
24 నుంచి వరంగల్ జిల్లాలో వైఎస్ షర్మిల పరామర్శ యాత్ర
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల ఈ నెల 24 నుంచి వరంగల్ జిల్లాలో పరామర్శయాత్ర చేపట్టనున్నారు.
హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల ఈ నెల 24 నుంచి వరంగల్ జిల్లాలో పరామర్శయాత్ర చేపట్టనున్నారు. మొదటి విడత యాత్రలో భాగంగా 32 కుటుంబాలను ఆమె పరామర్శిస్తారని వైఎస్సార్ సీపీ నేతలు కొండా రాఘవరెడ్డి, మహేందర్ రెడ్డి, అహ్మద్ తెలిపారు.
మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి మరణాన్ని తట్టుకోలేక వరంగల్ జిల్లాలో 72 మంది అశువులు బాశారని చెప్పారు. షర్మిల పరామర్శయాత్రకు తెలంగాణ వైఎస్సార్ సీపీ నేతలందరూ హాజరై విజయవంతం చేస్తారన్నారు. ఇది రాజకీయ యాత్ర కాదని స్పష్టం చేశారు. ఇప్పటికే తెలంగాణలోని 4 జిల్లాల్లో పరామర్శయాత్ర పూర్తైందని తెలిపారు.