పరామర్శిస్తారు. *చివరగా మోమిన్‌పేట మండలం ఎన్కతలలోని ఆలంపల్లి వెంకటేశం కుటుంబాన్ని కలుసుకుంటారు. అనంతరం లోటస్‌పాండ్‌కు పయనమవుతారు. కాగా దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి మరణ వార్తను జీర్ణించుకోలేక రంగారెడ్డి జిల్లాలో మృతి చెందిన వారి కుటుంబాలను పరామర్శించేందుకు వైఎస్ షర్మిల గత నెల 29 నుంచి మలివిడత యాత్రను చేపట్టిన విషయం తెలిసిందే. -
అడుగడుగునా నీరాజనం
అనురాగం.. ఆత్మీయతల నడుమ జిల్లాలో షర్మిల పరామర్శ యాత్ర మూడోరోజు కొనసాగింది. చేవెళ్ల, పరిగి, తాండూరు నియోజకవర్గాల్లో పర్యటించిన షర్మిలకు జనం అడుగడుగునా బ్రహ్మరథం పట్టారు. బుధవారం నాలుగు కుటుంబాలను ఆమె కలుసుకున్నారు. ‘మీకు నీనున్నానంటూ’ భరోసా ఇచ్చారు. తాండూరులో ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ఆమెతో కరచాలనం చేసేందుకు మహిళలు పోటీపడ్డారు. మొయినాబాద్ మండలం ఎన్కేపల్లిలో పాఠశాల విద్యార్థులు ఘనంగా స్వాగతం పలికారు. - భరోసా ఇచ్చిన వైఎస్ తనయ - సుగుణ కుటుంబానికి పరామర్శ - ఉద్వేగానికిలోనైన కుటుంబసభ్యులు - కంటతడిపెట్టిన వైనం - ఓదార్చిన షర్మిల చేవెళ్ల/మొయినాబాద్ రూరల్: ‘వైఎస్ రాజశేఖరరెడ్డి మరణవార్త విన్న మా అమ్మ అదేరోజు చనిపోయింది. వైఎస్ అంటే మా అమ్మకు విపరీతమైన అభిమానం ఉండేది. ఆరు సంవత్సరాల తర్వాత మా కు టుంబాన్ని కూడా గుర్తుపెట్టుకొని ఓదార్చడం తో ఉద్విగ్నానికి లోనయ్యాం. మీరాక మాకు సంతోషాన్ని కలిగించింది. మీరు మా ఇంటికి రావడం గొప్ప అనుభూతిని కలిగించింది’ అని సుగుణ కుటుంబసభ్యులు తెలిపారు. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి మరణాన్ని తట్టుకోలేక మృతిచెందిన మొయినాబాద్ మం డలంలోని ఎన్కేపల్లి గ్రామంలో ఈడిగ సుగుణ కుటుంబాన్ని షర్మిల బుధవారం పరామర్శిం చారు. ఉదయం 11 గంటలకు ఎన్కేపల్లిలోని సుగుణ ఇంట్లో వైఎస్సార్ విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. షర్మిలను చూసి కుటుంబసభ్యులు ఉద్విగ్నానికి లోనయ్యారు. అనంతరం సుగుణ కుమారుడు ఈడి గ రాజప్రవీణ్, కుమార్తె సల్వ పుష్పరాజ్, బిం దు ప్రియదర్శిని, కోడలు జీవామణి, మనుమరాళ్లు ప్రేజీ, సంజన, మనవడు పార్థును ఆమె పరిచయం చేసుకున్నారు. మీ అమ్మ ఎలా చని పోయిందని, మీ నాన్న ఏం చేస్తుంటాడని కు టుంబసభ్యులను అడిగి తెలుసుకున్నారు. మా నాన్న చిన్నప్పుడే మమ్మల్ని వదిలి వెళ్లిపోతే.. అన్నీ తానై మా అమ్మే మాకు చదువు చెప్పిం చింది. కష్టపడి మాకు కూడా పెళ్లిళ్లు చేసింది. మా అమ్మకు వైఎస్సార్ అంటే మహాప్రాణం. ఆయన ప్రవేశపెట్టిన పథకాలు గ్రామంలో మహిళలకు, ప్రజలకు తెలియజెప్పేది. మీ స్ఫూర్తితోనే పాఠశాలను నడిపిస్తున్నాం.. ప్రతి ఒక్కరూ చదువుకోవాలనే వైఎస్ ఆశయం మేరకు.. మీ స్ఫూర్తి, చేయూతతోనే గ్రామంలో మేము ప్రియదర్శిని పేరుతో పాఠశాలను నడిపిస్తున్నాం. మా అమ్మ సుగుణకు కూడా చదువుపై ఆసక్తి ఎక్కువ. అందువల్ల 1999లో పాఠశాలను స్థాపించాం. ప్రస్తు తం 70 మంది వి ద్యార్థులున్న ఈ పాఠశాలలో 30 మంది రెసిడెన్షియల్గానూ, మరో 40 మం ది డే స్కాలర్స్‌గా చదువుతున్నారు. ఆడపిల్లలు చదువుకోవాలనేదే అమ్మ ఆశయం. అందువల్ల బాలికల చదువుకు ప్రాధాన్యతనిస్తున్నాం. అమ్మ ఎలా చనిపోయిందంటే.. మా అమ్మ సుగుణ వైఎస్‌కు వీరాభిమాని. సెప్టెంబర్ 2న ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ మిస్సయిందని తెలుసుకొని విలవిల్లాడింది. అప్పటినుంచి టీవీ చూస్తూ కూర్చుంది. రోజంతా గడిచినా ఆయన జాడ తెలియకపోవడంతో కంగారు ఎక్కువైంది. మరుసటిరోజు ఉదయం హెలికాప్టర్ ప్రమాదంలో వైఎస్ మరణించాడని టీవీ ల్లో వార్తలు రావడంతో కన్నీ టి పర్యంతమైంది. వైఎస్ మరణాన్ని జీర్ణించుకోలేక అదే రోజురాత్రి గుండె ఆగి చనిపోయిందని కన్నీటిపర్యంతమయ్యారు. మీ కుటుంబాలు బాగుండాలి.. దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డిపై ఇంత అభిమానం చూపిస్తున్నందుకు మీకు కృతజ్ఞతలు. మీ కుటుంబాలు బాగుండాలి. ఏ ఆపద వ చ్చినా నాకు ఫోన్‌చేయండి. నేను మీకు అం డగా ఉంటా. మీకు చేయూతనిస్తామని వైఎస్ తనయ షర్మిల తెలిపారు. సుగుణ కుటుంబసభ్యులను ఓదార్చి వారికి భరోసా కల్పించారు. షర్మిలకు కుటుంబసభ్యులు స్వీట్లు తినిపిం చారు. కార్యక్రమంలో తెలంగాణ వైఎస్సార్ సీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, రాష్ట్ర ప్రచార కార్యదర్శి శివకుమార్, జిల్లా అధ్యక్షుడు సురేష్‌రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి, రాష్ట్ర యూత్ అధ్యక్షుడు భీష్మ రవీందర్, రాష్ట్ర నాయకులు సయ్యద్ ముజ్తబా, అమృతాసాగర్, ప్రధాన కార్యదర్శి గాదె నిరంజన్‌రెడ్డి, సునీల్‌కుమార్, జిల్లా ఉపాధ్యక్షుడు పి.నాగిరెడ్డి, మొయినాబాద్ మండల అధ్యక్షుడు రాజయ్య, ఎనికెపల్లి సర్పంచ్ అమర్నాథ్రెడ్డి, చేవెళ్ల పార్లమెంటు ఎస్సీ సెల్ అధ్యక్షుడు జే.భీమయ్య, పార్టీ నాయకులు వెంకటేశ్‌యాదవ్, శివారెడ్డి, మందడి వెంకట్‌రెడ్డి, మెల్గు శ్రీనివాస్‌గౌడ్, రవీందర్ తదితరులు పాల్గొన్నారు. గోటిగకుర్ధులో.. తాండూరు: మీకు ఏ కష్టమొచ్చినా మేమున్నాం. అధైర్యపడొద్దు.. అంటూ వైఎస్ఆర్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల ఆత్మవిశ్వాసం కలిగించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం తరువాత ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి కావాలని, ఆ కోరిక నెరవేరకపోవడంతో ప్రాణాలు వదిలిన తాండూరు డివిజన్ గోటికగుర్ధుకు చెందిన అవుసుల లక్ష్మయ్యచారి కుటుంబాన్ని షర్మిల పరామర్శించారు. మూడోరోజు పరామర్శ యాత్రలో భాగంగా లక్ష్మయ్యచారి కుటుంబాన్ని కలిశారు. లక్ష్మయ్యచారి కొడుకు జగన్నాథ్‌చారి, కోడలు రేణుక, కూతుళ్లు జగదాంబ, లక్ష్మితోపాటు అల్లుడు రాములు ఇతర కుటుంబ సభ్యులను షర్మిల ఆప్యాయంగా పలకరించారు. లక్ష్మయ్యచారి ఎలా చనిపోయారు? ఎందుకు చనిపోయారు? తదితర వివరాలు అడిగి తెలుసుకున్నారు. వైఎస్ అంటే నాన్నకు ఎంతో ప్రే మ అని లక్ష్మయ్యచారి కూతుళ్లు జగదాంబ, లక్ష్మి షర్మిలకు వివరించారు. కళ్ల ముందే ఒంటికి నిప్పంటించుకొని జగన్ సీఎం కావాలని కేకలు వేస్తూ నాన్న ప్రాణాలు వదిలారని చిన్నకూతురు జగదాంబ ఏడుస్తూ షర్మిలకు వివరిం చారు. జగన్మోహన్రెడ్డి సీఎం కావాలని దే వున్ని ప్రార్థించేవాడు. ఆ కోరిక నెరవేకపోవడంతో ఒంటిపై నిప్పంటించుకొని తన తండ్రి ప్రాణాలు విడిచారని లక్ష్మ్యచారి కూతుళ్లు కన్నీటి పర్యంతమయ్యారు. తన సోదరుడు జగన్నాథ్, తమకు పెద్ద దిక్కు మా తండ్రి లేకపోవడంతో మా కుటుంబం కష్టాలు పడుతున్నదని వాపోయారు. వారి కష్టాలు విన్న షర్మిల చలించిపోయారు. ఎలాంటి సహాయం కావాలన్నా తనకు ఫోన్ చేయాలని షర్మిల సూచించారు. వైఎస్ఆర్ సీపీ తెలంగాణ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్, ఖమ్మం ఎంపీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి లక్ష్మయ్యచారి కుటుంబాన్ని ఓదార్చారు. మొదట షర్మిల లక్ష్మయ్యచారితోపాటు దివంగత నేత వైఎస్ చిత్రపటాలకు పూలతో నివాళులర్పించారు. లక్ష్మయ్యచారి కూతుళ్లు, కోడలు జగదాంబ, లక్ష్మి, కోడలు రేణుక షర్మిలకు చేతికి గాజులు తోడిగి, పండ్లు, పూలు అందించారు. ఆమె పాదాభివందనం చేయబోతుండగా షర్మిల వద్దని వారించారు. -
వైఎస్ ఆశయాలను మనమే బతికించాలి
♦ అందరూ చేయీ చేయీ కలిపి రాజన్న రాజ్యం తెచ్చుకోవాలి: షర్మిల ♦ రంగారెడ్డి జిల్లాలో మూడోరోజు కొనసాగిన పరామర్శ యాత్ర సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : ‘నేటికీ కోట్ల మంది తెలుగు ప్రజల కళ్లల్లో తడి ఆరలేదు. ఈరోజు వర కూ తెలుగు ప్రజల గుండెల్లో ైవె ఎస్ రాజశేఖరరెడ్డి బతికే ఉన్నారు. ఆయనకు మరణం లేదు. తెలుగు జాతి ఉన్నంత కాలం ప్రజల హృదయాల్లో రాజన్నగా బతికే ఉం టారు. ఆయన ఆశయాలను మనమే బతి కించాలి. మీరూ, మేం చేయీ చేయీ కలపాలి రాజన్న రాజ్యం తెచ్చుకోవాలి’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల పిలుపునిచ్చారు. రంగారెడ్డి జిల్లాలో వైఎస్ మరణాన్ని తట్టుకోలేక మరణించినవారి కుటుంబాలను పరామర్శిస్తున్న షర్మిల బుధవారం మూడోరోజు చేవెళ్ల, పరిగి, తాండూరు నియోజకవర్గాల్లో నాలుగు కుటుం బాలను కలుసుకున్నారు. వారి కష్టసుఖాలను తెలుసుకుని ధైర్యం చెప్పారు. తాండూరులోని అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించిన అనంతరం ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. వైఎస్ ప్రజల మనిషి కాబట్టే.. వైఎస్ ప్రజల మనిషి కాబట్టే జనం గుండెలో చిరస్థాయిగా నిలిచిపోయారని షర్మిల అన్నారు. ‘దేశ చరిత్రలో ఎప్పుడూ జరగనిది వైఎస్ విషయంలో జరిగింది. ఒక్క నాయకుడు చనిపోతే ఆ బాధను భరించలేక జీర్ణించుకోలేక వందల మంది ఆయన వెనకాలే వెళ్లిపోయారు. ఇది సామాన్యమైన విషయం కాదు. వైఎస్ ప్రజల గుండెల్లో బాధను తన బాధగా భావించారు. అధికారం ఉన్నా.. లేకున్నా.. ప్రజల పక్షాన నిలిచారు. సీఎం అయిన క్షణం నుంచి ప్రజల గురించే ఆలోచించి అద్భుత పథకాలకు రూపకల్పన చేశారు. పేదలను తన భుజాన మోశారు. రైతును రాజును చేశారు. అందుకే రాజశేఖరరెడ్డి రాజన్న అయ్యారు. కోట్ల మందికి ఆత్మబంధువయ్యారు. రైతులు, మహిళలు, విద్యార్థులు, వృద్ధులకు మేలు చేశారు. సంక్షేమ పథకాలతో ప్రతి ఒక్క రంగానికి మేలు చేశారు. వైఎస్ ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో ఎందరో పేదలు ఉచితంగా చదివి ఉద్యోగాలు చేస్తున్నారు. పేదలు జబ్బు పడితే ఆదుకునేందుకు ఆరోగ్యశ్రీని ప్రవేశపెట్టారు. 108 సర్వీసులతో లక్షలాది మందికి పునర్జన్మనిచ్చారు’ అని షర్మిల అన్నారు. ఆప్యాయత.. ఆత్మీయత మధ్య.. వైఎస్ మరణాన్ని తట్టుకోలేక చనిపోయినవారి కుటుంబాలను పరామర్శించిన షర్మిలకు అడుగడుగునా ఆత్మీయ స్వాగతం లభించింది. తొలుత మొయినాబాద్ మండలం ఎన్కేపల్లిలో ఈడిగి సుగుణమ్మ కుటుంబాన్ని పరామర్శించారు. ‘చిన్నప్పుడే మమ్మల్ని వదిలి నాన్న వెళ్లిపోతే.. అమ్మే అన్నీ తానై మమ్మల్ని సాకింది. వైఎస్ మరణాన్ని తట్టుకోలేక అమ్మ కూడా చనిపోయింది’ అని కుటుంబసభ్యులు బోరున విలపించారు పేద విద్యార్థులకు ఉచిత విద్యను ప్రారంభించిన తమ తల్లి స్ఫూర్తిని కొనసాగిస్తున్నామని సుగుణమ్మ కుటుంబీకులు చెప్పారు. అనంతరం పరిగి నియోజకవర్గంలోని కల్ప కృష్ణారెడ్డి కుటుం బాన్ని షర్మిల పరామర్శించారు. తర్వాత పరిగి మండల కేంద్రంలో బంగరిగళ్ల శ్రీనివాస్ కుటుంబాన్ని పరామర్శించారు. పెద్దదిక్కు పోవడంతో వీధినపడ్డ శ్రీనివాస్ భార్య అనసూయకు అంగన్వాడీ కార్యకర్త పోస్టు ఇప్పించేందుకు చొరవ చూపుతానని భరోసా ఇచ్చారు. తర్వాత బషీరాబాద్ మండలం గొట్టిగఖుర్దులో అవుసల లక్ష్మయ్యచారి కుటుం బాన్ని షర్మిల పరామర్శించారు. ‘మీ కుటుం బాన్ని ఆదుకునే బాధ్యత మాదే’ అంటూ వారికి భరోసా ఇచ్చారు. షర్మిల వెంట పరామర్శ యాత్రలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు కె.శివకుమార్, జిల్లా అధ్యక్షుడు సురేశ్‌రెడ్డి, గాదె నిరంజన్‌రెడ్డి, నల్లా సూర్యప్రకాష్, అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి, అనుబంధ విభాగాల అధ్యక్షులు బీష్వ రవీందర్, ప్రఫుల్లారెడ్డి, జార్జ్ హెర్బెర్ట్, నర్రా భిక్షపతి, శ్రీనివాస్‌రెడ్డి, ముజతబా అహ్మద్, వెంకట్రావ్, కార్యదర్శులు బొడ్డు సాయినాథ్‌రెడ్డి, రఘురామ్‌రెడ్డి, రామ్‌భూపాల్‌రెడ్డి, ప్రభుకుమార్, అమృతాసాగర్, వరలక్ష్మి, మహబూబ్‌నగర్, వరంగల్ జిల్లా అధ్యక్షులు శ్యాంసుందర్‌రెడ్డి, మహేందర్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర నేతలు సూర్యనారాయణరెడ్డి, గోపాల్‌రావు, వనజ, సత్యమూర్తి, విజయ్‌కుమార్‌రెడ్డి, ప్రశాంత్‌రెడ్డి, మేరీ, వీఎల్ఎన్ రెడ్డి, బంగి లక్ష్మణ్, జి. జైపాల్‌రెడ్డి, జస్వంత్‌రెడ్డి, సుమన్‌గౌడ్, విలియం మునగాల, మల్లు రవీందర్‌రెడ్డి, సంజీవరావు, జగదీశ్వర్ గుప్త తదితరులు పాల్గొన్నారు. -
శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో వైఎస్ షర్మిలకు ఘన స్వాగతం
హైదరాబాద్ : మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిలకు శంషాబాద్ విమానాశ్రయంలో సోమవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అక్కడ నుంచి ఆమె నేరుగా నేరుగా మహేశ్వరం నియోజకవర్గంలోని సరూర్‌నగర్ మండలం జిల్లెలగూడలో మందమల్లమ్మ చౌరస్తాకు చేరుకుంటారు. అక్కడ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించి పరామర్శ యాత్రను ప్రారంభిస్తారు. రంగారెడ్డి జిల్లాలో వైఎస్ రాజశేఖరరెడ్డి హఠాన్మరణాన్ని జీర్ణించుకోలేక ప్రాణాలు వదిలిన15 కుటుంబాలను వైఎస్ షర్మిల పరామర్శిస్తారు నాలుగు రోజులు పాటు జరిగే పర్యటనలో భాగంగా ఆమె తొలిరోజు 177 కిలోమీటర్ల మేర పరామర్శయాత్ర చేస్తారు. రెండో రోజు 134 కిలోమీటర్లు, మూడోరోజు 153 కిలోమీటర్లు, నాలుగోరోజు 126 కిలోమీటర్ల చొప్పున మొత్తం 590 కిలోమీటర్ల మేర యాత్ర కొనసాగుతుంది. -
నేడు జిల్లాకు రాజన్న బిడ్డ
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తనయ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల సోమవారం నుంచి జిల్లాలో పర్యటించనున్నారు. వరుసగా నాలుగు రోజులపాటు ఆమె జిల్లాలో పర్యటిస్తారు. వైఎస్ రాజశేఖరరెడ్డి హఠాన్మరణాన్ని జీర్ణించుకోలేక ప్రాణాలు వదిలిన వారి కుటుంబాలను పరామర్శించనున్నారు. సోమవారం మధ్యాహ్నం శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి జిల్లెలగూడకు చేరుకుని అక్కడినుంచి ఆమె యాత్ర ప్రారంభించనున్నారు. ఇందు కోసం వైఎస్సార్ సీపీ నాయకులు ఏర్పాట్లను పూర్తి చేశారు. * నాలుగురోజులపాటు షర్మిల పర్యటన * 590 కి.మీ. కొనసాగనున్న పరామర్శ యాత్ర * వైఎస్సార్ హఠాన్మరణాన్ని తట్టుకోలేక మరణి ంచిన * వారి కుటుంబాలను కలుసుకోనున్న షర్మిల * భారీగా ఏర్పాట్లు చేసిన వైఎస్సార్ సీపీ శ్రేణులు సాక్షి, రంగారెడ్డి జిల్లా: శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి షర్మిల సోమవారం మధ్యాహ్నం మహేశ్వరం నియోజకవర్గంలోని సరూర్‌నగర్ మండలం జిల్లెలగూడలో మందమల్లమ్మ చౌరస్తాకు చేరుకుంటారు. అక్కడ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పిస్తారు. అనంతరం జిల్లెలగూడలో వైఎస్ హఠాన్మరణాన్ని తట్టుకోలేక చనిపోయిన బి.అంజయ్య కుటుంబీకులను కలుసుకుంటారు. అనంతరం మహేశ్వరం మండలం మంఖాల్‌లో ఎండల జోసెఫ్ కుటుంభసభ్యులను పరామర్శిస్తారు. ఆ తర్వాత ఇబ్రహీంపట్నం మండలం దండుమైలారంలోని పోకల్‌కార్ మహేశ్‌జీ కుటుంబసభ్యులను కలుసుకుంటారు. అనంతరం లోటస్‌పాండ్‌కు బయలుదేరుతారు. తొలిరోజు 177 కిలోమీటర్ల మేర పరామర్శ యాత్ర కొనసాగనుంది. రెండో రోజు 134 కిలోమీటర్లు, మూడో రోజు 153 కిలోమీటర్లు, నాలుగో రోజు 126 కిలోమీటర్ల చొప్పున మొత్తం 590 కిలోమీటర్ల మేర పరామర్శ యాత్ర కొనసాగుతుంది. ఏర్పాట్లు పూర్తి చేసిన శ్రేణులు.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల పరామర్శ యాత్ర నేపథ్యంలో జిల్లా పార్టీ అధ్యక్షుడు సురేష్‌రెడ్డి ఆధ్వర్యంలో నాయకత్వం ఏర్పాట్లను పూర్తి చేసింది. పరామర్శయాత్ర సాగే రహదారులు పార్టీ జెండాలతో నిండిపోయాయి. పరామర్శ యాత్రలో షర్మిలతోపాటు వైఎస్సార్ సీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కూడా పాల్గొననున్నారు. పరామర్శ యాత్రతోపాటు పలుచోట్ల రోడ్‌షోల్లోనూ ఆమె పాల్గొననున్నట్లు పారీ వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో ప్రధాన కూడళ్లు ఫ్లెక్సీలు, కటౌట్లతో నిండిపోయాయి. నాలుగురోజులపాటు యాత్ర జరుగుతున్నందున పార్టీ శ్రేణులు భారీగాపాల్గొననున్నాయి. పరామర్శ యాత్రను విజయవంతం చేద్దాం వైఎస్సార్ సీపీ నాయకురాలు షర్మిల పరామర్శ యాత్రను విజయవంతం చేయాలని వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు సురేష్‌రెడ్డి పిలుపు నిచ్చారు. సోమవారం మధ్యాహ్నం ప్రారంభం కానున్న పరామర్శ యాత్రలో వైఎస్సార్ అభిమానులు, నాయకులు పెద్దఎత్తున పాల్గొని తమ ప్రియతమ నాయకురాలికి స్వాగతం పలకాలని కోరారు. మందమల్లమ్మ చౌరస్తాలోని వైఎస్ఆర్ విగ్రహానికి నివాళులర్పించి అక్కడి నుంచి ర్యాలీగా వెళ్లి అంజయ్య కుటుంబ సభ్యులను పరామర్శిస్తారని, అనంతరం అక్కడి నుంచి మహేశ్వరం మండలం మంఖాల్‌కు బయలు దేరనున్నట్లు పేర్కొన్నారు. తొలి రోజు పర్యటన ఇలా * సోమవారం మధ్యాహ్నం శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి సరూర్‌నగర్ మండలం జిల్లెలగూడలో మందమల్లమ్మ చౌరస్తాకు చేరుకుంటారు. * అక్కడ వైఎస్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పిస్తారు. అనంతరం స్థానికంగా వైఎస్ హఠాన్మరణాన్ని తట్టుకోలేక చనిపోయిన బి.అంజయ్య ఇంటికి వెళ్లి ఆయన కుటుంబీకులను పరామర్శిస్తారు. * అనంతరం మహేశ్వరం మండలం మంఖాల్‌లో ఎండల జోసెఫ్ కుటుంబ సభ్యులను కలుసుకుంటారు. * ఆ తర్వాత ఇబ్రహీంపట్నం మండలం దండుమైలారంలోని పోకల్‌కార్ మహేశ్‌జీ కుటుంబీకులను పరామర్శిస్తారు. -
రేపటి నుంచి రంగారెడ్డి జిల్లాలో షర్మిల యాత్ర
-
రేపటి నుంచి షర్మిల యాత్ర
వైఎస్ మృతిని తట్టుకోలేక చనిపోయిన కుటుంబాలకు పరామర్శ మంద మల్లమ్మ చౌరస్తాలో రాజశేఖరరెడ్డికి నివాళి జిల్లెలగూడ నుంచి రంగారెడ్డి జిల్లా పర్యటన ప్రారంభం సాక్షి,సిటీబ్యూరో: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి హఠాన్మరణాన్ని తట్టుకోలేక మృతి చెందినవారి కుటుంబాలను మహానేత తనయవైఎస్ షర్మిల పరామర్శించనున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశం మేరకు షర్మిల సోమవారం నుంచి రంగారెడ్డి జిల్లాలో పరామర్శ యాత్ర చేపడతారు. తొలుత సరూర్ నగర్ మండలం జిల్లెల గూడలో మరణించిన బచ్చనబోయిన అంజయ్య యాదవ్ కుటుంబ సభ్యులను ఆమె పరామర్శిస్తారు. సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు మంద మల్లమ్మ చౌరస్తాలోని వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి నివాళి అర్పించిన అనంతరం షర్మిల పరామర్శ యాత్రను ప్రారంభిస్తారు. తొలి రోజు మహేశ్వరం మండలం మంఖాల్, ఇబ్రహీంపట్నం మండలం దండుమైలారం గ్రామాల్లోని మృతుల కుటుంబాలను పరామర్శిస్తారు. మంగళవారం ఉదయం మేడ్చల్ నియోజకవర్గంలోని కొండ్లకోయ నుంచి యాత్రను ప్రారంభించి... మేడ్చల్, కేసారం, మూడుచింతలపల్లి, లక్ష్మాపూర్‌లలో పరామర్శ యాత్ర కొనసాగిస్తారు. బుధవారం మొయినాబాద్ మండలం ఎన్కేపల్లి, పరిగి మండలం రంగాపూర్, గొట్టిఖుర్దు, తాండూరులలో మృతుల కుటుంబాలను పరామర్శిస్తారు. గురువారం వికారాబాద్ నియోజకవర్గంలోని మర్పల్లి, మోమిన్‌పేట, ఎన్కతలను సందర్శిస్తారు. భారీగా స్వాగతం పలుకుదాం దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రజల కోసం ఏ కార్యక్రమం తలపెట్టినా రంగారెడ్డి జిల్లానే ఎంచుకునే వారని... ప్రస్తుతం ఆయన కుమార్తె షర్మిల జిల్లా పర్యటనకు వస్తున్న దృష్ట్యా ఆమెకు భారీగా స్వాగతం పలకాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కె.శివకుమార్, జిల్లా అధ్యక్షులు సురేష్‌రెడ్డి శ్రేణులకు విజ్ఞప్తి చేశారు. -
పరామర్శ యాత్రను విజయవంతం చేయండి
సరూర్‌నగర్: జిల్లాలో ఈనెల 29 నుంచి ప్రారంభం కానున్న షర్మిల పరామర్శ యాత్రను జయప్రదం చేయాలని వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివకుమార్ పిలుపునిచ్చారు. దివంగత ముఖ్యంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అకాల మరణాన్ని జీర్ణించుకోలేక చనిపోయిన వారి కు టుంబాలను పరామర్శించేందుకు షర్మిల చేపట్టబోతున్న పరామర్శ యాత్ర పోస్టర్‌ను బుధవారం మందమల్లమ్మ చౌరస్తాలో వైఎస్ విగ్రహం వద్ద ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పార్టీ రాష్ట్ర కార్యదర్శి కొ లిశెట్టి శివకుమార్, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు సురేష్‌రెడ్డి హాజరయ్యారు. ఈనెల 29నుంచి జిల్లాలోని సరూర్‌నగర్ మండలం, జిల్లెలగూడ నుంచి పరామర్శ యాత్ర ప్రారంభమై వచ్చే నెల 2వ తేదీ వరకు కొనసాగుతుందన్నారు. జిల్లాలోని ఏడు నియోజకవర్గాలల్లో 580 కిలోమీటర్లమేర పర్యటించి 15 కుటుంబాలను ప రామర్శిస్తారని వెల్లడించారు. మహేశ్వరం ని యోజకవర్గంలోని జిల్లెలగూడ నుంచి తొలి రోజు పరామర్శయాత్ర మొదలవుతుందన్నా రు. మందమల్లమ్మ చౌరస్తాలో బహిరంగసభ ఉంటుందన్నారు. జిల్లా అధ్యక్షుడు జి.సురేష్‌రెడ్డి మాట్లాడుతూ వైఎస్సార్ మరణాన్ని తట్టుకోలేక జిల్లాలో మరణించిన అన్ని కుటుంబాలను షర్మిల పరామర్శిస్తారన్నారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శులు గోపాల్‌రెడ్డి, సూరజ్‌ఎస్‌దాని, జిల్లా కార్యదర్శి వెంకట్‌రెడ్డి, సరూర్‌నగర్ మం డల అధ్యక్షుడు మోహన్‌రెడ్డి, విద్యార్థి నాయకు లు సుమన్‌గౌడ్, రాంచందర్, మాసూం, రాజ శేఖర్‌రెడ్డి, కిష్టయ్య, నగరపంచాయతీ అధ్యక్షురాలు విజయలక్ష్మి, యాదయ్య, పాండునాయక్, ఆనంద్‌కుమార్, శ్రీనివాస్ ఉన్నారు. -
'బాబును ఏ1, రేవంత్ ను ఏ2 గా చేర్చాలి'
నల్గొండ: ఓటుకు రూ. 5 కోట్ల కేసులో చంద్రబాబునాయుడిని ఏ-1 ముద్దాయిగా, ఈ ఘటనతో సంబంధమున్న ఎమ్మెల్యేలందరినీ ముద్దాయిలుగా చేర్చాలని వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి డిమాండ్ చేశారు. నల్లగొండ జిల్లా చౌటుప్పల్ మండలం అంకిరెడ్డిగూడెంలో షర్మిల మలివిడత పరామర్శయాత్ర ముగింపు సందర్భంగా ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఓటుకు నోటు వ్యవహారంపై వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్రెడ్డి గవర్నర్, రాష్ట్రపతిలను ఇప్పటికే కలిసి ఫిర్యాదు చేశారన్నారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని ప్రభుత్వం చెప్పడం కాదని, తక్షణమే ఆ పని చేయాలని, చంద్రబాబును ఏ-1 ముద్దాయిగా చేర్చి, అరెస్టు చేయాలని పొంగులేటి డిమాండ్ చేశారు. ఒక పార్టీ ఎంపీ, ఎమ్మెల్యేలను వేరే పార్టీలోకి మారే అంశానికి కూడా తక్షణమే పుల్‌స్టాప్ పెట్టాలని ప్రభుత్వానికి సూచించారు. రేవంత్‌రెడ్డిని ఏ-2 ముద్దాయిగా, ప్రలోభాలతో సంబంధం ఉన్న ఎమ్మెల్యేలందరినీ ముద్దాయిలుగా చేర్చాలన్నారు. చంద్రబాబునాయుడు ఢిల్లీకి వెళ్లి లాబీయింగ్ చేస్తున్నారన్నారు. ఈ విషయంలో ప్రధానమంత్రి సరిగా వ్యవహరించాలని పొంగులేటి అన్నారు. (చౌటుప్పల్) -
'త్వరలో కరీంనగర్ జిల్లాలో షర్మిల పరామర్శయాత్ర'
కరీంనగర్:త్వరలో కరీంనగర్ జిల్లాలో వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల పరామర్శయాత్ర చేపట్టనున్నట్లు తెలంగాణ వైఎస్సార్ సీపీ అధ్యక్షులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. దివంగత నేత వైఎస్సార్ కోసం ప్రాణాలు కోల్పోయిన 30 మంది కుటుంబాలను షర్మిల పరామర్శిస్తారని ఆయన తెలిపారు. ఆదివారం జరిగిన వైఎస్సార్ సీపీ విస్తృతస్థాయి సమావేశంలో పొంగులేటి పాల్గొన్నారు. టీఆర్ఎస్ ఎన్నికల్లో హామీలను విస్మరించిందని పొంగులేటి విమర్శించారు. ఏపీలో కూడా టీడీపీ సర్కార్ మాటలకే పరిమితమైందని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వాలకు సిద్ధ శుద్ధి ఉంటే పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. రేపటి నుంచి జరిగి పార్లమెంట్ సమావేశాల్లో రైతు సమస్యలను ప్రస్తావిస్తామని పొంగులేటి స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో వైఎస్సార్ సీపీ శాసన సభను శాసిస్తోందన్నారు. పంట నష్టపోయిన రైతులకు తక్షణమే పరిహారం అందించాలని వైఎస్సార్ సీపీ డిమాండ్ చేసింది. కరీంనగర్ జిల్లాను వెంటనే కరువు జిల్లాగా ప్రకటించాలని కోరుతూ నేటి తీర్మానంలో పేర్కొన్నారు. దీంతో పాటు ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్ట్ డిజైన్ మార్చకుండా జాతీయ హోదా కల్పించాలని కోరుతూ వైఎస్సార్ సీపీ తీర్మానించింది. -
21నుంచి పరామర్శ యాత్ర
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి హఠాన్మరణాన్ని జీర్ణించుకోలేక ప్రాణాలొదిలిన వారి కుటుం బాలను పరామర్శించేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈనెల 21 నుంచి జిల్లాలో ‘పరామర్శ యాత్ర’ జరగనుంది. ఈ యాత్రలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు, ఆ పార్టీ అధినేత వైఎస్.జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల పాల్గొని ఆయా కుటుంబాలను పరామర్శించనున్నారు. వారం రోజులపాటు జిల్లాలోని ఆరు నియోజకవర్గాల్లో ఈ యాత్ర జరుగుతుందని పార్టీ వర్గాలు తెలిపాయి. తొలి విడతలో దేవరకొండ నియోజకవర్గంలోని మల్లేపల్లి వద్ద ప్రారంభం కానున్న ఈ యాత్ర నాగార్జునసాగర్, మిర్యాలగూడ, హుజూర్నగర్, కోదాడ మీదుగా సూర్యాపేట వరకు సాగుతుంది. ఈ నియోజకవర్గాల్లోని మొత్తం 32 కుటుంబాలను షర్మిల పరామర్శిస్తారని, మలి విడత యాత్ర వచ్చే నెలలో ఉంటుందని పార్టీ వర్గాలంటున్నాయి. ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకే: గట్టువైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్.జగన్మోహన్రెడ్డిని హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో గురువారంజిల్లా అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి కలిశారు. అనంతరం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. తన తండ్రి మరణాన్ని తట్టుకోలేక ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాల వద్దకు స్వయంగా వస్తానని సంతాపసభ జరిగిన నల్లకాలువలో వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం కోసమే ఈ యాత్రను నిర్వహిస్తున్నారన్నారు. జగన్ తరఫున ఆయన సోదరి ఆయా కుటుంబాలను పరామర్శిస్తారని, ఈ యాత్రను విజయవంతం చేసేందుకు జిల్లాలోని పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. -
వైఎస్సార్ జనభేరి
నేడు మరిపెడ, మానుకోట, నర్సంపేటలో షర్మిల రోడ్ షో వెఎస్సార్ కాంగ్రెస్ శ్రేణుల్లో వెల్లివిరుస్తున్న ఉత్సాహం విజయవంతం చేయూలని పార్టీ జిల్లా అధ్యక్షుడు ముత్తినేని పిలుపు వరంగల్, న్యూస్‌లైన్ : ఎన్నికల ప్రచారంలో భాగంగా జిల్లాలో శనివారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్.జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల రోడ్‌షో నిర్వహించనున్నారు. మహబూబాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ వైఎస్సార్ సీపీ అభ్యర్థి తెల్లం వెంకట్రావు, డోర్నకల్ అసెంబ్లీ అభ్యర్థి సుజాతా మంగీలాల్‌కు మద్దతుగా ఆమె వైఎస్సార్ జన భేరి పేరిట ప్రచారం చేపట్టనున్నారు. మరిపెడ నుంచి మహబూబాబాద్ మీదుగా నర్సంపేట వరకు రోడ్‌షో సాగనుంది. ఉదయం పది గంటలకు మరిపెడలో రోడ్‌షో ప్రారంభం కానుంది. అక్కడ ప్రజలనుద్దేశించి ప్రసంగించిన అనంతరం కురవి మీదుగా మహబూబాద్‌కు మధ్యాహ్నం ఒంటిగంట వరకు చేరుకోనున్నారు. ఆ తర్వాత గూడూరు మీదుగా నర్సంపేటకు మధ్యాహ్నం మూడు గంటలకు చేరుకుని.. అక్కడ రోడ్‌షోలో మాట్లాడనున్నారు. అనంతరం షర్మిల హైదరాబాద్‌కు వెళ్లిపోనున్నారు. షర్మిల రోడ్‌షో నేపథ్యంలో వైఎస్సార్ సీపీ జిల్లా నాయకులు, కార్యకర్తల్లో ఉత్సాహం వెల్లివిరుస్తోంది. రోడ్‌షోలను విజయవంతం చేసే ఏర్పాట్లలో ఇదివరకే నిమగ్నమయ్యారు. డోర్నకల్, మహబూబాబాద్, నర్సంపేట నియోజకవర్గాల పరిధిలోని నాయకులు రోడ్‌షోలో భాగస్వామ్యం కానున్నారు. షర్మిల రోడ్‌షోను జయప్రదం చేయాలి : ముత్తినేని ఎన్నికల ప్రచారంలో భాగంగా జిల్లాలో షర్మిల చేపట్టిన రోడ్ షోను విజయవంతం చేయాలని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ముత్తినేని సోమేశ్వర్రావు పిలుపునిచ్చారు. ఈ ఎన్నికల్లో పోటీ చేసిన పార్టీ అభ్యర్థుల విజయానికి నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయాలని కోరారు. దివంగత మహానేత వైఎస్సార్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను అమలు చేసే సత్తా యువనేత జగన్మోహన్రెడ్డికి మాత్రమే ఉందన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు రోడ్‌షోలో అధిక సంఖ్యలో పాల్గొనాలని ఆయన విజ్ఞప్తి చేశారు. -
తెలుగు తమ్ముళ్లూ మా వాళ్లే !: షర్మిల
కానీ చంద్రబాబుకు వైఎస్సార్ సీపీలోకి నో ఎంట్రీ * టీడీపీకి వేరే గతిలేకే చంద్రబాబును నాయకుడిగా ఎన్నుకున్నారు వైఎస్ షర్మిల * ఈ ఐదేళ్లలో చంద్రబాబు ఏనాడూ ప్రజల్ని పట్టించుకోలేదు సాక్షి, విశాఖపట్నం: ‘‘తెలుగు తమ్ముళ్లూ.. మాతో కలిసిపోతున్నారా..? రండి.. మీరంతా మా అన్నదమ్ములే. కానీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చంద్రబాబుకు మాత్రం నో ఎంట్రీ(ప్రవేశం లేదు)’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల.. టీడీపీ శ్రేణులనుద్దేశించి వ్యాఖ్యానించారు. విశాఖ లోక్‌సభ స్థానానికి వై.ఎస్.విజయమ్మ గురువారం నామినేషన్ వేశారు. ఈ కార్యక్రమానికి షర్మిల హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ వద్ద ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. విజయమ్మ నామినేషన్ వేసిన అనంతరం కలెక్టరేట్ ప్రాంగణం వద్ద పార్టీ శ్రేణులనుద్దేశించి షర్మిల ప్రసంగిస్తుండగా.. టీడీపీ అభ్యర్థి నామినేషన్‌కు మద్దతుగా ఆ పార్టీ శ్రేణులు కూడా వచ్చాయి. దీంతో వారినుద్దేశించి షర్మిల పైవిధంగా స్పందించారు. షర్మిల ప్రసంగం ఆమె మాటల్లోనే.. తెలుగు తమ్ముళ్లూ ఒక్క మాటకు సమాధానం చెప్పండి. చంద్రబాబు నాయుడున్న కాంగ్రెస్ ఓడిపోతే.. పాపం అల్లుడు కదా.. అని ఎన్టీఆర్ దయతలచి టీడీపీలోకి తీసుకొచ్చారు. చంద్రబాబు కన్ను ఎన్టీఆర్ కుర్చీపై పడింది. అంతే క్షణం ఆలోచించలేదు. సొంత మామ అని కూడా చూడకుండా.. పట్టపగలే.. కళ్లార్పకుండా వెన్నుపోటు పొడిచారు. ఎన్టీఆర్‌ను కాళ్లుపట్టి లాగి మరీ కుర్చీ తీసేసుకున్నారు. ఏ పార్టీ అని మీరు చెప్పుకుంటున్నారో.. ఏ పార్టీనైతే ఎన్టీఆర్ స్థాపించారో.. అదే పార్టీ నుంచి ఆయన్ని వెలేశారు. మీకు ఎంత గతిలేకపోతే అలాంటి చంద్రబాబును నాయకుడిగా పెట్టుకుంటారు? జగనన్న సీఎం అవుతాడు.. జగనన్న పాలనలో మీరు, మీ కుటుంబాలు కూడా లబ్ధి పొందుతాయి. ఐదేళ్లూ పేదల పక్షాన నిలిచింది జగనన్నే.. సూటిగా అడుగుతున్నా.. ఈ ఐదేళ్లలో చంద్రబాబు ఎప్పుడైనా జనం కోసం పోరాడారా? నిద్రలేచిన నుంచి ఎప్పుడూ.. జగన్ జపమే. ప్రజల కోసం పోరాడింది, వారి సమస్యలపై ఉద్యమించింది జగనన్న ఒక్కరే. ఎండనకా.. వాననకా.. రేయనకా.. పగలనకా.. ప్రజల మధ్యనే గడిపారు. పేద విద్యార్థులు, వారి ఫీజు రీయింబర్స్మెంట్ కోసం వారం రోజులు నిరాహార దీక్ష చేశాడు. రైతుల కోసం, చేనేత కార్మికుల కోసం రోజుల తరబడి నిరాహార దీక్ష చేశాడు జగనన్న. మీ చంద్రబాబుకు అప్పుడైనా బుద్ధొచ్చిందా? అంటూ ప్రశ్నించారు. (ప్రసంగం చివరి వరకు ఆసక్తిగా వింటున్న టీడీపీ శ్రేణులనుద్దేశించి) ‘‘మండుటెండనుసైతం లెక్కచే యకుండా తెలుగుతమ్ముళ్లు సైతం మా కోసం ఇంతటి ప్రేమాభిమానాలు, ఆప్యాయతలు, ఆత్మీయతలు చూపుతున్నందుకు మీకు శిరసు వంచి మనస్ఫూర్తిగా నమస్కరిస్తున్నా’’ అని అన్నారు. నేడు నల్లగొండలో షర్మిల ప్రచారం సాక్షిప్రతినిధి, నల్లగొండ: ఎన్నికల ప్రచారంలో భాగంగా షర్మిల నల్లగొండ జిల్లాలో శుక్రవారం పర్యటించనున్నారు. హుజూర్నగర్, కోదాడ, సూర్యాపేట నియోజకవర్గాల్లోని మూడు సభల్లో పాల్గొని ఆమె ప్రసంగిస్తారు. ఉదయం 10.30గంటలకు నేరేడుచర్ల, మధ్యాహ్నం మూడు గంటలకు కోదాడలో, సాయంత్రం ఐదు గంటలకు సూర్యాపేటలో సభలలో ఆమె ప్రసంగిస్తారని వైఎస్సార్ కాంగ్రెస్ నేత రఘురాం తెలిపారు. -
ఏడాదంతా పోరే
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: బలుపు కాదు వాపు అని కాంగ్రెస్‌కు, ఇంకా బతికే ఉందని టీడీపీకి, ప్రజాదరణ ఏ మాత్రం తగ్గలేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి తెలియజెప్పిన సంవత్సరం 2013. నాలుగు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రావడం జిల్లా బీజేపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నింపగా, వామపక్షాలు మునుపటి నిస్తేజంతోనే ఎన్నికల సంవత్సరంలోకి వెళ్తున్నాయి. స్థానిక, సహకార సంఘాల అధికారం అండతో డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్ పదవులను కాంగ్రెస్ దక్కించుకున్నప్పటకీ పంచాయతీ ఎన్నికల్లో వైఎ స్సార్ కాంగ్రెస్ పార్టీ తన సత్తా చాటుకుంది. ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీలోని పెద్ద నాయకులు కొందరు ఇతర పార్టీలకు క్యూ కడుతున్నారు. సమైక్యాంధ్ర సమరంలోనూ కాంగ్రెస్, టీడీపీలు మొక్కుబడిగా పాల్గొనగా వైఎస్సార్సీపీ ఒక్కటే ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పోరుబాటన నడిచింది. ఇదీ స్థూలంగా 2013లో రాజకీయపార్టీల పరిస్థితి. మరోవైపు ఏడాదంతా సమైక్య ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడింది. అధికారానికి ఎదురొడ్డి విజయాలు సాధించిన వైఎస్సార్సీపీ జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ ప్రజల హృదయాల్లోనే నిలిచి ఉందని ఈ ఏడాది కూడా నిరూపించుకుంది. ప్రజల పక్షాన ఒక వైపు పోరాటం చేస్తూనే అధికారపక్షాన్ని ఎదురొడ్డి విజయాలను సొంతం చేసుకుంది. పంచాయతీ ఎన్నికల్లో అత్యధిక సర్పంచ్ స్థానాలను సాధించి సత్తా చాటుకుంది. జిల్లాలో పార్టీకి లభిస్తున్న ఆదరణతో రాష్ట్ర నాయకత్వం కూడా కొందరు నేతలను సీఈసీలోకి తీసుకుంది. సమైక్యాంధ్ర ఉద్యమం విషయంలో వైఎస్సార్సీపీ అలుపెరగని పోరాటం చేయడం ద్వారా ప్రజలకు మరింత దగ్గరైంది. కాంగ్రెస్ వర్కింగ్‌కమిటీ రాష్ట్ర విభజన నిర్ణయం వెలువరించిన రోజు నుంచే వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ జిల్లాలో సమైక్యాంధ్ర ఉద్యమాన్ని భుజాన వేసుకొని పనిచేసింది. సమైక్య శంఖారావంలో భాగంగా వైఎస్ షర్మిల జిల్లా పర్యటన జరిపారు. ఆత్మకూరు, బుచ్చిరెడ్డిపాళెం, కావలి పట్టణాల్లో నిర్వహించిన సభలకు జనం వేలాదిగా తరలివచ్చారు. గడ్డు పరిస్థితిలో కాంగ్రెస్ ... జిల్లాలో కాంగ్రెస్ పార్టీ దాదాపుగా కనుమరుగయ్యే దశకు చేరింది. ప్రస్తుతం ఆ పార్టీ తరపున నలుగురు శాసనసభ్యులు ఉండగా అందులో ఇద్దరు ఇతర పార్టీలకు వలస వెళ్లేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసుకుంటున్నారు. మిగిలేదల్లా ఆనం సోదరులు మాత్రమే. ఇక చాలా నియోజకవర్గాల నుంచి ముఖ్య నాయకులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు. పంచాయతీలో బతికే ఉన్నాననిపించిన టీడీపీ.. ఈ ఏడాది జరిగిన పంచాయతీ ఎన్నికలు జిల్లాలో టీడీపీకి ఊపిరిపోశాయి. కొన్ని నియోజకవర్గాల్లో ఆశించిన స్థాయిలో సర్పంచ్ పదవులను కైవసం చేసుకోవడం ద్వారా జిల్లాలో ఆ పార్టీ ఇంకా బతికే ఉందన్న అభిప్రాయాన్ని కల్పించాయి. రాష్ట్రంలో నెలకొన్న ప్రత్యేక రాజకీయ పరిస్థితుల్లో ప్రస్తుత కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు వైఎస్సార్సీపీలో అవకాశం దొరక్క దేశంవైపు చూస్తున్నారు. ఇది ఆ పార్టీలో ఇప్పటికే అసెంబ్లీ టికెట్లు ఆశిస్తున్న నేతల అసంతృప్తికి దారి తీస్తోంది. కార్యకర్తలు సంతోషపడాలో, బాధపడాలో తెలియని అయోమయ పరిస్థితుల్లో ఉన్నారు. జిల్లా పార్టీలో కీలక పాత్ర పోషిస్తున్న సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డికి 2013లో పొలిట్‌బ్యూరోలో స్థానం దక్కింది. కాగా పార్టీ అధినేత రెండు కళ్ల సిద్ధాంతంతో సమైక్యాంధ్ర ఉద్యమంలో తెలుగుదేశం కీలక పాత్ర పోషించలేక విమర్శలపాలైంది. -
కల చెదిరింది.. కథ మారింది
ఉవ్వెత్తున ఎగసిన సమైక్య ఉద్యమం.. మలుపులు తిరిగిన రాజకీయం.. ఈ రెండు అంశాలు పశ్చిమగోదావరి తీరానికి ఈ ఏడాది అత్యంత ప్రాధాన్యతను తెచ్చిపెట్టాయి. చరిత్రకే వన్నె తెచ్చేలా జరిగిన సమైక్యాంధ్ర పరిరక్షణ పోరాటం.. రోజుకో తీరున మారిన రాజకీయం.. జిల్లా ముఖచిత్రాన్నే మార్చేశాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజా సమస్యలపై పోరాడుతూ, సమైక్యాంధ్ర పరిరక్షణే అభిమతంగా ముందుకుసాగింది. రాష్ట్ర విభజన నిర్ణయంపై ద్వంద్వ వైఖరితో టీడీపీ క్యాడర్‌ను దూరం చేసుకుంది. కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు అడుగడుగునా ప్రజా వ్యతిరేకతను చవిచూశారు. - సాక్షి ప్రతినిధి / ఏలూరు వైఎస్సార్ సీపీలో ఉత్సాహం వైఎస్సార్ కాం గ్రెస్ పార్టీ ప్రజా సమస్యలపై పోరాడుతూ పార్టీని పటిష్టం చేసుకుంటూ ముందుకెళ్లింది. సమైక్యాంధ్ర ఉద్యమంలోనూ వైఎ స్సార్ కాంగ్రెస్ పార్టీ అగ్రభాగాన నిలిచింది. గడపగడపకూ పాదయాత్ర ద్వారా ఆ పార్టీ నేతలు ప్రజల్లోకెళ్లారు. ఆ పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల 24 రోజుల పాటు 278 కిలోమీటర్ల మేర జిల్లాలోని 13 నియోజకవర్గాల్లో పాదయాత్ర నిర్వహించి ఔరా అనిపించారు. ఆ తర్వాత సమైక్య శంఖారావం పేరుతో బస్సు యాత్రను కూడా ఆమె జిల్లాలో చేపట్టారు. పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ విపత్తులు సంభవించినప్పుడు జిల్లాలో పర్యటించి రైతులను ఓదార్చారు. ఆ పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి లెహర్ తుపాను తర్వాత జిల్లాలో పర్యటించి బాధితులను పరామర్శించారు. సమైక్యమే ఊపిరిగా.. రాష్ట్ర విభజన ప్రకటన వెలువడిన తర్వాత మూడు నెల లపాటు జిల్లా అంతటా జరిగిన సమైక్యాంధ్ర ఉద్యమం ప్రజల భావోద్వేగాలను బయటపెట్టింది. ప్రజల్లో గూడుకట్టుకుని ఉన్న ఆందోళన, ఆవేదన ఒక్కసారిగా బయటపడ్డాయి. రోజురోజుకీ ఉద్యమం విస్తరించిన విధానం, అట్టడుగు నుంచి ఉన్నత వర్గాల వరకూ భాగస్వాములైన తీరు రా జకీయ వ్యవస్థలోని లోపాలను ఎత్తి చూపింది. ఎవరి ప్రోద్భలం లేకుండానే, ఎవరూ నాయకత్వం వహించకుండానే ప్రజలు స్వచ్ఛందంగా ఈ ఉద్యమాన్ని నడిపించడం మేధావుల్ని సైతం నివ్వెరపరిచింది. జనమంతా ఒక్కటై.. జిల్లాలో సమైక్య ఉద్యమానికి ఏలూరు, భీమవరం, తాడేపల్లిగూడెం ప్రాంతాలు కేంద్రాలుగా మారాయి. ఏలూరు ఫైర్‌స్టేషన్ సెంటర్, భీమవరం ప్రకాశంచౌక్ సెంటర్, తాడేపల్లిగూడెంలోని పోలీస్ ఐలాండ్ సెంటర్లో ప్రతిరోజూ 15 వరకూ ఆందోళనలు జరిగాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. లారీ, ట్యాక్సీ, జీపు, ట్రాక్టర్ల ఓనర్లు, వర్కర్లు, కళాకారులు, రైతాంగ సమాఖ్య, కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్స్, విద్యుత్, హాస్టల్ ఉద్యోగులతోపాటు అనేక ఇతర రంగాలకు చెందిన వారు ఈ ఆందోళనల్లో పాల్గొన్నారు. ఈ ఉద్యమంలో పాల్గొనని రంగం లేదంటే నమ్మక తప్పదు. ప్రతి అసోసియేషన్ సమైక్య ఉద్యమంలో పాల్గొనడం తమ బాధ్యతగా భావిస్తోంది. యువజనం.. ఉద్యోగుల ప్రభంజనం సమైక్యాంధ్ర ఉద్యమానికి యువకులు కొండంత అండగా నిలిచారు. పాఠశాల, కళాశాల విద్యార్థులు ప్రతిచోటా ఆందోళనల్లో పాల్గొన్నారు. ప్రభుత్వోద్యోగులు నిబద్ధతతో కార్యరంగంలోకి దిగారు. ఏపీఎన్జీవోలు ఒక దశలో ఉద్యమానికి సారథులుగా వ్యవహరించి ముందుకుతీసుకెళ్లారు. వారు చేసిన 66 రోజుల నిరవధిక సమ్మె కారణంగానే ఉద్యమ ప్రభావం అందరికీ తెలిసింది. వారితోపాటు రైతులు, కార్మికులు, రిక్షా కార్మికులు, తోపుడు, ఇస్త్రీ బళ్లు, జట్టు కూలీలు, మేదరులు ఒకరేమిటి చివరికి హిజ్రాలు కూడా సమైక్య ఉద్యమంలో భాగస్వాములయ్యారు. ఏలూరు నగరంతోపాటు పట్టణాలు, మండల కేంద్రాలు, గ్రామాల్లోనూ జేఏసీలు ఏర్పాటై పకడ్బందీ ఉద్యమాలకు రూపకల్పన చేసి అమలు చేశారు. ఉద్యమం.. వినూత్నం ఉద్యమం అంటే ఒక ప్రదర్శన, ఒక ధర్నా, ఒక బహిరంగ సభ గురించే అందరికీ తెలుసు. అప్పుడప్పుడూ వినూత్న నిరసనలూ చూస్తుం టాం. కానీ సమైక్య ఉద్యమంలో చేసినన్ని వినూత్న ఆందోళనలు గతంలో ఎప్పుడూ జరిగిన దాఖలాలు లేవు. దిష్టిబొమ్మల దహనాలు, వంటావార్పు నుంచి పిండ ప్రదానాలు, హోమాలు, శవయాత్రలు, మానవహారాలతోపాటు రోడ్లపై ఆటల ద్వారా ప్రజలు తమ నిరసన తెలిపారు. కేబినెట్లో కావూరి ఏలూరు ఎంపీ కావూరి సాంబశివరావుకు కేంద్ర మంత్రివర్గంలో స్థానం దక్కడం ఒక్కటే కాంగ్రెస్ శ్రేణులకు ఊరటనిచ్చింది. ఆయనకు కేంద్ర జౌళి శాఖ లభించింది. అయితే మంత్రి పదవి దక్కిందనే ఆనందం పంచుకునేలోపే విభజన వ్యవహారం ముందుకురావడంతో కావూరి అడుగడుగునా నిరసనలు ఎదుర్కోక తప్పలేదు. దివికేగిన కోటగిరి జిల్లాపై చెరగని ముద్ర వేసిన సీనియర్ రాజకీయ నాయకుడు, మాజీ మంత్రి కోటగిరి విద్యాధరరావు మృతి ఈ సంవత్సరం రాజకీయాల్లో అనూహ్యంగా చెప్పుకోవచ్చు. జులై 20న అకస్మాత్తుగా గుండెపోటుతో ఆయన మృతి చెందడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘకాలం హవా నడిపిన విద్యాధరరావు ఆ తర్వాత పీఆర్పీలో చేరి అది కాంగ్రెస్‌లో విలీనమవడంతో ప్రాధాన్యతను కోల్పోయారు. మళ్లీ రాజకీయాల్లో ఉన్నత స్థాయికి ఎదిగేందుకు ప్రయత్నిస్తున్న తరుణంలో విద్యాధరరావు మృతి చెందారు. ఇరకాటంలో టీడీపీ ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ 2013లో అనేక ఒడిదుడుకులను ఎదుర్కోక తప్పలేదు. ఆ పార్టీ అధినేత చంద్రబాబు చేసిన పాదయాత్ర కూడా జిల్లాలో తెలుగుదేశం పరిస్థితిని మెరుగు పరచలేకపోయింది. ఆ తర్వాత రాష్ట్ర విభజన వ్యవహారంలో ఆ పార్టీ వైఖరి సమైక్యాంధ్రకు అనుకూలంగా లేకపోవడంతో క్యాడర్ సమాధానం చెప్పుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే విభజనపై పార్టీ వైఖరిని వివరించేందుకు చంద్రబాబు జిల్లాలో పర్యటించాలని భావించినా ఇక్కడి నేతలు చేతులెత్తేయడమే ఆ పార్టీ పరిస్థితికి ఒక ఉదాహరణ. దీంతో ఆయన జిల్లా పర్యటనను రద్దు చేసుకోక తప్పలేదు. కాంగ్రెస్‌కు కష్టకాలం కాంగ్రెస్ పార్టీ పరిస్థితి 2013లో ఒక్కసారిగా తల్లకిందులైంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హవాతో కుదేలైన ఆ పార్టీ సమైక్య ఉద్యమంతో పాతాళానికి వెళ్లిపోయింది. ఆ పార్టీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలను ప్రజలు అడుగడుగునా నిలదీసి జిల్లాలో తిరగనివ్వలేదు. దీంతో చాలామంది వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి భయపడుతూ పక్కపార్టీల వైపు చూస్తున్నారు. అయితే సహకార ఎన్నికల్లో అధికారం అండతో ఎలాగోలా నెగ్గుకొచ్చారు. ఆ పార్టీకి చెందిన ముత్యాల వెంకటరత్నం డీసీసీబీ చైర్మన్‌గా, రవివర్మ డీసీఎంఎస్ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. అయినా పంచాయతీ ఎన్నికల్లో మాత్రం అధికార పార్టీ వెనుకబడిపోయింది. మారిన రాజకీయ ముఖచిత్రం సమైక్య ఉద్యమ ప్రభావంతోపాటు అంతకుముందు జరిగిన పరిణామాలతో జిల్లా రాజకీయ ముఖచిత్రం మారిపోయింది. కాంగ్రెస్, ఆ పార్టీ నేతలు ప్రజల దృష్టిలో చులకనైపోయారు. గందరగోళంతో తెలుగుదేశం కూడా జనంలోకి వెళ్లడానికి ఇబ్బంది పడింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమైక్య నినాదంతో ప్రజల్లోకి వెళ్లి ఉద్యమంలో మమేకమైంది. -
షర్మిళ పాదయత్ర ఒక సువర్ణ అధ్యాయం