సరూర్‌నగర్: జిల్లాలో ఈనెల 29 నుంచి ప్రారంభం కానున్న షర్మిల పరామర్శ యాత్రను జయప్రదం చేయాలని వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివకుమార్ పిలుపునిచ్చారు. దివంగత ముఖ్యంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అకాల మరణాన్ని జీర్ణించుకోలేక చనిపోయిన వారి కు టుంబాలను పరామర్శించేందుకు షర్మిల చేపట్టబోతున్న పరామర్శ యాత్ర పోస్టర్‌ను బుధవారం మందమల్లమ్మ చౌరస్తాలో వైఎస్ విగ్రహం వద్ద ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పార్టీ రాష్ట్ర కార్యదర్శి కొ లిశెట్టి శివకుమార్, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు సురేష్‌రెడ్డి హాజరయ్యారు.
ఈనెల 29నుంచి జిల్లాలోని సరూర్‌నగర్ మండలం, జిల్లెలగూడ నుంచి పరామర్శ యాత్ర ప్రారంభమై వచ్చే నెల 2వ తేదీ వరకు కొనసాగుతుందన్నారు. జిల్లాలోని ఏడు నియోజకవర్గాలల్లో 580 కిలోమీటర్లమేర పర్యటించి 15 కుటుంబాలను ప రామర్శిస్తారని వెల్లడించారు. మహేశ్వరం ని యోజకవర్గంలోని జిల్లెలగూడ నుంచి తొలి రోజు పరామర్శయాత్ర మొదలవుతుందన్నా రు. మందమల్లమ్మ చౌరస్తాలో బహిరంగసభ ఉంటుందన్నారు.
జిల్లా అధ్యక్షుడు జి.సురేష్‌రెడ్డి మాట్లాడుతూ వైఎస్సార్ మరణాన్ని తట్టుకోలేక జిల్లాలో మరణించిన అన్ని కుటుంబాలను షర్మిల పరామర్శిస్తారన్నారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శులు గోపాల్‌రెడ్డి, సూరజ్‌ఎస్‌దాని, జిల్లా కార్యదర్శి వెంకట్‌రెడ్డి, సరూర్‌నగర్ మం డల అధ్యక్షుడు మోహన్‌రెడ్డి, విద్యార్థి నాయకు లు సుమన్‌గౌడ్, రాంచందర్, మాసూం, రాజ శేఖర్‌రెడ్డి, కిష్టయ్య, నగరపంచాయతీ అధ్యక్షురాలు విజయలక్ష్మి, యాదయ్య, పాండునాయక్, ఆనంద్‌కుమార్, శ్రీనివాస్ ఉన్నారు.
పరామర్శ యాత్రను విజయవంతం చేయండి
Published Thu, Jun 25 2015 1:19 AM | Last Updated on Sat, Jul 7 2018 2:56 PM
Advertisement
Advertisement