
'రేవంత్ విషయంలో టీడీపీది మేకపోతు గాంభీర్యమే'
మోమినపేట (రంగారెడ్డి): ఓటుకు కోట్లు కేసులో నిందితుడుగా ఉన్న ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి విషయంలో టీడీపీ పార్టీ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తోందని తెలంగాణ రాష్ట్ర వైఎస్ఆర్సీపీ కమిటీ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి విమర్శించారు. వైఎస్ఆర్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల రంగారెడ్డి జిల్లాలో చేపట్టిన నాలుగు రోజుల పరామర్శయాత్ర విజయవంతమైందని ఆయన తెలిపారు. ఈ నెలాఖరులోగా తెలంగాణ లోని మరో జిల్లాలో షర్మిల పరామర్శయాత్ర చేపడుతారని పొంగులేటి శ్రీనివాస్రెడ్డి వివరించారు.