
సాక్షి, వరంగల్: వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల తిరిగి చేపట్టబోయే పాదయాత్రకు పోలీసుల అనుమతి లభించింది. ఫిబ్రవరి 12వ తేదీ నుంచి 18వ తేదీ వరకు పాదయాత్ర చేసుకునేందుకు ఆమెకు వరంగల్ సీపీ రంగనాథ్ అనుమతి ఇచ్చారు.
ఇదిలా ఉంటే షరతులతో కూడిన అనుమతి షర్మిల యాత్రకు ఇచ్చినట్లు తెలుస్తోంది. కిందటి ఏడాది నవంబర్ 28వ తేదీన వరంగల్ జిల్లా లింగగిరి వద్ద షర్మిల పాదయాత్ర నిలిచిపోయిన సంగతి తెలిసిందే.
షరతులు..
ఉదయం నుంచి 10 నుంచి సాయంత్రం 7 గంటల వరకు మాత్రమే పాదయాత్రకు అనుమతి.
పార్టీలు, కులాలు, మతాలు, వ్యక్తిగతంగా ఉద్దేశించి వివాస్పదవాఖ్యలు చేయవద్దు.
ర్యాలీల్లో ఫైర్ క్రాకర్స్ ఉపయోగించవద్దు.
ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థల విధులకు ఆటంకం కలిగించకూడదు.
లింగగిరి గ్రామం నుంచి నెక్కొండ, పర్వతగిరి, వర్థన్నపేట, వరంగల్, హనుమకొండ, కాజీపేట ఘన్ పూర్ , జఫర్ గడ్, ఘన్ పూర్, నర్మెట్ట, జనగామ, దేవుర్పుల , పాలకుర్తి మండలం దరిదేపల్లి వరకు షర్మిల పాదయాత్రకు అనుమతి లభించింది.
Comments
Please login to add a commentAdd a comment