సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పాదయాత్రకు తెలంగాణ హైకోర్టు అనుమతించింది. పాదయాత్రకు నర్సంపేట పోలీసులు అనుమతి రద్దు చేశారని హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది వైఎస్సార్‌టీపీ. ఈ పిటిషన్‌పై విచారించిన హైకోర్టు అనుమతులు ఇచ్చింది.
మరోవైపు.. వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. పాదయాత్ర సందర్భంగా సోమవారం రోజు టీఆర్‌ఎస్ నేతలు చేసిన దాడికి నిరసనగా ప్రగతి భవన్ ముట్టడికి బయలుదేరిన క్రమంలో పోలీసులు అడ్డుకున్నారు. రాజ్‌భవన్ రోడ్డులో వైఎస్ షర్మిలను అడ్డుకుని పోలీసులు అరెస్ట్ చేశారు. కారు అద్దాలు మూసివేసి వైఎస్ షర్మిల లోపలే కూర్చున్నారు. డోర్ లాక్ చేసి కారు దిగేందుకు నిరాకరించారు. దీంతో షర్మిల కారును క్రేన్ ద్వారా లిఫ్ట్ చేసి ఎస్‌ఆర్ నగర్ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు.
ఇదీ చదవండి: వైఎస్ షర్మిలపై కేసు.. విజయమ్మను అడ్డుకున్న పోలీసులు
Comments
Please login to add a commentAdd a comment