సాక్షి, సిటీబ్యూరో: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టనున్న ఆమరణ దీక్ష నేపథ్యంలో సర్వత్రా ఉ్కతంఠ నెలకొంది. అందరి దృష్టీ లోటస్‌పాండ్‌పై కేంద్రీకృతమైంది. సమన్యాయం చేయలేనప్పుడు రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలనే డిమాండ్‌తో శనివారం ఉదయం నుంచి లోటస్‌పాండ్‌లో జగన్ ఆమరణ దీక్ష చేపడుతున్న విష యం తెలిసిందే. దీక్షను స్వాగతిస్తూ, మద్దతునిస్తూ పలువురు పాల్గొననున్నారు.
రాష్ట్రంలోని వివిధ సీమాంధ్ర జిల్లాలకు చెంది, పెద్దసంఖ్యలో నగరంలో స్థిరపడ్డ కుటుంబాలతో పాటు పలువురు హైదరాబాదీలు జగన్ దీక్షను స్వాగతిస్తూ పార్టీ కార్యాలయానికి లేఖలు పంపారు. రాష్ట్రాన్ని విడదీసి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను పాడు చేయొద్దంటూ పలువురు మైనారిటీ నేతలు సైతం శుక్రవారం సందే శాలు పంపారు. ఇదిలా ఉంటే ఆమరణ దీక్ష నేపథ్యంలో నగరంలోని ఆయన అభిమానులు, పార్టీ నాయకులు శనివారం నుండి విస్తృత కార్యక్రమాలకు పిలుపునిచ్చారు. జగన్‌కు సంఘీభావంగా దేవాలయాలు, మసీదులు, చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు చేయాలని నిర్ణయించారు.
ఇతర పార్టీలూ స్పందించాలి
13 జిల్లాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా చేసిన ఏకపక్ష విభజన నిర్ణయంపై మిగిలిన పార్టీలు ఇప్పటికైనా స్పందిం చాలని రాష్ట్ర పరిరక్షణ వేదిక కో ఆర్డినేటర్ వి.లక్ష్మణరెడ్డి, ఏపీఎన్జీఓల సంఘం మాజీ అధ్యక్షుడు గోపాల్‌రెడ్డి కోరారు. జగన్‌మోహన్‌రెడ్డి చేయతలపెట్టిన దీక్షను స్వాగతిస్తున్నామన్నారు. అంతా మద్దతునివ్వాలని కోరారు.
దీక్షకు దన్నుగా...
Published Sat, Oct 5 2013 3:43 AM | Last Updated on Wed, Aug 8 2018 5:45 PM
Advertisement
Advertisement