దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి హఠాన్మరణాన్ని తట్టుకోలేక మృతి చెందినవారి కుటుంబాలను మహానేత తనయవైఎస్ షర్మిల పరామర్శించనున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశం మేరకు షర్మిల సోమవారం నుంచి రంగారెడ్డి జిల్లాలో పరామర్శ యాత్ర చేపడతారు. తొలుత సరూర్ నగర్ మండలం జిల్లెల గూడలో మరణించిన బచ్చనబోయిన అంజయ్య యాదవ్ కుటుంబ సభ్యులను ఆమె పరామర్శిస్తారు.