మహానేత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల పరామర్శ యాత్రకు బయల్దేరారు. సోమవారం ఉదయం ఆమె హైదరాబాద్ లోటస్ పాండ్ నుంచి వరంగల్ జిల్లా పర్యటనకు పయనం అయ్యారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్...తన సోదరిని దగ్గరుండి యాత్రకు సాగనంపారు. వరంగల్ జిల్లాలో ఆమె అయిదు రోజుల పాటు పర్యటిస్తారు.