సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మధ్యంతర ఎన్నికలు వచ్చే అవకాశమే లేదని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తేల్చిచెప్పారు. సీఎం కేసీఆర్‌కు ముందస్తు ఎన్నికలకు వెళ్లే ధైర్యం లేదన్నారు. శనివారం ప్రజాప్రస్థానం పాదయాత్ర పునఃప్రారంభం సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలకు వెళ్తారన్నారు. ప్రజల కోసం చేపట్టిన ప్రజాప్రస్థానం పాదయాత్ర అధికార పార్టీకి వణుకు పుట్టిస్తోందని చెప్పారు. నడిచేది తానే అయినా నడిపించేది మాత్రం ప్రజలేనన్నారు. షర్మిలను ఆదరిస్తున్నారంటే.. అందుకు వైఎస్సారే కారణమని పేర్కొన్నారు. కాగా, శనివారం నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా ట్విట్టర్‌లో షర్మిల ఘన నివాళి అర్పించారు. పరిపాలనలో నూతన సంస్కరణలు చేపట్టిన గొప్ప నాయకులు ఎన్టీఆర్ అని అన్నారు.
తాళ్లమడలో పునఃప్రారంభం..
‘టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఒక బ్లాక్ మెయిలర్. ఓటుకు నోటు కేసులో దొరి కిన దొంగ. రెడ్డి స మాజానికి అధికారం ఇవ్వాలని, నాయకత్వం కట్టబెట్టాలని ఆయన చెబుతున్నా రు. అంటే మిగిలిన కులాలు నాయకత్వానికి పనికిరావా? పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కుల రాజకీయం చేస్తుంటే.. అధిష్టానం కనీస చర్యలు ఎందుకు తీసుకోవ డం లేదో చెప్పాలి’అని వైఎస్ షర్మిల ప్రశ్నించారు. ఆమె చేపట్టిన ప్రజాప్రస్థానం పాద యాత్ర ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం తాళ్లమడలో శనివారం పునఃప్రారంభం అయ్యింది. ఈ సం దర్భంగా మాట్లాడుతూ.. వైఎస్సార్ వల్లే కేంద్రం, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందనే ఒక్క నిజాన్ని మాత్రమే రేవంత్ చెప్పాడన్నారు. అయితే, వైఎస్సార్ ఏనాడూ ఒక కులం తక్కువ.. ఒక కులం ఎక్కువ అని చెప్పలేదని గుర్తు చేశారు. ఇక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మత రాజకీయాలు చేస్తూ, పిచ్చివాడిలా మాట్లాడుతున్నారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment