శంషాబాద్ ఎయిర్పోర్ట్లో వైఎస్ షర్మిలకు ఘన స్వాగతం | YS sharmila receives grand welcome at shamshabad airport | Sakshi
Sakshi News home page

శంషాబాద్ ఎయిర్పోర్ట్లో వైఎస్ షర్మిలకు ఘన స్వాగతం

Published Mon, Jun 29 2015 1:41 PM | Last Updated on Tue, May 29 2018 6:04 PM

శంషాబాద్ ఎయిర్పోర్ట్లో వైఎస్ షర్మిలకు ఘన స్వాగతం - Sakshi

శంషాబాద్ ఎయిర్పోర్ట్లో వైఎస్ షర్మిలకు ఘన స్వాగతం

మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిలకు శంషాబాద్ విమానాశ్రయంలో సోమవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.

హైదరాబాద్ : మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిలకు శంషాబాద్ విమానాశ్రయంలో సోమవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అక్కడ నుంచి ఆమె నేరుగా నేరుగా మహేశ్వరం నియోజకవర్గంలోని సరూర్‌నగర్ మండలం జిల్లెలగూడలో మందమల్లమ్మ చౌరస్తాకు చేరుకుంటారు. అక్కడ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించి పరామర్శ యాత్రను ప్రారంభిస్తారు.

రంగారెడ్డి జిల్లాలో  వైఎస్ రాజశేఖరరెడ్డి హఠాన్మరణాన్ని జీర్ణించుకోలేక ప్రాణాలు వదిలిన15 కుటుంబాలను వైఎస్ షర్మిల పరామర్శిస్తారు నాలుగు రోజులు పాటు జరిగే పర్యటనలో భాగంగా ఆమె తొలిరోజు 177 కిలోమీటర్ల మేర పరామర్శయాత్ర చేస్తారు. రెండో రోజు 134 కిలోమీటర్లు, మూడోరోజు 153 కిలోమీటర్లు, నాలుగోరోజు 126 కిలోమీటర్ల చొప్పున మొత్తం 590 కిలోమీటర్ల మేర యాత్ర కొనసాగుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement