బోనకల్: రూ.16 వేల కోట్ల మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణను సీఎం కేసీఆర్ నేడు రూ.4 లక్షల కోట్ల అప్పుల రాష్ట్రంగా మార్చారని వైఎస్సార్‌టీపీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షరి్మల విమర్శించారు. ఆమె చేపట్టిన ప్రజాప్రస్థానం పాదయాత్ర అదివారం ఖమ్మం జిల్లా బోనకల్ మండలంలో కొనసాగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్నికల ముందు రైతు రుణమాఫీ చేస్తానని చెప్పి ఇంతవరకూ ప్రకటించలేదని, దీంతో రాష్ట్రంలో ఎనిమిది వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రూ.25 వేలు రుణం తీసుకున్న రైతుకు ప్రస్తుతం వడ్డీతో కలిపి రూ.40 వేలు దాటిందని తెలిపారు.
వడ్డీలు కట్టమని బ్యాంకు అధికారులు రైతులను వేధిస్తున్నారని ఆరోపించారు. పంటలకు మద్దతు ధర చెల్లించడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయన్నారు. పోడు భూముల కోసం పోరాడిన రైతులను జైల్లో పెట్టించిన ఘనత కేసీఆర్‌కే దక్కిందన్నారు. రాష్ట్రాన్ని బార్లు, బీర్ల తెలంగాణగా మార్చారని, గాడిదకు రంగుపూసి ఆవు అని నమ్మించగల శక్తి కేసీఆర్‌కు మాత్రమే ఉందన్నారు. కాగా, మండలంలోని ఆళ్లపాడులో షరి్మల.. 33 జిల్లాల పార్టీ అధ్యక్షులు, సమన్వయకర్తలతో సమావేశమయ్యారు. పార్టీ నిర్మాణం, బలోపేతం, సభ్యత్వ నమోదుపై నేతలకు సూచనలు చేశారు. వైఎస్సార్ మరణాన్ని జీరి్ణంచుకోలేక తెలంగాణలో 400 మంది గుండెలు ఆగాయని, వారి కుటుంబాలకు భరోసా కలి్పంచాల్సిన బాధ్యత పార్టీపై ఉందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment