శంషాబాద్: ‘కేసీఆర్ తెలంగాణకు సీఎంలా పనిచేస్తలేడు.. ఉప ఎన్నికల ప్రాంతాలకు మాత్రమే సీఎంగా పనిచేస్తుండు. దళితబంధు హుజూరాబాద్‌లోనే ఎందుకు పెట్టారు? ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గాల్లో ఎందుకు ప్రవేశపెట్టలేదు?’అని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల ప్రశ్నిం చారు. ఎన్నికల కోసం పథకాలు ప్రవేశపెట్టి ఆ తర్వాత వాటిని నిలిపేయడం కేసీఆర్‌కు అలవాటుగా మారిందని దుయ్యబట్టారు. మూడోరోజు పాదయాత్రలో భాగంగా వైఎస్ షర్మిల శంషాబాద్‌లోని రాళ్లగూడదొడ్డి, ఇంద్రానగర్, మధురానగర్ కాలనీల మీదుగా పాదయాత్ర చేశారు.
అనంతరం శంషాబాద్‌లోని అంబేడ్కర్ విగ్రహానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ‘నా పాదయాత్రపై విమర్శలు చేసిన కేటీఆర్ రాష్ట్రంలో సమస్యలు లేవని నిరూపిస్తే నేను ముక్కు నేలకు రాసి పాదయాత్ర ముగిస్తాను. సమస్యలుంటే మీరు రాజీనామాలు చేస్తారా?’అని సవాల్ విసిరారు.
మహానేత వైఎస్సార్‌ది సుపరిపాలన
మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి సుపరిపాలన చేసి చూపెట్టారన్నారు. ఐదేళ్లలో పన్నులు పెంచకుండా రాష్ట్ర ప్రజలకు మంచి చేసి మార్గదర్శకులుగా నిలిచారని షర్మిల అన్నారు. మళ్లీ అలాంటి పరిపాలన రావాలంటే ప్రజలు చైతన్యవం తులై టీఆర్‌ఎస్ గద్దె దింపాలని పిలుపునిచ్చారు.
కాంగ్రెస్‌కు ఓటేస్తే టీఆర్‌ఎస్‌కు వేసినట్లేనన్నారు. రాజన్న రాజ్యం రావాలంటే వైఎస్సార్ తెలంగాణ పార్టీని ఆశీర్వదించాలని కోరారు. అనంతరం పాదయాత్ర గొల్లపల్లి మీదుగా పోశెట్టిగూడ వరకు చేరుకుంది. కార్యక్రమంలో కొండా రాఘవరెడ్డి, ఏపూర్తి సోమన్న, శంషాబాద్ నేతలు అక్రమ్‌ఖాన్ ఉన్నారు.
జనాన్ని పలకరిస్తూ ముందుకు..
శంషాబాద్ రూరల్: షర్మిల చేపట్టిన ‘ప్రజాప్రస్థానం’పాద యాత్ర శుక్రవారం మూడో రోజు మండలంలోని కాచారం నుంచి ప్రారంభమైంది. సుల్తాన్‌పల్లి చౌరస్తా, నర్కూడ, రాళ్లగూడ మీదుగా సాయంత్రం శంషాబాద్‌కుS చేరుకుంది. దాదాపు 10 కి.మీటర్ల దూరం వరకు సాగిన యాత్రలో దారి పొడవునా జనాన్ని పలకరిస్తూ, వారి సమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగారు.
Comments
Please login to add a commentAdd a comment