
సాక్షి, మంచిర్యాల: మంచిర్యాల జిల్లాలో వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పాదయాత్ర కొనసాగుతోంది. ఈ క్రమంలో పాదయాత్ర 3వేల కిలోమీటర్లు మైలురాయి దాటిన సందర్భంగా హజీపూర్ వద్ద వైఎస్‌ఆర్ పైలాన్‌ను వైఎస్ విజయమ్మ, షర్మిల ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా వైఎస్ విజయమ్మ మాట్లాడుతూ.. ‘మీ అందరి దీవెనలే షర్మిలను నడిపిస్తున్నాయి. 3వేల కిలోమీటర్లు నడవటం సాధారణ విషయం కాదు. షర్మిల పాదయాత్ర మనుషులతో మమేకమయ్యే యాత్ర. పాదయాత్ర ద్వారా ప్రజల కష్టాలను షర్మిల తెలుసుకుంటోంది. పాదయాత్ర అంటే గుర్తుకొచ్చే పేరు వైఎస్‌ఆర్. వైఎస్‌ఆర్ ఆశయాలతోనే షర్మిల పాదయాత్ర చేస్తోంది. ఇది ఓట్ల కోసం చేస్తున్న యాత్ర కాదు. సమస్యలకు ముగింపు పలకాలని చేస్తున్న యాత్ర అని స్పష్టం చేశారు.
అనంతరం, వైఎస్ షర్మిల మాట్లాడుతూ.. ‘మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి బిడ్డను ఆశీర్వదించిన మీ అందరికీ ధన్యవాదాలు. మహానేతకు మరణం లేదని మరోసారి నిరూపించారు. నడిచింది నేనైనా.. నడిపించింది మీరే. వైఎస్‌ఆర్ పేదల కోసం ఎన్నో పథకాలు అమలు చేశారు’ అని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment