కేంద్రంలో ఏ పార్టీకి పూర్తి మెజార్టీ రాదని, హంగ్ ఏర్పడే అవకాశాలున్నట్లు పలు సర్వేలు చెబుతున్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అన్నారు. ఏ పార్టీతో పొత్తు పెట్టుకోమని... ప్రత్యేక హోదా ఫైల్‌పై సంతకం పెట్టిన పార్టీకే మాత్రమే మద్దతిస్తామని స్పష్టం చేశారు. లోటస్‌పాండ్‌లో ఆయన గురువారం తటస్థులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తమ పార్టీ విధివిధానాల గురించి వారికి వివరించారు. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా హంగ్ వస్తేనే మంచిదని వైఎస్ జగన్ అభిప్రాయపడ్డారు.
Published Thu, Jan 31 2019 7:08 PM | Last Updated on Fri, Mar 22 2024 11:23 AM
Advertisement
Advertisement
Advertisement