అక్టోబర్‌ 20 నుంచి వైఎస్‌ షర్మిల పాదయాత్ర | YS Sharmila Padayatra From October 20th | Sakshi
Sakshi News home page

అక్టోబర్‌ 20 నుంచి వైఎస్‌ షర్మిల పాదయాత్ర

Sep 20 2021 5:05 PM | Updated on Sep 20 2021 7:05 PM

YS Sharmila Padayatra From October 20th - Sakshi

అక్టోబర్‌ 20 నుంచి పాదయాత్ర చేపడుతున్నట్లు వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ప్రకటించారు.
 

సాక్షి, హైదరాబాద్‌: అక్టోబర్‌ 20 నుంచి పాదయాత్ర చేపడుతున్నట్లు వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ప్రకటించారు. సోమవారం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ‘ప్రజా ప్రస్థానం’ పేరుతో చేవెళ్ల నుంచి పాదయాత్ర ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. తెలంగాణలో ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు కాలేదని మండిపడ్డారు.

గత ఏడేండ్ల కేసీఆర్ పాల‌న‌లో 7 వేల మంది రైతులు ఆత్మ‌హ‌త్య చేసుకున్నారని.. రైతుల‌కు రుణ‌మాఫీ చేస్తాన‌ని చెప్పి, సీఎం కేసీఆర్ మోసం చేశారని నిప్పులు చెరిగారు. కేవ‌లం 3 ల‌క్ష‌ల మందికే మాఫీ చేసి, 30 ల‌క్ష‌ల మంది రైతుల‌కు రుణ‌మాఫీ ఎగ్గొట్టారని దుయ్యబట్టారు. తెలంగాణలో 91 శాతం మంది రైతుల‌కు క‌నీసం రూ.ల‌క్ష‌న్న‌ర అప్పు ఉన్న‌ట్లు ఓ స‌ర్వే చెబుతోంది. ఈ లెక్కన రైతులందరూ అప్పుల‌పాల‌య్యారని వైఎస్‌ షర్మిల అన్నారు.
చదవండి:
గణేశ్‌ నిమజ్జనం: ఈ ఫొటో చూసి వావ్‌ అనాల్సిందే!
ప్రభుత్వం, పోలీసులు చేయలేని న్యాయం దేవుడు చేశాడు: వైఎస్‌ షర్మిల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement