
అభిమానులను కలవనున్న జగన్
హైదరాబాద్: జైలు నుంచి విడుదలయిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తమ అభిమానులను కలిసేందుకు సమయాన్ని కేటాయించారు. ఉదయం10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు అభిమానులను కలవాలని ఆయన నిర్ణయించారు. రేపటి నుంచి లోటస్‌పాండ్‌లోని నివాసంలో అభిమానులను ఆయన కలవనున్నారు. 16 నెలల పాటు జైలు జీవితం గడిపిన జగన్ బెయిల్పై నిన్న విడుదలయిన సంగతి తెలిసిందే. నేరం రుజువు కాకుండానే ఆయన 485 రోజులు జైలులో ఉన్నారు.
జైలు నుంచి విడుదల తర్వాత రోజే వైఎస్ జగన్ పార్టీ వ్యవహారాలపై దృష్టి పెట్టారు. తాజా రాజకీయ పరిణామాలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు ఆయన బుధవారం వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీ, తాజా మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలతో భేటీ అయ్యారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని డిమాండ్ చేస్తూ సమ్మె చేస్తున్న సీమాంధ్ర సచివాలయ ఉద్యోగుల ఫోరం నాయకులు జగన్ను కలిశారు.