
వరంగల్: తీవ్ర ఉద్రిక్తతల నడుమ వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను వరంగల్‌లో అరెస్ట్ చేశారు. ఈరోజు(సోమవారం) షర్మిల చేపట్టిన పాదయాత్ర ఉద్రిక్తతలకు దారి తీయడంతో షర్మిలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తొలుత ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డిపై షర్మిల చేసిన వ్యాఖ్యలతో టీఆర్‌ఎస్ ఆందోళన చేపట్టింది. ఈ క్రమంలోనే షర్మిల కేర్‌వాన్‌కు ఆందోళన కారులు నిప్పుపెట్టారు.
దాంతో వైఎస్సార్‌టీపీ-టీఆర్‌ఎస్ శ్రేణుల మధ్య తీవ్ర వాగ్వాదం, బాహాబాహీ జరిగింది. అయితే ఈ ఉద్రిక్తల నడుమే షర్మిల పాదయాత్రను కొనసాగించాలని భావించినా పోలీసులు అందుకు అనుమతి ఇవ్వలేదు. పరిస్థితి మరింత ఉద్రిక్తతంగా మారే అవకాశం ఉండటంతో షర్మిలను నర్సంపేట పేట పోలీసులు అరెస్ట్ చేశారు. వైఎస్సార్‌టీపీ శ్రేణులను పోలీసులు అడ్డుకోవడంతో షర్మిల మండిపడ్డారు. పోలీసులు వ్యవరించిన తీరును తప్పుబట్టారు. బస్సుకు నిప్పుపెట్టిన వారిని వదిలేసి మమ్మల్ని అరెస్ట్ చేస్తారా? అంటూ షర్మిల ధ్వజమెత్తారు.
చదవండి: రెచ్చిపోయిన టీఆర్‌ఎస్ శ్రేణులు.. వైఎస్ షర్మిల కేరవాన్‌కు నిప్పు..
Comments
Please login to add a commentAdd a comment