వైఎస్సార్ సీపీలో చేరిన గార్ల ఎంపీపీ | garla mpp and vice mpp joined in ysrcp | Sakshi
Sakshi News home page

వైఎస్సార్ సీపీలో చేరిన గార్ల ఎంపీపీ

Published Fri, Aug 28 2015 4:59 PM | Last Updated on Tue, May 29 2018 6:04 PM

వరంగల్ జిల్లాలోని గార్ల ఎంపీపీ , వైస్ ఎంపీపీలు శుక్రవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.

వరంగల్: జిల్లాలోని గార్ల ఎంపీపీ , వైస్ ఎంపీపీలు శుక్రవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వరంగల్ జిల్లాలో వైఎస్ షర్మిల చేపట్టిన తొలి విడత పరామర్శయాత్రలో గార్ల ఎంపీపీ సుశీల, వైస్ ఎంపీపీ నర్సింగరావులు వైఎస్సార్ సీపీలో చేరారు.

 

ఈ సందర్భంగా ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ పరిపాలన రావాలని కోరుకుంటున్నారని తెలిపారు. తెలంగాణ ప్రజలు షర్మిలపై చూపిస్తున్న అభిమానం మరువలేనిదని ఆయన పేర్కొన్నారు. జిల్లాలో వైఎస్ షర్మిల చేపట్టనున్న రెండో విడత పరామర్శయాత్ర సెప్టెంబర్ 7 వ తేదీ నుంచి 11 వ తేదీ వరకూ కొనసాగుతుందని పొంగులేటి తెలిపారు.

 

వైఎస్ షర్మిల వరంగల్ జిల్లాలో చేపట్టిన తొలి విడత పరామర్శయాత్ర  ముగిసింది. ఈరోజు పరకాల నియోజకవర్గం సంగెం మండలం రామచంద్రాపురంలోని బొల్లు ఎల్లమ్మ కుటుంబాన్ని ముందుగా పరామర్శించారు. అనంతరం వర్ధన్నపేట నియోజకవర్గం పర్వతగిరిలోని పుల్లూరు కొమురమ్మ ఇంటికి వెళ్లారు. చివరగా పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరు మండలం సోమారంలో మేడిద శాంతమ్మ కుటుంబ సభ్యలకు భరోసా ఇచ్చారు. మొదటి విడత యాత్రలో మొత్తం 7 నియోజకవర్గాల్లో 32 కుటుంబాలను వైఎస్ షర్మిల పరామర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement