
బోనకల్: ఉద్యమ నాయకుడని నమ్మి ప్రజలు రెండు సార్లు అధికారం అప్పగిస్తే ఎన్నికలకు ముందు ఇచ్చిన ఏ హామీని కూడా అమలు చేయ కుండా సీఎం కేసీఆర్ ప్రజల నమ్మకాన్ని వమ్ము చేశారని వైఎస్సార్ టీపీ అధ్యక్షు రాలు వైఎస్ షర్మిల విమర్శించారు. ఆమె చేపట్టిన ప్రజా ప్రస్థానం పాదయాత్ర శుక్రవారం ఖమ్మం జిల్లా బోనకల్ మండలంలో కొనసాగింది. ఈ సందర్భంగా పలు గ్రామాల్లో ప్రజలనుద్దేశించి షర్మిల మాట్లాడారు. ప్రజలు తమకు అధికారం అప్పగిస్తే వైఎస్సార్ సంక్షేమ పథకాలన్నింటినీ తిరిగి అమలు చేస్తానని, మాట మీద నిలబడే రాజన్న బిడ్డగా మాట ఇస్తున్నానని తెలిపారు.
వైఎస్సార్ వ్యవసాయాన్ని పండుగలా చేస్తే.. కేసీఆర్ తన విధానాలతో రైతులు ఆత్మహత్య చేసుకునేలా చేశారని మండిపడ్డారు. వైఎస్సార్ ఏక కాలంలో రుణమాఫీ చేయగా, కేసీఆర్ నేటికీ రుణమాఫీ చేయకుండా రైతులను నిస్సహాయ స్థితిలోకి నెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశా రు. రైతుబంధు పేరిట రూ.5వేలు ఇస్తూ మిగతా పథకాన్నీ తొలగించారని విమర్శించారు. పలు గ్రామాల్లో పొలాల్లో పనిచేస్తున్న రైతుల సమస్యలు తెలుసుకున్న షర్మిల.. కాసేపు ట్రాక్టర్ నడిపారు. తరువాత అరక దున్నారు.
Comments
Please login to add a commentAdd a comment